పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్ మణికొండ
రామాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊరికి సెల్‍ఫోన్ సిగ్నల్ సరిగ్గా వచ్చేది కాదు. ఏదైనా ఫోన్ మాట్లాడాలి అంటే ఊరి చివరకు వెళ్లి మాట్లాడాలి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు బాగా చదువుకున్న రాజు రామాపురానికి వచ్చాడు. అతను సెల్‍టవర్ స్థాపించే వ్యాపారవేత్త. రాజుకు హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. కానీ అక్కడ సిగ్నల్ లేకపోవడంతో అతను వచ్చిన ఫోన్ కాల్ మాట్లాడ లేకపోయాడు. అయితే రాజు గ్రామంలో ఒక వ్యక్తిని ఇలా అడిగాడు.
‘‘ఏమైంది ఈ ఊరిలో ఫోన్ మాట్లాడడానికి సిగ్నల్ ఉండదా’’ అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ‘‘అవును సార్ ఈ ఊరిలో సిగ్నల్ ఉండదు. ఫోన్ మట్లాడాలి అంటే ఊరి చివరకు వెళ్లాలి’’ అని చెప్పాడు.
ఆ మాట వినగానే రాజుకి ఒక దుర్బుద్ధి కలిగింది. నేను ఇక్కడ సెల్ టవర్ స్థాపిస్తే నాకు చాలా ఆదాయం వస్తుంది. నేను ఇక్కడ సెల్ టవర్‍ను స్థాపిస్తాను అని అనుకున్నాడు. అదే విధంగా ఊరివారితో మాట్లాడాడు. రామాపురం ఊరు ప్రజలు ఎక్కువగా చదువుకోకపోవడంతో వారికి టవర్ వేయడం వలన కలిగే నస్టాలు తెలియదు. కానీ చింటూ అనే ఒక చదువుకున్న యువకుడు టవర్ వలన కలిగే నష్టాలు చెప్పాడు. కానీ వారు ఎవరు పట్టించుకోలేదు వారు ఒకటే ఆలోచించారు. సిగ్నల్ వస్తే ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు అని అనుకున్నారు.
అనుకున్న విధంగానే టవర్‍ను స్థాపించారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి మెల్లి మెల్లిగా సమస్యలు మొదలయ్యాయి. చుట్టుపక్కల ఉన్న పక్షులు ఆ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల చనిపోయాయి. అలాగే కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీలలో ఉన్న శిశువుకి ఊపిరి ఆడక పోవడం, పుట్టిన పిల్లలు అవిటిగా పుట్టడం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్యలు గ్రామ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇది అంతా చూసిన తర్వాత ఆ గ్రామ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఎలా అయినా మన ఊరిలో ఈ టవర్‍ని తొలగించాలి అని అనుకున్నారు. అనుకున్న విధంగానే రాజుని పిలిపించి టవర్ తీసివేయమని అన్నారు. రాజు కుదరదు అన్నాడు. గ్రామ ప్రజలు ఇలా అన్నారు. నువ్వు తీసివేయకపోతే నిన్ను పోలీసులకు అప్పగిస్తాము. మాకు దానివల్ల కలిగే లాభం మాత్రమే చెప్పావు. టవర్ వలన కలిగేనష్టాలు చెప్పలేదు. అమాయకులను చేసి ఆడుకున్నావు. అని చెప్పి నీ పైన పోలీసు కంప్లైంట్ చేస్తా అని అన్నారు. అయినా రాజు భయపడక మీకు నచ్చింది చేసుకోమని చెప్పాడు. అందరికీ ఫోన్ సిగ్నల్స్ అవసరం కాని వాటిని అందించే సెల్‍ఫోన్ టవర్లు కూడా కావాలి. అవి ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు, అపాయాలు జరుగకుండా పశుపక్ష్యాదుల ఉనికి ప్రశ్నార్థకం గాకుండా ఉండాలి అని విన్నవించగా సరేనన్నారు. సెల్‍ఫోన్ కంపెనీ వారు రాజు ప్రయత్నం ఫలించినందుకు అభినందించారు.
- కె. రేవతి, ఫోన్ : 944176210