కొయ్య బొమ్మలాట మోతె జగన్నాథం మృతి

తెలంగాణలోని జనగామ జిల్లా అమ్మాపురం మోతె జగన్నాథం ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ వేదకుమార్‍ మణికొండ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘బొమ్మలోల్లు’’ అని ఆప్యాయంగా పిలుచుకునే మోతె జగన్నాథం, కొయ్య బొమ్మలాట ద్వారా శతాబ్దాల నాటి కథా సంప్రదాయాన్ని పరిరక్షించ డానికి అంకితమైన కళాకారుల బృందానికి నాయ కత్వం వహించాడు. వీరి ప్రదర్శనలు రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలకు, ప్రహ్లాద, రామదాసు కథలకు ప్రాణం పోశాయి. ఈ బృందం యొక్క కళానైపుణ్యం తెలంగాణ ప్రాంతపు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్‍ ఉమ్మడి జిల్లాలో ఒకే మోతె కుటుంబానికి చెందిన రెండు బృందాలు మాత్రమే మిగిలాయి.


జగన్నాథంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వేదకుమార్‍ మణికొండ 2006లో ఢిల్లీలోని నేషనల్‍ మాన్యుస్క్రిప్ట్ మిషన్‍ మరియు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‍ అకాడమి హైదరాబాదు జగన్నాథం బృందంతో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వీరంతా కలిసి ఉమ్మడి ఆంధప్రదేశ్‍ లోని 3 ప్రాంతాలలోని 11 జిల్లాల్లో పర్యటించారు. నేషనల్‍ మాన్యుస్క్రిప్ట్ మిషన్‍ అవేర్‍నెస్‍ ప్రచారం జగన్నాథం బృందం కొయ్య బొమ్మలాట ప్రదర్శనలు విద్యాసంస్థలు మరియు ప్రజలలో సాంస్కృతిక వారసత్వ మరియు మాన్యుస్క్రిప్ట్ పరిరక్షణ ప్రాముఖ్యతకు దోహదపడ్డాయి. వేదకుమార్‍తో దేశంలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించే జగన్నాథం కొయ్య బొమ్మల బృందంతో అనేక వర్క్ షాప్‍లు మరియు ప్రదర్శనలు కూడా నిర్వహించారు. దశాబ్దాలుగా హైదరాబాద్‍లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనలు ఇప్పించాము.
ప్రముఖ చలన చిత్ర నిర్మాత అజిత్‍నాగ్‍ కొయ్య బొమ్మలాటకు వారి ప్రత్యేక సాంస్కృతిక విలువను వర్ణించే ‘‘బొమ్మలోల్లు’’ అనే డాక్యుమెంటరీ చిత్రంలో జగన్నాథం మరియు బృందం జీవితం మరియు కళా రంగానికి ఆయన సేవలు చక్కగా తెలియపరిచారు.


రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సిఫార్సులతో సహా వేదకుమార్‍ యొక్క నిరంతర ప్రయత్నాల ద్వారా, జగన్నాథం మరియు అతని బృందం భారతదేశంలోని 12కి పైగా రాష్ట్రాలలో ప్రదర్శనలు ఇస్తూ జాతీయ వేదికలపై గుర్తింపు పొందారు. దురదృష్టవ శాత్తూ, కొయ్య బొమ్మలాట ఇప్పుడు అంతరించి పోయే దిశలో ఉంది. సామాజిక-ఆర్థిక సవాళ్ల కారణంగా యువతరం పరిమిత ఆసక్తిని చూపుతోంది.
తెలంగాణ దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ వేదకుమార్‍ మణికొండ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన సంప్రదాయ సాంస్కృతిక రూపాన్ని గుర్తించాలని, అంతరించిపోతున్న ఈ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఈ కళను సజీవంగా ఉంచడంలో మిగిలిన కొయ్య బొమ్మల కుటుంబ కళాకారులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతరించిపోతున్న కళారూపాన్ని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను అని తెలిపారు.


జగన్నాథంకు పద్మశ్రీ దక్కేలా ప్రయత్నం జరుగుతున్న సంధర్భంలో ఆయన ఆకస్మిక మృతి తీవ్రంగా కలిచి వేసిందన్నారు. కళారంగానికి ఆయన మృతి వల్ల ఏర్పడిన నష్టం పట్ల వేదకుమార్‍ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోతె జగన్నాథం కుటుంబానికి వేదకుమార్‍ మణికొండ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప కళాకారుడి మృతికి సంతాపం తెలిపారు.

  • టి.స్వామి, ఎ : 8374 99 5555

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *