దక్షిణ భారతంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

దక్షిణ భారతంలో ఇప్పటి వరకు జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా ప్రతిపాదన మేరకు, కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిని జయోలాజికల్‍ మాన్యుమెంట్స్గా డిక్లేర్‍ చేయడం జరిగింది. అలాంటి స్థలాలు పదిహేను (15) ఉన్నవి. ఆంధప్రదేశ్‍లో అయిదు (5), కర్నాటకలో నాలుగు (4), తమిళ నాడులో మూడు (3) మరియు కేరళలో మూడు (3) కలవు. ఈ సంచికలో ఆంధప్రదేశ్‍లోని జియోలాజికల్‍ మాన్యుమెంట్స్ గురించి చర్చించుకుందాము.
ఆంధప్రదేశ్‍లోని అయిదు సైట్స్ యొక్క వివరణ ఒకొక్కటిగా క్రింద ఇవ్వబడినది.


1) నేచురల్‍ ఆర్చ్ (శిలా తోరణం)
ఈ నేచురల్‍ ఆర్చ్ని ఇక్కడి వారు శిలాతోరణం అని అంటారు. ఇది తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కలదు. ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాకు చెందుతుంది. ఈ శిలాతోరణం ఒక రాక్‍ బ్రిడ్జ్, ఇది మూడు (3) మీటర్ల ఎత్తు, ఎనిమిది (8) మీటర్ల వెడల్పు కలిగి ఉన్నది. ఇది క్వార్ట్జైట్‍ శిలలో ప్రకృతి వైపరిత్యాల ద్వారా చెక్కబడినది. ఈ శిల కడప సూపర్‍ గ్రూప్‍కు చెందిన నగరి ఫార్మేషన్‍కు చెందినది. దీని వయస్సు 1600 మిలియన్‍ సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగినది. ఇది ఫార్మ్ కావడానికి కారణం డిఫరెన్‍షియల్‍ ఎరోశన్‍ అనగా సాప్ట్మెటీర్యెల్‍ ఎరోడ్‍ అయిపోయి హార్డ్ మెటీరియల్‍ మిగిలిపోవడం. ఇది తిరుమలలో ఉండడం వల్ల స్వామి దర్శనానికి వచ్చిన ప్రతివారు దీనిని కూడా దర్శించుకుంటారు. స్వామి ఈ ద్వారం గుండా అక్కడికి వచ్చాడన్న గట్టి నమ్మకం భక్తులలో వుంది.


2) ఎప్‍ఆర్‍క్యన్‍ అన్‍ కన్ఫర్‍మిటి
ఈ స్థలం జియోలాజికల్‍గా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నగరి ఫార్మేషన్‍కు చెందిన క్వార్‍టజైట్‍ అనకన్‍ఫర్మబుల్‍గా పెనెన్‍ సులర్‍ నైస్‍ పైన ఉండటం విశేషం. ఆర్‍క్యన్‍ పీరియడ్‍కు చెందిన నైస్‍ శిలపైన ప్రొటిరోజోయిక్‍ పీరియడ్‍కు చెందిన క్వార్ట్జైట్‍ శిల దానిపైన కాంటాక్టులో ఉండటం మరియు ఇలాంటి దృశ్యం ఇంకెక్కడా లేకపోవడం దీని ప్రత్యేకత. దీనిని తిరుమల కొండల స్టీప్‍ స్కార్ప్లో 900 మీటర్ల ఎత్తు ప్రాంతంలో చూడగలము.


3) స్ట్రాటిఫార్మ్ బెరైట్‍ డిపాజిట్‍
ఈ స్ట్రాటిఫార్మ్ బెరైట్‍ డిపాజిట్‍ కడప జిల్లాలోని మంగంపేట వద్ద కలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్ట్రాటిఫార్మ్ బెరైట్‍ డిపాజిట్‍ ఇక్కడ రెండు స్ట్రాటిఫార్మ్ లెన్స్స్‍ 1.2 కి.మీ. పొడవు 20 మీ. తిక్‍నెస్‍ కలిగి యుండి 74 మిలియన్‍ టన్నుల బెరైట్‍ రిజర్వు కలదు. ఈ బెరైట్‍ ఖనిజం యొక్క కాంపొజిషన్‍ BaSO4 దీని స్పెసిఫిక్‍ గ్రావిటి 2.4 నుండి 2.9 వుంటుంది. ఈ డిపాజిట్‍ ఫార్మ్ అయిన విధానం ఏంటంటే అగ్నిపర్వతం సబ్‍ మెరైన్‍ కండిషన్స్లో బద్ధలైన సమయంలో వేపర్స్, ఏశ్‍, మోల్ట్న బరైట్‍ లాపిల్లి విరజల్లడం సెడిమెంటరీ బెసిన్‍ యొక్క సీ ఫ్లోర్‍ దగ్గర ఈ పక్రియ ద్వారా ఏర్పడినది ఈ డిపాజిట్‍. ఇది కడపా సూపర్‍ గ్రూప్‍లోని పుల్లంపేట్‍ ఫార్మేషన్‍కు చెందినది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బెరైట్‍ డిపాజిట్‍. దేశంలోనే అతి పెద్ద బెరైట్‍ డిపాజిట్‍ దేశంలోని రిజర్వ్లో 98%, ప్రపంచంలో 28% ఇక్కడి నుండి వస్తుంది. దీనిని డ్రిల్లింగ్‍ మడ్‍గా, కెమికల్స్, పేంట్స్, ఫిల్లర్‍ మరియు ఎక్స్టెండర్‍ అగ్రిగేట్స్లో ఉపయోగిస్తారు.


4) ఎర్రమట్టి దిబ్బలు
వీటిని విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం వద్ద చూడగలము. ఇవి కోనికల్‍ దిబ్బలుగా ఒక డైసెక్‍టెడ్‍ బ్యాడ్‍లాండ్‍ టోఫోగ్రఫీగా చూడగలము. ఈ బ్యాడ్‍ లాండ్‍ గల్లీ స్టీమ్స్ ద్వారా ఏర్పడినది. ఈ దిబ్బలు ఏర్పడడానికి కారణం. ఈ ప్రాంతం నియో టెక్టానిక్‍ ఎక్టివిటికి గురి కావడం ఈ దిబ్బలు ఫెర్రుజినస్‍ సాండ్‍తో కూడి యున్నది. వీటి వయస్సును TL మరియు OSL మెథడ్స్ ద్వారా 49000-54000 సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగినది. అనగా ప్లీస్టోసీన్‍ ఏజ్‍కు చెందినది.


5) బొర్రాకేవ్స్
ఈ బొర్రాకేవ్స్ విశాఖపట్నంకు 90 కి.మీ. దూరంలో ఈస్టర్న్ ఘాట్స్కు చెందిన అనంతగిరి హిల్స్లో 800 నుండి 1300 మీ ఎత్తు ఎం.ఎస్‍. ఎల్‍. పైన గలదు. వీటిని 1807లో మొట్ట మొదట విలియమ్‍. కింగ్‍ అనే ఒక బ్రిటీష్‍ జియాలజిస్ట్ రిపోర్ట్ చేశాడు. గోస్తని నది యొక్క ఉపనది నీళ్లలోని హుమిక్‍ ఎసిడ్‍ క్రిస్టలైన్‍ లైమ్‍ స్టోన్‍ లోని కాల్‍ శియం కార్బొనేట్‍తో రియాక్ట్ కావడం వల్ల కెమికల్‍ సెక్రీశన్‍ ద్వారా స్టాలక్‍ టైట్స్ మరియు స్టాలగ్‍మైట్స్, ఫార్మ్ కావడం జరిగినది. ఈ గుహల యొక్క ద్వారం ఎత్తు 705 మీ. వీ.•.• పైన, లోపల 625 ఎం. ఎస్‍, ఈ కేవ్‍ యొక్క పొడువు 200 ఎం. ఆంధ్రాయూనివర్సిటీ ఆంత్రపాలజిస్ట్లు తొవ్వకాలు జరపగా, మిడిల్‍ పేలియొలితిక్‍ స్టోన్‍ టూల్స్ దొరికినవి, అవి 30,000-50,000 సంవత్సరాలుగా నిర్ధారించారు.
(వచ్చే సంచికలో కర్ణాటక గురించి తెలుసుకుందాం.)

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ : ం91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *