జీవవైవిధ్యంతో పశ్చిమ కనుమలు


ఉనికి: మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, కేరళలో 39 సీరియల్‍ సైట్స్
గుర్తింపు : 2012

విభాగం : నేచురల్‍
సార్వత్రిక విలువ:

భారతదేశ పశ్చిమ తీరం పొడుగునా కొండల గొలుసుగా ఉండే పశ్చిమ కనుమలు హిమాలయ పర్వతాల గొలుసు కంటే ప్రాచీనమైనవి. ఇవి ఈ ప్రాంతపు ఉష్ణ వాతావరణాన్ని చల్లబరిచేలా భారతీయ రుతుపవనాల తీరుతెన్నులను మారుస్తాయి. వీటికి ఉన్న మరో విశిష్టత జీవపరమైన వైవిధ్యత, స్థానికంగానే కనిపించే కొన్ని జీవజాతులు. ఇవే వీటికి ప్రక•తి పరిరక్షణపరంగా అపరిమిత ప్రాధాన్యాన్ని కూడా అందించాయి.


ప్రాథమ్యాలు: (X) (X)
(ఱఞ): మొదటగా, జురాసిక్‍ కాలం తొలినాళ్లలోని గోండ్వానా ల్యాండ్‍ ప్రాచీన భూభాగం ముక్కలు కావడానికి సంబంధించిన విశేషాన్ని, రెండవదిగా, భారతదేశం ఒక ఒంటరి భూభాగంగా ఏర్పడడాన్ని ఇక మూడోదిగా భారత భూభాగం యురేషియా వైపు వెళ్లడాన్ని ఈ పశ్చిమ కనుమలు చాటిచెబుతాయి. ఈ పశ్చిమ కనుమలు జీవుల చెల్లాచెదురు, రకాలకు సంబంధించిన అవుట్‍ ఆఫ్‍ ఆఫ్రికా, అవుట్‍ ఆఫ్‍ ఆసియా సిద్ధాంతాల విప్లవాత్మక ఎకోటోన్‍ లను ప్రదర్శిస్తాయి.


(X) పశ్చిమ కనుమలు ఉత్క•ష్ట స్థాయి జీవవైవిధ్యాన్ని, అక్కడికి పరిమితమైన జీవజాలాన్ని కలిగిఉన్నాయి.
2012లో భారతదేశం చరితాత్మక పరిరక్షణ మైలురాయిని అధిగమించి నట్లయింది. నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లోని 39 రక్షిత ప్రాంతాల క్లస్టర్‍ అంతా కలిపి ఒక్కటిగా గుర్తింపును పొందింది. అదేమీ అంత సులభంగా రాలేదు. ఈ విజయం ఎంతో సంక్లిష్టతతో, క్షేత్రస్థాయిలో గొప్పగా పని చేయడం ద్వారా సాధ్యపడింది. అందుకు గాను ఎన్నో ఏళ్ల పాటు రాజకీయ నాయకులు, సామాజిక శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు అంతా కలసి చర్చలు జరపాల్సి వచ్చింది. వారందరి ఆశయం ఒక్కటే… వరల్డ్ హెరిటేజ్‍ కన్వెన్షన్‍ గొడుగు కిందికి ఈ ప్రక•తి పరిరక్షణను తీసుకురావడం.


ఆ ఏడాది రష్యాలోని సెయింట్‍ పీటర్స్ బర్గ్ లో జరిగిన వరల్డ్ హెరిటేజ్‍ కమిటీ ఇలా పేర్కొంది. ‘‘మరెక్కడా లేనివిధంగా భూమధ్యరేఖా ప్రాంతానికి చెందని ఉష్ణ సతతహరితారణ్య అడవులకు ఇది చక్కటి ప్రాతినిథ్యం వహిస్తోంది. అంతర్జాతీయంగా అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న కనీసం 325 రకాల జంతువులు, మొక్కలు, పక్షులు, చేపలు, ఇతర జీవులకు ఇది ఆవాసంగా ఉంది. దీని జీవావరణ వ్యవస్థలు భారతీయ రుతుపవన వాతావరణ ధోరణులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ ప్రాంతపు ఉష్ణవాతావరణాన్ని తగిన విధంగా ఉంచుతున్నాయి. ఇది భూగ్రహంపై రుతుపవన వ్యవస్థలకు చక్కటి ఉదాహరణల్లో ఒకటిగా ఉంటోంది’’.


హిమాలయాల కంటే ప్రాచీనమైన ఈ ఘాట్స్ (ఈ పేరు బహుశా మరాఠీ పదం ఘాట్‍ నుండి వచ్చింది, దీని అర్థం ‘‘మార్గం’’) భారతదేశ పశ్చిమ తీరానికి సమాంతరంగా ఉన్న పర్వతాల పొడవైన గొలుసు. మహారాష్ట్ర-గుజరాత్‍ సరిహద్దులోని డాంగ్స్ (వెదురు అడవులు) నుండి 1,600 కిలోమీటర్ల పొడుగునా సుమారు 1,40,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నాయి. తమిళనాడు – కేరళ సరిహద్దు వెంబడి 30 కిలోమీటర్ల పాల్‍ఘాట్‍ గ్యాప్‍ ద్వారా మాత్రమే అంతరాయం కలిగింది.


ఈ విధమైన హోదా పొందిన ఘాట్స్లో అనేక రక్షిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి మహారాష్ట్రలోని సహ్యాద్రి క్లస్టర్‍, కర్ణాటకలోని కుద్రేముఖ్‍ క్లస్టర్‍, తమిళనాడులోని ముకుర్తి-కలకడ్‍-ముందంతురై క్లస్టర్‍, కేరళలోని సైలెంట్‍ వ్యాలీ-పెరియార్‍ క్లస్టర్‍. అంతరించిపోతున్న నిర్దిష్ట జాతులను, ప్రపంచంలో మరెక్కడా లేని ఐకానిక్‍ జాతులను ఈ రక్షిత రక్షించడానికి నాలుగు రాష్ట్రాల్లోని అటవీ శాఖలచే తీవ్రంగా క•ష్టి చేస్తున్నాయి.


ఈ ప్రపంచంలో అధిక స్థాయి జీవ వైవిధ్యం మరియు స్థానికతను ప్రదర్శించడంతో ఈ సైట్‍ను గ్లోబల్‍ బయోడైవర్సిటీ హాట్‍స్పాట్‍గా కూడా పిలుస్తారు. ఇక్కడ అనేక వన్యమ•గాలు, మచ్చిక చేసిన జీవుల జాతులు ఉద్భవించాయి. ప్రస్తుతం ఇవి మానవ-ప్రేరిత అభివ•ద్ధి ముప్పు, స్థానిక విలుప్తానికి గురవుతున్నాయి.


పశ్చిమ కనుమలు వేసవి చివరలో నైరుతి నుండి వచ్చే వర్షాలతో కూడిన రుతుపవనాల గాలులను అడ్డగిస్తాయి. ఇక్కడి అడవులు స్థిరీకరణ ఏజెంట్‍గా పనిచేసి భారీ వర్షాలను ప్రేరేపిస్తాయి. ఈ అడవులు గోదావరి, కావేరి, క•ష్ణ, తుంగభద్ర, కబిని, పెరియార్‍, భరతపూజ, పంబా, నేత్రావతి, శరావతి, మండోవి, జువారీ వంటి అనేక శాశ్వత నదులు, వాటి ఉపనదులకు అత్యంత ముఖ్యమైన పరీవాహక ప్రాంతాలలో ఒకటిగా ఉన్నాయి. 200 మిలియన్లకు పైగా ప్రజలు తమ మనుగడ కోసం ఈ సహజ వనరులపై ఆధారపడి ఉన్నారు.


నీల కురుంజి (స్ట్రోబిలాంథెస్‍ కుంతియానా) పూల విస్టాలను చూసేందుకు ప్రజలు తరలి రావడంతో స్థానిక సమూహాలు ‘‘ప్రపంచ వారసత్వం’’ ట్యాగ్‍ నుండి ప్రయోజనం పొందాయి. ఇది కేరళలోని మున్నార్‍ లేదా గ్రాస్‍ హిల్స్ నేషనల్‍ పార్క్ లో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుందిబీ మహారాష్ట్రలోని కాస్‍ పీఠభూమిలో ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి పూసే కాలానుగుణ కార్వి (స్ట్రోబిలాంథెస్‍ కాలోసల్‍) ఉన్నాయి. అనేక ఇతర పుష్పించే మూలికలు, పొద జాతులతో పాటు అవి ఆకుపచ్చని నేపథ్యంలో ప్రక•తి రంగుల కార్పెట్‍ లాంటి విస్టాను ఏర్పరుస్తాయి.


కమ్యూనిటీ-ఆధారిత పర్యాటకం ప్రధానంగా వ్యవసాయ దారులైన ఈ స్థానిక సమూహాలకు ప్రత్యామ్నాయ ఆదాయాన్ని అందించింది. ప్రాంతీయ, జాతీయ స్థాయిలో, ప్రపంచ వారసత్వ గుర్తింపు అంటే అభివ•ద్ధి ప్రాజెక్టులు (రోడ్లు, రైల్వేలు, విద్యుత్‍ లైన్లు వంటివి) రూపకల్పన, ప్రణాళిక, అమలు దశలో సహజ పర్యావరణ వ్యవస్థల పర్యావరణ సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో, అంతర్జాతీయంగా భూతాపాన్ని తగ్గించడంలో పశ్చిమ కనుమలు, తీరప్రాంత మడ అడవుల పాత్ర గుర్తింపులు, శాస్త్రీయ ఆధారాలు పెరుగుతున్నాయి.

  • సోనాలి ఘోశ్‍
    అనువాదం : ఎన్‍. వంశీ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *