మృత్యువుతో ముఖాముఖం

చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటే
గేలి చేస్తూ పగలబడి నవ్వేవారెవరు?

బళించిన చావును తిరిగి, విసిరి
గోడకు దిగ్గొట్టిన వారెవరు?
-సముద్రుడు (అజ్ఞాత విప్లవ కవి
)


ఈసారి సరదాగా మనం కొన్ని చావు కబుర్లు చల్లగా చెప్పుకుందామా?
మృత్యువు వ•ందు వ•ఖావ•ఖంగా నిలబడి దాని కళ్లల్లోకి సూటిగా చూస్తూ కాసేపు పరిహాసాలాడుకుందామా?
నేనూ, నా సతీమణి – మా ఇద్దరికీ ఏమీ పని పాటా లేనపుడు ఏమీ పొద్దుపోనపుడు మృత్యువును మజాక్‍ చేస్తూ కాలక్షేపం కోసం దానిమీద కొన్ని జోకులేసుకుంటూ ఉంటాం. మచ్చుకు మా చావు వ•చ్చట్లు కొన్ని మీతో ముచ్చటగా పంచుకుంటాను.
మా ఇద్దరికీ పచ్చిమిరపకాయలు బాగా దట్టించి చేసిన వేడివేడి పెసరగారెలంటే మహా ఇష్టం. మేం చనిపోయాక నరకానికో లేదా స్వర్గానికో ఎక్కడికో అక్కడికి వెళ్తాం కదా! అక్కడి మెస్‍లో గరం గరం పెసర గారెలు దొరుకుతాయో లేదో అని ఇప్పట్నించే బెంగపెట్టుకుంటూ ఉంటాం. ఇక పోతే మా ఇద్దరికీ గాలి వెలుతురూ ధారాళంగా ఉండాలి. గాలి ఆడకపోతే మాకు చచ్చేచావు. మేం బొందలోకి వెళ్లిన తర్వాత దానికి తలుపులు కిటికీలు ఉండవు కదా గాలి ఎట్లా వస్తుందని నేను పరేషాన్‍ అవుతుంటా. ‘‘ఏం పరవాలేదు. మనం మన బొందలో ఒక ఉషా ఫ్యాన్‍ ఏర్పాటు చేసుకుందాం’’ అని నా శ్రీమతి నన్ను ఓదారుస్తుంది. బొందలో పడుకున్న తర్వాత కాలక్షేపం ఎలా అవుతుంది. విసుగ్గా ఉంటదేమో అని నేను మళ్లీ కొత్తగా ‘‘కిరికిరి’’ పెడుతుంటే ‘‘అయ్యో అదేమంత ప్రాబ్లెమ్‍? బొందలోకి కొన్ని లావు లావు పుస్తకాలు తీసుకపోతే సరి’’ అని నా అర్ధాంగి ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తుంది. నాకు మరో కోరిక కూడా ఉంది. నేను పై లోకాలకు వెళ్లాక అక్కడ సృష్టికర్త కనబడితే ‘‘నువ్వు సృష్టించిన ఈ లోకం ఇంత అస్తవ్యస్తంగా ఎందుకుంది? ఈ కష్టాలు కన్నీళ్లకు ఈ దుర్మార్గాలకు, దౌర్జన్యాలకు కారణాలేమిటి? నువ్వు చిత్రించిన ఈ చిత్రం ఇంత చెత్తగా ఎందుకుంది? •శీ• •తీవ ఙవతీ• ••• •తీ•ఱ••’’ అని నిలదీసి క్లాసు పీకాలని నా ఆఖరి కోరిక.


× × ×
రవీంద్రనాథ్‍ఠాగూర్‍ తన కవితలో ఒక చోట ఇలా అంటాడు. ‘‘నేను పుట్టినప్పట్నుండి నన్ను నీడలా వెంబడిస్తూనే వున్నావు. నన్ను వెనక నుండి హఠాత్తుగా దొంగదెబ్బ తీయాలని. అ••నా నువ్వంటే నాకు భయం లేదు. మరణించినా మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటాను. పునరపి జననం – పునరపి మరణం’’.
పెద్ద కాళోజీ ‘‘షాద్‍’’ రామేశ్వరరావుగారు మృత్యువును హుందాగా ఆహ్వానించాడు.
‘‘ఆకుపచ్చ ఆకులు చెట్టుకు అలంకారాలు.
పసుపుపచ్చ పండుటాకులు మోతబరువు
కొమ్మకు అతుక్కుని ఎంతకాలం వేలాడుతావు
ఆకురాలు కాలం వచ్చింది ఇక రాలిపోరాదా’’.
చాలా సంవత్సరాల క్రితం నేను కాకినాడలో ‘‘బ్రహ్మసమాజం’’ ప్రాంగణానికి వెళ్లాను. అక్కడ ఒక వ•లలో సర్‍ రఫ•పతి వెంకటరత్నం నా•••డు సమాధిపై రాసి ఉన్న ‘‘ఎపిటాఫ్‍’’ నన్ను ఆకర్షించింది.
‘‘ఇతను జీవించనూ లేదు. మరణించనూ లేదు. ఆది మధ్యాంత రహిత విశ్వవినువీధులలో సంచరిస్తూ రవంత సేపు విశ్రమించటానికి ఈ పుడమి మీద ఆగినారు’’.
బన్సీలాల్‍పేట స్మశానంలోని గోపాల్‍దాస్‍ మఠం ‘‘కబీర్‍ పంత్‍’’ సభ్యులు పాడే ఒక భజన నాకు యాదికొస్తుంది.
‘‘దునియామే ఆయా మనుష్య్ బన్‍కే
యహాఁ ఫిర్‍తాహై వ•రఖ్‍ పశూ బన్‍కే’’
‘‘సమల్‍ కర్‍ చలో మేరే మనువా
ఏ ఖిలోనా టూట్‍ జానే వాలీ హై
సమజ్‍కర్‍ దేఖో మేరే మనువా
ఏ దునియా ఛూట్‍ జానే వాలీ హై’’


× × ×
మృత్యువుకు వ•ందు రాసుకునే వీలునామాలు కూడా చాలా అందంగా ఉంటా••. నెహ్రు వీలునామా నాకు చాలా ఇష్టం. ఆయన నాస్తికుడు కదా! తన అంత్యక్రియలలో మతప్రమేయం, బ్రాహ్మణ పద్దతులు ఉండకూడదని ఆయన వీలునామాలో రాశాడు. కాని క్యా ఫా••దా? అప్పటికి ఆయన కూతురు ఒక ‘‘గూంగీ గుడియా’’, అమా••క. ఆపద్ధర్మ ప్రధాని గుల్జారీలాల్‍ నందా పుణ్యమా అని కాశీబ్రాహ్మణ పండితుల ఆధ్వర్యంలో ఆయన కర్మకాండ ప్రయాగ సంగమంలో శాస్త్ర ప్రకారం జరిగింది. నెహ్రు రాసిన ‘డిస్కవరీ ఆఫ్‍ ఇండియా’ ప్రభావంతో నేను కూడా 1976లో మా బాపు అంత్యక్రియలను హిందూమత పద్దతులకు వ్యతిరేకంగా చేసి మా పెద్దల ఆగ్రహానికి గురైనాను.
కామ్రేడ్‍ చండ్ర రాజేశ్వరరావుగారి వీలునామా నాకు కన్నీళ్లను తెప్పించింది.


‘‘నేను నా జీవితాన్ని సంపూర్ణంగా వినియోగించుకున్నాను. నాకు ఆస్తులు లేవు. అప్పులు లేవు. నా తదనంతరం నా దుస్తులు పేదప్రజలకు, నా పుస్తకాలు ఏదైనా లైబ్రరీకి ఇవ్వగలరు’’. సంక్షిప్తంగా ఇదీ ఆ కవ్యనిస్టు యోధుడి వీలునామా.
యస్‍.వి.ఘాటే కూడా కవ్యనిస్టు నాయకుడు. ‘‘నా మృత్యువు అంత వ•ఖ్యమైనదేమీ కాదు. మీరెవరూ మీ పనులను వదులుకుని అవ•ల్యమైన మీ కాలాన్ని వృధా చేసుకుని నా అంత్యక్రియలకు రావద్దని నా విజ్ఞప్తి’’. ఇదీ ఆయన రాసిన వీలునామా.
గొప్పవాళ్లు చనిపోయాక వారి గురించి రాసే జ్ఞాపకాలను ‘‘ఎలిజీలు’’ అంటారు. స్మ•తిగీతాలు, స్మ•తి వాక్యాలే ఈ ఎలిజీలు.
కొంపెల్ల జనార్ధనరావు చనిపోగా శ్రీశ్రీ ‘‘దొంగలంజ కొడుకులసలే మెసలే ధూర్త లోకంలో నుండి వెళ్లిపోయావా నేస్తం’’ అని కవిత రాసి అంగలార్చాడు.
లోకనాయక్‍ జయప్రకాశ్‍ నారాయణ్‍ మృతి వార్త విని చిన్న కాళోజీ:
‘‘పుటక నీది చావు నీది
బ్రతుకంతా దేశానిది’’ అన్నాడు.


‘‘చివరకు మిగిలేది’’ నవల రాసిన బుచ్చిబాబు చనిపో••నపుడు ఒక కవి ‘‘ఆంధ్రదేశం నిలువుటద్దం భళ్లున బ్రద్దల•• పో••ంది అన్నాడు. కృష్ణశాస్త్రి మరణవార్త విని శ్రీశ్రీ ‘‘షెల్లీ మళ్లీ మరణించాడు’’ అన్నాడు. నెహ్రూ హఠాన్మరణ వార్త కె.ఏ. అబ్బాస్‍కు అందింది. అప్పుడు ఆయన బ్లిట్జ్ వారపత్రికలో పనిచేస్తున్నాడు. అప్పటికే పేపరు డెడ్‍లైన్‍ దగ్గరి కొచ్చింది. మంచి టైటిల్‍ రెండు పదాలలోనే ఉండాలని పత్రికాధిపతి కరంజియా తొందర పెట్టసాగాడు. అబ్బాస్‍ ఆలోచించి చీవష్ట్రతీ• ణఱవ• అని కాక చీవష్ట్రతీ• •ఱఙవ• అని టైటిల్‍ పెట్టాడు. అంటే ఆయన మరణించినా ఆయన ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పటం. ఇవన్నీ ఎలిజీలే.
చంద్రశేఖర్‍ ఒకప్పుడు నా ప్రియ మిత్రుడు. పక్కా సోలానా తెలంగాణా వాది. సంస్క•తం చదివిన వాడు. కవిత్వం రాసేవాడు. ఇద్దరం కలిసి తెలంగాణా రచ••తల సంఘంలోనూ, తెలంగాణా ఉద్యోగుల సంఘంలోనూ చురుకుగా పని చేసాం. ఆఫీసు పనుల మీద ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలు పర్యటించాం. తెలంగాణా రాకవ•ందే కుటుంబ సమేతంగా తిరుపతికి
వెళ్లుతూ కడప దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ‘‘సార్‍ ఎక్కువగా చదివి తక్కువగా రాయాలి’’ అని నాతో అనేవాడు. నేను అతని గురించి ఒక ఎలిజీ రాస్తూ: ‘‘చంద్రశేఖర్‍ నువ్వు చూడలేని తెలంగాణాను మేవ• చూస్తాం. తెలంగాణా రాగానే నేను వ•ందు నిన్నే జ్ఞాపకం చేసుకుంటా’’ అన్నాను.
అన్నట్లే తెలంగాణా సిద్దించగానే నేను, నా సహచరి కల్సి నాంపల్లిలోని అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి చంద్రశేఖర్‍ను గుర్తు చేసుకుంటూ పుష్పగుచ్చం సమర్పించాం.


మరో మిత్రుడు కాతోజు వెంకటేశ్వర్లు హఠాత్తుగా జరిగిపోయాడు. అతను నిరంతరం కళ్లద్దాలు ధరించేవాడు. ఆయన రంగస్థల నటుడు కూడా. నేను ఆయనపై రాసిన స్మ•తిగీతం ఇలా ఉంది.
‘‘కాతోజూ ఇదేమైనా న్యాయంగా ఉందా?
నాటకం నడుస్తుండగానే మధ్యలో
హఠాత్తుగా మాయం అయ్యావ్‍.
మళ్లీ వస్తాననైనా చెప్పలేదు.
రంగస్థలం ఖాళీగా ఉంది కాతోజూ
కాలేజీలో అటెండెన్స్ రిజిస్టర్‍ ఖాళీగా ఉంది
ప్లీజ్‍ ఒకసారి వచ్చి సంతకం చేసి వెళ్లరాదా?
అన్నట్లు కాతోజూ నీ స్కూటర్‍ ఇక్కడే ఉంది.
మరి దేవలోకంలో నువ్వు ఎలా తిరుగుతావు?
దోస్తులందర్నీ నువ్వు దిల్‍సుఖ్‍నగర్‍ చౌరాస్తాలో వదిలేసి
మంచుపల్లకీ ఎక్కి మౌనంగా నిష్క్రమించావు
కాతోజూ ఇదేమైనా న్యాయంగా ఉందా?
(తరువాయి వచ్చే సంచికలో)


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *