వెదురు విస్తీర్ణంలో భారత్‍ రెండో స్థానం


సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం


ప్రక•తి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్‍లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లు వుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. సెప్టెంబర్‍ 18న ప్రపంచ వెదురు దినోత్సవం.

 • ప్రపంచ వెదురు (పెంపక-పరిరక్షణ నిర్వాహణ) సంస్థ.. ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
 • 2009లో బ్యాంకాక్‍లో జరిగిన వరల్డ్ బాంబూ కాంగ్రెస్‍లో ఈ డేను నిర్వహించాలని తీర్మానించారు.
 • వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి.. అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించు కోవాలో అనే విషయాలపై ఇవాళ ప్రధానంగా చర్చిస్తారు.
 • అటవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు.. వెదురు
 • గిరిజనుల జీవనంలో ఇదొక భాగం
 • గిరిజనులకు జీవనోపాధిగానే కాకుండా.. వాళ్ల సంప్రదాయాల్లోనూ పవిత్రతను సంతరించుకుంది వెదురు.
 • చైనా, భారత్‍ లాంటి ఆసియా దేశాల్లో స్థిరమైన అభివ•ద్ధి లక్ష్యాలు సాధించడంలో వెదురు గణనీయమైన పాత్ర పోషిస్తోంది.
 • 65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. అమెరికా (ద్వయం), ఆఫ్రికా ఖండాలు ఆ తర్వాతి ప్లేస్‍లో ఉన్నాయి.
 • గ్లోబల్‍ బాంబూ మార్కెట్‍ విలువ 2015 నాటికి 72 బిలియన్‍ల డాలర్లుగా ఉంది. 2019 నాటికి అది 98 బిలియన్‍ డాలర్లకు చేరుకుంది.
 • చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్‍ మాత్రం 4 శాతంతో సరిపెట్టుకుంది.
 • వియత్నాం, థాయ్‍లాండ్‍, కాంబోడియాల మార్కెట్‍ షేర్‍ మనకంటే ఎక్కువే.
 • మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, స్పెషల్‍ బాంబూ ఎకనమిక్‍ జోన్లను ఏర్పాటు చేసి ఆర్థిక వ•ద్ధిని సాధించొచ్చు.
 • వెదురు వ్యర్థాలతో అద్భుతం చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, జాతీయ వెదురు మిషన్‍లు ప్రయత్నిస్తే.. మన మార్కెట్‍ సైతం తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి.
 • పోవాషియే కుటుంబానికి చెందిన వెదురులో.. 115 జాతులు, 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి.
 • కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఎటు నుంచి నరికినా.. వేగంగా పెరుగుతుంది కూడా.
 • ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలపగా చెప్తుంటారు. అంతేకాదు ఆకుపచ్చ బంగారంగా వెదురుకు పేరుంది.
 • ఆహారంతో పాటు కట్టడాలు, నిర్మాణ మెటీరియల్‍గా, పేపర్‍, హస్త కళల్లోనూ వెదురును ఉపయోగిస్తారు.
 • వెదురు చెట్ల పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ అక్కర్లేదు. వేస్ట్ ల్యాండ్‍లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షాలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది.
 • పోషక విలువలు సైతం ఉంటాయి.
 • వెదురు ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.
 • సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు.
 • వెదురు సామాన్లకు, ఫర్నీచర్‍కు, పరికరాలకు, షోకేజ్‍ వస్తువులకు గ్లోబల్‍ మార్కెట్‍లో ఫుల్‍ గిరాకీ ఉంది.
 • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తుల వారికి ప్రత్యేక ఆర్థికాభివృద్ధిని అందించి వారిని ప్రోత్సహిస్తుంది.


కొత్వాల్ సచిన్
9701001036

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *