ముత్తాతల కాలం నాటి జీవామృతాలు తృణ ధాన్యాలు

తృణధాన్యాలు పదివేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగం. అయితే ఆధునిక ఆహారం మనజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టాం. అయితే మనం తీసుకుంటున్న పాలియో డైట్‍ వంటి అనేక ఆధునిక ఆహారం ఆరోగ్యానికి హానికరమని.. పోషకాహార నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. శుద్ధి చేసిన ధాన్యాలు అధికంగా తీసుకోవడంవలన ఊబకాయం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే తృణ ధాన్యాలు మంచి ఆరోగ్యకరమైన శరీరానికి హాని కలిగించని ఫుడ్‍. తృణధాన్యాలు తినడం మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటుతో అనేక వ్యాధులను నివారిస్తుంది. తృణ ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.


భారతదేశములో అధికంగా వినియోగించే తృణ ధాన్యాలు వరి, గోధుమ. అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు.. వీటినే తృణ ధాన్యాలు అంటారు. వీటిలోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70-80 శాతం ఇస్తాయి. అంతేకాదు ఇతర పోషకపదార్ధాలైన మాంస కృత్తులు, కాల్షియం, ఐరన్‍, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, బికాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయి. ఇవి మనిషికి వచ్చే రకరకాల వ్యాధులను దరిచేరనివ్వవు.


తృణధాన్యాలు తీసుకోవాల్సిన విధానం:
  • తృణధాన్యాలను కాయధాన్యాలతో కలిపి తీసుకుంటే బియ్యం పప్పు లాగా మాంసక•త్తులను అధిక మొత్తంలో శరీరానికి అందిస్తాయి.
  • ఉప్పుడు బియ్యం: ధాన్యాన్ని నీటిలో నానబెట్టి, ఆవిరిపట్టే ఉప్పుడు బియ్యం వస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వలన శరీరానికి మంచి పోషకాలు విటమిన్లు అందుతాయి.
  • రాగులు, జొన్నలు, సజ్జల్లో ఖనిజాలను, పీచును బాగా కలిగి ఉంటాయి. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే బియ్యంలో కాల్షియం, ఐరన్‍ తక్కువగా ఉంటాయి. ఆహారంగా తీసుకుంటే శరీరానికి ఫైబర్‍ అంది.. తిన్న ఆహారాం త్వరగా జీర్ణమవుతుంది.
  • తృణధాన్యాలు 6-12శాతం మాంసక•త్తులను కలిగి ఉంటాయి. అంతేకాదు వీటిల్లో అమినో ఆసిడ్‍ లైసిన్‍ను తక్కువగా ఉంటాయి. శరీరానికి నిత్యం అవసరమయ్యే మాంసక•త్తుల్లో 50శాతం అవసరాన్ని తీరుస్తాయి.
  • తృణ ధాన్యాలు బి-విటమిన్లకు మంచివనరులు.
  • మనం ఎలా, ఎంతమేరకు బియ్యాన్ని శుభ్రం చేస్తున్నామో, పాలిష్‍ పట్టిస్తున్నామో దానిమీద ఆధారపడి బియ్యములోని బి-విటమిన్‍ కోల్పోతు న్నామో తెలుస్తుంది. ఎదుకంటే బియ్యపు గింజ యొక్క వెలుపలి భాగములోనే అధికశాతం విటమిన్లు ఉంటాయి. ఎక్కువ పాలిష్‍ పట్టించిన బియ్యంలో అతితక్కువ బి కాంప్లెక్స్ విటమిన్‍ ఉంటుంది.
  • తృణ ధాన్యాలలో ఉండే క్రొవ్వుశాతం ప్రతి వందగ్రాములకు 2-5 గ్రాములుగా ఉంటుంది. తృణ ధాన్యాలు మనకు కావాల్సిన ఫాటీ ఆసిడ్‍ అవసరాల్లో 50శాతానికి పైగా తీరుస్తాయి. ఇది మనం ఎంతమేరకు ఎంత పరిమాణమములో తృణ ధాన్యాలను తీసుకుంటున్నామన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇక డాక్టర్లు కూడా ఆరోగ్యంగా పది కాలాల పాటు బతకాలంటే చిరు ధాన్యాలు లేదా తృణ ధాన్యాలను తినాలంటూ సూచిస్తున్నారు.


కొన్ని జాగ్రత్తలు

చిరుధాన్యాల అన్నం, సంగటి కాస్త బరకగా ఉంటాయి. త్వరగా ముద్ద దిగదు. కాబట్టి వేపుళ్లు కాకుండా కాస్త జారుగా ఉండే కూరలతో తినాలి.
చిరుధాన్యాలతో ఏది తయారుచేసినా ఏదో ఒక పప్పు (ప్రొటీన్‍) తోడుగా ఉండేలా చూసుకోవాలి. దీంతో పోషక స్థాయి పెరుగుతుంది. అన్నం వండుకున్నట్టయితే ఆకుకూర, కూరగాయల పప్పుతో కలిపి తినాలి. లేదా గుడ్డు, మాంసం కూరతోనైనా తినొచ్చు. పాలు, పెరుగు కూడా తీసుకోవచ్చు. బియ్యం, గోధుమల మాదిరిగానే చిరుధాన్యాల్లోనూ లైసిన్‍ అనే అమైనో ఆమ్లం తక్కువగా ఉంటుంది. దీన్ని భర్తీ చేయటానికి పప్పు తోడ్పడుతుంది. దీంతో అమైనో ఆమ్లం పూర్తిగా తయారై శరీర ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

ఆరోగ్య సారథులు
చిరుధాన్యాల్లో పోషకాలు పెద్దమొత్తంలో ఉండటమే కాదు. వీటిల్లోని కొన్ని సంయోజ పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి వరి, గోధుమ వంటి పెద్ద ధాన్యాలు.. రాగులు, కొర్రలు, సామల వంటి చిన్న ధాన్యాలు రెండింటిలోనూ పిండి పదార్థాలు, మాంస క•త్తులు, కొవ్వు, కేలరీలన్నీ కొద్ది గొప్ప తేడాలతో దాదాపు సమానంగానే ఉంటాయి. అయితే ఇవి మెరుగైనవి కావటమే విశేషం. వరి, రాగులు, సామల్లో 7% మాంసక•త్తులుంటే.. గోధుమ, జొన్న, సజ్జలు, కొర్రలు, వరిగెలు, అరికెల్లో 10-12% వరకు ఉంటాయి. పిండి పదార్థమైతే- వరిలో 77%, గోధుమల్లో 64% వరకు.. చిరు ధాన్యాల్లో 60-70% వరకు ఉంటుంది. కొన్ని చిరుధాన్యాల్లో 50-55 శాతమే ఉంటుంది. వీటి నుంచి 330-345 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. బియ్యం, గోధుమల్లో 2% కొవ్వు ఉంటుంది. చిరుధాన్యాల్లో ఇది ఎక్కువ. అత్యధికంగా సజ్జలతో 5% వరకు కొవ్వు లభిస్తుంది. జొన్న, కొర్రలు, వరిగెల్లో 3 నుంచి 3.5% ఉంటుంది. ఈ కొవ్వు హాని చేసేది కాదు. మంచి శక్తిని ప్రసాదిస్తుంది. వీటిల్లో విటమిన్‍ ఇ కూడా ఎక్కువే. ఖనిజ లవణాల విషయంలో చిరుధాన్యాలదే పైచేయి. రాగుల్లో పాలతో సమానంగా 344 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు, వ•ద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి ఇదెంతో మేలు చేస్తుంది. బియ్యం, గోధుమల్లో ఐరన్‍ అంతగా ఉండదు. చిరుధాన్యాల్లో ఇది మంచి పాళ్లలో లభిస్తుంది. ముఖ్యంగా సజ్జల్లో 8 మి.గ్రా., సామల్లో 9.3 మి.గ్రా ఐరన్‍ ఉంటుంది. రాగులు, జొన్నల్లో సుమారు 4 మి.గ్రా. ఉంటుంది. రక్తహీనత తగ్గటానికిది ఎంతో అవసరం. జీవక్రియల్లో పాలు పంచుకునే మెగ్నీషియం, మాంగనీస్‍, ఫాస్ఫరస్‍, జింక్‍ వంటివీ వీటిల్లో ఎక్కువే. ఇన్సులిన్‍ సరిగా ఉత్పత్తి కావటానికి మెగ్నీషియం.. ఎదుగుదలకు జింక్‍ తోడ్పడుతుంది. అయితే బియ్యం, గోధుమల్లో కన్నా చిరుధాన్యాల్లో థయమిన్‍ తక్కువగా ఉంటుంది. నైసిస్‍, పెరిడాక్సిన్‍, ఫోలిక్‍ యాసిడ్‍ వంటివి మాత్రం బాగానే ఉంటాయి. కొన్నింటిలో విటమిన్‍ ఎ, బీటా కెరటిన్లు కూడా ఉంటాయి.

  • సముద్రాల ధనుంజయ
    (దేవర కొండ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *