పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్ మణికొండ
ఒక పల్లెటూర్లో రాహుల్ అనే ధనవంతుడు భార్య రమణి, పిల్లలు సీత, మహేశ్‍లతో కలిసి నివసిస్తుండేవారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది. ఆ ఇల్లు పల్లెటూరి శివార్లలో నది దగ్గర ఉండేది. ఎందుకంటే రాహుల్ యంత్రశాల యమజాని. ఆ యంత్రశాల నదికి దగ్గరగా ఉండేది. యంత్రశాల నుండి వచ్చే వ్యర్థపదార్థాలు, హానికరమైన పదార్థాలు నదిలో పోయేవి.
రాహుల్ దగ్గర ఒక కారు, రెండు బైకులు ఉండేవి. కాని అతడు తక్కువ దారులకు కూడా వాహనాల మీదనే వెళ్ళేవాడు. పిల్లలకు పాఠశాల బస్సులో పంపియ్యకుండా కారులో దింపేవాడు. హానికరమైన పొగను వదలడం వలన వాయు కలుషితం అవుతది. యంత్రశాలలు కూడా హానికరమైన వాయువులను విడుదల చేసి వాయువుని కలుషితం చేస్తాయి. కాని కలుషితమైన వాయువు గురించి భయపడకుండా వాయు కాలుష్యాన్ని మోసుకెల్తున్నాడు.
ఆ గ్రామంలో మధ్యతరగతి కుటుంబం వారంతా సేద్యం చేస్తూ నివసిస్తారు. ఒకరోజు మహేశ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ల బంధువులు ఉదయాన్నే వచ్చారు. వాళ్ళు రమణి వాళ్ళ అన్న, వినోద్ కుటుంబ సభ్యులు. ఈ విందుకు హాజరయ్యారు. ఆ విందులో డిజె ఏర్పాటు చేశారు. ఆ చప్పుడుకి చుట్టుప్రక్కల వాళ్ళు తలుపులు మూసుకున్నారు. వినోద్ గమనిస్తూనే ఉన్నాడు.
వినోద్, రాహుల్‍ని ‘‘తలుపులు మూసుకున్న ఇళ్ళకు వెళ్ళి ఏమైందని’’ అడిగారు. దానికి సమాధానం వాళ్ళు గుండె రోగులని చెప్పాడు. డిజె సౌండ్ వలన వాళ్ళ గుండె దెబ్బతింటుందని సమాధానం ఇచ్చాడు. దీనిని రాహుల్ తట్టుకోలేకపోయాడు. వాళ్ళతో క్షమాపణ అడిగి, ఇంటికి వెళ్ళాడు. అతడు వెంటనే వెళ్ళి డిజె ఆపి చిన్న స్పీకర్లలో పాటలు పెట్టుకున్నాడు.
సెలవులలో రాహుల్ కుటుంబ సభ్యులతో సహా వినోద్ ఇంటికి గ్రామానికి వెళ్లారు. రాహుల్ యజమాని ఐన యంత్రశాల కాగితాలు తయారు చేస్తది. చాలా చెట్లను నరకాల్సి వస్తది. ప్రాంగనంలో ఒక్క చెట్టు కూడా లేకుండే అందుకే రాహుల్‍కి వినోద్ మొక్కలు నాటమని చెప్పాడు.
యంత్రశాల చెత్తను నదిలో వదిలి కలుషితం చేస్తున్నారని తెలుసుకొని ప్రసరించే శుద్ధి కర్మాగారం వాడమని సలహా ఇచ్చాడు.
సెలవులు గడిచాయి. అందరూ ఇంటికి తిరిగి వచ్చారు. రాహుల్ వెంటనే ప్రసరించే శుద్ధి కర్మాగారంని కొని, యంత్రశాలలో వాడడం మొదలు పెట్టాడు. ప్రాంగణంలో కుండ మొక్కలు నాటి, ఇంటి పరిసరాలను పచ్చగా చేసాడు. ఏదైనా విందులను నిర్వహించినప్పుడు శబ్దాన్ని తక్కువ చేసి ఎవ్వరికీ భంగం కాకుండా చూసాడు. రాహుల్ యొక్క కుటుంబ సభ్యులు ప్లాస్టిక్ వాడడం కూడా ఎక్కువ శాతం తగ్గించారు. ఇలా వాళ్ళు చిట్కాలను పాటించారు.
ఈ విధంగా రాహుల్, రమణి, సీత, మహేశ్‍లు వినోద్ చెప్పినవన్నీ పాటించి ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడిపారు.
- ఉమైజ అప్షీన్, ఫోన్ : 889778699