జీ20 సదస్సులో ఇద్దరు గిరిజన మహిళా రైతులు

దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో త•ణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరిని ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్‍ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో త•ణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరించారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరించారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు? వారి విజయ గాథ ఏంటంటే..


రాయిమతి ఘివురియా
కోరాపుట్‍ జిల్లాలోని కుంద్ర బ్లాక్‍కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల త•ణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి.. తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‍లోని ఎంఎస్‍ స్వామినాథన్‍ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ త•ణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు.


ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్‍ స్కూల్ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన క•షికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ.. ఈ సదస్సులో పాల్గొనే అద•ష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజ నాలు గురించి వివరించాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రాయిమతి.


మరో మహిళా రైతు సుబాస మోహనత
మయూర్‍భంజ్‍ జిల్లాలోని జాషిపూర్‍ బ్లాక్‍ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడు ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రక•తి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్‍ మిషన్‍ తీసుకొచ్చింది.


చాలామంది మిల్లెట్‍ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు. అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్‍ మిషన్‍ పథకంలో పాల్గొని త•ణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి త•ణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది.


అంతేగాదు ఆమె 2023 కల్లా ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో త•ణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్‍ అండ్‍ అగ్రికల్చర్‍ ఆర్గనైజేషన్‍, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ త•ణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు.

  • దక్కన్‍ న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *