జల్లేపల్లి పాఠశాల గ్రంథాలయం

పాఠశాల స్థాపన
జల్లేపల్లి పాఠశాల 1964లో స్థాపించబడింది. ఎందరో విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు ముందుగా ఈ పాఠశాల యుపిఎస్‍గా ఉండేది. ఆ తర్వాత ఉన్నత పాఠశాలగా 1984లో అప్‍ గ్రేడేషన్‍ అయింది. మా పాఠశాల స్థాపించినప్పటి నుంచి గ్రంథాలయం విద్యార్థులకు చదువుకోటానికి అందుబాటులో ఉండేది. మా పాఠశాల గ్రంథాలయంలో పుస్తకాలను చదివి ఎందరో విద్యార్థులు విజ్ఞానాన్ని మరియు మంచి పాఠకులుగా వ•ద్ధి చెందారు.
గ్రంథాలయ ప్రాముఖ్యత
ముందుగా 500 పుస్తకాలతో స్థాపించిన గ్రంథాలయం ఆ తర్వాత దినదినాభివ•ద్ధి చెందుతూ, ఇప్పుడు పాఠశాలలో సుమారు 3000 పుస్తకాల వరకు ఉన్నాయి. కరోనా సమయంలో మా పాఠశాలకు ఆ ఊరి విద్యార్ధులు మరియు గ్రామస్తులు చదువును మరచిపోకుండా గ్రంథాలయమును వినియోగించుకున్నారు. మా పాఠశాలలో విద్యార్థులు కొంతమంది శ్రీలేఖ, శివాని, ప్రణీత, ప్రేమ్‍ కుమార్‍, సంతోష్‍, గణేష్‍ వీరంతా బాలచెలిమి పుస్తకాలను చదివి కథలను రాసి, జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు.
గ్రంథాలయ వారోత్సవాలు
అంతేకాకుండా మేము ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతున్నాం. నేను ఏ. ఝాన్సీ లక్ష్మి 2018 నుంచి ఈ పాఠశాలలో పని చేస్తున్నాను. 2018 నుంచి మొన్నటి సెప్టెంబర్‍ 10-07-2023 నుంచి 15-07-2023 వరకు ఇలానే ఆరు సంవత్సరాల నుంచి కరోనా సమయంలో మినహా ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు జరుపుతున్నాం. పుస్తకాలు, కథలు చదవడం కాకుండా కొత్త విషయాలను తెలుసుకుంటూ, రచన శైలిని గమనిస్తూ, విద్యార్థులు కూడా బాలకవులుగా, రచయితలుగా ఎదుగుతున్నారు. దీనికి బాలచెలిమి పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నవి అనడంలో ఎటువంటి సందేహం లేదు.


బాల చెలిమి సహకారం
మా గ్రంథాలయానికి సుమారు వెయ్యి బాలచెలిమి పుస్తకాలను వేదకుమార్‍ సార్‍ మా గ్రంథాలయానికి ఇచ్చి వారి గొప్ప మనసును చాటుకున్నారు. గరిపల్లి అశోక్‍ సారు సమన్వయం మరిచిపోలేనిది. ఆ పుస్తకాలను చదవడం వలన ప్రేరణ పొంది మా విద్యార్థులతో క•ష్ణయ్య సార్‍ మేము కలిసి పుస్తకాలను విద్యార్థుల చేత కథలు, కవితలను రచింపచేసాము.
విద్యార్థుల రచనలు
కడివేడు పూలు, జల్లేపల్లి బాలల కలాలు, కథల తోట, జల్లేపల్లి పిల్లల కథలు పుస్తకావిష్కరణ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి డి.ఇ.ఓ గారు సోమశేఖర్‍ శర్మ గారు రావడం జరిగింది. ప్రముఖ రచయిత్రి సునంద మేడం వారు రచించిన పుస్తకాలలో మా విద్యార్థులు కథలను కూడా చేర్చడం జరిగింది. ఇది మా విద్యార్థుల మరియు బాలచెలిమి పుస్తకాల క•షి అని చెప్పవచ్చు. మేము ప్రతిరోజు లైబ్రరీ పీరియడ్‍ విద్యార్థుల చేత చదివించడం జరుగుతుంది. అలాగే వారిలో పఠనా శక్తిని పెంపొందించడం, బాలచెలిమి పుస్తకాల వలనే జరిగింది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతేకాకుండా మా విద్యార్థుల చేత పుస్తక సమీక్షలు గ్రంథాలయ పుస్తకంలో రాయించడం జరిగింది.
ముగింపు
మా పాఠశాలకు ఇంకా ఎన్నో పుస్తకాలను బాల చెలిమి నుండి వేదకుమార్‍ సార్‍, అశోక్‍ సార్‍ మాకు ఎన్నో పుస్తకాలను ఇచ్చి మా గ్రంథాలయ అభివ•ద్ధికి తోడ్పడతారని, వారి గొప్ప మనసును చాటుకుంటారని తెలియజేస్తూ, వారికి ఇవే మా పాఠశాల తరపున, నా తరపున వేల వేల క•తజ్ఞతాభివందనాలు.

  • ఏ ఝాన్సీ లక్ష్మి,
    L.P.T జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల,
    జల్లేపల్లి, తిరుమలపాలెం మండలం,
    ఖమ్మం జిల్లా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *