భవన నిర్మాణంలో కీలకం డే లైటింగ్‍ డిజైన్‍


(
ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 21వ వార్షికోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఎకో సిస్టమ్‍ రిస్టొరేషన్‍ – హైదరాబాద్‍ సిటీ – అర్బన్‍ ప్లానింగ్‍, ఎన్విరాన్‍ మెంట్‍’ అనే అంశంపై నిర్వహించిన ఆన్‍ లైన్‍ సమావేశంలో JBR Architecture College Prof. Esther Clifford ‘డే లైట్‍ స్ట్రాటజీస్‍ ఫర్‍ సస్టెయినబిలిటీ’ పై చేసిన ప్రసంగ సారాంశం. ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఛైర్మన్‍ యం.వేదకుమార్‍, ప్రొఫెసర్‍ కేటీ రవీంద్రన్‍, ఎన్‍.కె పటేల్‍, డాక్టర్‍సంఘమిత్రబసు, ఐఏఎస్‍ అధికారి అధర్‍ సిన్హా తదితర ప్రముఖులు, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.)


ఈ రోజు ఇక్కడ నేను ‘డే లైట్‍ స్ట్రాటజీస్‍ ఫర్‍ సస్టెయినబిలిటీ’ అంశం పై మాట్లాడదలిచాను. డే లైటింగ్‍ ప్రాధాన్యం, డే లైటింగ్‍ డిజైన్‍ ను ప్రభావితం చేసే అంశాలు, డే లైటింగ్‍ లో సుస్థిరదాయక అంశాలు ఇందులో ప్రధానం. బిల్ట్ ఎ న్విరాన్‍ మెంట్‍ అనేది మనిషికి అత్యంత అవసరమైన మూడు అంశాల్లో (ఆహారం, దుస్తులు, నివాసం) ఒకటి. ఏదై నా బిల్ట్ ఎన్విరాన్‍ మెంట్‍ సామర్థ్యపూర్వకంగా, ప్రభావపూరిత లైటింగ్‍తో ఉండాలంటే, ఒక భవనంలో ఉపయోగించే శక్తిలో సుమారు 30% వినియోగం సహజంగా పొందేదై ఉండాలి. నిజంగా అది ఆయా నివాసాలను ఆరోగ్యవంతం, ప్రకాశవంతం, సంతోషదాయకం చేస్తుంది. ఆర్కిటెక్చర్‍ పరంగా చూసుకుంటే, పగటి కాంతి అనేది శక్తి వినియోగాన్ని తగ్గిస్తుంది. తద్వారా కార్బన్‍ ఫుట్‍ ప్రింట్‍ను తగ్గిస్తుంది. మొత్తం మీద ఆ భవనం సుస్థిరదాయకతను అధికం చేస్తుంది.


ఎనర్జీ స్ట్రాటజీ
పగటి కాంతిని గనుక సరిగా వినియోగించుకుంటే, అది సరైన ఎనర్జీ స్ట్రాటజీ అవుతుంది. ఈ వ్యూహం అటు వివి ధ సాంకేతికతలను, ఇటు వివిధ డిజైన్‍ తాత్వికతలను కలిగిఉండేలా చూసుకోవాలి. స్థూలంగా చూస్తే డే లైటింగ్‍ ఇంటర్వెన్షన్‍ను పాసివ్‍ డిజైన్‍ తో, సరళమైన విధానాలతో సాధించవచ్చు. అది వ్యక్తిగత స్థాయిలో ప్రారంభం కావాలి. సాంకేతిక వినూత్నతలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. పగటి కాంతిని వినియోగించుకునేందుకు ఎందుకింత ప్రాధాన్యం అనే అంశం గురించి కూడా మనం ఆలోచించాలి. 1980ల నుంచి జరిగిన ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా పగటి కాంతి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు అని రుజువు చేశాయి. మానసిక ఆరోగ్యం సరి గా ఉండేందుకు కూడా అది తోడ్పడుతుంది. నైతిక ప్రవర్తనను మెరుగుపరుస్తుంది. అంతేగాకుండా, కంటి చూపు కోల్పోవడాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా మనిషిపరంగా చూసినప్పుడు కలిగే ప్రయోజనాలు.
ఇక భవనం విషయానికి వస్తే, సహజ పగటి కాంతి అనేది శక్తి వినియోగాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఆర్కిటెక్చర్‍ పరంగా మాట్లాడితే, పగటి కాంతి అనేది ఆఫీస్‍ స్పేస్‍ స్పేషియల్‍ క్వాలిటీని మెరుగు పరిచేందుకు సాయపడుతుంది. అక్కడ పని చేసే వ్యక్తులు మరింత ఉత్పాదకతతో పని చేసేందుకు కూడా తోడ్పడుతుంది. అందుకే పగటి కాంతి వినియో గానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది.


డే లైటింగ్‍ను ప్రభావితం చేసే అంశాలు
లైటింగ్‍ డిజైన్‍ను ఏ విధంగా అమలు చేయాలి, డే లైటింగ్‍ డిజైన్‍ స్ట్రాటజీల ద్వారా డే లైటింగ్‍ను ప్రభావితం చేసే వివిధ అంశాలు, పరామితులు గురించి మొదట మాట్లాడుకుందాం. అన్నిటి కంటే ముఖ్యమైంది క్లైమేట్‍. అందుకే శీతోష్ణస్థితిపై ఆధారపడి డిజైన్‍ను రూపొందించాలి. గరిష్ఠ ప్రయోజనం పొందేలా దాన్ని తీర్చిదిద్దాలి. మనం హైదరాబాద్‍ నే గనుక ఉదాహరణగా తీసుకుంటే, ఇక్కడ ముఖ్యమైన అంశం సౌరశక్తికి సంబంధించింది. సోలార్‍ హీట్‍ గెయిన్‍ ను అధికం చేయడం. భవనంలో ఓపెనింగ్స్ ఉంటే స్పేసెస్‍ బాగా వేడి అవుతాయి. అందుకే డే లైటింగ్‍ స్ట్రాటజీని డిజైన్‍ చేసేటప్పుడు మనం శీతోష్ణస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. భవనం పొందే వేడిని తగ్గించడంపై కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఇక రెండో అంశం. నిర్దిష్ట భవనం లొకేషన్‍. భూమి సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతుందో మనకు తెలుసు. రుతువులను బట్టి సూర్యుడి కోణం మారుతూ ఉంటుంది. ఈ అంశా లను ఆధారంగా చేసుకొని మనం ఓపెనింగ్‍ సైజులను ఆప్టిమైజ్‍ చేసుకోవాలి. వాటికి తగినట్లుగా షేడింగ్‍ డిజైన్‍లను ఉపయోగించాలి. వాటి పరామితులు కూడా ఇక్కడ కీలకంగా ఉంటాయి. ఇక మూడో అంశం సైట్‍ కాంటెక్సట్. ఇక్కడ మనం పరిసరాల్లో కొనసాగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుంటాం. అక్కడ బ్లాకేజెస్‍ (నిరోధకాలు) ఉండవచ్చు. లేదా ఎంతో ప్రకాశవంతమైన ఉపరితలాలు ఉండవచ్చు. కాంతిని బాగా ప్రతిఫలించవచ్చు. అందుకే మనం డే లైటింగ్‍ స్ట్రాటజీలను డిజైన్‍ చేసేటప్పుడు ఇలాంటి బహిర్గత అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామో లేదో సరి చూసుకోవాలి.


ముఖ్యమైన అంశం మరొకటి కూడా ఉంది. మనం వర్కవుట్‍ చేసేటప్పుడు వ్యయాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పెట్టుబడులపై ప్రతిఫలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అది కూడా ముఖ్యమై నదే. అదే సమయంలో ఆ డిజైన్‍ స్ట్రాటజీలో ఉండే పర్యావరణ అంశాలను కూడా చూడాలి. ఆ తరువాత చూడాల్సింది భవనం టైపోలజీ. బిల్డింగ్‍ టైపాలజీ అనేది కార్యకలాపాలు, వినియోగించుకునే వారిని బట్టి మారుతూ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.
ఉదాహరణకు ఒక లైబ్రరీ కోసం డే లైటింగ్‍ డిజైన్‍ అనేది చాలా వరకు చదివే పక్రియల కు సంబంధించినదై ఉంటుంది. పాఠకులు కూర్చునే చోట కాంతి ఎలా పడుతుంది, దానితో పాఠకులు ఎలా సౌకర్యంగా ఉండగలుగుతారు లాంటి అంశాలపై అది ఆధారపడి ఉంటుంది. ఆ తరువాత మనం స్టాండర్డస్, కోడ్స్ గురించి కూడా చూడాలి. డే లైట్‍ డిజైనర్లకు నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. దాంతో పాటుగా మనం ఫెన స్ట్రేషన్‍ (కిటికీల అమర్పు), ఓపెనింగ్స్ సైజెస్‍ వంటివి కూడా చూడాలి. ఉదాహరణకు మనం ఈసీబీసీ 2017 (ఎనర్జీ కన్జర్వేషన్‍ బిల్డింగ్‍ కోడ్‍) ను తీసుకుందాం. ఒక నిర్దిష్ట సైజు లోని ఫెనస్ట్రేషన్‍ కు సంబంధించి ప్రమాణాలు, కోడ్స్, విభిన్న క్లైమేట్‍ జోన్లు, ఓపెనింగ్‍ ఏ దిశలో ఉంది లాంటివాటిని అర్థం చేసుకోవడంలో అది తోడ్పడుతుంది.


స్ట్రాటజీల వర్గీకరణ
లైటింగ్‍ డిజైన్‍ స్ట్రాటజీలను అర్థం చేసుకోవడానికి గాను సాధారణ స్థాయి నుంచి సంక్లిష్టస్థాయి దాకా వాటిని నేను పాసివ్‍ స్ట్రాటజీలు, ఆర్కిటెక్చరల్‍ ఇంటర్వెన్షన్స్, టెక్నలాజికల్‍ ఇన్నోవేషన్స్ గా వర్గీకరించాను. పాసివ్‍ స్ట్రాటజీలు ఎంతో సరళమైనవిగా ఉంటాయి. చాలా వరకు అవి డిజైన్‍కు, ప్రాక్టీస్‍ కు సంబంధించినవే అయి ఉంటాయి. ఆ ర్కిటెక్చరల్‍ ఇంటర్వెన్షన్స్ అనే వాటిని భవన నిర్మాణ సమయంలో ఉపయోగిస్తాం. టెక్నలాజికల్‍ ఇన్నోవేషన్స్ అనే వి అధునాతన సాంకేతికతలు. ఇవి సామర్థ్యపూర్వక డే లైటింగ్‍కు తోడ్పడుతాయి. పాసివ్‍ టెక్నిక్‍ అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా డిజైన్‍ లెవల్‍. బేసిక్‍ లెవల్‍లో మనం సైట్‍ను విశ్లేషించినప్పుడు రెండు ప్రధాన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన ఓరియెంటేషన్‍, సూర్యుడి కోణం. ఈ రెండు అంశాలనూ ఒక్కచోటికి చేర్చి చూస్తే, ఆ భవనాన్ని మనం ఎలా తీర్చిదిద్దవచ్చో, ఓపెనింగ్స్ ను ఎలా రూపొందించవచ్చో అర్థం చేసుకోగలుగుతాం.
హైదరాబాద్‍ నే ఉదా హరణగా తీసుకుంటే, శీతోష్ణస్థితిపరంగా చూస్తే, మనం పెద్ద పెద్ద కిటికీలను ఉత్తరం వైపు పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా సోలార్‍ హీట్‍ గెయిన్‍ కారణంగా, దక్షిణం వైపు, నైరుతి వైపు ఉండే కిటికీలను తగ్గించాలి. భవనం దక్షిణం, నైరుతి వైపు వేడి అధికంగా ఉంటుంది. దక్షిణం, నైరుతి వైపుతో పోలిస్తే, ఉత్తర భాగం చల్లగా ఉంటుంది. రుతువులను దృష్టిలో ఉంచుకొని, సూర్యుడి కాంతి ఎలా వస్తుందో చూసుకుంటూ, లైటింగ్‍ డిజైన్‍ స్ట్రాటజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎంచుకోవడం చాలా సులభం. రంగులు ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత స్థాయిలోనూ మనం ఎంతో సులభంగా చేయవచ్చు. పెయింట్‍ లేదా వాల్‍ పేపర్స్ లేదా మరే రకమైన ప్యానెల్‍ ను ఉపయోగించడం ద్వారా మనం ఒక గదిలోకి వచ్చే కాంతి నాణ్యతను హెచ్చుతగ్గులు చేయవచ్చు. ఉదాహరణకు తెలుపు లేదా లేత రంగులు ఉపయోగిస్తే కాంతి ప్రతిఫలిస్తుంది. కాంతి బాగా అవసరముండి, కాంతి రాలేని పక్షంలో మనం ఇలాంటి రంగులను ఎంచుకోవచ్చు. అవి భవనంలో కాంతిని ప్రతిఫలిస్తూ, కాంతిని అధికం చేస్తాయి.
ఇక ఆర్కిటెక్చరల్‍ ఇంటర్వెన్సన్‍ గురించి… కిటికీల గుండా సహజ కాంతిని పొందడం అత్యంత సరళమైన మార్గం. ఎన్నో రకాల కిటికీలు ఉంటాయి. ఫిక్స్ డ్‍ విండోస్‍ ఉంటాయి, సెగ్మెంటెడ్‍ విండోస్‍ ఉంటాయి… మరెన్నో రకాల కిటికీలు ఉంటాయి. వర్టికల్‍ సర్ఫేస్‍ లకు విండోస్‍ ఉన్నట్లుగానే హారిజాంటల్‍ ఉపరితలాలకు పైభాగంలో స్కైలైట్స్ ఉంటాయి. ఇలాంటి వాటి ద్వారా మనం తగినంత వెలుతురును పొందవచ్చు. ఇక మరో ముఖ్యమైన అంశం…దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా చోట్ల పెరడు ఉండడం మనం చూస్తుంటాం. అవి సుస్థిరదాయకతకు దోహదం చేస్తాయి. అవి సహజ కాంతిని అందించడం మాత్రమే గాకుండా, సోలార్‍ హీటింగ్‍ను కూడా తగ్గిస్తాయి. వేడి గాలిని బయటకు పంపేందుకు కూడా ఇవి తోడ్పడుతాయి. ఒకే సమయంలో రెండు పనులు జరుగుతాయి. అందుకే ఇది ఒక ముఖ్య మైన డిజైన్‍ స్ట్రాటజీగా ఉంది.


కొంత సంక్లిష్టంగా…
ఇక తదుపరి మూడు సెట్ల ఆర్కిటెక్చరల్‍ ఇంటర్వెన్షన్లు కాస్తంత సంక్లిష్టమైనవి. ఇందులో మొదటిది లైట్‍ షెల్వస్. ఇది ఇంటీరీయర్‍ లేదా ఎక్స్ టీరియర్‍గా ఉండవచ్చు. దీనికి ఫెనెస్ట్రేషన్‍ తో సంబంధం లేదు. విండో డిజైన్‍ మాత్రమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సూర్య కాంతి దానిపై పడి, లోపలికి కొంత ప్రతిఫలిస్తుంది. మనకు ఎంత కాంతి అవసరం అనే దాన్ని బట్టి మనం లైట్‍ షెల్వస్ డిజైన్‍ ను ఎంచుకోవచ్చు. ఇలా లోపలికి వచ్చే కాంతి వేడిగా ఉండదు.
వీ టితో వివిధ రకాల సమయాల్లో వివిధ రకాల కాంతిని పొందవచ్చు. సహజ కాంతిని హ్యాండిల్‍ చేయడంలో ఇదొక విధానంగా ఉంది.
ఇక తదుపరి ఉదాహరణ లోవర్స్ లేదా ఫిల్మ్ని ఉపయో గించడం. లోవర్‍ లేదా ఫిల్మ్ ఒక ఆర్కిటెక్చరల్‍ కాంపోనెంట్‍. అది కాంతి చొరబాటును తగ్గిస్తుంది. సుస్థిరదాయక పగటికాంతికి సంబంధించిన ఇంటర్వెన్షన్‍ ఇది. మరొకటి అట్రియం. వీటిని ప్రధానంగా మాల్స్ లాంటివాటిలో చూస్తాం. ఇవి ఒక ఫ్లోర్‍ కు అని గాకుండా అనేక ఫ్లోర్‍ లకు అవసర మైన గాలి, వెలుతురు అందిస్తాయి.
ఇక టెక్నలాజికల్‍ ఇన్నోవేషన్స్ విషయానికి వస్తే…ఇందులో మూడు రకాలున్నాయి. తగినంత వెలుతురు లేని పక్షంలో ఆటోమేషన్‍, బిల్డింగ్‍ మేనేజ్‍ మెంట్‍ సిస్టమ్స్, స్మార్ట్ సొల్యూషన్స్ అనేవి మనకు తోడ్పడుతాయి. వీటిలో మొదటిది ఆపెరబుల్‍ డివైజెస్‍. ఇది ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే వీటిని మనం ఆటోమేట్‍ చేయాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ ఎలా వర్క్ చేస్తాయనే విషయంలో మనం జాగ్రత్త వహించాలి. వాతావరణ పరిస్థితులకు, సూర్యుడి కోణానికి తగినట్లుగా వెలుతురు లోపలికి వస్తుంది. ఈ ఉపకరణాలు మూసుకుంటాయి, తెరుచుకుంటాయి. వీటిని స్కైలైట్స్తో కలిపి ఉపయోగించవచ్చు. లోవర్స్తో ఉండే కిటీకీల వద్ద కూడా
ఉపయోగించవచ్చు. ఇటీవలి కాలంలో వచ్చిన స్మార్ట్ గ్లేజింగ్‍ మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎంతో సింపుల్‍ టెక్నిక్‍. సుస్థిరదాయక డే లైటింగ్‍ స్ట్రాటజీలకు ఇవన్నీ తోడ్పడుతాయి. ఇక చివరగా ఆక్యుపెన్సీ సెన్సర్స్. ఒక నిర్దిష్ట గదిలో లేదా స్థలంలో ఎంత మంది ఉన్నారనే దాన్ని బట్టి లైటింగ్‍ ఉంటుంది. ఎలాంటి కాంతి కావాలో కూడా నిర్ణయించుకోవచ్చు. ఇలాంటి వన్నీ కూడా ఇంటర్నెట్‍ ఆఫ్‍ థింగ్స్ లో భాగమవుతున్నాయి. వీటన్నిటినీ వ్యక్తిగతస్థాయిలో, సామాజిక స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.


అనువాదం : యన్‍.వి.యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *