ఓ అమ్మ – ఆవేదన

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్‍ మణికొండ

మంచు కమ్ము కుంది. కళ్ళకు మబ్బులు పట్టినాయ్‍. ఏం చేయాలో అర్థం అయితలేదు. ఏ దారినో తెలుస్తలె. ఏందిరా! ఈ గోస. ఏడ జూసినా గదే మంచు కనబడు తున్నది. ఏం చేయాలే. కాళ్లు కదుపు దామన్న వీలు లేకుండా ఉండాది. ఒంటి గంట దాటింది. అమ్మ భారతి యాడున్నావే జర జల్దీ రా! ఆ…. నాయనా! అచ్చినావా! గీయాలిటీ దాకా యాడికిపోయేస్తివి. గాడికే అదే మందుల దుకాణంకి పోయస్తిని. ఏమన్నా కావాలా చెప్పు. కాస్త తలనొప్పిగా ఉండాది. గట్ల చల్లగాలికి చెరువు గట్టుకు పోయేద్దాం. అని నేను నాయన దారిలో నడుచు కుంటూపోయినాం. చెరువుగట్టున చల్ల గాలికి కూర్చున్నాం చెరువు దగ్గర ఉన్న ఒక నీళ్ల కుంటలో అంత ప్లాస్టిక్‍ సంచులు, సీసాలు గివన్నీ కనబడుతున్నాయి. గివన్నిటిని చూసిన నాయనా చానా బాధపడతాండు ఏందో ఇయాలటి దినం మనుషులు, తాగడానికని నీళ్లకుంటలు, చెరువులు తవ్వినం. కానీ గీయాలిటీ సంది చెత్తకుంటగా మార్చి నీరుని కలుషితం చేస్తారనీ గాదు.


చెరువు గట్టున చినిగిన అంగి వేసుకుని నిలబడ్డ ఒక పిల్లవాడు కనిపించిండు. ఆడిని చూసి ఈడుగిక్క డెంచేస్తుండు. అని నేను నాయనా అడినం.
ఓ… ఎవరు బిడ్డా! నువ్వు గిక్కడేం పని నీకు, అని వెన్ను తట్టి అడిగిండు. తీరా చూస్తే పిల్లగాడు గుక్క పట్టి ఏడుస్తుండు. అరే-తమ్మి ఏమైందిరా? ఎందుకు గిట్ల ఏడుస్తున్నావ్‍ అని అడిగిండు నాయన.


నేను… నేను… నేనండి రవినయ్యా పక్క ఊరి నరసవ్వ కొడుకుని, మేము పేదోలం మాకంటూ ఎవరూ లేరయ్యా. నేను మా అమ్మ కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాం. రోజు అమ్మ ఈ చెరువు నీళ్లను మోసుకొచ్చేది. గవే తాగేటోల్లం రెండు దినాలకే నాకు దగ్గు, జ్వరం వచ్చింది. అమ్మకు కాళ్ళు చేతులు ఆడలే. పేద ఆసుపత్రికి పోయినం. డాక్టర్‍ గారు నన్ను చూసి ఏందమ్మా! ఇంత జ్వరం పెట్టుకొని ఆస్పత్రికి రాలే రెండు దినాలు దాటితే నీ కొడుకు చేతికి రాకపోవు అని చెప్పి సూదిచ్చి మందుల చిట్టి రాసిండు. నాకు ఈ రోగం చెరువు నీళ్ల వల్లే వచ్చిందని చెప్పిండు. ఈ విషయాన్ని నేను వెళ్లి మాఊరి సర్పంచ్‍ గారికి చెప్తే పట్టించుకోలే. పరిశ్రమల అధికారులతో మాట్లాడితే ప్రయోజనం కనిపించలే. ఏమి చేయలేక చనిపోదామనుకున్నా. కనీసం మీరైనా నాకు సహాయం చేస్తారా! పెద్దయ్య. చేస్తాను అని నాన్న మాటిచ్చి నాకు బాధ్యతను అప్పగించాడు. నేను ప్లాస్టిక్‍ తయారీలో వాడే పదార్థాల గురించి సమాచారం తెలుసుకొని ప్లాస్టిక్‍ నీ మళ్ళీ వాడి పడివేయకుండా మళ్ళీ దాన్ని మనం పునచక్రియ చేసే చాలు అలా చేయకపోతే రవి లాంటి ఎంతో మంది రోగాల బారిని పడి చనిపోతారని పై అధికారులతో చెప్పాను. వారు నా మాటను గౌరవించి మీరు చెప్పినట్టే చేస్తామన్నారు. అలాగే అని ప్లాస్టిక్‍ తయారీలో 50 మైక్రాన్స్ కంటే తక్కువ కాకుండా ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు.


సునీత లకావత్‍,
ఫోన్‍: 949327523

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *