వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు
సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా వుంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని దారుణంగా సినిమా వాళ్ళు చూపిస్తూ వుంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ వున్నారు.నేర న్యాయవ్యవస్థతో సంబంధం వున్న రచయితలు గానీ, న్యాయవాదులైన రచయితలు గానీ, న్యాయమూర్తులైన రచయితలుగానీ కోర్టుకు సంబంధించిన కథలు గానీ, నవలలు గానీ రాసినప్పుడు అలా వుండదు. కోర్టుల్లో వుండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో …