నిత్య వసంతం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.

పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.

ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్‍ మణికొండ

పచ్చని పొలాలతో అందమైన సెలయేళ్ళతో ప్రక•తి ఒడిలో ఆడుకుంటునట్లుగా ఉన్న పచ్చని పల్లెటూరు మా రామాపురం. ఈ గ్రామంలో మంగమ్మ అనే పెద్దమ్మ ఉండేది. ఆమెకి ముగ్గురు కొడుకులు వారికి ఒక పెద్ద పండ్ల తోట ఉంది.
ఆ తోటలో మంగమ్మ, ముగ్గురు కొడుకులు కలిసి రకరకాల పండ్లను (నిమ్మ, దానిమ్మ, జామ, బొప్పాయి, మామిడి) పండించేవారు.
చక్కగా పండ్లు బుట్టలు బుట్టలుగా వచ్చేవి. చెట్లు కాపుకు వచ్చాయో లేదో మందలు మందలుగా కోతులు వచ్చి తోటలోని పండ్లను తిన్న కాడికి తిని, విసిరేసి, కొమ్మలు విరిసి ఆగమాగం చేసాయి. తోటంతా చిందరవందర అయింది. మంగమ్మ చాలా బాధ పడింది. ఇదేందిరా దేవుడా పంట కోతకు వచ్చే సమయానికి ఈ కోతుల బెడద ఏంది. ప్రతి ఏడూ ఇదో బాధ అయి పోయింది. అని మంగమ్మ చాలా విచారించింది. తన ఒక్కదాని తోట మాత్రమే కాదు. ఊర్లో ఇలా ఎందరికో నష్టం జరుగుతుంది.


పాపం! అవి మాత్రం ఏం చేస్తాయి వాటికి కూడా ఆకలి వేస్తుంది. అడవులు లేవాయే కడుపు కాలి ఊర్లో తోటల మీద పడ్డాయి. కోతులు వచ్చాయంటే బాంబులు వేసి బెదర కొట్టడం, డప్పుల మోత మోగించడం కాదు. వాటి ఆకలి కూడా తీరే మార్గం మనమే చూడాలి అనుకుంది.
అడవులు నరికి వేయడంతో జరిగిన అనర్ధం ఇది అనుకొని బాధ పడింది.
జరిగిన నష్టానికి వేదన కాదు కదా పరిష్కారం. ఇప్పుడేం చేయాలి. అని ఒక్క క్షణం ఆలోచించింది తన 70 ఏళ్ల అనుభవాన్ని మదించి ఓ అద్భుతమైన ఆలోచన చేసింది.
పండ్ల గింజలని తోటంతా తిరిగి రోజులు రోజులు తీసి బాగా ఎండ బెట్టింది. అందరికి అదే సలహా ఇచ్చింది. సంచుల నిండా పండ్ల గింజలు నింపింది. ఎండాకాలంలో చక్కగా పండ్ల గింజల్ని సిద్ధం చేసుకుంది. ఓ రోజు ఊరి వాళ్ళందరినీ పిలిచి ఎవరికి ఏ గింజలు కావాలంటే అవి ఇచ్చింది. అట్లా ఆ నోట ఈ నోట అందరికి తెలిసింది. చుట్టు పక్కల గ్రామాల రైతులు కూడా వాటిని తీసుకోవడానికి వచ్చేవారు. రోహిణి కార్తీ తర్వాత గింజల్ని నాటారు. ప్రక•తి కూడా కరుణించింది. ఆ ఏడు వానలు కూడా బాగా పడ్డాయి. చక్కగా చెట్లు పెరిగాయి, ఎటు చూసినా పండ్ల చెట్లె. చుట్టు పక్కల ఊర్లన్నీ ఊరికి వెలుపల అడవి దగ్గర అంతా పండ్ల చెట్ల మయం అయింది. అంతే కోతులు ఊర్లను వదిలి నెమ్మది నెమ్మదిగా అడవి బాట పట్టాయి. ‘‘వానలు కురవాలి కోతులు పోవాలి’’ అన్న పెద్దల ఆకాంక్షను ఒక సామాన్యురాలి సంకల్పం నెర వేర్చింది. అవును మరి మనసుంటే మార్గం ఉంటుంది.

  • సునీత, ఫోన్‍ : 770216920

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *