ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో 15,140 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నది. దేశంలోనే ప్రసిద్ది చెందిన వెంకటేశ్వరస్వామి మందిరం ఈ జిల్లాలో తిరుమల కొండల్లో కలదు. ఇది తిరుపతి పట్టణానికి ఉత్తరాన
ఉన్నది. మరియు ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ జిల్లాలో మదనపల్లి పట్టణం వద్ద 1314 మీ।। ఎత్తుగల హార్సిలీ కొండను ఆంధప్రదేశ్ పర్యాటక విభాగం దీన్ని ఒక ఆకర్శవంతమైన పర్యాటక స్థలంగా మార్చారు. ఇక్కడ వేసవి కాలంలో చల్లగా ఉండటం వల్ల ఇక్కడ టి.బి. సానిటోరియంని ఏర్పాటు చేశారు. ముంబయి, చెన్నై, బెంగళూరు-చెన్నై, ధర్మవరం-పాకాల, గూడూరు-కాట్‍పాడి మరియు జాతీయరహదారి చీ•-4 ఈ ప్రాంతం ద్వారా వెళ్తుంది.
ఈ జిల్లాలోని ఈశాన్య ప్రాంతం చాలా రగ్గెడ్‍గా కడప బేసిన్‍లోని కొండలతో కూడి ఉంటుంది. ఈ కొండలు రిడ్జస్‍గా చీఔ-•జు దిశల్లో విస్తరించి యుంటవి. ఈ ప్రాంతం 57 మీ।। నుండి 1314 మీ।। వరకు ఎత్తు పల్లాలు ఉన్నాయి. వీటన్నిటిలో తిరుమల కొండలు ప్రముఖమైనవి. 100 మీ।। వర్టికల్ డ్రాప్‍ని చూడగలము. తూర్పు ప్రాంతం చాలా వరకు ప్లాటుగా ఉంటుంది. మధ్య మధ్యలో కొండలు, లోయలతో కూడి ఉంటుంది. మిగతా ప్రాంతం ప్లేన్‍గా 50 మీ।। ఎత్తులో ఉంటుంది.
ఈ జిల్లా ప్రాంతంలోని ప్రముఖమైన నదులు బహుదా, కాలంగి, స్వర్ణముఖి, ఆరని, నగరి, పొయిని, కౌండిన్య మరియు పొలార్. ఈ నదులు వీటి డ్రైనేజి ఈ ప్రాంతం యొక్క నీటి అవసరాలను తీరుస్తాయి. వీటి డ్రైనేజీ ప్యాటర్న్ డెండ్రిటిక్ నుండి సబ్ డెండ్రిటిక్‍గా ఉంటుంది.
ఈ జిల్లాలో ఆర్క్యన్, ప్రొటిరోజోయక్, జురాసిక్-క్రిటేశ్వస్ మరియు టర్శయ్రి-క్వాటర్‍నరికి చెందిన పీరియడ్స్కు చెందిన శిలలు కలవు. చాలా భాగం ఈ జిల్లాలో పెనిన్సులర్ నైసిక్ కాంప్లెక్స్ యొక్క నైసెస్, గ్రానైట్స్ మరియు వీటి వేరియంట్స్తో కూడి
ఉన్నది. ఈ పిజిసిలో ఎన్‍క్లేవ్స్గా ఓల్డర్ మెటమార్పిక్స్ ఆంఫిబౌలైట్స్, హార్న్బ్లెండ్- టాల్క- మైకా శిస్ట్, పూక్‍సైట్ కార్డ్జైట్, కాల్క్ సిలికేట్‍రాక్, మార్బల్ మరియు బాండెడ్ ఫెరుజినస్ కార్డ్జైట్.
శిస్ట్ బెల్టుల రూపంలో ధార్వార్ సూపర్‍గ్రూప్‍కు చెందిన శిలలు క్వార్ట్జ్ మైకాశిస్ట్, ఆంపిబౌలైట్ శిస్ట్ చాంపియన్‍నిస్ మెటాబసాల్ట్, మెటా డసైట్ మరియు బాండెడ్ ఫెరజినెస్ క్వార్ట్జైట్. ఇవి చీ-• దిశల్లో లీనియర్‍గా విస్తరించి ఉన్నవి. మరియు పి.జి.సి పైన నాన్‍కన్ఫర్మబుల్‍గా ఉన్నవి. ఆసిడ్ ఇంట్రాసివెస్ గ్రానైట్స్, కార్ట్జ్ వీన్స్ పి.జి.సి.లో చూడగలము. ఇవి పేలియో ప్రొటిరొజొయిక్ పీరియడ్‍కు చెందినవి. ఒక చిన్న సైనైట్ బాడీని పాలంనేర్ వద్ద చూడగలము. బేసిక్ డైక్స్ని డొలరైట్స్ రూపంలో చూడగలము. వీటిని మూడు దిశల్లో చూడగలము. జు-ఔ, ఔ-•, చీఔ-•జు. వీటిలో జు-ఔ, దిశల్లో ఉన్న డొలరైట్స్ ఎక్కువగా ఉన్నది. ఇవి ఒక స్వార్మ్గా చూడగలము. ఈ జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో ప్రసిద్ది చెందని కడప బేసిన్ ఉండటం విశేషం. ఇక్కడ శేల్, క్వార్ట్జైట్ బైరంకొండ ఫార్మేశన్‍కు చెందినవి మరియు కుంభం పార్మేశన్‍కు చెందిన శేల్స్ / ఫిలైట్స్, లైమ్‍స్టోన్‍లను చూడగలము. ఈ కడప సూపర్ గ్రూప్‍కు చెందిన శిలలు పి.జి.సి పైన నాన్ కన్ఫ్ర్మబుల్‍గా ఉన్నవి. ఇవి లీనియర్ రిడ్జ్స్‍గా కాలహస్తికి దక్షిణంలో మరియు నగరి పట్టణం దగ్గర అవుట్ లైయర్స్గా చూడగలము. ఈ ఆన్‍కన్ఫర్మిటిని ఎప్‍ఆర్‍క్యన్ అన్‍కన్ఫ్ర్మిటిగా నిర్ధారించారు. జి.ఎస్.ఐ. దీన్ని నేషనల్ జియోలజికల్ మాన్యుమెంట్‍గా గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఇది కాకుండా తిరుమలలో న్యాచురల్ ఆర్చ్ (శిలా తోరణం)ను కూడా కేంద్రం నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్‍గా గుర్తించారు. ఇవి రెండు నగరి క్వార్ట్జైట్‍లోనే కలవు.
గోండ్‍వానా శిలలు ఈ జిల్లాలోని ఆగ్నేయంలో పి.జి.సిపైన నాన్ కన్ఫర్మబుల్‍గా ఉన్నది. ఈ శిలలు మాటల్డ్ ఫెరుజినస్ క్వార్ట్జైట్, కంగ్లామరేట్ ప్లాంట్ ఫాసిల్స్తో కూడి యున్నవి, వీటిని సత్యవేడు ఫార్మేశన్‍గా గుర్తించారు. వీటిపైన లాటరైట్ క్యాపింగ్స్ను కూడా చూడగలము. నదులకు ఇరువైపులా ఫ్లడ్ ప్లేన్‍లో క్వాటర్‍నెరి సెడిమెంట్స్ని చూడగలము.
ఈ జిల్లాలో చాలా వరకు రెడ్ నుండి రెడ్డిశ బ్రౌన్ సాండి సాయిల్ ఉంటుంది. నదుల ఇరువైపులా సాండిలోమీ సాయిల్‍ని చూడగలము. సెడిమెంటరి శిలలపైన మిక్స్డ్ రెడ్, బ్లాక్‍సాయిల్స్ని చూడగలము. సీస్‍మిక్ మైక్రోజొనేశన్ ప్రకారం ఈ జిల్లాలోని ప్రాంతాన్ని జోన్-2గా నిర్ధారించారు.
ఖనిజ సంపద: ఈ జిల్లాలో కమర్షియల్ గ్రానైట్స్కు మరియు గ్రానైట్ పాలిశింగ్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. ఇది కాకుండా ఈ జిల్లాలో బైరైట్స్, క్లే, కొరండం, గోల్డ్, ఐరన్ ఓర్ మరియు సియటైట్ ఉండటం విశేషం.
బెరైటీస్ : బైరైట్ వీన్స్ 1 నుండి 3 సెం.మీ. థిక్‍నెస్‍తో గ్రానైట్ నైసెస్‍లో బైరాగి కంద్రీగ ప్రాంతంలో చూడగలము. బెరైటీస్ పసుపు రంగులో క్వార్ట్జ్ హెమటైట్‍తో కూడి వుంటుంది.

డైమెన్షన్ స్టోన్స్ : గ్రానైట్ నైసెస్, మిగ్మాటైట్స్, బైరన్ కొండ క్వార్ట్జైట్స్, గొండవాన సాండ్ స్టోన్స్ కమర్షియల్‍గా క్వారీ చేస్తున్నారు. వీటిని కన్స్ట్రక్షన్ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ఈ జిల్లాలో పాలిశింగ్ పరిశ్రమ కుప్పం వద్ద ఉన్నది. రాష్ట్రంలో ఈ జిల్లాలోనే మొట్టమొదటి కమర్శియల్ గ్రానైట్ క్వారియింగ్ ఆరంభించారు. కొన్ని పాపులర్ వెరైటీస్ కుప్పం గ్రీన్ (గ్రానైట్ నైస్), ఇంగ్లీశటీక్ (మల్లీకలర్డ్ గ్రానైట్), బ్లాక్ గ్రానైట్ (డొలరైట్), మదనపల్లి వైట్ (ల్యుకొగ్రానైట్).
కొరండం: కొరండం క్రిస్టల్స్ 1 సెం. నుండి 3 సెం. వరకు
ఉంటవి. ఇవి ఎర్ర చెరువుపల్లి, పాలిచెట్టిపల్లి ప్రాంతంలో దొరుకుతుంది. దీన్ని అబ్రేసివగా వాడతారు.
బంగారం: వీటి అక్కరెన్సెస్ కుప్పం ప్రాంతంలోని బిసకట్టం సలచింతపల్లి, మలప్పకొండ, చిగర్‍గుంట వద్ద దొరుకును. ఈ నిక్షేపాలు కోలార్ గోల్డ్బెల్ట్ యొక్క ఎక్స్టెన్షన్స్గా నిర్ధారించారు. జి.ఎస్.ఐ. శ్రీకాళహస్తి యొక్క పల్లెచెరువు పరిసరాలలో చిన్న మొత్తం గోల్డ్ అక్కరెన్సెస్ కలవు.
హెమటైట్ (ఐరన్ ఓర్): ఐరన్ ఓర్ హెమటైట్ రూపంలో హార్న్బ్లెండ్ శిస్ట్ అసోసియేషన్‍లో దొరుకుతుంది. వీటి నిక్షేపాలు సిరసనంబేదు, కోవనూర్, సురమాల వద్ద 6మీ. నుండి 7మీ. థిక్‍నెస్‍గా ఉన్నది.
ఓఖర్: ఓఖర్ బ్యాండ్స్ క్రీమ్, బ్రౌన్, పింక్ రంగులలో శేల్స్లో కరకంబాడికి పశ్చిమంలో దొరుకును. వీటిని డిస్టెంబర్స్ మరియు పెయింట్స్లో ఉపయోగిస్తారు.
స్టియటైట్ : చిన్న స్టియటైట్ నిక్షేపాలు ఒకారినరసింగ రాయనపేట, అనుగల్లు, కిరిమంజ, బిండ కిందపల్లి మరియు తలుపులపల్లి ప్రాంతాలలో కలవు. వీటిని సిరామిక్ పరిశ్రమలో ఉపయోగిస్తారు.
టాల్క్ : టాల్క్ ట్రిమొలైట్ శిస్ట్లో దీని నిక్షేపాలు వెల్లంపల్లి ప్రాంతంలో దొరుకతవి.
క్లేస్ : కుంభం శేల్స్లో కరకంబాడి, తొయిడవేరు వద్ద క్లే పాకెట్స్ రూపంలో దొరుకును.
- కమతం మహేందర్ రెడ్డి, ఎ :91 90320 12955