మహబూబ్‍నగర్‍ జిల్లా – బడిపిల్లల కథలుబాలచెలిమి కృషి


పిల్లల్లోని స్నేహం, సౌశీల్యం, శాంతి, జిజ్ఞాస,భావుకత, అమాయకత్వం, వినయం వంటి గుణాలు పెద్దలకు, దేశానికి ఆదర్శం కావాలి. తెలుగు మాతృభాషగా గల బాలలందరిలోను ఒక సమగ్ర సంఘటిత చైతన్యశక్తిని పెంపొందించవలసిన అవసరం ఎంతో ఉంది. బాలల ఆలోచనలు, అభిరుచులు, ఆశలు, ఆశయాలు జాతి జీవన గతిని నిర్ణయిస్తాయి. వాళ్ళ ఆటపాటలు, చదువు సంధ్యలు, వాళ్ళ మనోవికాసానికి ముఖ్య సాధనాలు. ఒక విధంగా బాల్యం వంటిదే బాల వ్మాయం. బాల్యంలో సూచన ప్రాయంగా గోచరించిన లక్షణాలే తరువాత దశలలో వికసిస్తాయి. అలాగే బాల సాహిత్యంలో అంకుర ప్రాయంగా కనపడే కవితా లక్షణాలే ప్రౌఢ రచనలలో అనలుకొనలుగా అల్లుకొని వ్యాపిస్తాయి. గతం లేనిదే ప్రస్తుతం లేనట్లుగా బాల్యం లేనిదే మిగతా జీవితాన్ని ఊహించటం కష్టసాధ్యమైనది. ఒక జాతి సంపద అనదగిన బాల సాహిత్యాన్ని ఇప్పటి వరకు మనం సేకరించి పదిలపర్చుకున్నది చాలా తక్కువే.పల్లె పల్లెలో, మూల మూలలందున్న ఈ అమూల్యమైన సాహిత్య సంపదను సేకరిస్తూ విశేషమైన క•షి చేస్తున్న పత్రిక బాలచెలమి. ఈ పత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍ గారు పిల్లల చేత మరియు పిల్లల కోసం పెద్దల చేత కథలను వ్రాయిస్తూ వేల కథలను బాలచెలిమి ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ కథలకు అద్దం పట్టేలా మంచి చిత్రాలను వేయిస్తూ అందమైన పుస్తకాలను ప్రచురిస్తున్నారు.


బాల చెలిమి ద్వారా చిల్డ్రన్‍ ఎడ్యుకేషనల్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ గారు తెలంగాణ లోని పది ఉమ్మడి జిల్లాల నుండి పెద్దలు, పిల్లలు వ్రాసిన కథల పుస్తకాలను ముద్రించి వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగానే మహబూబ్‍ నగర్‍ జిల్లా నుండి కూడా పిల్లలు, పెద్దలు వ్రాసిన కథల పుస్తకాలు కూడా ముద్రించారు.


‘‘బాలచెలిమి’’కన్వీనర్‍ అయినటువంటి గరిపల్లి అశోక్‍ గారి మాటల్లో ‘‘ఏ దేశం, ఏ జాతి బాలల్ని, వాళ్ళ సాహిత్యాన్ని పట్టించుకోదో ఆ దేశం, ఆ జాతి అభివ•ద్ధిని ఊహించలేం’’. అంటూ బాల సాహిత్య గొప్పదనాన్ని తెలియచేసారు. ‘బాల చెలిమి’ పత్రికకు మణికొండ వేదకుమార్‍ గారు చైర్మన్‍గా దాదాపు మూడు దశాబ్దాలుగా బాలల వికాసం కోసం పనిచేస్తూనే ‘‘బాల చెలిమి పత్రిక’’, ‘‘బాల చెలమి-గ్రంథాలయం’’ ‘‘చెలిమి క్లబ్‍’’లు నిర్వహించటమే కాకుండా తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల నుంచి తెస్తున్న ‘‘తెలంగాణ బడిపిల్లల కథలు’’. ఈ కథల కోసం ఆహ్వానం పంపగా 882 కథలు రాగా అందులో నుండి నిష్ణాతులైన బాల సాహితీవేత్తలు మహబూబ్‍ నగర్‍ నుండి 90 కథలను ఎంపిక చేయగా మళ్ళీ అందులోనుండి 13 కథలను ఎంపిక చేసారు. ఈ కథలు పుస్తక రూపంలోనికి రావడానికి బాలు చెలమి ముచ్చట్ల కన్వీనర్‍ పత్తిపాక మోహన్‍ గారు, కూరెళ్ళ శ్రీనివాస్‍ గారు చక్కటి చిత్రాలను అందించిన తునికి భూపతి గారు, వడ్డేపల్లి వెంకటేశ్‍ గారు, డా. భీంపల్లి శ్రీకాంత్‍ డా।। తెలుగు తిరుమలేష్‍ గారు, జుగాష్‍ విలికి గారు ఇలా అందరు తమ ఇతోధిక సేవలందించారు. ‘‘మహబూబ్‍ నగర్‍ జిల్లా బడిపిల్లల కథల పుస్తకానికి గరిపల్లి అశోక్‍, ఎం. రాములు గార్లు, తమ అభినందనలు తెలుపుతూ తమ అభిప్రాయాలను పుస్తకంలో పొందుపరిచారు.


ఇందులో మొదటి కథ అయినటువంటి ‘‘తికమక’’ కథను మహబూబ్‍ నగర్‍ ఎం.జి.ఎస్‍ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఎం.ఎన్‍. జయంత్‍ కుమార్‍ రచించాడు. ఈ కథలోని రాజుకు తన కోటలోని కొలనులో అందమైన చేపలను పెంచాలని ఆలోచన రాగా భటులను పిలిచి కొన్ని చేపలను తెమ్మని ఆజ్ఞాపించడం, ఎందుకు తెమ్మన్నారో తెలియని భటులు చేపలను రాణికి అప్పగించడం. ఆమె వాటిని కూర వండటం. దానిని తిన్న తరువాత రాజు మొదట కోపం తెచ్చుకోవడం. అందుకు తాను సరిగా చప్పకపోవటం కారణం కావడం ద్వారా ఇదంతా జరిగిందని తెలుసుకొని ఇక నుండైనా ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలపటం ద్వారా తప్పిదాలు జరగవని తెలుసుకున్నాడు. ఈ కథ ద్వారా ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ప్రశ్నలను వేసుకోవాలని రచయిత తెలిపాడు.


రెండవ కథ ‘‘మానవత్వం’’ ఈ కథను మహబూబ్‍నగర్‍ లోని మూసాపేట, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల వేములకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె.మాధవి వ్రాసింది. ఈ కథలోని అవ్వకు శివుడు అన్నం తినపెట్టకపోగా చీదరించుకుంటాడు. అదే సమయానికి ఆడుకోవడానికి వచ్చిన శివుని స్నేహితుడైన రాముడు అవ్వకు అన్నం తినిపించి, శివునికి బుద్ధి చెప్పటం, శివునిలో పరివర్తన కలిగి పెద్దలకు సేవ చేయడం. ఒక అద•ష్టంగా భావించడం జరుగుతుంది. ఈ కథ ద్వారా పెద్దలను గౌరవించాలి అనే నీతిని తెలుసుకుంటాము.


మూడవ కథ ‘‘నిజాయితీ’’. ఈకథను దేవరకద్ర జిల్లా పరిషత్‍ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని డి.ఐశ్వర్య వ్రాసింది. ఈ కథ రాధ, జ్యోతి, శృతి స్నేహితురాళ్ళ మధ్యన జరుగుతుంది. ఈ కథలో రాధ అమాయకత్వం మూలాన శృతి శిక్షార్హురాలవడం. తరువాత రాధ తన తప్పును నిజాయితీగా ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ కథ ద్వారా తప్పులందరూ చేస్తారు కానీ వాటిని నిజాయితీగా ఒప్పుకోవడమనేది చాలా గొప్ప గుణం.
నాలుగవ కథ – ‘‘నీటి విలువ తెలుసుకో’’ ఈ కథను దేవరకద్ర జిల్లా పరిషత్‍ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎ. జ్యోతిక వ్రాసింది. ఈ కథలో తులసి, రమ్య పాత్రధారులు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. తులసి ఎప్పుడూ నీటిని వృథాచేసేది అది చూసి రమ్య ఎంతో బాధ పడేది అలాగే తులసికి నీటిని వృధా చేయడం సరికాదని, నీటిని పొదుపుగా వాడమని ఎప్పుడూ చెపుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తులసి వాళ్ళు ఊరు వెళతారు. అక్కడ ఎంతో నీటి కొరత ఉండటంతో తులసి తాను ఇన్ని రోజులు ఎంత తప్పు చేసానో అని తెలుసుకొని చాలా బాధపడుతుంది. ఈ కథ ద్వారా రచయిత్రి తెలిపిన నీతి ఏమిటంటే మంచి స్నేహితులను దూరం చేసుకోవద్దు. అలాగే నీటిని పొదుపుగా వాడాలి.


‘‘ఒంటరి మేక పిల్ల’’ కథను బల్సుపల్లి జిల్లా పరిషత్‍ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని కె. అపర్ణ వ్రాసింది.ఈ కథలో మేకపిల్ల, ఒంటరిగా షికారుకు వెళ్లి సింహం దృష్టిలో పడి తప్పించుకొని ఊరిలోకి వెళ్ళగా సింహం మేక పిల్లను అనుసరిస్తూ ఊరిలోకి వెళ్తుంది. అక్కడి ప్రజలందరు భయపడటం, మేకపిల్ల ఉపాయంతో సింహం చనిపోయేలా చేస్తుంది. కథ ద్వారా రచయిత్రి తెలిపిన నీతి ఏమిటంటే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళరాదు. ఎవరినైనా తోడుగా తీసుకొని వెళ్ళాలి.


‘పోషణ’ కథను 10వతరగతి విద్యార్థిని ప్రియాంక వ్రాసింది. ఈ కథలో గీత తండ్రి రామయ్య ఉంటారు. రామయ్య తన తోటలోని మొక్కలకు ప్రతిరోజు నీళ్లుపోస్తూ, ఎర్రమట్టి, పేడ వేస్తూ చక్కగా చూసుకొనేవాడు.. ‘ఒక రోజు రామయ్య ఊరు వెళ్తూ మొక్కలను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. గీత అందంగా పూలుపూసే గులాబీ చెట్టు మొదట్లో దుర్వాసన కలిగించే పేడ ఉండటం చూసి దాన్నితీసి మట్టి లేని తొట్టిలో పెడుతుంది. రామయ్య గీతపై కోపపడుతూ మొక్కకు అందాల్సిన పోషణ గురించి వివరించగా గీత తన తప్పును తెలుసుకుంటుంది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పైకి చెడుగా కన్పించినా అది ముఖ్యం కాదు దానివల్ల ఎంత మంచి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి.


దేవరకద్ర జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ- తరగతి విద్యార్థిని ఎం. అక్షయ ‘‘మంచి మిత్రుడు’’ అనే కథను వ్రాసింది. ఈ కథలో ఒక పిల్లవాడు, చెట్టు మంచి మిత్రులు. పిల్లవానికి చెట్టు అన్ని విధాలా సహాయపడుతుంది. పిల్లవాడు పెరిగి పెద్దయి, ముసలివాడైనప్పటికి ఎంతో స్నేహంగా ఉంటూ తను చనిపోయి కూడా తన మిత్రుని బ్రతికించాలను కుంటుంది.


ఈ కథలోని నీతి ఏమిటంటే తాను చనిపోతూ కూడా బతికించాలనుకునే త్యాగానికి ప్రతిరూపం చెట్టు. మన అవసరాలకు చెట్లను నరకడం చేయవద్దు.
నారాయణ పేట, కొల్లంపల్లి, జెడ్పి.హెచ్‍.ఎస్‍కు చెందిన 9వ తరగతి విద్యార్థిని తరంగిణి ‘‘శిక్షతో మార్పు’’ కథ వ్రాసింది. ఈ కథలో ఒక దొంగ శిక్ష ద్వారా మంచిగా మారుతాడు.. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం ఎప్పుడూ ఇతరులపైన ఆధారపడకూడదు. మన కాళ్ళపై మనం నిలబడాలి..
పై పాఠశాలకే చెందిన మరో విద్యార్థిని అయిన హిందు ‘‘ప్రాణ స్నేహితులు’’ అనే కథను వ్రాసింది. ఈ కథలో ఉన్న ముగ్గురు స్నేహితురాళ్ళలో ఒకరి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండక పోవడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోతుందనే కారణం తెలిసి మిగతా స్నేహితురాళ్ళు కలిసి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఆమె చదువు కొనసాగేలా చేస్తారు. ఈ కథ ద్వారా తెలుసుకునే నీతి ఏమిటంటే కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు.


మహబూబ్‍ నగర్‍, మూసాపేట జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థిని అర్చన.జి ‘‘నెమలి’’ అనే కథను వ్రాసింది. ఈ కథలో రంగయ్య, అతని కూతురు ఉంటారు. వేటగాడైన రంగయ్యల్లో కూతురు మార్పు తీసుకొని వస్తుంది. ఈ కథ ద్వారా జంతువులపట్ల దయతో మెలగాలనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
పై పాఠశాలకు చెందిన మరొక విద్యార్థిని వి. వైష్ణవి (7వ తరగతి) ‘మార్పు’ అనే కథను వ్రాసింది. ఈ కథలో గౌరి, గణేష్‍ లు అక్కా తమ్ముళ్ళు. తమ్ముడు సోమరిపోతు తనాన్ని పోగట్టి కష్టపడే తత్వాన్ని అలవరుస్తుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే బద్ధకంగా ఉండకూడదు, కష్టపడే తత్వమును అలవర్చుకోవాలి.
అత్మకూరు ఎంవి. రామన్‍ స్కూల్‍కి చెందిన 8వ తరగతి విద్యార్థి కె. శ్రీకాంత్‍ నాయక్‍ ‘‘గుడ్డికోతి’’ అని కథను వ్రాశాడు. ఈ కథలో ఒక గుడ్డి కోతి, ఏనుగు మంచి మిత్రులు. అయితే నక్క పన్నాగంలో నక్కే చనిపోవడం జరుగుతుంది. కానీ నక్క మంచిదని గుడ్డిగా కోతి నమ్మటం జరుగుతుంది. ఈ కథ ద్వారా రచయిత కళ్ళు లేనంత మాత్రాన గుడ్డిగా ఎవరిని నమ్మరాదు.


ఆత్మకూరులోని ఎం.వి. రామన్‍ స్కూల్‍ కే చెందిన మరొక విద్యార్థి డి.మహేందర్‍ యాదవ్‍ (10వ తరగతి) ‘‘చెరపకురా చెడేవు’’ అనే కథను వ్రాసాడు. ఈ కథలో రామయ్య, రంగయ్య ఇద్దరు రైతులు వుంటారు. నకిలీ మందు మారడంతో రామయ్య పొలాన్ని పాడు చేద్దామనుకొని రంగయ్య తన పొలాన్ని నాశనం చేసుకొంటాడు. ఈ కథ ద్వారా ఎవరినైనా చెడపాలనుకుంటే అది తనకే జరుగుతుంది కాబట్టి ఎవరిని చెడుపరాదు.
‘‘బాలచెలిమి’’ పిల్లల వికాస మాసపత్రిక విశేషమైన క•షి సల్పుతూ ప్రతి జిల్లా నుండి బడిపిల్లలు, పెద్దలు రాసిన కథలను అందమైన చిత్రాలతో ముద్రిస్తూ పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తుంది.

దుగ్గి గాయత్రి
పరిశోధక విద్యార్థిని,
ఎ : 970405516

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *