కొత్తా చరిత్ర నీది ‘ఉమ్మెడా’!

తెలంగాణాలో అడుగడుగున చారిత్రక ప్రదేశాలు. వేలయేండ్ల చరిత్ర మోస్తున్న రాతిగుహలు, దేవాలయ శిథిలాలు, శిల్పాలు, శాసనాలు… ఎక్కడ పిడికెడు మట్టిని ముట్టుకున్నా మానవవికాస పరిమళాలు గుబాళిస్తాయి. ఎంత అద్భుత చరిత్రను తన కడుపున దాచిందో ఈ నేల. ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క ప్రత్యేకతతో నవ, నవోన్మేష విశేషాలతో రంగమెక్కుతుంది తెలంగాణ చరిత్ర. కొంచెం ఇష్టంతో, కొంచెం మర్యాదతో చరిత్రను అన్వేషించేవారికి తెలుసు చిన్నరాతిముక్క నుంచి బ•హద్దేవాలయాల దాక కొత్త తెలంగాణ చరిత్రే.


నిజామాబాద్‍ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ ఒక చారిత్రక గ్రామం. ఉమ్మెడ అనేది పాత ఉమ్మెడ, కొత్త ఉమ్మెడ అని రెండు గ్రామాల ఉమ్మడి రూపం. గోదావరినది ఒడ్డున ఉన్న ఈ వూరిలో చారిత్రక పూర్వయుగం నుంచి మధ్యయుగాల దాక జరిగిన మానవ సాంస్క•తిక పరిణామాల క్రమాన్ని చూడవచ్చు.


ఉమ్మెడ గ్రామం శ్రీరాంసాగర్‍ ప్రాజెక్టులో ముంపుకు గురైంది. ఇప్పుడున్నది కొత్త గ్రామం. ఉమ్మెడకు ఆ పేరు ఆ గ్రామంలో వెలసిన ఉమామహేశ్వరాలయంవల్లనే వచ్చిందని గ్రామస్తుల కథనం. ఉమామహేశ్వరాలయం ఏకకూటం. గర్భగుడి, అంతరాళం, అర్ధమంటపాలతో నిర్మాణమైంది. గర్భగుడిలో వర్తులాకారంలో, అంచులున్న పానవట్టం మీద బాణలింగం ప్రతిష్టించబడివుంది. గర్భగుడిలో శివలింగానికి వెనక అమ్మదేవత శిల్పం ఉంది. ఈ దేవత చతుర్భుజి. పరహస్తాలలో త్రిశూలం, ఢమరుకం, నిజహస్తాలలో ఖడ్గం, రక్తపాత్రలున్నాయి. ఇది దుర్గారూపం. తననే ఉమాదేవి అని పిలుస్తున్నారు. అంతరాళం ద్వారానికి కుడిపక్కన కుడివైపు తొండంతో లలితాసనంలో ఉన్న చతుర్భుజుడైన గణపతి శిల్పం ఉంది. ఇది జైనశిల్పశైలి. కిరీటాలు, పెద్దమీసాలతో కనిపించే ద్వారపాలకులలో ఒకరు గద, మరొకరు దండం ధరించి నిలుచున్నారు. వారు ద్విభుజులు. గుడి మంటపం 16స్తంభాలతో, కక్ష్యాసనాలతో, 3 తోవలతో ఉన్నది. స్తంభాలమీద పుష్పాలు, హంస, ఏనుగు, ఏనుగులు అభిషేకిస్తున్న శివలింగం వంటి అర్ధశిల్పాలు చెక్కబడి వున్నాయి. గర్భగుడి ముఖద్వారం మీద లలాటబింబంగా ఏనుగులు అభిషేకిస్తున్న శివలింగముంది. అంతరాళం ద్వారంపైన లలాటబింబంగా వినాయకుడున్నాడు. అర్థమంటపంలో 16స్తంభాలు, కక్ష్యాసనాలతో 3తోవలు తీయబడివున్నాయి. స్తంభపోదికలపై భారవాహకులుగా స్త్రీలను చెక్కారు. ఆలయం మంటపం ఉత్తరద్వారానికి పైన జైనతీర్థంకరుడు అభినందుని లాంఛనమైన కోతులు చెక్కబడ్డాయి. మంటపంలో భువనశిల్పంగా చక్రం కనిపిస్తుంది. (సిద్ధసాయిరెడ్డి)


గుడిముందు దీపాలంకరణకు దివ్వెలుచెక్కిన ఎత్తైన దీపస్తంభమున్నది.
ఉమామహేశ్వరాలయానికి కొంత దూరంలో పాత గ్రామానికి అతిసమీపంలో ఉన్న రాతిగుట్టలను కాలభైరవుని గుట్టలంటారు. ఇక్కడే కాలభైరవస్వామి గుడి వుంది. భైరవుడు చతుర్బుజుడు. ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం, రక్తపాత్రలతో త్రిభంగిమలో చెక్కబడిన శిల్పం. భైరవునికి కుడివైపున చాముండి, ఎడమవైపున గణపతి, రెండు వర్తులాకారపు పానవట్టాలపై బాణలింగాలు ప్రతిష్టించబడి, వాటికెదురుగా నంది శిల్పాలున్నాయి.


కాలభైరవగుట్టలో ఎన్నో రాతిగుండ్లు, వాటిచేత ఏర్పడ్డ గుహలున్నాయి. రాతిగుండ్ల మీద శిల్పాలున్నాయి. శాసనాలున్నాయి. ఒకచోట జైన గణపతి, అదేరాతిగుండు మీద తలపై కిరీటం, చెవులకు కుండలాలు, మెడలో హారాలు, జంధ్యం, నీవీబంధంతో, చేతుల్లో కత్తి, డాలు ధరించిన నరసర్పరూపంలో నాగశిల్పముంది. ఇంకొకచోట సర్పం చెక్కివుంది. ఇంకొక రాతిగుండు మీద గణపతి, కార్తికేయుని అర్ధశిల్పాలున్నాయి. అక్కడ కనిపించే విడి శిల్పాలలో రాష్ట్రకూటశైలిలో చెక్కిన గణపతి విగ్రహం, హనుమంతుడు, గరుడుడు, రాముడు, గుహాలయంలో చతుర్భుజి అయి త్రిశూలం, ఢమరుకం, ఖడ్గం, రక్తపాత్రలలో సుఖాసనంలో మణిమకుటం ధరించి కూర్చున్న దేవత శిల్పాలున్నాయి. గుడిబయట గోదావరినది ఒడ్డున చతుర్భుజ స్తంభానికి 4వైపుల 4తలలు, 5వది స్తంభశీర్షంపై ఊర్ద్వముఖంగా పంచముఖాంజనేయ శిల్పం చెక్కివున్నది. ఈ శిల్పం చెక్కిన తీరు అరుదైనది.
ఇవన్నీకాక పాత గ్రామంలోని ఆలయ సమీపంలో విల్లమ్ములు, కత్తి ధరించిన ఎక్కటి ఒకరు, రెండవది విలుకాడు, మూడవ వీరగల్లు బరిసెతో దొంగలను దునుమాడి గోరక్షణ చేసి అమరుడైన యోద్ధ రాష్ట్రకూటశైలిలో వున్న శిల్పంతో మూడు వీరగల్లుల శిల్పాలున్నాయి.


ఉమ్మెడ కాలభైరవస్వామిగుట్ట చుట్టు ఎన్నోరాతిగుండ్లు, సహజసిద్ధమైన రాళ్ళపేర్పుతో ఏర్పడ్డ గుహలున్నాయి. పరుపు బండరాళ్లున్నాయి. ఒక పరుపుబండమీద 23 రాతిబొద్దు (••జూ•శ్రీవ•) లున్నాయి. వీటి అమరిక నక్షత్రరాశిని సూచించే విధంగా వుంది. చరిత్రకారుడు కెపిరావు ఇవి 4వేల సంవత్సరాల కిందటి బ•హచ్ఛిలా యుగానివిగా భావిస్తున్నానన్నారు. ఇంకా పాతవి కావచ్చని చరిత్రబ•ందం భావిస్తున్నది. మరొకచోట రాతిబొద్దులున్నాయి. అంతేకాదు ఇప్పటికి 6వేల సంవత్సరాల పూర్వపు కొత్తరాతియుగానికి చెందిన నూరుడుగుంటలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇవి ఉమ్మెడలో వేలయేండ్లుగా మానవావాసాలుండేవని చెప్పడానికి నిదర్శనాలు.
ఉమ్మెడలో లభించిన కళ్యాణీచాళుక్యుల పాలనాకాలంనాటి రెండు శాసనాలు కొత్తవి. అవింకా ప్రచురించబడలేదు.


ఉమ్మెడ తొలి శాసనం:
ఉమ్మెడ కాలభైరవస్వామి గుడి సమీపాన రాతిగుండుపై కళ్యాణీచాళుక్య ప్రభువు త్రిభువనమల్ల 5వ విక్రమాదిత్యుడు (1008-1014) పంప పెర్మానడి కాలానికి చెందిన శాసనం తెలుగన్నడ లిపిలో, కన్నడభాషలో, 17పంక్తులలో చెక్కబడింది. సత్యరత్నాకర బిరుదాంకితుడు సోమరస పుణ్యంకొరకు మహా ప్రధాని పల్లవరస శక సం.933 ఫాల్గుణ మాస పౌర్ణిమ ఆదివారంనాడు అంటే 1012 ఫిబ్రవరి 10న చందగ్రహణ సందర్భంగా సోమనాథుని కాళ్ళుకడిగి 60మర్తురుల భూమిని భట్టవ్రిత్తిగా, సర్వనమస్యం (సకలజన పూజనీయం)గా దానం చేసినట్లు ఈ శాసనంలో వివరించబడినది. 5వ విక్రమాదిత్యుని శాసనం మరొకటి సంగారెడ్డి జిల్లా నందికందిలో లభించింది. తెలిసినంతవరకు ఇది అతని పేరునున్న రెండవ శాసనం అవుతుంది. ఇప్పటికే ప్రచురితమైన నిజామాబాద్‍ జిల్లా శాసన సంపుటిలో ఈ శాసనం లేదు.


ఉమ్మెడ శాసన పాఠం:

  1. స్వస్తి సమస్త భువనాశ్రయ శీప్రిథ్వీవల్లభ మ
  2. రాజాధిరాజపరమేశ్వర పరమభట్టారక స
  3. త్యాశ్రయకులతిలక చాళుక్యాభరణం త్రిభువనమల్ల
  4. శ్రీమద్విక్రమాదిత్యదేవర చన్దళేయ బిడినోళ్‍ విజే
  5. య రాజ్యగేయ్యత్తిరే .. .. సమధిగత పంచమహాశబ్ద మహామండలేశ్వర
  6. గంగాకులతిలకం కలికాలకర్ణ వివేకబ•హస్పతి సత్యరత్నాకరం శ్రీమత్సోవరస
  7. నీవరతావిరో స్వస్తి గంగాజలజాత వస్త్ర పవిత్రీక•తోత్త మాంగీయరప్వ
  8. శ్రీమంన్నిబపొవియద సకవర్ష 933నేయ విరోధక•త్సంవత్సరద పాల్గుణ(ద)
  9. సోమగ్రహణవాదిత్యవారదన్దు శ్రీబల్లవరసం సమస్త ప్రధానరుమా
  10. ఱింయి మగ్గిణ్ద(యి) ప్రత్తనాలతొలగొటిమ్మలేయ భట్టసామ్య దఱు
  11. (వ)త్త మత్త కొల్యం మహారాజపట్టలనిపిపొవికొల్లపేయ
  12. సోమనాథకాల్గ(చ్చి) సర్వనమస్యగొట్ట స్వస్తి సమస్తరాజ్య ప
  13. ర నిరూపితమహామాత్య పదవి విరాజమానం రప్వ శ్రీమా
  14. ల్మల్లపయ్యంగల మగం మహారాజ భట్టర మల్లీశ్వరద శంహి
  15. మరకొనేప్నికత పొదవర్గేలన్నిభ్భర్గో సత్ర ఈకొట్ట స్వదత్తాం
  16. పరదత్తాం వాయోహరేత వసుం(ధర) షష్టివర్ష సహస్రాణి
  17. విష్టాయా జాయతే క్రిమిః


ఉమ్మెడ మలి శాసనం:
ఉమ్మెడ కాలభైరవస్వామి దేవాలయం సమీపంలో గణపతిగుండు మీద కళ్యాణీ చాళుక్యులనాటి 2వ శాసనంలో 1వ జగదేకమల్లుని పాలనాకాలంలో శక సం.939, పింగళ సం. ఆశ్వయుజ శుద్ధ షష్టి ఆదివారం అనగా క్రీ.శ.1017 సెప్టెంబరు 29వ తేదీన మండలేశ్వరుడు కొంగుణవమ్మకు ధర్మువుగా మహారాజ గోపాలపురం నందగిరినాథునికి, మయూరపింఛధ్వజ లాంఛనం గల కుమారమల్లుడు, అంకకారుడు సోమరస యమ, నియమ, స్వాధ్యాయ, ధ్యాన, సమాధి సంపన్నుడైన ప్రసన్నాచార్యునికి గురుదక్షిణగా మెట్టభూమి, తరిభూమిని దానం చేసాడని వివరించబడ్డది. అష్టాంగయోగ నిరతుడైన గురువు గురించి చెప్పే పంక్తులు బాసర కాలాహనుమాన్‍ శాసనంలో కూడా
ఉన్నాయి. సాధారణంగా జైనగురువులను వర్ణించేక్రమంలో ఈ మాటలను పేర్కొంటుంటారు.


శాసన పాఠం:

  1. శ్రీ…………..లస్సజ….
  2. కామినిజన మో..న మణ్డల.. …… శ్రీ.. మహాద ప
  3. …….క గుణత్రయాచరణ క..ల….. స్వస్తి సమస్త భువనాశ్రయ…
  4. …రాజధిరాజపరమేశ్వర పరమభట్టారక సత్యాశ్రయ కులతిలక చాళుక్యాభరణ శ్రీ
  5. జ(గ)దేకమల్లదేవ చన్డ… గిరేవీఱల ద్విజయరాజ్యగేయ్యుత్తు….
  6. ….న…………..సమనా (సలు)త్తమిరే స్వస్తిశక వరిస 939నేయ పింగళ
  7. (సం)వత్సర ఐశ్వజ సుద్ద (6) ఆదిత్యవార స్వస్తి సమధిగత మహాశబ్ద..
  8. ..మణ్డలేశ్వరం కొంగుణవమ్మ దమ్మ మహారాజం కొపాలపుర పరమి
  9. ….నన్దగిరినాథం కంపి(బ)ళపఱి……. మయూరపింఛధ్వజ
  10. ….చ లాంఛనం కొమ్వరమల్లం… మాణిక్యం గణ్డగుణ
  11. చరణం జయదంకకాఱం శ్రీమత్సోమయ్యరస…స్వస్తి
  12. యమనియమస్వాధ్యాయధ్యానసమాధి సంద
  13. ….ప్ప… మత్ప్రసన్నాచార్య(గ్ల)జాద….. గేయోల్‍ గురుదక్షిణ
  14. ట్ట భూమి పల.. న్దయ్యదలకరియకేయిమే(గ్గ)… నాల్వత్ప్రపిరియ క
  15. యిందంపదవలోకరియ ఈయి మత్త…… క… కణకేఱై…
  16. పే(పీ)ఱగేగఱ్ది మత్త….. కరచం మత్త…మంగళ మహాశ్రీ స్వదత్తం పరద
  17. త్తాం వాయోహరంతు వసుంధర షష్టిర్వర్ష సహస్రాణి విష్టాయా జాయతి
  18. ….మతిణిసముద్ర విషధర భువనంయేర చంద్రార్క తారాయావదం….
  19. ..రతి మణికటా రిగ్యజుస్సామ… జాయ(వ)తి….. ప్రతినిధి
  20. తి.. రమర శ్రీగీతావతే శ్రీగంగసోమవిజయతే భువనేపూ…… తేస్సమతి


నిజామాబాద్‍ జిల్లా చరిత్రకారుడు, తరతరాల బోధన్‍ చరిత్ర పుస్తకరచయిత సిద్ధసాయిరెడ్డి ఉమ్మెడను దర్శించి మొదటి శాసనాన్ని చదివే ప్రయత్నం చేసారు. ఆ శాసనపాఠం లభించలేదు. తన ‘తర, తరాల బోధన్‍ చరిత్ర’ గ్రంథంలోని పే.84,204లలో
ఉమ్మెడ శాసనం గురించి, అంబిక శిల్పం గురించి పేర్కొన్నాడు. సాయిరెడ్డి స్వయంగా తన చేతులతో ఉమ్మెడ చరిత్రను రాసి గ్రామస్తులకు యిచ్చాడు. ఈ విషయాలే వివిధపత్రికల్లో కథనాలుగా ప్రచురించబడ్డాయి.


ఉమ్మెడలో శాసనాలను గుర్తించి, స్పష్టమైన శాసనబింబాలను తీసి, నాకు శాసనాలను చదివే అవకాశం కల్పించిన మా కొత్త తెలంగాణ చరిత్రబ•ందం పరిశోధక సభ్యులు అసిస్టెంట్‍ ప్రొఫెసర్‍ కటకం మురళి, టీచర్‍ బలగం రామ్మోహన్‍ వల్లనే ఉమ్మెడ చరిత్ర వెలుగు చూస్తున్నది. గ్రామస్తులతో మాట్లాడి, రెండువారాలపాటు ప్రతి చారిత్రక ప్రదేశాన్ని సందర్శించి, విషయసేకరణ జరిపి ఉమ్మెడకథా రచనకు మూలకాలైన అన్వేషకులు మురళి, రామ్మోహన్లు. గ్రామ సర్పంచ్‍ రాముడ పోశెట్టి, ఉమ్మెడ గ్రామ యువజన సంఘ బాధ్యుడు బుచ్చ సాయరెడ్డి, ఉమ్మెడ గ్రామానికి చెందిన కసిగంటి బొర్ర ముత్తన్న, నిజామాబాద్‍కు చెందిన రిషి ఖర్వాడ్‍ కర్‍, టీచర్‍ గుమ్మడి చంద్రశేఖర్‍, వానల్పహాడ్‍ పంచాయతీ సెక్రటరీ చాట్ల గాయత్రి, విద్యార్ధి రాథోడ్‍ ప్రవీణ్‍, వటోలి గ్రామ అడబాకే నగేష్‍ చరిత్రబ•ందానికి ఎంతగానో సహకరించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు, పేరునా ధన్యవాదాలు.

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *