అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం (IMD) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్క•తిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్క•తిక మార్పిడి, సంస్క•తుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం మరియు శాంతి అభివ•ద్ధికి ముఖ్యమైన సాధనాలు.
మ్యూజియంలు, వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ICOM ఒక నిర్దిష్ట నేపథ్యంతో వస్తుంది. అన్ని కార్యకలాపాలు ఈ నిర్దిష్ట అంశం చుట్టూ తిరుగుతాయి. మ్యూజియం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్క•తులు, సమాజాలు, ప్రక•తికి సంబంధించిన అన్ని రకాల పత్రాలు, చారిత్రక కళాఖండాల సేకరణలను ప్రదర్శించే ప్రదేశం.
ఈ సంవత్సరం థీమ్, ‘‘మ్యూజియంలు, విద్య మరియు పరిశోధన,’’ సంపూర్ణ విద్యా అనుభవాన్ని అందించడంలో సాంస్క•తిక సంస్థల యొక్క కీలక పాత్రను ప్రత్యేకంగా చెబుతుంది. ఈ రోజు మరింత స్ప•హతో కూడిన, స్థిరమైన మరియు సమ్మిళిత ప్రపంచం కోసం ముందుకు వస్తుంది.
మానవ సంస్క•తి, చరిత్రలను పరిరక్షించే జ్ఞానభాండాగారం మ్యూజియం. ఇలాంటి ప్రదర్శనశాలల్లో భద్రపరిచే పురాతన వస్తువులు, కళాఖండాలు పరిశోధనలకు ఎంతో ఉపయుక్తంగా ఉండటమే కాకుండా, భావితరాలకు విలువైన పాఠాలు బోధిస్తాయి. వీటి సందర్శనతో విద్యార్థుల విషయ పరిజ్ఞానం- పాఠ్యాంశాల పరిధిని దాటి విస్తరిస్తుంది. ఒక్క అమెరికాలోనే ఏటా 85 కోట్ల మంది పురావస్తు ప్రదర్శనశాలలను సందర్శిస్తారు. ఇది పశ్చిమ దేశాల్లో వీటికున్న ఆదరణకు నిదర్శనం. 1784లో కలకత్తాలో రాయల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపించినప్పటి నుంచి పరిశోధనలో భాగంగా బ్రిటిష్ అధికారులు, శాస్త్రవేత్తలు ఎంతో విలువైన సాంస్క•తిక సంపదను సేకరించి భద్రపరచడం ద్వారా మన దేశంలో వస్తు ప్రదర్శనశాలల శకం మొదలైంది. 1814లో ఈ సొసైటీ ఆవరణలోనే మొట్టమొదటి ప్రదర్శనశాలను ప్రారంభించారు. తదనంతర కాలంలో దేశవ్యాప్తంగా వీటి విస్తరణ కొనసాగింది.
మారిన అభిరుచులు
స్వాతంత్య్రం వచ్చిన తరవాత భారతీయ అస్తిత్వం ప్రతిబింబించేలా 1949లో దిల్లీలో జాతీయ సంగ్రహాలయం ఏర్పాటుతో మరింత ముందడుగు పడింది. 1956లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖలో ఏర్పాటు చేసిన కేంద్ర సలహా బోర్డు సహకారంతో దేశంలోని పురావస్తు ప్రదర్శనశాలలను సర్వే చేయడంతోపాటు- కొత్త వాటిని నెలకొల్పేందుకు కావాల్సిన ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తున్నారు. దాంతో వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలతో పాటు ఆర్ట్ గ్యాలరీలు, విజ్ఞాన, సాంకేతిక, పారిశ్రామిక, హస్తకళ, విద్య, ఆరోగ్య, తపాలా, అటవీ తదితర ప్రదర్శనశాలలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మనదేశంలో వివిధ ఇతివ•త్తాలతో జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యం కలిగిన 1,500 ప్రదర్శనశాలలు ఉన్నట్లు అంచనా. 1984లో మన దేశంలో స్థాపించిన భారత జాతీయ సాంస్క•తిక వారసత్వ ట్రస్టు (ఇంటాక్) ప్రపంచంలోని అతిపెద్ద వారసత్వ కట్టడాల పరిరక్షణ సంస్థల్లో ఒకటి. ప్రజల మధ్య సాంస్క•తిక మార్పిడి, పరస్పర సహకారం, శాంతి పట్ల అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సంగ్రహాలయాల మండలి (ఐకామ్) సర్వప్రతినిధి సభ తీర్మానం ప్రకారం ఏటా మే నెల 18వ తేదీని అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకోవాలని 1977లో నిర్ణయించారు. సామాజికాభివ•ద్ధిలో ప్రదర్శనశాలల ప్రాధాన్యాన్ని చాటిచెప్పడంతోపాటు, భావి తరాలకు సాంస్క•తిక వారసత్వ సంపదను అందించాలన్నదే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
ప్రపంచీకరణతో చోటుచేసుకున్న మార్పులతో ప్రజల అభిరుచులు మారిపోవడం, టీవీలు కంప్యూటర్లు స్మార్ట్ఫోన్ల ప్రభావం పెరగడంతో విజ్ఞాన ఆధారిత ప్రదర్శనశాలలపై ఆసక్తి తగ్గింది. దీనికితోడు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహాయం తగ్గడంతో వాటి విస్తరణ, నూతన ఆవిష్కరణలు, సదుపాయాలు ••రువై ఎక్కువమంది సందర్శకులను ఆకర్షించలేక పోతున్నాయి. మరోవైపు, బహిరంగ ప్రదర్శనశాలలకు సంబంధించిన ఎన్నో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. కొన్ని ప్రభుత్వ అవసరాల పేరిట అన్యాక్రాంతమవుతున్నాయి. కేంద్ర సాంస్క•తిక శాఖ సర్వే ప్రకారం- 321 బహిరంగ వారసత్వ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు ఆక్రమణలకు గురయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి- ఇటీవల విశాఖపట్నం సమీపంలోని తొట్లకొండ వద్ద ప్రభుత్వ అతిథి గ•హం నిర్మాణానికి భూమి కేటాయింపులు, హైదరాబాద్‍లోని గోల్కొండ కోటలో ఆక్రమణలు వివాదాస్పద మయ్యాయి. ప్రదర్శనశాలల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంబిస్తూ, సరైన వసతులు కల్పించకపోవడంతో విద్యావేత్తలు, పరిశోధకులు నిరాశ నిస్ప•హలకు గురవుతున్నారు.
వర్చువల్ పద్ధతిలో…
ప్రపంచంలోనే మొదటిసారిగా కేంద్ర సాంస్క•తిక మంత్రిత్వశాఖ – ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్‍తో ప్రస్తుతం మన దేశంలో పది జాతీయ సంగ్రహాలయాలను ఆన్‍లైన్ పద్ధతిలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా, సంగ్రహాలయాల అభివ•ద్ధి కోసం డిజిటలీకరణపై అధికంగా ద•ష్టి సారిస్తూ, వర్చువల్ విధానంలో సందర్శనకు అవకాశాలు కలిగించడం తదితర నూతన ఆవిష్కరణలకూ అవకాశం కల్పించారు. జాతీయ డిజిటల్ రిపోజిటరీ ద్వారా అనేక ఇతివ•త్తాలతో కూడిన కళాఖండాలను డిజిటల్ మాధ్యమంలోకి మార్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, పర్యాటకులకు జాతీయ పోర్టల్ ద్వారా అందిస్తున్నారు. ఇదే క్రమంలో వీలైనన్ని సంగ్రహాలయాలను డిజిటలీకరించి విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా తీర్చిదిద్ది, పలురకాల అభ్యసన వనరులుగా పాఠశాల విద్యతో అనుసంధానించాలి. దీనివల్ల ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయంలో విద్యార్థులకు విజ్ఞాన ఆధారిత వినోదాన్ని అందించడంతో పాటు మనోవికాసానికీ తోడ్పడినట్లవుతుంది. ఇలాంటి పద్ధతుల ద్వారా సంక్షోభంలో కూరుకుపోతున్న సంగ్రహాలయాలను సామాజిక మాధ్యమాల ద్వారా వర్చువల్ విధానంలో ప్రజల చెంతకు చేరవేసే క•షి ప్రస్తుతావసరం. అంతేకాదు, పశ్చిమ దేశాల తరహాలో ఇంటరాక్టివ్, మల్టీమీడియా పద్ధతులతో ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా సంగ్రహాలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
-సువేగా, ఎ : 9030 6262 88