అనేక యుద్ధముల ఆరితేరినవాడు మా చక్రపాణి

చిన్న పిల్లవాడు, పెద్ద కలలు కనేవాడు. ఆజానుబాహువై అంగలు వేసుకుంటూ ఎదిగిపోయాడు.
తమ్ముడిగా ఉండడం మానలేదు, స్నేహితుడిగా ఉండడమూ మానలేదు.
మంచిచెడ్డలన్నిటితో మనిషిగా మెలగడమూ మానలేదు. అందుకే అతనంటే నాకు వాత్సల్యం, స్నేహమోహం!
ఈ రోజు (జనవరి 31, 2024) అతని ఉద్యోగానికి రిటైర్మెంట్‍ అట. చక్రపాణి పనిజీవితాన్ని, ప్రజాజీవితాన్ని గుర్తు చేసుకుని పండగ చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం. రేపటి నుంచి కూడా అతను పనిమంతుడే. విశ్లేషణలతో విప్పిచెప్పే ఆచార్యుడే.
చక్రపాణి అనే ప్రవర్థమానుడు డాక్టర్‍ అయినప్పుడు, ముచ్చటపడి, ఇరవై మూడేళ్ల కిందట ‘ప్రజాతంత్ర’ వారపత్రిక ‘కొత్తవంతెన’ కాలమ్‍లో రాసిన వ్యాసాన్ని అందరితో పంచుకుంటున్నాను.

ఎల్లమ్మ కొడుకు, పరశురాముడు, పరిశోధకుడు

ఆ రాత్రి దేశం కాని దేశంలో రాత్రిపూట మేమున్న విడిది నుంచి దాదాపు తప్పించుకుని వచ్చి, బస్సెక్కాము. ప్రతి ఒక చూపులోనూ చురకత్తి, ప్రతి నిశ్శబ్దంలోనూ ఒక నాటుతుపాకీ కనిపించే వాతావరణంలో రాత్రి ప్రయాణం. భయమూ బీభత్సమూ వెన్నులో నింపుతున్న చలితో పాటు- నెత్తురు గడ్డకట్టే డిసెంబర్‍ చలితో కూడా నిరాయుధంగా తలపడడం. రాంచీ నుంచి ఆ రాత్రి ప్రయాణించిన అపరిచిత మార్గం నిండా మాకు అనేక సుపరిచిత గ్రామాలూ పట్టణాలూ తారసపడ్డాయి, జెహానాబాద్‍, రాంపూర్‍… ఆ ఊర్ల పేర్లన్నీ ఏవో ఒక మారణకాండతో, ఊచకోతతో ముడిపడిన పేర్లే. జర్నలిస్టులు ఎప్పుడూ మరచిపోయే అవకాశం లేని పేర్లే. సరిగ్గా పదిసంవత్సరాల కిందట బీహార్‍లో చేసిన ఆ ప్రయాణానికి ఇప్పుడు అనేక కొత్త అర్థాలు కనిపిస్తున్నాయి.


నేనూ చక్రపాణీ కాక ఇంకో పదిమంది ఉన్న ఆ బస్సులో ఒకరిద్దరు తప్ప అందరూ ఆంధప్రదేశ్‍ వాళ్లే, ఇప్పటిభాషలో చెప్పవలసివస్తే- తెలంగాణా వాళ్లే. మాసీటుకు ముందున్న సీటులో స్వెట్టర్లలో శాలువలో మునిగిపోయి ఉన్న శంకర్‍లాల్‍ శ్రీవాస్తవను కనుగొని ఆశ్చర్యపోయాము. మేం ముగ్గురం హైదరాబాద్‍ ఉదయం పత్రికలోనే పనిచేసేవాళ్లం. అందరం కలసి జర్నలిస్టుల సభలకే వచ్చాము కానీ, మా లాగా ఇంతమంది రహస్యంగా అమర్‍ కళ్లు కప్పి ఈ ప్రయాణాన్ని తలపెట్టారని తెలియదు. బుద్ధగయా, రాజగ•హ, నలందలను చూసి, గౌతమబుద్ధుడు తచ్చాడిన, పర్యటించిన, కూర్చున్న, నిలుచున్న, ధమ్మబోధ చేసిన చోటులివే కదా, ఇక్కడి నేలాఆకాశమూ అంతా మహానీరుడి, బుద్ధభగవానుడి తేజస్సుతో సత్యాన్వేషణ పరిమళాలతో నిండిపోయాయి కదా అని చక్రపాణీ నేనూ శ్రీవాస్తవా ఎంతగా మురిసిపోయామని! అప్పటికింకా దళితోద్యమం మోసుకు వచ్చిన బౌద్ధ ప్రభంజనం రానే లేదు. బుద్ధుడి పారవశ్యంతో పాటు బీహార్‍ బీభత్స వాస్తనికత కూడా జతచేసి నేనూ చక్రపాణీ ‘బీహారూ నీకు జోహారు’ అనే పెద్ద యాత్రావ్యాసం అప్పట్లో ఉదయంలో రాశాం కూడా. మేం ఇద్దరం కలసి చేసిన జంట రచన అదొక్కటే.


ఈ ఏడాది టిఆర్‍ఎస్‍ కరీంనగర్‍ సింహగర్జనకు వెళ్లినప్పుడు ఘంటా చక్రపాణితో వాళ్ల ఊరికి వెళ్లి, అతని తల్లిదండ్రుల ఆతిథ్యం తీసుకున్నాము. చక్రపాణి ఊరు పేరు ధూళికట్ట. పేరు సూచిస్తున్నట్టు అదొక బౌద్ధ ప్రాంతం. శిథిలమైన స్థూపం ఉన్న గ్రామం. బహుశా అక్కడ ఒకప్పుడు బుద్ధుడి అవశేషం ఉండే ఉంటుంది. పదేళ్ల కిందట బుద్ధుడి వెలుగుసోకిన నేలలను అన్వేషిస్తూ బీహార్‍లో మేము తిరిగినప్పుడు చక్రపాణికి ఖచ్చితంగా తన ఊరు కూడా బుద్ధుడి కార్యక్షేత్రమేనని స్ఫురణలో లేదు. ఇప్పుడు ధూళికట్ట గురించి చెబుతున్నప్పుడు అతని కళ్లలో నలందను చూసినప్పటి కంటె ఎక్కువ వెలుగు కనిపిస్తుంది.


తొట్లో బిడ్డడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా రాజకీయాలలో, ఆదర్శాలలో, కార్యరంగాల ఎంపికలో ఆకాశ నీధులలో సంచరించి, చివరికి తమ కాళ్లు పాదుకున్న నేలలోనే జీవన సాఫల్యాన్ని కనుగొని ఆశ్చర్యపోయిన అనేకులలో చక్రపాణి కూడా ఒకడని నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. ఈ పదిసంవత్సరాల కాలం – కట్టెదుటి రాజకీయ, సామాజిక, ఆర్థిక ప్రపంచంలోని నిచ్ఛిన్నాలను, నికాసాలను, నూతన అస్తిత్వాల వెల్లువను- నేనూ అతనూ కలసికట్టుగానూ , విడిగానూ కూడా నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాము, ఆ గమనంలో ఏదో ఒక సాపేక్షవేగంతో భాగంగానూ ఉన్నాము. అతనివాళ తన పంబాల కులస్థుల సామాజిక స్థితిగతులలో వచ్చిన మార్పు గురించి అధ్యయనంచేసి డాక్టర్‍ చక్రపాణి అయినప్పుడు- అతని ప్రయాణంలోని ఒక సూత్రాన్ని పట్టుకోవాలనిపించింది. పదిసంవత్సరాల దళిత రాజకీయ, సామాజిక, సాహిత్యోద్యమం లేకపోతే- చక్రపాణి పంబాల కులం న్నీద పరిశోధన చేసేవాడు కాదు, అలాగే, చక్రపాణిని అతని తరాన్ని నడిపించిన అన్ని చారిత్రక శక్తుల ప్రమేయం లేకపోతే కూడా అతని ద•ష్టి అంత నిశితంగానూ, అతని అధ్యయనం అంత అన్వేషణాత్మకంగానూ ఉండేది కాదు.

.
ఒక మనిషి ప్రయాణంలో జన్మ, నేపథ్యం, జీనితంలోకి వచ్చిన బాహ్యప్రపంచం, సొంత ఘర్షణలు, సామాజిక ఘర్షణలు, నీటన్నిటి మధ్య ఒక చిన్న స్థలాన్ని వెదుకుకుని దాని న్నీదనుంచి పైకి ఎగరాలనుకునే తపన- ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ నిశ్వాసాలతో, ఆచరణలతో, వాటి గమనంతో పెనవేసుకుని మరీ ఎలా తోడు వస్తాయో చక్రపాణి ఒక ఉదాహరణ. ఉత్తర తెలంగాణా లో, కొద్దిపాటి అవకాశాలు, ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలనే ఉత్సాహం ఉన్న ఒక దళిత కుటుంబంనుంచి అతను వచ్చాడు. అతని జీవిఫ్తంలో ఏ దశలోనూ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్క•తిక న్యాయాలకు సంబంధించిన ఆదర్శాల అంశ లేకుండా ఎప్పుడూ లేదు. చేసే ఏపనిలోనయినా ఆ ఆదర్శాలను, విలువలను తనకు తోచినపద్ధతిలో సంలీనం చేయకుండా అతను లేడు. కరీంనగర్‍ నుంచి వచ్చిన చిన్నపత్రిక ‘జీవగడ్డ’తో ప్రారంభించి – ఆంధ్రజ్యోతి, ఉదయం దాకా చేసిన పత్రికారంగ ప్రయాణంలోనూ, ఉస్మానియా విద్య, కాకతీయ అధ్యాపకత్వం, ఇప్పుడు ఓపెన్‍యూనివర్సిటీలో బహుముఖమైన బాధ్యతల నిర్వహణ దాకా కూడా చక్రపాణి గమనంలో సామాజిక బాధ్యత, విలువలతో కూడిన అభిరుచీ స్పష్టంగా కనిపిస్తాయి.


చక్రపాణి పరిశోధన అంశం- ‘’దళిత పూజారులలో సామాజిక మార్పు- తెలంగాణా పంబాల కులం న్నీద అధ్యయనం’’. దళిత, పూజారి అనే రెండు పదాల మధ్య ఒక సమాసమే అసాధ్యం కానీ, పంబాల కులస్థులు చేసేది గ్రామదేవతారాధాన. వారికి ఆ బాధ్యతను అప్పగించింది కేవలం దళితులు మాత్రమే కాదు, పంబాల ‘పౌరోహిత్యాన్ని’ గ్రామం అంతా ఆమోదిస్తుంది. వైద్యం, భూతవైద్యం, యంత్రతంత్రాలతో దేవతల ఆవాహన- మొదలైనవన్నీ పంబాల కులస్థులు నిర్వహించే నిధులే. బయిండ్ల, పోతరాజుల, దేవతల మొదలయిన పేర్లున్న ఈ దళిత పూజారులు మాల, మాదిగలు ఇద్దరిలోనూ కనిపిస్తారు. ఇవాళ తెలంగాణాలో పంబాల కులస్థుల జీవనాధారాలే కాక, వారి నిధులతో ముడిపడిఉన్న సంస్క•తి అంతా కూడా అంతరించి పోతున్నది. శూద్ర, దళిత కులాల ప్రత్యేక ఆరాధనలను, దేవుళ్లను కూడా కబళిస్తున్న బ్రాహ్మణీకరణ ఒక వైపున, స్థానిక సాంస్క•తిక ప్రత్యేకతలను పరాయి శాస్త్రవిజ్ఞానంతో, తర్కహేతువాదాలతోనూ నిరాకరించే ఆధునిక సిద్ధాంతాలు మరొక వైపున పంబాలవారిని సాంప్రదాయ వ•త్తినుంచి తరిమి వేస్తున్నాయి. ఈ పరిణామాన్ని చక్రపాణి తన అధ్యయనంలో కనుగొనడమే కాక, ఎంతో స•జనాత్మకంగా వ్యాఖ్యానించాడు. పంబాల కులానికి తెలంగాణా స్థానిక సంస్క•తులకు చక్రపాణి చెప్పిన సంబంధం అనేక కొత్త ఆలోచనలకు తలుపులు తెరుస్తుంది. తెలంగాణా ప్రాంతంలో చారిత్రకంగా బ్రాహ్మణ ప్రభావం అతి తక్కువగా ఉన్నదని, మాత•స్వామ్య, ద్రావిడ, శక్తి, శైవ ఆరాధనా ధోరణులు తెలంగాణాలో శతాబ్దం కిందటిదాకా సజీవంగా
ఉన్నాయని చక్రపాణి అంటాడు. మహ్మదీయ పాలకుల పాలన ఐదారు శతాబ్దాల దాకా ఉండడం తెలంగాణా గ్రాన్నీణ సంస్క•తిని బ్రాహ్మణీకరణ నుంచి కాపాడిందని చక్రపాణి వ్యాఖ్యానిస్తాడు. తెలంగాణాలో ‘గ్రేట్‍ ట్రెడిషన్‍’ది ఇటీవలిదాకా ఎన్నడూ పైచేయిగా లేదని, ‘లిటిల్‍ ట్రెడిషన్‍’ వర్థిల్లిన ప్రాంతం ఇది అనీ చక్రపాణి సూచిస్తాడు. నలభై యాభై ఏళ్ల కిందటి దాకా తెలంగాణాలో వెంకటేశ్వరస్వాన్ని ఆలయాలు, రామ, క•ష్ణాలయాలు ఏ ఒకటో రెండో తప్ప లేని సంగతిని ఆయన గుర్తుచేస్తాడు. వెంకటేశ్వరస్వాన్ని, షిరిడి సాయిబాబా, అయ్యప్ప- వంటి దేవతల ప్రవేశం ఇటీవలి కాలానిది అనీ- అవే ఇక్కడ వెల్లువస్థాయిలో అడుగుపెట్టిన తొలి ప్రధాన స్రవంతి మతమార్గాలు అనీ చక్రపాణి వాదిస్తాడు.


ఎల్లమ్మ భర్త జమదగ్ని, కుమారుడు పరశురాముడు. జమదగ్ని చనిపోయిన నిషయం తెలియకుండా కుమారుడిని పెంచుతుంది ఎల్లమ్మ. అల్లరిచిల్లరిగా బొంగరాలు ఆడుతూ తిరుగుతున్న పరశురాముడిని గ్రామస్థులు తండ్రి ఎవరో తెలియని వాడని తిడతారు. తండ్రి ఎవరో చెప్పమని నిలదీయడానికి వస్తున్న పరశురాముడి నుంచి తప్పించుకోవడానికి ఎల్లమ్మ వెళ్లి మాదిగ వాళ్లు తోళ్లు నానబెట్టే లొందలో దాక్కుంటుంది. అన్ని కులాలవారినీ అడిగి, చివరికి మాదిగవాడి ఇంటికి వస్తాడు పరశురాముడు. ఎల్లమ్మకు ఆశ్రయం ఇచ్చిన మాదిగవాడు బిడ్డన్నీద ఒట్టుపెట్టి ఎల్లమ్మ తన ఇంట్లో లేదంటాడు. అబద్ధపు ఒట్టుపెట్టినందుకు బిడ్డ మాయమై ఆకాశంలో నక్షత్రమవుతుంది. అరుంధతి. తల్లిని ఎక్కడా కనుగొనలేక పరశురాముడు గదాపావనం, ఘటపుకుంట, జమిడిక ధరించి ఎల్లమ్మను కీర్తించడం మొదలుపెడతాడు, పరశురాముడి స్తుతికి ఎల్లమ్మ లొందలోనుంచి బయటకు వస్తుంది, పరశురాముడు పంబాలవాడిగా పరివర్తన చెందుతాడు. ఈ ఎల్లమ్మే ఏకవీరాదేని అని కాకతీయులు ఆరాధించిన దేవత అదే నని ‘క్రీడాభిరామం’ సాక్షిగా చక్రపాణి చెబుతాడు. సర్వమూ సరిహద్దూ అని రెండు అర్థాలున్న అచ్చ తెలుగు ‘ఎల్ల’మ్మ కథను పంబాల ఆలపించే తీరూ, దానికి తోడుగా నెత్తురూ అన్నమూ కలగలసిన పూజాదికమూ కలసి ఒక అద్భుత మాంత్రిక వాస్తనికతను ప్రకటిస్తాయి. ఇంతకాలం ఇనుపగోడల వలె దళితుల సంస్క•తిని కాపాడిన ఈ సాంస్క•తిక విశేషాలు ఇప్పుడు బ్రాహ్మణీకరణకు అటునుంచి పాశ్చాత్యీకరణకు గురి అవుతున్నాయంటే గుండె పగిలిపోతుంది. అడ్డూ ఆపూలేని ప్రపంచీకరణను నిలువరించగలిగిన ఎల్లలను ఈ ప్రజా సంస్క•తి నుంచే ఆవిష్కరించాలేమో అని స్ఫురిస్తుంది.
గ్రామవైద్యుడిగా, గావుపట్టే పోతురాజుగా, గ్రామదేవతల పూజారిగా, కీడును తరిమి వేసే తాంత్రికుడిగా అనేక బాధ్యతలను నిర్వహించే పంబాల ఇప్పుడు వ•త్తినుంచి నిష్క్రమిస్తున్నాడు, గ్రామాలలో ఏ మాత్రం అనుకోని ఉపద్రవం వచ్చినా, ఎవరికేన్ని కీడు జరిగినా పంబాల వారిని రాళ్లతో కొట్టి హింసించడం, చంపడం చేస్తున్నారు, ఈ మూర్ఖపు హత్యల వెనుక ఆధునిక శాస్త్రవిజ్ఞానం గ్రామ వైద్యుల న్నీద, పూజాతతంగాల మీద కలిగించిన చిన్నచూపు ప్రభావం చాలా ఉన్నదని చక్రపాణి విమర్శిస్తున్నాడు. ‘ప్రజల నుంచి నేర్చుకోవడం’ అన్న భావనను కమ్యూనిస్టులు కూడా నిర్లక్ష్యం చేయడం, ప్రజల వాస్తవ సంస్క•తి మీద నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగి ఉండకపోవడం- ఇవాళ వెనుకకు తిరిగి చూసుకుంటే కనిపించే వాస్తవం. చక్రపాణి వంటి వారి అధ్యయనాలు ప్రజాకార్యకర్తల అవగాహనకు- వారు స్వీకరిస్తే- దోహదం చేస్తాయి. ప్రజాసంస్క•తి అంటూ ఏదయినా ఒకటి ఉంటే- అందులో పోతురాజు లేకపోతే, ప్రక•తి శక్తులతో నిరంతరం సంభాషించే ఒక పంబాల లేకపోతే ఎలా కుదురుతుంది? పంబాలలే కాదు, యావత్‍ ప్రజాశ్రేణులు వారి వారి సంస్క•తులతో సహా, ఉమ్మడి సంస్క•తికి దోహదాలు అందించకపోతే అదేన్ని ప్రజాసంస్క•తి?


చక్రపాణి అధ్యయనం- ఇటువంటి ప్రశ్నలనేకం మనలో కలిగిస్తుంది. ధూళికట్టకూ బుద్ధగయకూ మధ్య జరిగిన సంభాషణ, జీవగడ్డ నుంచి అంబేద్కర్‍ విశ్వవిద్యాలయం దాకా జరిగిన ప్రయాణం, కల్వకోల్‍నూ, కరీంనగర్‍ నూ కూడా దర్బన్‍కు తరలించ గలిగిన ద•క్పథం- చక్రపాణికి ఇప్పటికే అనేక సాఫల్యాలను అందించాయి. రాజవైద్యులుగా రాజులనుంచి, ప్రజల నుంచి గౌరవాలు పొందిన పంబాల కులంలోని చక్రపాణికి ఈ డాక్టరేట్‍ కాయితం తెచ్చే కొత్త కిరీటాలు ఏమున్నాయి కానీ- అతని ప్రయాణం ఆగకూడదు. కొత్తవిషయాలు నేర్చుకో గలిగే, నేర్చుకున్న ప్రతిదానినీ విమర్శ నాత్మకంగా చూడగలిగే లక్షణాలను అతను వదులుకోగూడదు. తన ముందు తెరచుకుంటున్న కొత్త గవాక్షాల నుంచి కనిపించే అద్భుతాలకు హ•దయాన్ని ట్యూన్‍ చేసి ఉంచుకోవలసిందే కానీ- వివశత్వంలోకి జారుకోగూడదు.


ఈ ప్రయాణం కొనసాగాలి, చక్రపాణీ!
(2001 ప్రజాతంత్ర వారపత్రిక)
-కె. శ్రీనివాస్‍, సంపాదకులు

ఆంధ్రజ్యోతి తెలుగు దిన పత్రిక

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *