తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని ఇతర 16 రాష్ట్రాల కోరస్ తో, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పాటలు పాడుతూ వాటిని రికార్డ్ చేస్తుంది.
సామాజిక కారణం కోసం సంగీతాన్ని ఉపయోగించే అతిపెద్ద ప్రచారం అయిన ‘మార్పు కోసం సంగీతం (మ్యూజిక్ ఫర్ ఛేంజ్)’ కార్యక్రమంలో భాగంగా దేశంలో మిగతా రాష్ట్రాలతో గొంతు కలుపుతూ, తెలంగాణలోని పెద్ద సంఖ్యలో ఎన్‍జివోలు, ప్రజలు దేశంలోని బాల్య వివాహాలకు ముగింపు పలకాలని పిలుపునిస్తూ పాటలు పాడారు. ఇప్పటివరకు, దేశంలోని 17 రాష్ట్రాల నుండి మహిళా జానపద గాయకులు, స్థానిక కళాకారులు, గ్రామస్థులు వారి స్థానిక భాషల్లో, మాండలికాల్లో 331 పాటలు పాడారు. డిజిటల్ భారతదేశంలోని సుదూo, మారుమూల ప్రాంతాలకు వాట్సాప్ ద్వారా దీనిని విస్తరింపజేస్తున్నారు. 2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా రూపుమాపి తద్వారా 30 మిలియన్ల మంది బాలికలను చిన్న వయస్సులో వివాహం జరగకుండా రక్షించే లక్ష్యంతో దేశంలోని 300లకు పైగా జిల్లాలలో మహిళా కార్యకర్తలు, పౌర సమాజ సంస్థల నేత•త్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ‘బాల్య వివాహాలు లేని భారతదేశం’ అనే ప్రచారంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. బాలల భద్రత కోసం హామీ ఇచ్చే ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, చట్టాలను అమలు చేయడంపై ద•ష్టి సారిస్తూ ఈ ప్రచారం నిర్వహించబడుతున్నది.
అత్యంత శక్తివంతమైనది అయిన సంగీతం అనే మాధ్యమాన్ని ఉపయోగిస్తూ, పురుషులు, మహిళలు, పిల్లలు సహా జానపద గాయకులు, స్థానిక కళాకారులు, గ్రామస్తులు వారి సామర్థ్యం మేరకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పాటలు రూపొందించారు. ‘మార్పు కోసం సంగీతం (మ్యూజిక్ ఫర్ ఛేంజ్)’ యొక్క మొదటి దశలో వివరించబడిన విధంగా వాటిని రికార్డ్ చేశారు. ఫలితంగా పొలాలు, తోటలు, రహదారులు, పంచాయతీలు, పాఠశాలలు, గ•హాలలో, స్టూడియోలలో కూడా అపూర్వమైన ఉత్సాహంతో, అభిరుచితో వివిధ భాషలలో 331 పాటలు రికార్డ్ చేయబడినవి. స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ యొక్క శక్తిని ఉపయోగించి అది ప్రతి భౌగోళిక ప్రాంతాన్ని, దేశంలోని అన్ని భాగాలకు చేరినది. ఈ పాటలు కేవలం గ్రామంలోని ఫంక్షన్స్, సమావేశాలలో పాడబడడం మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతున్నాయి.
అంగన్వాడీ కార్యకర్తల నుండి గిరిజన ప్రాంతాల్లోని ప్రజల వరకు, చిన్నపిల్లల నుండి బాల్యవివాహ బాధితులైన వ•ద్ధ మహిళల వరకు, గ్రామ పెద్ద నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వరకు, ప్రతిఒక్కరూ ఉద్యమంలో చేరారు. ఇప్పుడు వారి నిరసన గళాన్ని కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా సంగీతం ద్వారా కూడా వినిపిస్తున్నారు.
‘మార్పు కోసం సంగీతం (మ్యూజిక్ ఫర్ ఛేంజ్)’ కార్యక్రమంలో భాగంగా, 17 రాష్ట్రాలలోని భాగస్వామ్య ఎన్‍జివోలన్నీ ఒక ఉమ్మడి మ్యూజిక్ టెంప్లేట్ కలిగి ఉన్నాయి. వారి భాషలో ఒక పాట పాడి దాని రికార్డింగ్ షేర్ చేయమని వారిని కోరడం జరుగుతుంది. ఎన్‍జివోలు పాటలను రికార్డ్ చేసి దానిని వారి స్థానిక సందర్భానికి తగినదిగా ఉండేలా మార్చమని వారిని కోరడం జరుగుతున్నది.
షేర్ చేయబడిన పాట యొక్క అసలైన సాహిత్యం సమాజ రూపురేఖలను మార్చడానికి, బాల్య వివాహాలను రూపుమాపే ఉద్యమంలో చేరడానికి గ్రామంలో లేదా సంఘంలో ఉన్న ప్రజలను జాగ•తం చేస్తున్నది. కేవలం వారు ఉన్న చోటు నుండి ఉద్యమంలో చేరడం మాత్రమే కాకుండా వారి వద్ద ఉన్న చిన్న లేదా పెద్ద వనరులతో ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఇది ప్రతిఒక్కరికీ పిలుపునిస్తున్నది. మహిళల నేత•త్వంలో జరుగుతున్న ఈ
ఉద్యమంలో మహిళలంతా వారి పనిముట్లతో సహా ఉద్యమంలో చేరాలని కోరుతున్నది. ‘‘ఒకవేళ మీరు క్షవరం చేయువారైతే మీ కత్తెరల జతలతో రండి, ఒకవేళ మీరు రిక్షా లాగు వారైతే, మీ రిక్షాతో వచ్చి చేరండి…’’ అంటూ పాట సాగుతుంది.
ఇప్పటివరకు అండమాన్, ఆంధప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి 17 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88