పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు – 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. – వేదకుమార్ మణికొండ
‘‘గోకులవనమనే’’ అందమైన గ్రామం. కల్మషం లేని మనుషులు. అంతేకాకుండా పరిశుభ్రతకు మారుపేరు. ఆ గ్రామం ఎప్పుడు చెట్లతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. దానికి కారణం ఆ ఊరి ప్రజలందరూ విద్యావంతులు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండేది. వ•ధా నీరంతా అందులోకి మరలించేవారు. తద్వారా దోమలకు ఈగలకు నివాసం ఉండేది కాదు. అందుకే గ్రామస్తులందరూ ఆరోగ్యవంతులుగా ఉండేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి స్వచ్ఛ అవార్డు పొందిన గ్రామం గోకులవనం.
కొద్దిరోజుల తర్వాత ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీ వారు ప్లాస్టిక్ కవర్లు ఎవరు వాడకూడదు అని హెచ్చరించారు. దుకాణాల్లోకి మార్కెట్లోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా బట్ట లేదా జ్యూట్ సంచులను తీసుకెళ్లాలని సూచించారు. ఒకవేళ ప్లాస్టిక్ వాడినట్లయితే 1000 రూపాయలు జరిమానా విధించారు. కానీ ప్రజలు జ్యూట్ బ్యాగుల స్థానంలో ప్లాస్టిక్ కవర్లు వాడారు. ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది ప్లాస్టిక్ భూమిలో కరగదు. ప్రజలు విపరీతమైన ప్లాస్టిక్ వాడడం వలన అనారోగ్యం పాలయ్యారు. దీనికి కారణం ప్లాస్టిక్ తగలబెట్టడం వల్ల ఆ పొగ శరీరంలోకి వెళ్లి అనారోగ్యానికి కారణం అయింది.
ఒకరోజు పట్నం నుండి పెద్ద డాక్టర్లు వచ్చి, గ్రామంలో ఉచితంగా వైద్య సేవలు చేస్తున్నారు. గ్రామస్తులందరికీ పరీక్షలు చేయగా అందరికీ జీర్ణకోశ, కాలేయ శ్వాస వంటి జబ్బులు ఉన్నట్లు నిర్ధారించారు. దీనికి కారణం ప్లాస్టిక్ వాడకం. డాక్టర్లు ఇవి తెలుసుకొని ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను గ్రామస్తులకు తెలియజేశారు. అవి విన్న గ్రామస్తులు తమ తప్పును తెలుసుకున్నారు. అప్పటినుండి ప్లాస్టిక్‌ను నివారించి జ్యూట్ బ్యాగులను వాడడంమొదలుపెట్టారు. ఆ రోజు నుండి ప్రజలు ఆరోగ్యవంతులై ఎప్పటిలాగానే, ఆ ఊరు ఆరోగ్యవంతమైన మనుషులుతో కళకళలాడింది.
- వై. చెర్రి, ఫోన్ : 944176210