Day: February 1, 2022

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం

అనేక సామాజిక రుగ్మతలకు మూలం నిరక్షరాస్యత.ఈ నిరక్షరాస్యతకు మూలం సామాజిక అసమానతలు. విద్య, వైద్య విధానాల రూప కల్పన, ఆచరణ ఆయా సామాజికాభివృద్ధికి కారణమవుతాయి. నూతన రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ విద్య అందాలన్న సదాశయంతో దేశంలో మరెక్కడా లేని విధంగా కెజీ టూ పీజీ ఉచిత విద్యకు అంకిత భావంతో అంకురార్పణ చేసింది. గిరిజన, ఆదివాసీ, మైనారిటీ, దళిత బహుజన విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలను, స్థానిక, ప్రాంతీయ భాషల అభివృద్ధిలో భాగంగా …

భావితరాల ప్రయోజనకారి-నేటి విద్యావిధానం Read More »

సిరిప్రెగడ భార్గవరావు

‘‘పల్లెలు మా నివాసములు పచ్చని పంట పొలాలు మా మనః పుల్లత గూర్చు చైత్రములు, బోదెల పైని రసాల శాఖికా పల్లవముల్‍ గ్రసించు చిరుపాటలదియాని తేనెతేటలు జిల్లు పికంబు మా యనుగుచెల్లెలు గానమె మాదు ప్రాణమౌ’’.అని కంఠమెత్తి పాడిన కవికోకిల సిరిప్రెగడ భార్గవరావు.ఎక్కడో నల్లగొండ జిల్లాలోని చండూరు సమీపముగల చిరుపల్లె గూడెపల్లిలో సిరిప్రెగడ జన్మించారు. ఆయన జనన తేది కూడా సాహితీలోకానికి తెలియదు. చాలా పిన్న వయస్సులోనే 1963లో ఆయన అస్తమించారు.1934లో గుంటూరు జిల్లా ‘ఏదుబాడు’ నుండి …

సిరిప్రెగడ భార్గవరావు Read More »

మనం మరచిన సంస్థాన మహిళలు

హైదరాబాద్‍ రాజ్యమే ఎనుకటి ఇండియాలో పెద్ద సంస్థానం. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చిన్న, పెద్ద సంస్థానాలు పరిపాలన సాగించేవి. ఈ సంస్థానాధీశులతో చాలా మందికి దగ్గరి సంబంధాలుండేవి. దోమకొండ సంస్థానానికి అమరచింత సంస్థానాధీశులతో, గద్వాల సంస్థాన పాలకులకు మెదక్‍ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి, జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధీశులకి వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి పాలకులతో, వనపర్తి సంస్థానం వారికి మునగాల పాలకులతో సంబంధ బాంధవ్యాలుండేవి. ఇవన్నీ ఆ పరిపాలన సజావుగా జరగడానికి, వారి రాజరికాన్ని, అధికారాన్ని నిలుపుకోడానికి …

మనం మరచిన సంస్థాన మహిళలు Read More »

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’

ప్రేమకోసం తాజ్‍మహల్‍ వెలిసింది. ఒక ప్రియుడు, తన ప్రియురాలికి ఇచ్చిన ప్రేమ కానుకగా హైద్రాబాద్‍ నగరం అవతరించింది.అసలు హైద్రాబాదే ఒక ప్రేమనగరం. కొడుకు మీద ప్రేమతో ఒక ముసలి తండ్రి నిర్మించిన వంతెన పూరానాపూల్‍. తన ముస్లిం భార్య మీద ప్రేమతో ఒక ఆంగ్లేయుడు కట్టించిన భవనమే కోఠిలోని రెసిడెన్సీ. ప్రస్తుతం ఇది ఉమెన్స్ కాలేజీగా చెలామణి అవుతుంది. ఒక ముస్లిం ప్రేమికుడు తన ఫార్సీ భార్యకోసం కట్టించిన మహల్‍ ‘‘వికార్‍ మంజిల్‍’’. అతను ఎవరో కాదు …

భగ్నహృదయాల దయ్యాల మేడ ‘వికార్‍ మంజిల్‍’ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు

(గత సంచిక తరువాయి) సోషల్‍ ఎకాలజీముర్రేబుక్‍చిన్‍ అనే సామాజిక సిద్ధాంతకర్త సాగించిన ఆలోచనధారను ‘సోషల్‍ ఎకాలజీ’గా వ్యవహరిస్తున్నారు. నాలుగు దశాబ్దాలపై చిలుకుగా ఈయన సామాజిక ఆధిపత్యం, ప్రకృతిపై ఆధిపత్యం మధ్యగల సంబంధాలను గురించి సాగించిన రచనల సారాంశం సోషల్‍ ఎకాలజీగా గుర్తింపు పొందింది.ఈయన సాగించిన చింతనకు మూలాలు భిన్న రకాలైన తాత్త్విక సంప్రదాయాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మార్క్సీయ సామ్యవాదం, ఉదార అరాచకవాదం, పాశ్చాత్య జీవవాదాలలో దర్శనమిస్తాయి. అదే విధంగా అరిస్టాటిల్‍, హెగెల్‍ వంటి తత్త్వవేత్తల ఆలోచనల ప్రభావం …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

ఉజ్జలికోట శాసనం (క్రీ.శ.966 & క్రీ.శ.1097)

అలనాటి మేటి తెలంగాణ శాసనాలు-18అనేక ప్రత్యేకతలు గల ఇద్దరు రాజుల ఉజ్జిలి, మునుపటి మహబూబ్‍నగర్‍ జిల్లా, మక్తల్‍ తాలూకాలోని ఒక ప్రాచీన కోట. కళ్యాణ చాళుక్యుల కాలంలో ఒక రాజధాని. ఉజ్జిలి ఇపుడొక చిన్న గ్రామమైనా, క్రీ.శ.10-12 శతాబ్దాల్లో ఒక పాలనా కేంద్రంగా వెలుగొందిన నగరం. ఆ గ్రామంలోని ఒక బావి దగ్గర అనేక ప్రత్యేకతలున్న ఒక కన్నడ శాసనముంది. 131 సం।।ల తేడాతో ఒకేరాతిపై గల క్రీ.శ.966 నాటి మొదటి శాసనాన్ని మహామండలేశ్వర శ్రీ వల్లభచోళ …

ఉజ్జలికోట శాసనం (క్రీ.శ.966 & క్రీ.శ.1097) Read More »

ఆకాశంలో తెగిపడే చుక్కలు

నిజానికి ఉల్కలు అనేవి ఆస్టరాయిడ్‍ బెల్ట్ నుంచి వచ్చేవి. సౌరకుటుంబంలో అంగారక, గురుగ్రహాల నడుమ ‘గ్రహశకలాల సమూహం’ (Asteroids Belt) ఎల్లప్పుడు ఒక కక్ష్యలో తిరుగు తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రహశకలాలు ఆ గుంపు నుంచి వెలువడి అత్యంతవేగంతో భూమి వాతావరణంలోనికి ప్రవేశించినపుడు వాటిలో ఎక్కువభాగం మండిపోతాయి. కొన్ని మాత్రమే అరుదుగా భూమిమీద రాలిపడుతుంటాయి. దాన్నే ఉల్కాపాతం అంటారు. రాలిపడ్డ పదార్థాలు ఉల్కలు. గ్రహాంతర పదార్థశకలాలు(Celestial Bodies) . భూమి అక్షంలో వక్రత, భూమండలం మీద వాటి …

ఆకాశంలో తెగిపడే చుక్కలు Read More »

తెలంగాణ గిరి‘జనం’ జాతర

మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్యదైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. అడవిబిడ్డల ఆరాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మ పోరాట పటిమకు.. ధిక్కారస్వరానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఆదివాసీల పరిభాషలో పంచభూత ప్రకృతి దైవాలుగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మల కలయికే మేడారం జాతర. కీకారణ్యంలో రెండేళ్లకోమారు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర …

తెలంగాణ గిరి‘జనం’ జాతర Read More »

‘రైతు బీమా’ – రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావు

సంక్రాంతి సందర్భంగా ‘రైతు బంధు’ సంబరాలు ఎలా సాగినా కూడా ఒక అంశంలో ప్రభుత్వ చర్యను అభినందించాలి. అది రైతుల జీవిత బీమా పథకం. మ•తుల కుటుంబాలకు ఇది చీకట్లో చిరు దీపం. రూపశిల్పి కల్వకుంట్ల చంద్రశేఖర్‍రావుకు ప్రత్యేక అభినందనలు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిన రైతు బీమా ఒక ఉదార ప్రయత్నం Farmers Group Life Insurance Scheme పేరిట రూపొందించిన ఈ పథకం వల్ల గడిచిన మూడున్నరేళ్ళలో దాదాపు 72 వేల రైతులకు పరిహారం …

‘రైతు బీమా’ – రూపశిల్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‍రావు Read More »

పర్యావరణ హితంగా భారతదేశం

గ్లాస్గో సదస్సులో ప్రధాని మోదీ భారతదేశం రాబోయే యాభైయేళ్ళలో శూన్యస్థాయి కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని మోదీ గ్లాస్గో సదస్సులో ఇచ్చిన హామీ పర్యావరణ ప్రేమికులను ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తింది. పారిస్‍ ఒప్పందానికి కట్టుబడి ఉన్నది మేమేనంటూ భారత్‍ ఈ దిశగా వేసిన అడుగులను వివరించారు ప్రధాని. ప్రపంచ జనాభాలో 17శాతం ఉన్న దేశం, కర్బన ఉద్గారాల వాటాలో మాత్రం ఐదుశాతంగానే ఉందని గుర్తుచేస్తూ, పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్‍ ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. పర్యావరణ …

పర్యావరణ హితంగా భారతదేశం Read More »