కాంచన్‍ జంగ్‍ నేషనల్‍ పార్క్


ఉనికి: సిక్కిం, భారతదేశం
అంశం: యునెస్కో వారసత్వ గుర్తింపు
ప్రకటిత సంవత్సరం: 2016
విభాగం: మిక్స్డ్‍


ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షిత ప్రాంతాలకు సంబంధించి అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న వాటిలో కాంచన్‍ జంగ్‍ నేషనల్‍ పార్క్ ఒకటి. అసాధారణ రీతిలో ఏడు కిలోమీటర్లకు పైగా నిట్టనిలువు వాలు కూడా ఇక్కడ చూడవచ్చు. గడ్డితో కూడిన లోయలు, మంచుతో నిండిన కొండలు… ఇలా వైవిధ్యభరితంగా ఈ ప్రాంతం ఉంటుంది. కాంచన్‍ జంగా పర్వతంతో పాటుగా ఇక్కడ ఉన్న మరెన్నో ప్రాకృతిక విశిష్టతలు ప్రగాఢ సాంస్కృతిక విలువలతో పెనవేసుకుపోయాయి. స్థానిక తెగలు వాటిని ఎంతో పవిత్రమైనవిగా భావిస్తుంటాయి. అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న ఎన్నో రకాల మొక్కలు, జంతువులు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఈ ప్రాంతం సిక్కింలోని ప్రధాన పవిత్ర ప్రాంతాన్ని సూచిస్తుంది, ఈ ప్రాంతంలో బౌద్ధ మరియు పూర్వ బౌద్ధ సంప్రదాయాల సహ-అస్తిత్వానికి ప్రత్యేక సాక్ష్యంగా ఇది నిలిచింది.


ఈ ప్రాంతం ఎన్నో తెగల సంస్కృతికి గుండెకాయ. ఈ సంస్కృతి నుంచే ఎన్నో తెగలు పుట్టుకొచ్చాయి, వాటన్నింటికి ఇక్కడి సహజ పర్యావరణమే కేంద్రబిందువుగా ఉంటుంది.
కాంచన్‍ జంగా పర్వతంతో పాటు, ఈ ప్రదేశంలో పద్దెనిమిది హిమానీనదాలు మరియు డెబ్బై మూడు హిమనదీయ సరస్సులు ఉన్నాయి, ఇవి అసాధారణమైన ప్రక•తి ద•శ్యాన్ని ఏర్పరుస్తాయి.


ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన జీవవైవిధ్య సాంద్రతలలో ఒకటిగా గుర్తించబడింది, మధ్య/ ఎత్తయిన ఆసియా పర్వతాలకు సంబంధించి అత్యధిక స్థాయిలో మొక్కల, క్షీరద వైవిధ్యాలు నమోదు చేయబడ్డాయి.
స్థానిక సిక్కిం సంస్కృతిలో కాంచన్‍ జంగా పర్వతానికి ఎంతో ప్రాధాన్యముంది. ఆ పర్వతానికి పర్వతదైవమైన జంగాతో అనుబంధం ఉంది. ఇక్కడ సూర్యుడు ఉదయించేది కూడా ఈ పర్వతం పై నుంచే.


భారతదేశపు మొట్టమొదటి మిశ్రమ వారసత్వ ప్రదేశంగా, కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్ నిజంగా కమ్యూనిటీ-ఆధారిత చొరవకు అద్భుతమైన ఉదాహరణ. 2003లో, సహజ వారసత్వ నిపుణులు, పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ సైట్‍ అసాధారణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి అందాలను గుర్తించి దాన్ని నేచురల్‍ ప్రాపర్టీగా నామినేట్‍ చేయాలని భావించారు. ఈ సమయంలో, సిక్కిం తెగలు ఆ స్థలంతో తమకున్న బలమైన అనుబంధాన్ని వివరించడానికి, దాని సాంస్కృతిక విలువను కూడా గుర్తించాలని సూచించడానికి భారత ప్రభుత్వాన్ని సంప్రదించాయి. దీని ఫలితంగా, బలమైన సాంస్కృతిక అనుసంధానాలు, అద్భుతమైన సహజ వారసత్వం కారణంగా భారతదేశం కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్ ను అసోసియేటివ్‍ కల్చరల్‍ ల్యాండ్‍ స్కేప్‍గా నామినేట్‍ చేసింది. దీనికి 2016లో యునెస్కో గుర్తింపు లభించింది.


కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్ ప్రధానంగా 6,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో ఇరవైకి పైగా శిఖరాలు, 6,000-7,000 మీటర్ల మధ్య పదకొండు, 7.000 – 8.000 మీటర్ల మధ్య ఎనిమిది శిఖరాలతో విస్తృతమైన పర్వత భూభాగాలను కలిగి ఉంది. కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్లో 8,586 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వతం కాంచన్‍ జంగా ఉంది. 4.500 కంటే ఎక్కువ జాతుల పుష్పించే మొక్కలతో పాటు అనేక రకాల జంతు జాతులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు అంతరించి పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. రెడ్‍ పాండా, మంచు చిరుత, కస్తూరి జింక, నీలం గొర్రెలు వంటివి వీటిలో ఉన్నాయి. జీవవైవిధ్య ప్రాంతంగా దీని గొప్పతనం కాదనలేనిది. ఈ ప్రాంతం లోని అనేక పవిత్రమైన పర్వత శ్రేణులు, శిఖరాలు, సరస్సులు, గుహలు, శిలలు, బౌద్ధ కట్టడాలు, వేడి నీటి బుగ్గలను గుర్తించడం ద్వారా ఇది మరింత మెరుగు పరచబడింది. బయోస్పియర్‍ రిజర్వ్ బఫర్‍ జోన్‍తో కలిపి, కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్ సిక్కిం భౌగోళిక ప్రాంతంలో సగానికి పైగా కవర్‍ చేస్తుంది.


ఈ సైట్‍ తన సహజ అంశాలకు అత్యంత అసాధారణమైన, శక్తివంతమైన మత, కళాత్మక, సాంస్కృతిక అనుబంధా లను అందిస్తుంది. కాంచన్‍ జంగా పర్వత శ్రేణి సౌందర్యం, ప్రకృతి దృశ్యాల విలువను పరిగణనలోకి తీసుకుంటే, వాటికవే అత్యుత్తమమైనవి. బ్రిటీష్‍ మరియు యూరోపియన్‍ పర్వతారోహకులు ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఈ శిఖరంపైకి అడుగు పెట్టడానికి వెనుకాడారు. పర్వతారోహకులచే ఇప్పటికీ జయించబడని ఏకైక హిమాలయ దిగ్గజంగా ఇది గుర్తింపు పొందింది. సిక్కింలోని బౌద్ధ పూర్వ, బౌద్ధ సమాజాల విశ్వాసాలను గౌరవిస్తూ నేటికీ ఈ శిఖరాన్ని పవిత్రంగా ఆరాధిస్తున్నారు.


పర్వత శిఖరం, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలతో అనుబంధించబడిన సాంస్కృతిక విలువలు స్థానిక లెప్చా సంస్కృతి, సిక్కిమీస్‍ భూటియాస్‍ బౌద్ధ సంప్రదాయాలు రెండింటిలోనూ సామరస్యపూర్వకంగా పాతుకుపోయాయి. ఈ సైట్‍ నేడు బేయుల్‍ (బౌద్ధ విశ్వాసం ప్రకారం ‘‘దాచిన భూమి’’) ప్రాచీనమైన, బాగా సంరక్షించబడిన ఎత్తైన ప్రాంతాలను సూచిస్తుంది. విస్తృత పాన్‍-హిమాలయన్‍, టిబెటన్‍ బేయుల్‍ సంప్రదాయంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ సజీవ ఉదాహరణ ఇది.
కాంచన్‍ జంగా నేషనల్‍ పార్క్లోని ఈ సహజ అంశాలు, వాటి సాంస్కృతిక విలువల మధ్య అసలైన అనుసంధానత అనేక శతాబ్దాలుగా మెరుగవుతూ వచ్చింది, ఇది రెండు ప్రపంచ దృక్పథాలను ఏకీకృతం చేస్తుంది. అదే సమయం లో దీని ప్రధాన అంశం- పర్వత దేవుడు జొంగా నివసించే దీని శిఖరం కళాత్మక ప్రాతినిధ్యాన్ని సృష్టిస్తుంది. ఈ శిఖ రం, ఈ ప్రాంతంలోని అన్ని కమ్యూనిటీలకు ఏకీకృత చిహ్నంగా కూడా పనిచేసింది. ప్రకృతి, సాంస్కృతికం మధ్య ఈ పరస్పర సంబంధం చివరికి సిక్కిమీస్‍ అంటే ఏమిటో నిర్వ చించింది. దీనిని సిక్కింలో ఏటా పాంగ్‍ లబ్సోల్‍ పండుగతో వేడుక చేసుకుంటారు.


ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ జాబితా గుర్తింపు అనేది పరిరక్షణ, జీవనోపాధి సవాళ్లు, అభివ•ద్ధిలో అంతరాలను తగ్గించడానికి సమర్థవంతమైన చర్యను అందించడంలో సహాయ పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు భావిస్తున్నా రు. తక్కువ మానవ జనాభా సాంద్రత కారణంగా, పెద్ద అభివృద్ధి ప్రాజెక్టులను వేటికీ రూపకల్పన చేయలేదు. మారుమూల ప్రాంతాలలో చిన్న-స్థాయి పర్యావరణ-పర్యాటక కార్యక్రమాలు నగదు ఆదాయం అదనపు ప్రోత్సాహంతో స్థానిక ప్రజలకు మద్దతునిస్తున్నాయి.


సంస్కృతి, మతం, పర్యావరణ పరిరక్షణ కలయిక కాంచన్‍ జంగా పట్ల ఉన్న గౌరవానికి స్పష్టమైన రుజువు. అది ఒక సంరక్షక దైవం పట్ల స్థానిక వర్గాల ప్రజలచే చూపబడుతుంది. ఈ జీవసాంస్కృతిక శక్తులకు అధికారిక గుర్తింపు భారతదేశంలో ప్రపంచ వారసత్వ పరిరక్షణలో కొత్త ధోరణిని సూచిస్తుంది.

  • సోనాలి ఘోష్‍, శిఖా జైన్‍
    అనువాదం : ఎన్‍.
    వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *