ఉమ్మడి కడప జిల్లా శిలా మరియు ఖనిజసంపద

ఉమ్మడి కడపజిల్లా ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యమైన భాగం. ఈ జిల్లా 15380 చదరపు కిలోమీటర్లలో విస్తరించియున్నది. ఈ జిల్లాకి దక్షిణంలో చిత్తూరు జిల్లా, తూర్పులో నెల్లూరు జిల్లా, ఉత్తరంలో కర్నూలు, ప్రకాశం జిల్లాలు మరియు పశ్చిమంలో అనంతపురం జిల్లా కలదు. ఈ జిల్లా ఖనిజసంపదకు ప్రసిద్ధి చెందినది. ఎందుకంటే ఈ జిల్లాలో ఆస్‍బెస్టోస్‍, బెరైటీస్‍, యురేనియం, లైమస్టోన్‍, లెడ్‍, జింక్‍, టాల్క్, స్టియటైట్‍, డైమండ్‍, ఓకర్‍ మరియు ఐరన్‍ఓర్‍ నిక్షేపాలు పుష్కలంగా ఉండటం వలన.


ఈ జిల్లాలో ఆర్‍క్యన్‍ పీరియడ్‍కు చెందిన గ్రానైట్‍, నైస్‍ల యొక్క రకరకాల వేరియంట్స్, ధార్‍వార్‍ సూపర్‍గ్రూప్‍కు చెందిన వెలిగల్లు శిస్ట్ బెల్టుకు చెందిన శిస్ట్ బి.ఐ.ఎఫ్‍ మరియు మెటావాల్‍ కానిక్స్, మీసో ప్రోటిరో జోయిక్‍ పీరియడ్‍కు చెందిన కడప సూపర్‍గ్రూప్‍ యొక్క సెడిమెంటరీ శిలలు, ఈ శిలలను మూడు గ్రూప్‍లలో జతపరిచారు. అవి పాపాగ్ని, చిత్రావతి, నల్లమలాయ్‍ గ్రూప్‍లు. వీటిలో కంగ్లామరేట్‍, క్వార్ట్జైట్‍, సాండ్‍ స్టోన్‍, చెర్ట్ ఫి లైటు, మడ్‍ స్టోన్‍, డొలమైట్‍ బేసిక్‍ ఫ్లోస్‍ మరియు ఇంట్రూసివ్‍స్‍. నల్లమలై గ్రూప్‍ శిలలు హైలీ ఫొలియేటెడ్‍ సీక్వెన్స్ చూడగలము.
కర్నూలు గ్రూప్‍ శిలలను పశ్చిమ ప్రాంతంలో చూడగలము. వీటిలో బనగానపల్లి కంగ్లామరేట్‍, నగరి క్వార్ట్జైట్‍, ఔక్‍శేల్‍ పాన్యం, క్వార్ట్జైట్‍ కోయిల్‍ కుంట్ల లైమస్టోన్‍ మరియు నంద్యాల శేల్‍. ఈ గ్రూప్‍ శిలలు నియోప్రోటిరోజోయిక్‍ పీరియడ్‍కు చెందినవి.


ఈ జిల్లాలోని ముఖ్య నదులు పెన్నేరు మరియు దీని ఉపనదులు చెయ్యేరు, కుందేరు, సాగిలేరు వాటి డ్రైనేజ్‍ నెట్‍వర్క్. ఈ జిల్లాలోని డ్రైనేజ్‍ ప్యాటర్న్ ప్యారెలెల్‍ నుండి సబ్‍ ప్యారెలెల్‍గా ఉంటుంది. చాలా వరకు స్టక్చ్రల్‍ కంట్రోల్‍లో ఉంటవి. ప్రముఖమైన ల్యాండ్‍ ఫారమ్స్ గండికోట వద్ద లోతైన గార్జ్ మరియు నల్లమలై ప్రాంతంలో హై క్వార్ట్జైట్‍ రిడ్జ్స్‍ మరియు డీప్‍ స్ట్రక్చరల్‍ లోయలు కలవు. సీస్‍ మే టెక్‍టానిక్‍ స్టడీస్‍ ప్రకారం ఈ జిల్లాలోని ప్రాంతంలో రెండు జోన్స్ అనగా జోన్‍-1 మరియు జోన్‍-2గా నిర్థారించారు.


ఖనిజసంపద:
కడప జిల్లాలో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నది. ఈ జిల్లాలో ప్రసిద్ధిచెందిన మంగంపేట బెరైటీస్‍, పులివెందుల ఆస్‍బెస్టాస్‍, బనగానపల్లి డైమండ్‍ బెల్టులతో పాటు గోల్డ్, ఐరన్‍ ఓర్‍, లెడ్‍, జింక్‍, లైమ్‍స్టోన్‍, హైగ్రేడ్‍ ఓకర్‍ యురేనియం, స్టీయటైట్‍, టంగ్‍టన్‍ క్లేస్‍, మాగ్నసైట్‍, బిల్డింగ్‍ స్టోన్స్ యొక్క నిక్షేపాలు కలవు. వీటి గురించి చర్చించుకుందాము.
బెరైటీస్‍:
ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంగంపేట బెరైటీస్‍ డిపాజిట్‍ కడప సూపర్‍ గ్రూప్‍కు చెందిన పుల్లంపేట పార్మేశన్‍లో వున్నది. ఇది నల్లమలై గ్రూప్‍లోని కుంభం ఫార్మేశన్‍తో కొరిలేట్‍ చేయ బడినది. ఈ బెరైట్‍ డిపాజిట్‍ రెండు లెన్సోయి డల్‍ బాడీస్‍ రూపంలో టుఫ్‍ సీక్వెన్స్లో దొరుకుతుంది. మంగంపేట వద్ద ఉన్న బెరైట్‍లెన్స్ను సథరన్‍ లేన్స్ అని అందురు. మరి దీనికి 700 మీ. దక్షిణంలో కొంత చిన్న లెన్స్ కలదు. దీన్ని నార్తర్న్ లెన్స్ అని అందురు.
అసలు ఓర్‍ బెడ్‍ ఎక్కడైతే ఎక్కువ మొత్తం బెరైటీస్‍ ఖనిజం ఉన్నదో అది ఓక ట్రిఫ్‍ ఆకారంలో కలదు. ఇది 1320మీ. నార్త్-సౌత్‍ దిశలో మరియు 920 మీ. ఈస్ట్-వెస్ట్ దిశలో ఉన్నది. ఈ ఖనిజం యొక్క చాలా మొత్తం తిక్‍ టాఫ్‍ ఓవర్‍ బర్డెన్‍ క్రింద ఉన్నది. ఇక్కడ బెరైటీస్‍ పలు రకాలుగా ఉంటుంది.
ఉదాహరణకు 1. బెడ్డెడ్‍ గ్రే గ్రానులర్‍ 2. లా పిల్లి రొసెట్‍టైప్‍ 3. వీన్‍, కాని ఫ్రాక్చర్‍ ఫిల్లింగ్‍ టైప్‍ 4. రిప్లేస్‍మెన్గ్ టైప్‍ గ్రానులర్‍ టైడ్‍ రిజర్వ్స్‍ 45.91 మిలియన్‍ టన్స్, 200 మీ. లోతు వరకు ఇక్కడ Baso4 91.8 శాతం ఉంటుంది. లా పిల్లి రొసెటహొటైప్‍ బెరైటీస్‍ 2057 మిలియన్‍ టన్స్ రిజర్వస్‍ మరియు Baso4 60 నుండి 92 శాతం ఉంటుంది. ఇది కాకుండా చిన్న చిన్న బెరైటీస్‍ నిక్షేపాలు, కమలాపురం, కోడూరు, రాజంపేట, కడప మరియు సిద్దవటం తాలూకాలలో దొరుకుతుంది.
అస్‍బెస్టాస్‍:
ఈ ఖనిజం పులివెందుల మరియు లింగాల మండలాలలో, ఓక్‍ బెల్ట్గా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో డొలమైట్‍ శేల్‍, చెర్ట్తో పాటు బెసాల్ట్ ఫ్లోస్‍/ డొలరైట్‍ సిల్స్ శిలలను చూడగలము. ఈ శిలలు వేంపల్లి ఫార్మేశన్‍కు చెందినవి. పులివెందుల క్వార్ట్జైట్‍, తాడిపత్రి శేల ఫార్మేశన్‍కు చెందినది. ఇది చిత్రావతి గ్రూప్‍కు చెందినవి. పాపాగ్నికి చిత్రావతికి మధ్యన ఉన్న కాంటాక్ట్ ఓక డీస్‍ కన్ఫర్‍మిటి.
పులివెందుల ఆస్‍బెస్టాస్‍ బెల్ట్లోని శిలలు WNW-ESEనుండి NW-SE దిశలలో ట్రెండ్‍ అవుతాయి. వీటి డిప్స్ 120 నుండి 180 మధ్యలో ఉంటవి. ఈ బెల్ట్లో పలు ట్రాన్స్వర్స్ ఫాల్ట్లు కలవు. ఈ బెల్ట్ 25 కి.మీ. పొడవు కలదు. ఇందులో లింగాల-బ్రాహ్మణపల్లికి మధ్యలో ఉన్న 13 కి.మీ. ఆస్‍బెస్టోస్‍ ఎక్కువగా ఉంటుంది. జి.ఎస్‍.ఐ. బ్రాహ్మణపల్లిలో 14 బోర్స్, రామనాతపల్లిలో 20 బోర్స్, లింగాలలో 17 బోర్స్ డ్రిల్‍ చేసారు. మంచి మినరలైనేశన్‍ను రిపోర్ట్ చేసారు. ఈ క్రైసోటైల్‍ ఆస్‍బెస్టోస్‍ని పేపర్‍ బ్లాక్స్, సిమెంట్‍ ప్రొడక్ట్స్‍, బ్రేక్‍ లైనింగ్స్, ఆటోమొబైల్‍స్పేర్‍ పార్ట్స్‍ పేంట్స్, ఇన్సులేటింగ్‍ మెటీరియల్స్లో ఉపయోగిస్తారు.


డైమండ్‍:
బనగానపల్లి ఫార్మేశన్‍లో వజ్రాలు దొరుకుతవి. ఈ ఫార్మేశన్‍ 30 మీ. తిక్‍నెస్‍తో కూడి ఉన్నది. బనగానపల్లి, రాచర్ల బెల్ట్లో కంగ్లామరేట్‍ శిలలో బ్యాన్‍డెడ్‍ రెడ్‍ జీస్‍పార్‍, పసుపు, నీలిరంగుల చెర్ట్, శేల్‍ ట్రాప్‍, మరియు క్వార్ట్జ్‍. ఈ ప్రాంతంలో వజ్రాల కొరకు పురాతన మైనింగ్‍ సైట్స్ సాండ్‍స్టోన్‍/ క్వార్ట్జైట్‍లో కంగ్లా మరేట్‍ పొరలో చూడగలము. ఈ పురాతన సైట్స్ చాలా వరకు గ్రావెల్స్లో బనగానపల్లి, మునిమడుగు, ఆలహాబాద్‍ ప్రాంతాలలో పిట్స్, ట్రెంచస్‍ మరియు షాఫట్స్ను పోలియున్నవి. ఈ బ్లాక్‍లో యావరేజ డైమండ్‍ ఇన్సిడెన్స్ 2cpht కన్నా ఎక్కువ. మునిమడుగు-రాచర్ల బ్లాక్‍లో 1.53m.t సాంపిల్‍లో 0.03c.t డైమండ్‍ దొరికినది. ఇక్కడ డైమండ్‍ ఇన్సిడెన్స్ ఎర్రాటిక్‍గా దొరుకును. 0.35cpht నుండి 2.03 cpht మధ్యలో ఉన్నది. ఇందులో 76 శాతం ఇండస్ట్రియల్‍ వెరైటీగా ఉన్నది. ఇప్పటి వరకు దొరికిన డైమండ్స్లో అన్నిటికన్నా పెద్దది 6.15 క్యారైట్స్ ఉన్నది.


బంగారం:
వెలిగల్లు శిస్ట్ బెల్ట్ యొక్క కొంత భాగం కడప జిల్లాలో కలదు. పురాతన మైనింగ్‍ సైట్స్ చాలానే ఉన్నవి. ఈ ప్రాంతంలో ఈ బెల్ట్లో జి.ఎస్‍.ఐ మూడు బ్లాక్‍లో అనగా తెల్లికొండ తలముకుంట మరియు గూటమీదిపల్లెలో గోల్డ్ వ్యాలూస్‍ 2.29PPM నుండి 3.3PPM వరకు ఉన్నట్టు నిర్థారించారు. గోల్డ్ క్వార్ట్జ్‍ వీన్స్లో మరియు మస్కోవైట్‍ శిస్ట్- బ్యాండెడ్‍ ఐరన్‍ ఫార్మేశన్‍ కాంటాక్ట్లో దొరుకుతుంది.
ఐరన్‍ఓర్‍: ఈ జిల్లాలో ఐరన్‍ ఓర్‍ కడప సూపర్‍గ్రూప్‍కు చెందిన ఫెరుజినస్‍ సెడిమెంట్స్లో చబాలి, పగడాలపల్లి, రాజంపేట ప్రాంతాలలో కలదు. చబాలి వద్ద ఐరన్‍ఓర్‍ 54 శాతం 65 శాతం Fe, రాజంపేట వద్ద 58-60 శాతం ఖీవ గా నిర్థారించారు. వీటి రిజర్వు 20mtఉన్నట్టు తెలిపారు.
బేస్‍మెటల్స్:
లెడ్‍-జింక్‍ మినరలైజేశన్‍ కాపర్‍తో కూడియున్నది. జంగంరాజుపల్లి-వరికుంట బెల్ట్లో ఈ బెల్ట్ నార్త్-సౌత్‍ దిశలో 50 కి.మీ. పొడవు కలదు. జంగంరాజుపల్లి డిపాజిట్‍ చాలా ప్రముఖమైనది. ఇక్కడ ఖనిజాలు, గ్యలీనా, స్పాలరైట్‍తో కొంత పైరైట్‍ ఉన్నది. మినరలైజడ్‍ జోన్‍ కొన్ని సెంటిమీటర్ల నుండి 3.30 మీ. వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐదు లోడ్స్ కలవు. ఈ మినరలైజడ్‍జోన్‍ యొక్క ఎక్స్ఫ్లోరేశన్‍ మొదలు జి.ఎస్‍.ఐ తరువాత ఎమ్‍.ఇ.సి.ఎల్‍. చేశారు. దీని రిజర్వు జి.ఎస్‍.ఐ రెండు సెక్‍శెన్స్లో 100 మీ. మరియు 150 మీ. లోతువరకు 0.37mtగా నిర్ధారించారు. ఇక్కడ జింగ్‍ గ్రేడ్‍ .08 శాతం నుండి 4.21 శాతం మరియు లెడ్‍ గ్రేడ్‍ 1.08 శాతం నుండి 2.9 శాతం వరకు
ఉన్నట్టు నిర్థారించారు. గొల్లపల్లి డిపాజిట్‍లో మూడు బ్లాక్స్ను గుర్తించారు. ఇక్కడ ్గpb-zn మినరలైజేశన్‍ బ్రెక్‍ శియేటెడ్‍ డొలమైటిక్‍ లైమ్‍స్టోన్‍ కాంటాక్ట్ వద్ద ఉన్నది. ఈ డిపాజిట్‍లో లెడ్‍ గ్రేడ్‍ 1.8 శాతం జింక్‍గ్రేడ్‍ 1.7 శాతం మరియు రిజర్వు 3.47 mt ఉన్నట్టు నిర్థారించారు.


లైమ్‍స్టోన్‍:
సిమెంట్‍ గ్రేడ్‍ లైమ్‍స్టోన్‍ నార్జి ఫార్మేశన్‍కు చెందినది. జమ్మలమడుగు, కోడూరు, నిడుజువ్వి, పొన్నటోలా, తలమంచి పట్నం, ఎర్రగుంట్ల, కమలాపురం ప్రాంతాలలో దొరుకుతుంది. ఎర్రగుంట్ల వద్ద వున్న లైమ్‍స్టోన్‍ను CCI వాళ్లు సిమెంట్‍ ప్లాంట్‍ కొరకు ఉపయోగిస్తున్నారు.
ఓకర్‍:
రకరకాల రంగులలో హైగ్రేడ్‍ ఓకర్స్ కర్నూలు గ్రూప్‍కు చెందిన అవుక్‍శేల్స్లో దొరుకుతుంది. వీటిని పెంట్‍పిగ్‍మెంట్‍ పరిశ్రమలో ఎక్కువగా వాడుతారు. వీటి నిక్షేపాలు పాపాయపల్లి, పెద్దపసుపుల ప్రాంతాలలో కలవు.
స్టీయటైట్‍:
ఇది మాగ్నిశియం సిలికేట్‍తో హైడ్రాక్సిల్‍ మాలిక్యుల్‍ (mg3si4o10(oH)2)). స్వచ్చమైన టాల్క్ తెలుపు, వెండి, ఆకుపచ్చ రంగులలో ఉంటుంది. ఇది ఫైర్‍ ప్రూప్‍ మరియు యాసిడ్‍ రెసిస్టెంట్‍ ప్రాపర్టీస్‍ ఉండ టం వల్ల దీన్ని ఎలక్ట్రికల స్విచ్‍బోర్డ్లలో, యాసిడ్‍ ప్రూఫ్‍ టేబుల్‍ టాప్స్ తయారీలో వాడతారు. దీన్ని ఎక్కువగా టాల్క్ం పౌడర్‍ తయారీలో వాడతారు. ఇది వేంపల్లి ఫార్మేశన్‍ యొక్క డొలమైట్‍- బేసిక్‍ సిల్స్ కాంటాక్ట్ జోన్‍లో దొరుకుతుంది. ఈ జిల్లాలో లింగాల, ప్రనపల్లి, జంగారెడ్డిపల్లి, పులసల నూతపల్లి ప్రాంతాలలో వేంపల్లి డోలమైట్‍లో ల్యామినేషన్స్, బ్యాండ్స్ రూపంలో దొరుకుతుంది. ఈ బ్యాండ్స్ కొన్ని సెంటిమీటర్ల నుండి 10 సెంటిమీటర్ల వరకు వుంటుంది. వీటి రిజర్వ్స్‍ 7600 టన్నులుగా నిర్థారించారు.


టంగ్స్టన్‍:
వోలఫ్రమైట్‍ ((femn)wo3) టంగ్స్టన్‍ మొక్క ముఖ్యమైన ఖనిజం. దీన్ని ఎలెక్ట్రికల్‍ బల్బుల ఫిలమెంట్స్లో, ఎక్స్-రే మశీన్ల్లో, టి.వి అప్పరేటిస్‍లో, హైస్పీడ్‍ స్టీల్‍, స్టీల్‍ ఆర్మ్ర్‍ గన్‍ బ్యారెల్స్, రెసిస్‍టెంట్‍ వైర్స్లో, రెజర్‍బ్లేడ్స్లో ఉపయోగిస్తారు. చాలావరకు కొద్ది మొత్తంలో పెగ్మటైట్‍ వీన్స్ మరియు క్వార్ట్జ్‍-ఫైల్స్ పాతిక్‍ బ్వాండ్స్లో దొరుకుతుంది.
యురేనియం:
ఈ జిల్లాలోని యురేనియమ్‍ మినరలైజేశన్‍ దేశంలోనే అతిపెద్ద డిపాజిట్‍గా పరిగణించబడినది. ఈ డిపాటిట్‍ జీ.ఎస్‍.ఐ జియాలజిస్ట్లు 1986లో పి.ఎ.సిన్హా మరియు రవీంద్రబాబు మొట్టమొదట కనుగొన్నారు. తరువాత ప్రభుత్వ పాలసీ ప్రకారం దీన్ని ఎ.ఎం.డి.కి అప్పచెప్పారు.
ఈ మినరలైజేశన్‍ కడప సూపర్‍గ్రూప్‍కు చెందిన వెంపల్లి సిలిశియస్‍ డొలమైట్‍. గువ్వలచెర్వు క్వార్ట్జైట్‍ కాంటాక్ట్ జోన్‍లో దొరుకుతుంది.
ఈ మినరలైజేశన్‍ తుమ్మలపల్లి ప్రాంతంలో 0.02 శాతం మరియు వే•ంపల్లి ప్రాంతంలో 0.04 శాతం యురేనియం (U3O8) కలదు. రిజర్వు ఎ.ఎం.డి ఈ డిపాజిట్‍ని మైనింగ్‍ చేస్తున్నారు. ఇది ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద యురేనియమ్‍ మైన్‍. దీని రిజర్వు ఎం.ఎం.డి ప్రకారం 5000 టన్స్ U3O8 తుమ్మలపల్లి వద్ద.


క్లేస్‍:
ఈ జిల్లాలో క్లే నిక్షేపాలు పుష్కలంగా ఉన్నవి. ముఖ్యంగా కోడూరు, రాజంపేట, కడప ప్రాంతాలలో గోడేల వద్ద కుంభం శేల్‍లో రకరకాల రంగులలో ఇంప్యూర్‍ క్లే నిక్షేపాలు ఉన్నవి. హస్తవరం, తాళ్లపాక ప్రాంతాలలో తెలుపు రంగు క్లే నిక్షేపాలు పష్కలంగా ఉన్నవి.
మాగ్నసైట్‍:
లోగ్రేడ్‍ క్రిస్టలైన్‍ మాగ్నసైట్‍ వేంపల్లి టౌన్‍కు 3 కి.మీ. దక్షిణంలో మరియు కుమారపల్లికి 2.5 కి.మీ. ఆగ్నేయంలో దొరుకుతుంది.
బిల్డింగ్‍స్టోన్స్:
ఈ జిల్లాలో బిల్డింగ్‍ మెటీరియల్‍ పుష్కలంగా లభిస్తుంది. క్వార్ట్జైట్స్, లైమ్‍స్టోన్‍, డొలమైట్స్ రూపంలో వీటిని విస్త•తంగా క్వారీ చేస్తున్నారు. కడప, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల ప్రాంతాలలో నార్జి లైమ్‍స్టోన్‍ను విస్తృతంగా క్వారీ చేస్తున్నారు. రాయచోటి ప్రాంతంలో గ్రానైట్‍, నైస్‍ క్వారీ చేస్తున్నారు. కన్‍స్ట్రక్షన్స్లో ఉపయోగిస్తున్నారు.
వాలకానిక్‍ ఏ ష్‍:
ఇది మొట్ట మొదలు ఆంధప్రదేశ్‍ రాష్ట్రములోని సాగిలేరు బేసిన్‍లో గుర్తించారు. ఇది సుమాత్రా దివికి చెందిన టోబా వాల్కా నిజం తో కోరీ లేట్‍ చేశారు. ఇది 75000 సంవత్సరాల క్రితం జరిగినట్టు నిర్ధారించారు. దీనిని సబినా పౌడర్‍లో ఉపయోగిస్తున్నారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి
    ఎ :91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *