అండు కొర్రలను ఇంగ్లీష్‍లో brown top millets అని అంటారు. ఇవి సంప్రదాయ వంటలో ఒకటి. చిరుధాన్యాలు ఏవైనా కానీ కనీసం 5 నుండి 6 గంటల వరుకు నానబెట్టిన తరువాతనే వాడుకోవడం మంచిది.
అండు కొర్రలు మన ఆహారంలో చేరే ఒక విలువైన ధాన్యం. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు పర్యావరణానికి కూడా అనుకూలం. వంటకాల్లో దీన్ని ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, ఇది గ్లూటెన్-ఫ్రీగా ఉండటం వల్ల డయాబెటిక్ వున్నవారు కూడా సౌకర్యంగా తినవచ్చు. అద్భుతమైన రుచి, పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలతో, మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
అండు కొర్రలు అనేవి చిరుధాన్యాలలో ఒకటి. చిరుధాన్యాలు రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి.
మిగతా చిరుధాన్యాలతో పోలిస్తే ఈ తృణధాన్యాలలోనే ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఈ చిరుధాన్యాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
100 గ్రాముల అండు కొర్రల చిరు ధాన్యాలలో పోషక విలువలు ఈకింది విధంగా ఉంటాయి.

Niacin (mg) (B3) 18.5
Rivoflavin (mg) (B2) 0.027
Thiamine (mg) (B1) 3.2
Carotene (ug) 0
Iron(mg) 0.65
Calcium(g) 0.01
Phosphorous (g) 0.47
Protein(g) 11.5
Minerals(g) 4.21
CarboHydrate(g) 69.37
Fiber(g) 12.5
CarboHydrate/Fiber Ratio 5.54
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ చిరుధాన్యాలు ముఖ్యంగా థైరాయిడ్ (thyroid), క్యాన్సర్ (cancer), ఊబకాయం (obesity), కీళ్లనొప్పులు (arthritis), రక్తపోటు (hyper tension), జీర్ణ వ్యవస్థ (digestive system), మలబద్ధకం (constipation), నాడీ వ్యవస్థ (nerve), కళ్ళు (eyes) నాడీ సమస్యలను మెరుగుపరిచేందుకు ఉపయోగ పడుతుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఊబకాయ సమస్య పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకీ బరువు పెరిగే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే, ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలని చాలామంది డైటీషియన్లు సూచిస్తున్నారు. చిరుధాన్యాలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అలాగే రోగాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల, ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు.
- దక్కన్‍న్యూస్
ఎ : 9030 6262 88