సూర్య ఆరాధన చరిత్రలో విశిష్ట స్థానం సూర్య దేవాలయం, కోణార్క్

ప్రదేశం: ఒడిషా, భారతదేశం
ప్రకటితం: UNESCO – 1984
విభాగం: సాంస్క•తికం (మాన్యుమెంట్‍)


బంగాళాఖాతం ఒడ్డున, ఉదయించే సూర్యుని కిరణాలలో స్నానం చేస్తున్నట్లుగా కోణార్క్ లోని ఆలయం ఉంటుంది. సూర్య దేవుడు, సూర్యుని రథం, సింబాలిక్‍ డిజైన్‍లతో అలంకరించబడిన దాని ఇరవై నాలుగు చక్రాలకు ఒక స్మారక చిహ్నంగా ఉంటుంది. ఈ రథానికి ఆరు గుర్రాలుంటాయి. పదమూడవ శతాబ్దంలో నిర్మించబడిన ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాహ్మణ ఆలయాలలో ఒకటి.


ప్రమాణాలు:
ఒక అద్వితీయమైన కళాత్మక కట్టడం. ఆలయం కళాఖండాలకు నిలయం. ఆలయంలో ప్రతిచోటా వీటిని చూడవచ్చు. దీని నిర్మాణం పన్నెండేళ్ల పాటు 1,200 మంది కార్మికుల సమీకరణకు కారణ మైంది. ప్రధాన వాస్తుశిల్పి బిసు మోహరానా. ఆయన ఈ పని చేసేందుకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన కుటుంబాన్ని, ఇంటిని విడిచిపెట్టాడు, కానీ అతను ఆలయ గోపురం నిర్మా ణాన్ని పూర్తి చేయలేక పోతాడు. ఆయన కుమారుడు గోపుర నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆపై తనను తాను అర్పించుకుంటాడు.


కోణార్క్ పదమూడవ శతాబ్దపు ఒరిస్సా (ప్రస్తుతం ఒడిషా) రాజ్యానికి ఒక అద్భుతమైన సాక్ష్యం.
ఎనిమిదవ శతాబ్దంలో కాశ్మీర్‍లో ఉద్భవించి, తదనంతరం తూర్పు భారతదేశ తీరానికి చేరిన సూర్య ఆరాధన వ్యాప్తి చరిత్రలో కోణార్క్ ఒక అమూల్యమైన లింక్‍గా ప్రత్యక్షంగా, భౌతికంగా బ్రాహ్మణ విశ్వాసాలతో ముడిపడి ఉంది.


సూర్య దేవాలయం గురించి రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ యొక్క ప్రసిద్ధ సూక్తి ఇలా పేర్కొంటుంది. ‘‘ఇక్కడ రాతి భాష మనిషి భాష ను అధిగమిస్తుంది’’. ఏఎస్‍ఐ మొదటి డైరెక్టర్‍ జనరల్‍ సర్‍ జాన్‍ మార్షల్‍ ఇలా అన్నారు… చాలా అద్భుతంగా ఉంటూ, బ్లాక్‍ పగోడా వలె సంపూర్ణంగా ఉంటూ, మన జ్ఞాపకశక్తిపై లోతైన ముద్ర వేసే ఇలాంటి కట్టడం ‘‘హిందూస్థాన్‍ లో మరొకటి లేదు.


బ్రిటీష్‍ వారు ఈ ఆలయాన్ని ‘‘బ్లాక్‍ పగోడా’’ అని పిలిచారు. పదమూడవ శతాబ్దంలో గంగా రాజ వంశానికి చెందిన రాజు నర్సింహదేవ ఈ సూర్య దేవాలయం నిర్మించారు. సూర్యుని యొక్క గొప్ప రథంగా రూపుదిద్దుకున్న జగ్మోహన (ప్రధాన వేదిక) అనేది పన్నెండు చెక్కబడిన రాతి చక్రాలపై ఉంది. ఏడు బలిష్ఠమైన గుర్రాలు దాన్ని లాగుతుంటాయి. పన్నెండు జతల భారీ చక్రాలు హిందూ నెలలకు అనుగుణంగా ఉంటాయి. అవి ఎనిమిది పెద్ద చువ్వలు, ఎనిమిది సన్నటి చువ్వలను కలిగి ఉంటాయి. చక్రం హబ్‍ వ•త్తాకారంగా ఉంటుంది, ‘‘వీల్‍ క్యాప్‍’’ కలిగి ఉంటుంది. చువ్వలు కూడా సూక్ష్మస్థాయి వివరాలతో రూపొందించబడ్డాయి. ఇవి వివిధ రకాలుగా, ఒక దేవత, ఏనుగుపై ఉన్న రాజు లేదా శ•ంగార లేదా రసిక వ్యక్తి చిత్రాలను వర్ణిస్తాయి. మరొక గుర్తించదగిన విలక్షణత భారీ తూర్పు ద్వారం. ఎనిమిది ద్వారపట్టీలు క్రమంగా ప్రొజెక్టింగ్‍ బ్యాండ్‍లుగా విభజించబడి, దానికి తగ్గ ప్రొఫైల్‍ను ఇస్తాయి. ఈ ద్వారపట్టీలు ఆకులు, చుట్టబడిన సర్పాలు మరియు నాట్యగత్తెలు, రసిక జంటలతో చెక్కబడ్డాయి. మధ్యలో, లక్ష్మి చిత్రంతో మంటపాలు ఉన్నాయి.


జగ్మోహనబేస్‍ గోడలపై మహిషాసుర మర్దిని, జగన్నాథ రూపంలో విష్ణువు, లింగంగా శివుడు, పార్వతి, గజలక్ష్మి, న•సింహుడు వంటి హిందూ దేవతలు, ఇంద్రుడు, అగ్ని, కుబేరుడు వంటి వైదిక దేవతలను కలిగి ఉన్న అనేక శిల్పాలు ఉన్నాయి. సైనిక ఊరేగింపులు, వాయిద్యాలను వాయించే సంగీతకారులు, పల్లకీ మోసేవారు, ప్రజల జీవితంలోని వివిధ కోణాలు వంటి ఇతర ఇతివ•త్తాలు చెక్కబడిఉన్నాయి. స్తంభాలపై కామసూత్ర మైథున చిత్రాలు ఉన్నాయి, ఇది జంటల సాన్నిహిత్యం వివిధ దశలను చూపి స్తుంది. జగ్మోహన శిఖరం వివిధ న•త్య ముద్రలలో జంతువులు, స్త్రీల భారీ చిత్రాలను కలిగి ఉంది. ఈ చిత్రాలలో కొన్ని అందరి ద•ష్టిని ఆకర్షిస్తాయి, ముఖ్యంగా జిరాఫీ. ఇది భారతదేశానికి చెందిన జంతువు కాదు. ఈ విషయంపై వివిధ వాదనలు ఉన్నప్పటికీ, ఇది పాత సముద్రయాన సంప్రదాయం ద్వారా భారత దేశానికి తీసుకురాబడిన ‘‘ఖరీదైన బహుమతి’’గా భావించబడుతోంది.


సూర్య దేవాలయం కళాత్మక స•ష్టికి సంబంధించిన ముఖ్యమైన గాధలను యునెస్కో గుర్తించింది. 1,200 హస్త కళాకారులను ఉపయోగించి పన్నెండేళ్లలో దాని నిర్మాణం పూర్తి చేయడంఅత్యంత ఉత్తేజకరమైనది. ప్రధాన శిల్పి బిసు మోహరానా, ప్రాజెక్ట్ పట్ల లోతైన నిబద్ధత, అతని కొడుకు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం వంటి గాధలు కూడా ఉన్నాయి. ఆలయం యొక్క ప్రధాన భాగం, గర్భగుడి. ఇది ఇప్పుడు వాడుకలోని ఆలయ శిఖర అనే ఒడిషా శైలిలో ఉంటుంది. ఇది దాదాపు 60 మీటర్ల ఎత్తు ఉండేదని భావిస్తున్నారు. పునాది పడిపోవడం లేదా పిడుగుపాటు కారణంగా ఇది కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు.


పంతొమ్మిదవ శతాబ్దంలో కొన్ని ఆలయ మరమ్మతులు జరిగాయి. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో ఏఎస్‍ఐ ద్వారా ప్రధాన పరిరక్షణ పనులు జరిగాయి.


-జాన్విజ్‍ శర్మ
అడిషనల్‍ డైరెక్టర్‍ జనరల్‍ (కన్జర్వేశన్‍ • వరల్డ్ హెరిటేజ్‍)
అనువాదం : ఎన్‍. వం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *