ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్

ఉనికి: చండీగఢ్‍, భారతదేశం
(సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍)
ప్రకటన తేదీ: 2016
వర్గం: సాంస్క•తికం (సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍)
(Serial Transmational Site – Cultural)


అత్యుత్తమ సార్వత్రిక విలువ
లీ కొరిభూసియర్‍ డిజైన్‍ చేసిన నిర్మాణాల నుంచి ఎంపిక చేయబడిన, ఈ ట్రాన్స్ నేషనల్‍ సీరియల్‍ ప్రాపర్టీ మొత్తం పదిహేడు సైట్‍లతో కూడుకున్నది. గతకాలంలో ఓ సంచలనాన్ని స•ష్టించిన కొత్త నిర్మాణ భాష యొక్క వినూత్నతకు నిదర్శనం. చండీగఢ్‍ లోని క్యాపిటల్‍ కాంప్లెక్స్ అనేది లా కార్బియుసియర్‍ ఇతర నిర్మాణాల మాదిరిగానే, సమాజం అవసరాలకు ప్రతి స్పందించడానికి ఇరవయ్యవ శతాబ్దంలో ఆధునిక ఉద్యమం వర్తింప జేయడానికి ప్రయత్నించిన నిర్మాణ పరిష్కారాలను ప్రతిబింబిస్తుంది.


ప్రాధాన్యాలు:
(i): గత శతాబ్దానికి చెందిన కొన్ని ప్రాథమిక ఆర్కిటెక్చరల్‍, సామాజిక సవాళ్లకు అత్యుత్తమ ప్రతిస్పందనను అందిస్తూ, ఈ కట్టడాలు మానవ స•జనాత్మకతకు, మేధస్సుకు పట్టం కట్టే కళాఖండాలు.
(ii): ఈ కట్టడాలు యాభై సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా మానవ విలువల యొక్క అపూర్వమైన పరస్పర మార్పిడిని ప్రదర్శిస్తాయి. ఆధునిక వాస్తు శిల్పంలో మూడు ప్రధాన పోకడల పుట్టుకను కూడా సూచిస్తాయి: ప్యూరిజం, బ్రూటలిజం మరియు స్కల్ప్చరల్‍ ఆర్కిటెక్చర్‍
(iii): అవి ఇరవయ్యవ శతాబ్దంలో అత్యుత్తమ సార్వత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆధునిక ఉద్యమం ఆలోచనలతో ప్రత్యక్షంగా, భౌతికంగా సంబంధం కలిగి ఉన్నాయి.


1947లో భారతదేశ స్వాతంత్య్రం, దేశవిభజన తర్వాత లాహోర్‍ను కోల్పోవడం అనేది పంజాబ్‍ రాజధాని నగరం చండీగఢ్‍ నిర్మాణం, కాపిటల్‍ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రేరేపించింది. కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని వేడుక చేసుకోడానికి, ఆధునికత వైపు దాని కవాతుకు ఈ క్యాపిటల్‍ ఒక ప్రతీకగా భావించబడింది. దేశప్రతిష్ట యొక్క మాన్యుమెంటల్‍ ప్లేస్‍ గా క్యాపిటల్‍ కాంప్లెక్స్ రూపుదిద్దుకుంది.


నార్మా ఈవెన్సన్‍ పేర్కొన్నట్లుగా, ‘‘అప్పటికే ఉన్న శైలికి కట్టుబడి ఉండని మంచి ఆధునిక ఆర్కిటెక్ట్ కోసం అన్వేషణ ప్రారంభమైంది. ప్రాజెక్ట్ ఆవశ్యకత నుండి ఉద్భవించేది, భారతీయ వాతావరణానికి సరిపోయేది, అందుబాటులో ఉన్న వస్తువులతో నిర్మించేది, కొత్త రాజధాని విధులకు సరిపోయే కొత్త భావనను అభివ•ద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉండే వారికోసం ఆ అన్వేషణ’’. అమెరికన్‍ ప్లానర్‍ ఆల్బర్ట్ మేయర్‍, పోలిష్‍ ఆర్కిటెక్ట్ మాథ్యూ నోవికీల బ•ందంతో ప్రారంభించి, ఈ ప్రయత్నాలు చివరకు విప్లవాత్మక స్విస్‍-ఫ్రెంచ్‍ ఆర్కిటెక్ట్ లీ కోర్‍భూసియర్‍ మరియు అతని ముగ్గురు సహచరుల వద్దకు దారి తీశాయి.


యావత్‍ నిర్మాణాలకు లా కార్బియుసియర్‍ ‘మార్గదర్శకుడి’గా ఉన్నప్పటికీ, నగరానికి ఆయన అందిం చిన శాశ్వత తోడ్పాటు కాపిటల్‍ కాంప్లెక్స్. ఇది యావత్‍ నగరానికి ‘తల’ లాంటిది. శివాలిక్‍ పర్వతాల బ్యాక్‍ డ్రాప్‍లో అనువైన స్థలంలో నెలకొంది. ఇది నాలుగు భవనాలు, ఆరు మాన్యుమెంట్స్ సమ్మిళిత సమూ హంగా రూపొందించబడింది. అన్నీ పార్క్ లాంటి వాతా వరణంలో ఏర్పాటు చేయబడ్డాయి, ఇంటర్‍ లాకింగ్‍ స్క్వేర్‍ల యొక్క అద•శ్య జ్యామితి ద్వారా ద•శ్యమానంగా అనుసంధానం చేయబడ్డాయి.


స్వదేశీ నిర్మాణ పద్ధతులు, యాంత్రిక రహిత వ్యవస్థలను ఉపయోగించారు. మూడు భవనాలు, అంటే హైకోర్టు, శాసనసభ, సెక్రటేరియట్‍ రూపుదిద్దుకున్నాయి. ఈ భవనాలు ప్రజాస్వామ్యం యొక్క ప్రధాన విధులను కలిగి ఉంటాయి- చట్టాలు చేయడం, అమలు చేయడం, న్యాయం అందించడం.


హైకోర్టుతో నిర్మాణం ప్రారంభమైంది. 1955 నాటికి పూర్తి చేయబడింది, ఇది వెంటనే ఆధునిక నిర్మాణ చిహ్నంగా మారింది, దాని అసాధారణ సౌందర్యం, శిల్పకళానైపుణ్యంతో కూడిన పైకప్పులు, భారీ సన్‍ బ్రేకర్లతో అందరినీ అలరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ట్లు దానిని సందర్శించారు. కాశ్మీర్‍లో ప్రత్యే కంగా వర్క్ షాప్‍లో అల్లిన తొమ్మిది పెద్ద టేప్‍ స్టైర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూర్తి ఇంటీరియర్‍లకు, వాటి శక్తివంతమైన రంగులకు మానవ ఆసక్తిని జోడించారు. న్యాయాన్ని, స్థానిక ప్రక•తి ద•శ్యాలను సూచించే శైలి అనుసరించబడింది.


తొమ్మిది అంతస్తుల సెక్రటేరియట్‍ అప్పట్లో చండీగఢ్‍లోని ఎత్తైన నిర్మాణం. ఎలివేటర్లు లేకుండానే పైకి వెళ్లడాన్ని సులభతరం చేయడానికి కొట్టొచ్చేలా కనిపించే ర్యాంప్‍ల ఆలోచన అప్పట్లో మార్గదర్శకంగా నిలిచింది. భవనాలను సహజంగా చల్లబరచడానికి విస్త•తంగా షేడెడ్‍ ఫకేడ్‍ రూపొందించబడింది. అంతర్గత ప్రదేశాలను అది సహజంగా చల్లబరిచేది. రూఫ్‍ టాప్‍ కెఫెటేరియా, టెర్రెస్‍ గార్డెన్‍ కార్యాలయ విరామ సమయంలో సిబ్బంది అంతా ఒకరినొకరు కలుసుకునేందుకు వీలు కల్పిస్తాయి.


లెజిస్లేటివ్‍ అసెంబ్లీ సమూహం అత్యంత విస్త•తమైన నిర్మాణం. తన అద్భుతమైన అవాంట్‍-గార్డ్ టాప్‍-లైట్‍ ఫోరమ్‍, కొడవలి ఆకారపు పోర్టికో, సన్నని హైపర్‍ బోలాయిడ్‍ షెల్‍, స్తంభాలు లేని వ•త్తాకార అసెంబ్లీ హాల్‍ లాంటి వాటితో సందర్శకులను అలరిస్తుంటుంది. లోపలి ప్రదేశాలలో వెలుగు, రంగు దోబూచు లాడు తుంటాయి. వాటి సమ్మేళనం అద్భుతంగా ఉంటుంది. భారీ ఉన్ని టేప్‍ స్ట్రైస్‍ ప్రకాశవంతమైన రంగులు, అలాగే లే కార్బుసియర్‍ వ్యక్తిగతంగా చిత్రించిన మాన్యుమెంటల్‍ సెరెమోనియల్‍ ఎనామెల్‍ తలుపు, ఇవన్నీ లీ కోర్‍భూసియర్‍ యొక్క అసమానమైన స•జనాత్మక మేధస్సుకు సాక్ష్యంగా ఉన్నాయి. ఇక నాలుగవ భవనం, గవర్నర్‍ ప్యాలెస్‍. తరువాత కాలంలో ఇది మ్యూజియం ఆఫ్‍ నాలెడ్జ్ గా మారింది. భవనాలు పాదచారుల నడక మార్గాల ద్వారా కూడా అనుసంధానించబడి ఉన్నాయి, వీటిలో హైకోర్టు, అసెంబ్లీ మధ్య విస్తారమైన మార్గం ఉంది. మరో ఆరు కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి.


కట్టడాలు, బయటి శిల్పాలు లీ కోర్‍భూసియర్‍ డిజైన్‍ సూత్రాలను వ్యక్తపరుస్తాయి. నూతన గణతంత్ర రా జ్యం ఆత్మగా కూడా ఉంటాయి. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఓపెన్‍ హ్యాండ్‍ కట్టడం. నగరం యొక్క భావ జాలాన్ని ప్రకటించ డానికి ‘‘ట్రెంచ్‍ ఆఫ్‍ కన్సిడరేషన్‍’’కు పై భాగంలో నిలుస్తుంది: ‘‘స•ష్టించిన సంపద లను స్వీకరించడానికి తెరువండి… వాటిని దాని ప్రజలకు పంపిణీ చేయడానికి తెరువండి’’ అనే సందేశాన్ని ఇది అందిస్తుంది. లే కార్బూసియర్‍ రూపుదిద్దలేక పోయిన మాడ్యులర్‍ ‘‘మాడ్యులర్‍ మ్యాన్‍’’ ‘‘మానవ స్థాయికి శ్రావ్యమైన కొలత’’ అనేది చండీగఢ్‍ విస్త•త ద•శ్య క్రమాన్ని వివరిస్తుంది. అమరవీరుల మెమోరియల్‍ తో కూడిన శిల్పాలు బ్రిటిష్‍ సామ్రాజ్యం పతనానికి ప్రతీక, భారతీయ ప్రజల ఆత్మ పునర్జన్మ. మిగిలినవి మూడు, 24 సోలార్‍ అవర్స్, టవర్‍ ఆఫ్‍ షాడోస్‍, కోర్స్ ఆఫ్‍ ది సన్‍. ఇవన్నీ కలిసి ప్రజల రోజువారీ జీవితంలో సూర్యుని ప్రభావాన్ని, చండీగఢ్‍ సంక్లిష్ట వాతావరణం అందించిన సవాళ్లను నొక్కి చెబుతాయి.


చండీగఢ్‍ క్యాపిటల్‍ కాంప్లెక్స్ పూర్తిగా వాడుకలో ఉన్న హెరిటేజ్‍ సైట్‍. ఎంతో మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది. కట్టడాలు, స్మారక చిహ్నాలను ల్యాండ్‍ స్కేప్‍ తో వాటి అనుబంధంతో సహా పరిరక్షించాల్సిన అవసరం నెరవేరుస్తూనే, ప్రస్తుతం ఉన్న సౌకర్యాల ఆధునీకరణ కోసం పెరిగిపోతున్న అవసరాలను సమన్వయం చేయడమే ప్రధాన సమస్యగా ఉంటోంది.

  • కిరణ్‍ జోషి
    అనువాదం : ఎన్‍. వం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *