ప్రకృతి జీవనవేదం బతుకమ్మ

అనంతవిశ్వం భగవంతుని స•ష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప స•ష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రక•తి అనంత కోటి జీవరాశులకు ఆధారభూతం. అందులో మానవ జన్మ ఒకటి. మనిషి భౌతిక దేహం పంచభూతాలమయం. కనుకే అనాది నుంచి నేటి వరకు మానవ పరిణామక్రమం ప్రక•తితో మమేకమై ఉన్నది.


భారత దేశం వేదభూమి, కర్మభూమి, తపో భూమి. మన మహర్షులు అందించిన గొప్ప సంపద వేదాలు, పురాణా లు, ఉపనిషత్తులు, సనాతన ధర్మ సూత్రాలు మరెన్నో. భారతీయులు వీటి ఆధారంగా పరిస్థితులకు అనుగుణంగా తమ తమ ప్రాంతాలకు తగినవిధంగా సంస్క•తి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవనశైలిని ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.


పురాణాల ప్రకారం దేవుళ్ళందరూ ఒకరే అయినా వారి రూపు రేఖలు , వారిని కొలిచే విధానం, వారి భక్తి విశ్వాసాలు ప్రాంతీయ ఆచారాలకు తగ్గట్టుగా వారి వారి పండుగలు చేసుకోవడం అన్నది తరతరాలుగా వస్తున్న ఆచారమే . ఇదే క్రమంలో తెలుగువారు తమ ఆచారంగా చేసుకునే ‘బతుకమ్మ’ పూల పండుగ, ప్రక•తి పండుగ. ఇది తెలంగాణ సంస్క•తి సంప్రదాయాలకు చిహ్నంగా, తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.


బతుకమ్మ:
మానవాళి మనుగడకు ప్రక•తి చాలా ముఖ్యమని ప్రత్యక్షంగా, పరోక్షంగా చెపుతూ, సమైక్యతను కూడా చాటి చెపుతుంది బతుకమ్మ. పసుపు గౌరీదేవి సమేతంగా, ప్రక•తికి నిర్వచనంగా పంచభూతాల సాక్షిగా, బంధు మిత్ర సపరివారంగా పల్లె, పట్టణ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఒక గొప్ప పండుగ. భగవంతుడిపై విశ్వాసం భక్తిభావం ఉట్టిపడే విధంగా, చక్కని సాహిత్యంతో, చరిత్ర నేపథ్యంగా రాసిన పురాణ, జానపద, వీరగాధలను పాటలుగా పాడడం వలన వారిలో ఉత్తేజం పెల్లుబికి మనుషులు చైతన్య వంతులుగా అవుతారు. ఈ పాటల వల్ల ప్రజల జీవన విధానాలు, గుణగణాలు, వారిలోని రాగద్వేషాలు, చరిత్ర, పురాణాలలోని ఘట్టాలు తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
బతుకమ్మ పండుగలో సమాజానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప విషయాలు మనుషుల జీవన శైలిని తెలిపే ఆచార వ్యవహారాలు సమైక్యత, మానవ సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్య రహస్యాలులాంటి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. కనుకే ప్రక•తి జీవనవేదంగా బతుకమ్మను తెలంగాణ ప్రజలేగాక దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారందరూ జరుపుకోవడం వలన ఇది అత్యంత ప్రసిద్ధి పొంది, సంప్రదాయాత్మకమై మానవాళికి సందేశాత్మకంగా విరాజిల్లుతుంది.


తెలంగాణ హ•దయం – బతుకమ్మ
‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి పసిడి చిందగా బతుకు/ గునుగు తురాయి కులుకగ బతుకు/ కట్ల నీలిమల చిమ్మగా బ్రతుకు’ అని ప్రజాకవి కాళోజీ తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియచేశారు. బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదు. ప్రక•తిలో నిబిడీక•తమైన నిసర్గ సౌందర్యాన్ని తెలంగాణ గుమ్మం ముందు నిలిపిన పండుగ బత్కమ్మ.
పుష్పం పునరుత్పత్తికి ప్రతీక, మానవ సమాజం ధరిత్రిపై అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి స్త్రీకి ప్రక•తి కల్పించిన ప్రత్యేక ధర్మం సంతానోత్పత్తి. తల్లి కడుపులో శిశువు పెరుగుదలతో పాటు దాని జీవన సారాలన్నీ బొడ్డు తాడు ద్వారానే తీరుతాయి. ఈ బొడ్డు తాడుకు, మహత్మ్యాన్ని, దైవత్వాన్ని అపాదించి రూపం కలిపిస్తే బొడ్డెమ్మ అవుతుంది. ఈ మహోన్నత పవిత్ర క•తజ్ఞతను వ్యక్తం చేసుకోవడం కోసం పూలను బత్కమ్మగా, బొడ్డెమ్మగా కొలిచే అద్వితీయ సాంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం.
తెలంగాణ అంటేనే జాతర, పండుగలు, బహుజన దేవతారాధన. ఇక్కడి చెట్టు, పుట్ట, చేను, చెలక, పిట్ట, పువ్వు అన్నింటికీ ఒక చరిత్ర ఉంటుంది. కాకతీయుల సామ్రాజ్య పాలకులు తెలంగాణ అంతటా చెరువులను తవ్వించడం ఒక ప్రధానమైన పనిగా పెట్టుకున్నారు. చెరువులను అభివ•ద్ధికి ప్రతీకలుగా భావించారు. అప్పటినుండి ఈ సాంప్రదాయాన్ని జానపదులు కాపాడుతూ వస్తున్నారు. చిరు మార్పులతో ఆనాటి పండుగను నేటికీ జరుపుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉంచేది చెరువుల వల్లే కాబట్టి అందరూ కలిసి ఏడాదికొకసారి చెరువులకు పూలతో క•తజ్ఞతలు చెప్పేవారు. అందుకే బతుకమ్మ చెరువుల పండుగ.


పండుగ జరిపే నాటికి వర్షరుతువు ముగింపులోఉంటుంది. చెరువులు, కుంటలు నీలి బంగారంతో నిండి ఉంటాయి. ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉంటుంది. రకరకాల పుష్పాలు విరబూసి నేలపై సింగిడి ఏర్పడుతుంది. బతుకమ్మలో వాడే గునుగు, తంగేడు, గుమ్మడి లాంటి అనేక పుష్పాలు చెరువు నీటిని శుద్ధి చేస్తాయి. పండుగ కొనసాగుతున్న 18 రోజులు పంచే ఫలహారాలలో పుష్కలమైన ఖనిజ, విటమిన్‍ పోషకాలు సమ•ద్ధిగా ఉంటాయి. లయబద్ధమైన పాదపు కదలికలు, లలితమైన చప్పట్ల మోతలు, అద్భుతమైన సారస్వత విలువలు గల పాటలతో రసరమ్య మోహనరాగాలతో ఒక అలౌకిక ప్రపంచంలో విహరిస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రేమలు, ఆప్యాయతలు, మానవ సంబంధా లను చిక్కపరిచే బతుకమ్మ చిర కాలం వర్ధిల్లుతూనే ఉంటుంది.


బతుకమ్మ.. తొమ్మిది రోజులు.. తొమ్మిది నైవేద్యాలు ఇలా..

  • మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ
  • రెండో రోజు- అటుకుల బతుకమ్మ
  • మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ
  • నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ
  • ఐదో రోజు- అట్ల బతుకమ్మ
  • ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ
  • ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ
  • ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ
  • తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ


ముఖ్యంగా పల్లెల్లో అయితే పోటా పోటీగా భిన్న రుచులను తయారు చేసి మరీ వడ్డిస్తారు. ఇంట్లో చేసుకున్న ఏ వంటకమయినా.. మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి.


మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ..
బతుకమ్మ మొదటి రోజు పెతర అమావాస్య నాడు జరుపుకొంటారు. ఆరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. పండుగకు ముందు ఆయా పుష్పాలన్నీ వివిధ కీటకాల పరాగ సంపర్కం కారణంగా ఎంగిలి పడ్డాయని తలచి మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఆరోజు నువ్వుల సద్దిని అందరితో పంచుకుంటారు.
రెండో రోజు : అటుకుల బతుకమ్మ..
రెండో రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా వడ్డించే నైవేద్యం ఇది.
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ..
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ముద్ద పప్పు, పాలు, బెల్లంతో వేడివేడిగా నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
నాలుగో రోజు : నానబియ్యం బతుకమ్మ..
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ. నాన బెట్టిన బియ్యంను పాలు, బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు.
ఐదో రోజు : అట్ల బతుకమ్మ..
ఐదోరోజు అట్ల బతుకమ్మ. అట్లు లేదా దోశలను అమ్మవారికి నైవేద్యంగా వడ్డిస్తారు.
ఆరవ రోజు : అలిగిన బతుకమ్మ
ఆరో రోజు అలిగిన బతుకమ్మగా జరుపుకొంటారు. ఆరోజు అమ్మవారికి అలకగా చెప్పుకుంటారు. ఉపవాసం పాటిస్తారు
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ..
ఏడోరోజు వేపకాయల బతుకమ్మ. బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు : వెన్నెముద్దల బతుకమ్మ..
ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి వెన్నముద్దల నైవేద్యంగా వడ్డిస్తారు.
తొమ్మిదో రోజు : సద్దుల బతుకమ్మ..
బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకొంటారు. తొమ్మిదోరోజు పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.

  • ఎసికె. శ్రీహరి
    ఎ : 9849930145

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *