బంజార చరిత్రకు దిక్సూచి – రంజోళ్‍ కథాగాన ప్రదర్శనలు

భారతదేశంలో ఎన్నో పురాతన సంస్క•తులు కలవు. ప్రతీ సంస్క•తీ వాటి నియమ నిబంధనలను ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నాయి. భరత భూమిలో గోండ్వాన ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, సాంపద్రాయాలు కలిగి ఉన్నది. మానవుడు ఆదిమ మానవులుగా ఉన్నప్పుడు సమాజంలో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు.


తెలుగు రాష్ట్రాలలో 35 గిరిజనతెగలు తమ ప్రత్యేక ఉనికిని చాటుకున్నాయి. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల ప్రభావం వారి జీవనవిధానంపై కొంత ప్రభావం చూపుతుంది. గిరిజనులల్లో ఆధికశాతం తెగలు ప్రత్యేకభాషతో తమ వైవిద్యాన్ని కలిగియున్నా సమాజ నేపథ్యంతో ప్రత్యేకతను చాటుకుంటున్నందున వీరు జరుపుకునే పండుగలు, దేవతలు, వ్యక్తుల విలువలు ఒకే రీతిలో కనిపిస్తాయి. వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తున్న వ్యక్తుల పాత్రలు తమ తెగకు ప్రాతినిధ్యం వహించేవిగా ఉంటాయి. తమ వ్యక్తిత్వాన్ని తాము అనుసరిస్తూ మిగతా వారంతా అనుసరించేలా చాటడం వారి బాధ్యత. ఈ బాధ్యతలో గౌరవమే ముఖ్యమైనది. కాబట్టి దాన్ని కాపాడుకునే ప్రయత్నం ఉంటుంది. గిరిజన తెగ నాయకుడు మొదలుకొని సమూహ ప్రజలకు సమాచారాన్ని చేరవేసే వ్యక్తి వరకు, తమ కట్టుబాట్లను అమలు చేసే విషయంలో ప్రత్యేక విధి విధానాలు అనేవి ఉంటాయి. ఇవి వంశపారంపర్యంగా కొనసాగుతూ వస్తుంటాయి. అమలు చేసేవారు సమాజంలో ఒక భాగంగానే ఉంటూ, సమాజానికి ఆదర్శంగా నిలువాల్సి ఉంటుంది. ఐతే గిరిజన తెగల్లోని కొన్నింటికి ఉపతెగలు ఉన్నాయి. ఇది పని విభజనను బట్టి జరుగవచ్చు. గిరిజన సంస్క•తిలో భాగంగానే ఉపతెగలు తమ ధాతృకులం లేదా పోషిత కులం ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాప్తిచేసే క్రమంలో ఉపతెగల్లోని కొన్ని తెగలకు చెందినవారు ఆశ్రిత తెగులుగా స్ధిరపడిపోయి ఉండవచ్చు. జీవనోపాది కోసం ఈ ఆశ్రిత తెగలకు చెందినవారు కళాప్రదర్శననే వృత్తిగా స్వీకరించి కొందరు ఆశ్రిత కళాకారులుగా, మరికొందరు ఆశ్రితేతర లేదా వృత్తికళాకారులుగా స్థిరపడ్డారు. ఆశ్రిత కళాకారులు నియమిత తెగను మాత్రమే ఆశ్రయిస్తుండగా, వృత్తి కళాకారులు ప్రత్యేకమైన తెగతో లేదా గోత్రముతో సంబంధం లేకుండా కొన్ని గిరిజన తెగలను ఆశ్రయించి కళాప్రదర్శనల ద్వారా జీవనోపాధి పొందుతారు. ఇలా గిరిజన తెగల్లో ఆశ్రిత తెగలుగా లేదా ఆశ్రిత కళాకారులుగా పేరొందిన వారిలో గోండులకు పరదాన్‍, తోటి, కోయలకు ఢోలి, పట్టెడ వాళ్లు ఉన్నారు. వీరు ధాతృకులాలకు సంబంధించిన చరిత్రను, వంశకీర్తిని ప్రదర్శనల ద్వారా తెలియచేస్తూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచుతున్నారు. వీరు పోషిత కులం కట్టుబాట్లను అతిక్రమించకుండా సంస్క•తిలో భాగంగానే స్వీకరిస్తూ వారి మెప్పును పొందుతూ ముందుకు సాగుతున్నారు.


ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్న నేపధ్యంలో జానపద మరియు గిరిజన వృత్తి కళాకారులు సైతం పోషిత కులం ఆదరణకు దూరమవుతూ బతుకెళ్లదీస్తున్నారు. మిగతా గిరిజన తెగల్లో కొన్నింటికి ఉపతెగలు ఉన్నట్లుగానే బంజారా/లంబాడ గిరిజనులకు కూడా ఉన్నారు. వాటిలో గోర్‍ బంజారా, భాట్‍ బంజారా, ఢాడి బంజారా, నావి బంజారా, సనార్‍ బంజారా, డపుడియా బంజారాలను పేర్కొనవచ్చు. వీరిలో భాట్‍ / భాట్స్ బంజారా, ఢాడి బంజారాలు మాత్రమే లంబాడలకు ఆశ్రిత తెగలుగా చెపుతారు. మిగతావారు ఆయా వృత్తులను చెపట్టి సేవలందిస్తారు. ఐతే భాట్‍ బంజారా, ఢాడీ బంజారా తెగలు వేరు వేరు. అయినా, వారి పోషితకులం మాత్రం బంజారా గిరిజనులే. ఈ రెండు ఆశ్రిత తెగలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉన్నప్పటికి, కళనే వృత్తిగా స్వీకరించిన సంప్రదాయ కళాకారులు మాత్రం కొన్ని జిల్లాలకే పరిమితమై ఉన్నారు. భాట్‍ బంజారా కళాకారులు వరంగల్‍, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‍, నిజామాబాద్‍, ఆదిలాబాద్‍ జిల్లాలలోను ఉండగా, ఢాడి బంజారా కళాకారులు కేవలం నల్లగొండ జిల్లాలో మాత్రమే ఉన్నారు.


మహోన్నత గిరిజన సంస్క•తి గల బంజారా గిరిజనులకు ఆశ్రిత తెగయైన భాట్‍ బంజారాలలో ఎంతో మంది సంప్రదాయ వృత్తి నైపుణ్యం గల కళాకారులు ఉన్నారు. వారిలో భట్టు రంజోళ్‍ను సుప్రసిద్ధ కళాకారుడుగా చెప్పవచ్చు. ఇతను సంప్రదాయ కథాగాన ప్రదర్శనలో ఎన్నో ప్రయోగాలు చేసి భట్టు కథాగాన కళారూపాన్ని దిశదిశలా వ్యాప్తి చేయడంలో తన వంతు పాత్రను పోషించాడు. కథల ద్వారా బంజారాల చరిత్రను, వారి గోత్రాలు ఇంటిపేర్లను, వంశీకుల గొప్పతనాన్ని, సంస్క•తీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కనులకు కట్టినట్లుగా కథల రూపంలో ప్రదర్శిస్తూ గొప్ప కళాకారునిగా ఖ్యాతిని గడించాడు. ఈ కథలను కూడా బంజారాల పండుగలు, నోములు, వ్రతాలు, పూజలు మరిము పెళ్లి వంటి ప్రత్యేక కార్యక్రమాలు, సందర్భాల్లో ప్రదర్శించి పోషక కుల గిరిజనులైన బంజారాల మన్ననలు పొందుతుండటం గొప్ప విషయం.


భట్టు రంజోళ్‍ ఒక సంప్రదాయ గిరిజన వృత్తి కళాకారుడు. ఇతడు బంజారా భాషలో కథాగాన ప్రదర్శన ఇస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావల్సిందే. బంజారాల మౌఖిక చరిత్రకు ఒక దిక్సూచిగా నిలిచాడు. భవిష్యత్‍ తరాలకు ఇతని కథాగానాలు మార్గనిర్దేశకంగా మారాయి. ఇతను గొంతెత్తి కథాగానం చేస్తుంటే చుట్టూ ఉన్న పల్లెలు, తండావాసులు తన్మయత్వం చెందవలసిందే. తెలంగాణకే పరిమితమైందనుకున్న ఈ గిరిజన కళారూపాన్ని విశ్వవ్యాప్తం చేసి ఎంతో మంది కళాప్రియుల, పరిశోధకుల, ఆధికారుల మనసులు దోచుకున్నాడు. మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ కళాకారుడిని వెలికి తీయడంలో తెలుగు విశ్వవిద్యాలయం, జానపద గిరిజన విజ్ఞాన పీఠం పాత్ర వెలకట్టలేనిది. అంతటి మహోన్నత గిరిజన సంప్రదాయ వృత్తికళాకారుడు భట్టు రంజోళ్‍ గురించి దక్కన్‍ ల్యాండ్‍కు పరిచయం చేయడం ఆనందంగా భావిస్తున్నాను.


భట్టు రంజోళ్‍ తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్‍ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం. సుబ్బక్కపల్లె గ్రామ పంచాయితీ పరిధిలోని భట్టుపల్లి గ్రామంకు చెందిన కళాకారుడు. తెలంగాణలోని పలు తండల్లో రంజోళ్‍ తన కథాగాన ప్రదర్శన ద్వారా బంజారా జాతి వంశచరిత్ర, మూల వంశోత్పత్తి, గోత్రాలు, ఇంటిపేర్లు మొదలైనవి గానం చేస్తాడు. ఆదేవిధంగా గోర్‍ బంజారాల పండుగలు, నోములు, వ్రతాలు, పూజలు వంటి మొదలైన ప్రత్యేక సందర్భాలలో కథాగానం చేస్తూ తన ప్రతిభా పాటవాలతో పోషిత కులాన్ని రంజింపచేసి వారిచ్చే ప్రతిఫలాన్ని తీసుకుంటాడు. ఇలా భట్టు రంజోళ్‍ తరతరాలుగా వారి తండ్రి తాత ముత్తాతల నుండి సంక్రమించిన కళను అందిపుచ్చుకొని గత 50 సంవత్సరాలుగా బంజారాలకు కథలు చెప్పుతూ తెలంగాణలోనే గొప్ప కళాకారుడుగా రాణిస్తూ గిరిజన, గిరిజనేతరులతో ప్రశంసలు అందుకుంటున్నాడు. పృధ్విరాజ్‍ చౌహాన్‍, రాణా ప్రతాప్‍సింగ్‍ రాథోడ్‍, రాజారీసాల్వా, హాతీరామ్‍ భావాజీ చరిత్ర, అమర్‍సింగ్‍ రాథోడ్‍, కసన్‍సంగ్‍ హోడా, లాకాపులాకీ, డోలారాజ్యా, విరంధేసుమ్డా, సేవాలాల్‍ మహరాజ్‍, రామాయణం, భారతం, సాతీభవానీ కథలు, తీజ్‍పండుగ చరిత్ర, సీత్లా భవానీ చరిత్ర, మేరమ్మతల్లి చరిత్ర, దేవ్‍గురూజీ చరిత్ర, రాజ్‍బోజ్‍రాజ్‍ చరిత్ర మొదలైన కథలను కథాగానం చేయగల సమర్ధుడు రంజోళ్‍. ఆయా కథల్లోని చారిత్రక, హాస్య, శృంగార, రౌద్ర, భయానక, భీభత్సం వంటి రసాలను సందర్భాన్ని బట్టి కథాగానంలో ప్రవేశపెట్టి ఆద్యంతం ప్రదర్శన రక్తికట్టించగల సమర్ధుడుగా పేరొందాడు. కథల్లో బంజారాల మూల సంస్క•తిని ఆచారాలను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శించడం, కథల్లో సామాజికాంశాలను, సామెతలను, పొడుపుకథలను ప్రవేశపెట్టి కథను ఆద్యంతం ఆసక్తిగా తిలకించేలా చేసిన నిపుణుత కలిగిన కళాకారుడుగా ప్రసిద్ది చెందాడు. అలాగే రంజోళ్‍కు లంబాడి, తెలుగు, హింది, గుజరాతి భాషల్లో కథలు చెప్పగల బహుముఖ భాషా పరిజ్ఞానం ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రదర్శించడానికి వీలు కలిగింది. ఒక్కొక్క కథను సుమారుగా 24గంటలు ఏకధాటిగా ప్రదర్శించే ప్రతిభా సంపత్తి ఈయనకే స్వంతం. అంతే కాకుండా బంజారాజాతిలోని ఆరు వర్గాలకు చెందిన వంశోత్పత్తి కుల పురాణాలను ప్రరద్శించడంలో ఈయనకు ఈయనే సాటి. ఇప్పటి వరకు సుమారుగా 2వేల ప్రదర్శనలు ఇచ్చాడు. ప్రదర్శనలో రబాబ్‍ వాయించడంతో పాటు తాళాలు, చిరుతలు, డప్పు, లంగారా, సారంగీ, గజ్జెలు వంటి వాయిద్యాలను ప్రవేశపెట్టి కథకు నూతనత్వాన్ని సంతరించి తన కథలకు తానే ప్రచారకర్తగా నిలిచాడు. బంజారాల మౌఖిక సంపదను తరతరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో, తన కళ తనతోనే అంతరించకుండా ఉండేందుకు దాదాపుగా 100 మంది కళాకారులకు శిక్షణ ఇచ్చి ప్రదర్శించే స్థాయికి తీసుకువచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 12 భాట్స్ కళాబృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. జిల్లాస్థాయి, రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాడు. 2002 సంవత్సరంలో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఇచ్చిన ప్రదర్శన ఇతనికి మంచి గుర్తింపును తెచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠం జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి కళోత్సవాలు నిర్వహించగా తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‍ ఇంగ్లీష్‍ అండ్‍ ఫారిన్‍ లాంగ్వేజెస్‍ యూనివర్సిటి (ఇఫ్లూ) చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా పలు ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా డాక్యుమెంటేషన్‍ కూడా చేయడం జరిగింది. ఇంకా ఆల్‍ ఇండియా రేడియో, దూరదర్శన్‍ కేంద్రాలలో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రస్థాయి బంజారా గిరిజనసంఘాలు స్థానిక సంస్థలు తన ప్రతిభను మెచ్చి పలుమార్లు సన్మానించాయి. భాట్స్ కళాకారునిగా భవిష్యత్‍ తరాలకు బంజారా మూల సంస్క•తిని, మౌఖిక సంపదను పరిరక్షిస్తూ వస్తున్న భట్టు రంజోళ్‍ నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


పరిశోధకులు, విద్యావేత్తలు భాట్‍ బంజారా వ•త్తి కళాకారులను ఆశ్రిత కళాకారులుగా గుర్తించగా, బాట్‍ బంజారాలోని యువకులు, కళాకారులు, బంజారా సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రతినిధులు మేము ఆశ్రిత కులానికి సంబంధించిన వారం కాదని, బంజారా ఉప తెగగా గుర్తించాలని డిమాండ్‍ చేస్తున్నారు.

  • డా।। గడ్డం వెంకన్న,
    ఎ: 9441305070

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *