సితార

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు – 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. – వేదకుమార్‍ మణికొండ


సితార స్కూల్‍ బెల్‍ మ్రోగగానే పరుగెత్తుకొంటూ సంతోషంగా బ్యాగ్‍ వేసుకొని తన స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చింది. రాత్రి తాతయ్య నానమ్మతో కలిసి మంచంపైన కూర్చొని నానమ్మ పెట్టిన గోరు మ్దులు తింటూ వారితో మాట్లాడుతుంది. సితార నానమ్మతో ఇలా చెప్పింది. ‘‘నానమ్మా! ఈ రోజు మా స్కూల్‍ టీచర్‍ పర్యావరణం గురించి ఒక మంచి వ్యాసం వ్రాయమని చెప్పారు. ఎల్లుండి వ్యాస రచన పోటీలు నిర్వహిస్తారు. చక్కగా రాసిన వారికి మంచి బహుమతి కూడా ఇస్తారు’’ అని చెప్పారు నానమ్మ. ఓ అంతేనా! అని తాతయ్య వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవారో అప్పుడు పర్యావరణం ఎలా ఉండేదో చెప్పడం మొదలు పెట్టారు.


చుట్టూ పచ్చని పొలాలు, పచ్చని చెట్లు స్వాగతం పలికినట్టు ఉండేది. స్వచ్ఛమైన గాలి. చెరువులో నిండు కుండలా నీళ్ళు ఉండేవి. అందులో పాల రంగును అద్దుకున్నట్లు తెల్లని బాతులు. సూర్యుని రశ్మిని తాకి తామర మొగ్గలు పువ్వల్లా వికసించేవి. నీలి రంగులో ఎవరికి అందనంత ఎత్తులో ఉండే ఆకాశం. కిచకిచ మంటూ ఆకాశంలో విమానంలా ఎగురుతూ ఉండేవి అందమైన పక్షులు. సూర్యుని నీడను చూస్తూ సమయాన్ని తెలుసుకునేవాళ్ళము. అప్పుడు గడియారాలు లేవు. సూర్యుడు పెద్ద గడియారం అన్నాడు నవ్వుతూ తాతయ్య. నానమ్మ తన ఒడిలో పడుకోబెట్టుకొని తన వేళ్ళతో నన్ను నిద్రపుచ్చుతుంది. నేను తాతయ్య చెప్పిన వాటిని వింటూ ఊ కొడుతూ ఉన్నాను. తాతయ్య చెబుతూనే ఉన్నారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండేవి. ఇంకా ఉన్నాయి తెలుసా అని చెప్పబోయాడు. నేను నిద్రలోకి జారుకుంటున్నాను. నానమ్మ తాతయ్యతో మాట్లాడకు అని చేతితో సైగ చేసింది. సితార ఉదయం లేచి స్కూల్‍కి వెళ్ళింది రాత్రి తాతయ్య చెప్పిన మాటలే సితారకి గుర్తుకు వస్తున్నాయి. దాని గురించే ఆలోచిస్తుంది. సితారకి చిన్నప్పటి నుండే ‘ఉబ్బసం’ ఉంది. కలుషితమైన గాలి పీల్చుకోవడం వలన ఈ సమస్య వచ్చింది అని డాక్టర్‍ చెప్పారు. సితార ఇప్పటి వాతావరణం చూసి ఇలా అనుకుంది. ఎటు చూసినా కలుషితమైన గాలి ఇందుకు కారణం ఎటు చూసినా ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కంపెనీలు. అందులోంచి వచ్చే కలుషితమైన గాలి పీల్చుకోవడం వల్లనే నాకు ఈ సమస్య వచ్చింది. ఎటు చూసినా ఆకాశానికి హత్తుకునే భవనాలు, గాలి, నీరు, ఆహారం, చివరికి మనుషులు కూడా స్వచ్ఛంగా లేరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు బ్రతుకుతున్నారు. ఇలా ఆలలోచిస్తూ ఉండగానే బెల్‍ మ్రోగింది.


ఇంటికి వెళ్ళింది. వ్యాసం ఎలా రాయాలి అని ఒక పేపర్‍లో రాసుకొని పెట్టుకుంది. స్కూల్‍లో వ్యాస పోటీలు ప్రారంభించారు. సితార తాతయ్య చెప్పిన విషయాలు అన్ని రాసింది. సితార రాసిన వ్యాసానికి మొదటి బహుమతి వచ్చింది. ఆ బహుమతి తీసుకొని తాతయ్య చేతిలో పెట్టింది. తాతయ్య నానమ్మ సితారను ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు. శభాష్‍ చిట్టితల్లి అని తాతయ్య మెచ్చుకున్నారు. అప్పుడు సితార ఇది ఇంతటితో ఆగలేదు. ఎలాగైన ఈ పర్యావరణాన్ని మార్చాలి మళ్ళీ మీ చిన్నప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్చాలి రాబోయే భావితరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం అందించాలి అని చెప్పింది. సితార అన్న మాటలకు తాతయ్య నానమ్మలు మురిసిపోయారు. వారి మనుమరాలిని చూసి గర్వపడ్డారు. చిన్న వయస్సులోనే ఎంత గొప్ప ఆలోచన అంటూ సంతోషించారు.

  • జి. అశ్విని, ఫోన్‍ : 879032550

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *