ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ-ఆత్మీయ అభినందన సభ

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ జనవరి 31 కనీ వినీ ఎరుగని రీతిలో డాక్టర్‍ బిఆర్‍. అంబేద్కర్‍ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 1994లో డా. బి.ఆర్‍. అంబేద్కర్‍ ఓపెన్‍ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సహాయ ఆచార్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి డైరెక్టర్‍ అయ్యారు. 1997 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగ మయ్యారు. వారు సీనియర్‍ ప్రొఫెసర్‍ హోదాలో పదవీ విరమణ పొందారు. ఆచార్యులు, వర్సిటీ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.


సభకు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‍ కె.సీతారామారావు గారు అధ్యక్షత వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‍ ప్రొఫెసర్‍ ఏ.వి.ఎన్‍.రెడ్డి, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, మాజీ అధ్యాపకులు, బోధన, బోధనేతర పాలన, పాలనేతర సిబ్బంది, విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల, అన్ని తరగతుల ఉద్యోగులు- వారి సంఘాలు, విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు ఆయనను పుష్పగుచ్చాలు, పూలదండలు, పట్టు శాలువాలతో, బహుమానాలతో ఘనంగా సత్కరించారు.


తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్తు వైస్‍ చైర్మన్‍ బండ ప్రకాష్‍, ప్రొఫెసర్‍ జి. హరగోపాల్‍, ప్రొఫెసర్‍ గట్టు సత్యనారాయణ (గురువు – ఓ.యు), ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్‍ కె.శ్రీనివాస్‍, ప్రొఫెసర్‍ నాగేశ్వర్‍, తెలంగాణ ప్రెస్‍ అకాడమీ మాజీ చైర్మన్‍ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‍ జూలూరు గౌరీ శంకర్‍, శ్రీ జ్వాలా నరసింహారావు, ప్రొఫెసర్‍ దామోదరం (మాజీ వీసీ ఎస్‍వి. యూనివర్సిటీ), ప్రొఫెసర్‍ సూర్యనారాయణ రెడ్డి (గురువు), దక్కన్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍, డా. రామమోహన్‍ రెడ్డి (మాజీ మెంబర్‍ టీఎస్‍పిఎస్‍సీ), ప్రొఫెసర్‍ రా•శేఖర్‍ (హెచ్‍సియు, హైదరాబాద్‍), ప్రొఫెసర్‍ వేణుగోపాల్‍రెడ్డి, రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల అధ్యాపకులు – ఇంకా అనేకమంది ప్రముఖ మేధావులు, కవులు, రచయితలు, పాత్రికేయులు, పుర ప్రముఖులు హాజరై చక్రపాణి గారికి పదవీ విరమణ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు కుటుంబ, సభ్యులందరూ సత్కార సభలో పాల్గొన్నారు.

మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు దాదాపు 8 గంటలపాటు జరిగిన సభా కార్యక్రమంలో వక్తలు చక్రపాణి గారు విశ్వవిద్యాలయానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, విశ్వవిద్యాలయం వెలుపల ప్రజా జీవన రంగంలో రాష్ట్రానికి, సాంఘిక, సాహిత్య రంగాలలో చేసిన సేవలను ప్రస్తుతించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ తొలి చైర్మన్‍గా, నిర్వహించిన విధులను, ఏ సమస్యలు లేకుండా, సాఫీగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారని కొనియాడారు. విశ్వవిద్యాలయ వికాసానికి, అభివ•ద్ధికి వివిధ హోదాలలో బోధన, పరిపాలన రంగాలలో, పాలసీ విధానాలలో చక్రపాణి గారు చేసిన క•షిని ప్రశంసించారు. ప్రొఫెసర్‍ సీతారామారావు గారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు జరిగిన అభివ•ద్ధి చరిత్రను గ్రంథస్తం చేసే బాధ్యతను చక్రపాణి గారికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సభ న భూతో నా భవిష్యతి అని అన్నారు. ఇది పదవీ విరమణ మాత్రమే, కానీ విరామం కాదని సమాజానికి, విద్యారంగానికి మరిన్ని సేవలు అందిస్తారని వక్తలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా, పత్రికా రచనల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగ•త పరిచారని విశ్లేషించారు.

చక్రపాణి గారు తన స్పందన ప్రసంగంలో తాను పల్లెటూరు నుంచి ఇంత దాకా ఎదిగి వచ్చిన జీవన క్రమాన్ని వివరించారు. తన జీవనయానంలో వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను, సహనంతో త్యాగనిరతితో ప్రోత్సహించిన, కుటుంబ బాధ్యతలు మోసిన తన జీవన సహచరి ప్రొఫెసర్‍ పుష్పా చక్రపాణి గారిని, ఇతర కుటుంబ సభ్యులను చెమ్మగిల్లిన కళ్ళతో క•తజ్ఞతలు సమర్పించుకున్నారు. విశ్వవిద్యాలయం వైస్‍ ఛాన్సలర్‍ ప్రొఫెసర్‍ బషీరుద్దీన్‍ నుంచి ప్రస్తుత వైస్‍ ఛాన్సలర్‍ వరకు, అనేక విషయాల్లో, ప్రత్యక్షంగా పరోక్షంగా తన సలహాలు, సూచనలు తీసుకున్నారని, అందుకు గర్వపడుతున్నానని, తనను వారు ప్రోత్సహించారని తెలియజేశారు. సభ ఆద్యంతమూ ఆసక్తికరంగా కొనసాగింది. సభా కార్యక్రమానికి ముందు సభికులందరికీ పసందైన భోజనం ఏర్పాటు చేశారు.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *