ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని సాలర్ జంగ్ మ్యూజియంలో ‘‘గ్రాండ్ ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్’ ఎక్స్ పోలో భాగంగా సాలార్ జంగ్ మ్యూజియంలో చిత్రపటాలు, ప్రకృతి, వన్యప్రాణులు, వాస్తుశిల్పం నుంచి మతాలు, సంస్కృతులు, పండుగలు, గిరిజనుల వరకు టైమ్‍లెస్ ఛాయాచిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. 75 మందికి పైగా దేశ విదేశీ ఫోటోగ్రాఫర్‍ల నుండి 480 ఛాయాచిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. సెప్టెంబరు 4 వరకు ఫోటోలు ప్రదర్శనలో ఉంటాయి. ఈ సందర్భంగా తెలంగాణ వారసత్వం, హైదరాబాద్ వారసత్వం, ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్టస్ కళాశాల వారసత్వం అనే మూడు విభాగాల్లో ఫొటోలు సమర్పించిన నగరంలోని ఫొటోగ్రాఫర్‍లను ప్రపంచ వారసత్వ దినోత్సవం నేపథ్యంగా సన్మానించారు.
రాష్ట్ర టూరిజం డెవలప్‍మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి, Prof.Er. వేదకుమార్ మణికొండ, చైర్మన్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ జనరల్ సెక్రటరీ జనార్దన్, శ్రీ వీరేందర్ సిపిఆర్‍ఓ (సాలర్జంగ్ మ్యూజియం) మరియు ఎం.సి. శంకర్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్‍ఏఓపి, తెలంగాణ, ఇండియా హాజరై ప్రారంభించారు. టర్కీ, సింగపూర్, ఈజిప్ట్, శ్రీలంకలతో పాటు భారత రాష్ట్రాలైన అస్సాం, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఫొటోగ్రాఫర్ల చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
టర్కీకి చెందిన ఓజ్కాన్ సిమ్సెక్, సింగపూర్‍కు చెందిన విన్సెంట్ యూ, కెనడాకు చెందిన తారా డే, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్కు చెందిన ఆండ్రియాస్ ఆండ్రూ, ఈజిప్ట్కు చెందిన మహ్మద్ హస్సమ్ అహ్మద్, శ్రీలంకకు చెందిన బండారా పాండులా, సౌదీ అరేబియాకు చెందిన నజ్లా అంగ్వాయ్ తదితరుల చిత్రాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఒడిశాకు చెందిన ధీర్ పీసీ, పశ్చిమబెంగాల్‍కు చెందిన నరేందు ఘోష్, హైదరాబాద్ కు చెందిన రాధా ప్రసాద్ వారణాసి, అసోంకు చెందిన రత్నజిత్ చౌదరి వంటి భారతీయ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
ముగ్గురు పిల్లలు వర్షంలో ఆడుకుంటున్న ఫొటో, చిన్ననాటి అమాయకత్వాన్ని ప్రతిబింబించే ఫొటో, మనవరాలితో కలిసి ఓ వృద్ధురాలు ప్రేమ సారాన్ని బంధించి చిరునవ్వులు చిందిస్తూన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో హైలైట్స్ గా నిలిచాయి.ఈ ఫొటోల్లో వివిధ రకాల మనోభావాలు, లైట్లు, నీడలతో పాటు ఎరుపు, పసుపు, నీలం రంగులతో పాటు ప్రకృతి అందాలకు సంబంధించిన ఇతర రంగులను చూపించారు. రోజువారీ దినచర్య చిత్రాలు, నిజమైన భావోద్వేగాలను బంధించగా, పండుగలు మరియు నృత్య రూపాల చిత్రాలు సంస్కృతి మరియు కళలను బంధించాయి. దిబ్బలు, వాస్తుశిల్పం, ప్రతిబింబాలతో కూడిన ఖాళీ రోడ్లు, తెల్లవారు ఝాము నుంచి తీవ్రమైన సూర్యాస్తమయం వరకు ప్రేక్షకుడికి నచ్చే అనేక రకాల భావోద్వేగాలు, సున్నితత్వాలు, సంక్లిష్టతలను రేకెత్తించే షట్టర్ బగ్స్ కు అసాధారణంగా ప్రతిబింబించిన చిత్రాలు ప్రదర్షించ బడ్డాయి. ఈ సందర్భంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ఆధారంగా తీర్చిదిద్ది చిత్రీకరించిన నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్లకు బహుమతి ప్రధానం మరియు సన్మానించారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ, హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్టస్ కాలేజ్ హెరిటేజ్ అనే మూడు కేటగిరీల్లో ఫొటోలు సమర్పించారు.
- సయ్యద్ ఖైజర్ బాష,
ఎ : 9030 6262 88