‘‘దీప్తిమాన వజ్రః’’ ప్రకాశవంతంగా ఉండటం వజ్రం యొక్క లక్షణం అని బుద్ధభటుడు తన రత్న పరీక్షలో పేర్కొన్నారు.
వజ్రపరీక్ష:
వజ్రాలను పరీక్షించటానికి ముఖ్యంగా దాని రంగు (•శీశ్రీశీ•తీ), ఖండన (•••), బరువు (••తీ•••స్త్రవ), స్వచ్ఛత (•శ్రీ•తీఱ••)లను పరిశీలించడం ద్వారా దాని విలువ నిర్ణయిస్తారు. వీటిని సంక్షిప్తంగా వజ్రాల వ్యాపారంలో 4సి (4•) అని కూడా అంటారు. అయితే వజ్రం యొక్క విలువ, నాణ్యత నిర్ణయం చేయడానికి 4సిలే కాకుండా దాని ప్రదీప్తి (ఖీశ్రీశీతీవ••వఅ•వ), నునుపు (•శీశ్రీఱ•ష్ట్ర), క్యూలెట్ (••శ్రీవ•) అనే లక్షణాలు కూడా పరిశీలించి నాణ్యత నిర్ణయం చేయబడుతుంది. సర్టిఫికెట్ లేదా రిపోర్ట్లో సాధారణంగా ఈ విషయాలను క్లుప్తంగా పొందుపరచటం జరుగుతుంది. వజ్రం విలువ ఈ రిపోర్ట్లోని అంశాలు ఒక్కటే కాకుండా అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
వజ్రదీప్తి:
వజ్రం యొక్క రంగును దాని ఆకర్షణను ప్రభావితంచేసే ఈ ‘‘ఫ్లోరోసెన్స్’’ అంశం సాధారణంగా పైకికనిపించదు. ప్రయోగశాలలో అతినీలలోహిత కిరణాలు వజ్రంపైన ప్రసరింప చేసినప్పుడు వజ్రాలలో సాధారణంగా ఏరకమైన మార్పు ఉండదు. కాని కొన్ని వజ్రాలు ఆ కాంతిని పరావర్తిస్తూ ఇంకా ప్రకాశవంతంగా అవుతాయి. కాంతిని వేరే తరంగధైర్ఘ్యంలో పరావర్తనంచేసే ఈ లక్షణాన్ని ప్రదీప్తి (ఖీశ్రీశీతీవ••వఅ•వ) అంటారు. నూటికి దాదాపు ముప్పై శాతం వరకు వజ్రాలు ఈ లక్షణాలు కలిగిఉంటాయి.
ప్రదీప్తి నీలంరంగులోనే కాకుండా ఎరుపు, పసుపు ఇంకా అనేక ఇతర రంగులలో కూడా ఉంటుంది. దీనిని రిపోర్ట్లో పొందుపరచటం కోసం ఏమీలేదు (చీశీఅవ) తక్కువ (ఖీ•ఱఅ•) మధ్యస్థ (వీవ•ఱ•ఎ) ఎక్కువ (•ఱస్త్రష్ట్ర) మరియు చాలా ఎక్కువ (•వతీ• ష్ట్రఱస్త్రష్ట్ర) అనే గ్రేడ్‍లో వర్గీకరిస్తారు.
ఈ ఫ్లోరోసెన్స్ వజ్రం యొక్క మార్కెట్‍ను ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే, మార్కెట్ వర్గాలు ఇలాంటి వజ్రాల పట్ల అనేక కారణాలవల్ల తక్కువ సుముఖత కలిగిఉంటాయి. ఈ లక్షణం వల్ల వజ్రాలు కాస్త జిడ్డుగా కనిపించి రంగు తక్కువగా అనిపిస్తుంది. లేత పసుపు రంగు వజ్రాలు ఫ్లోరోసెంట్‍గా ఉంటే ఆ పసుపు రంగు కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. ఇలా 4సి లోని కలర్, క్లారిటీల పై ప్రభావం వల్ల మార్కెట్‍లో ఫ్లొరసెంట్ వజ్రాలు తక్కువధర పలుకుతాయి. ఆభరణాలలో వీటిని సాధారణ వజ్రాల తోపాటు మిశ్రమంగా వాడినప్పుడు, ఫ్లోరోసెంట్ వజ్రాలు రాత్రి వెలుగులో మెరుస్తూ మామూలు వజ్రాలకు వేరుగా కనిపించవచ్చు. ముఖ్యంగా మ్యాచింగ్ పెయిర్‍గా ఉండవలసిన చెవికమ్మలు ఒకటి ఒకరకంగా మరోటి ఇంకోరకంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరో సమస్య ఏమిటంటే క•త్రిమ వజ్రాలు (••ణ ణఱ•ఎశీఅ••) అన్ని ఫ్లోరోసెంట్‍గా ఉంటాయి.అయితే ఇవి ఎక్కువగా అతినీలలోహిత కిరణాల షార్ట్ వేవ్‍లో, సహజ వజ్రాలు లాంగ్ వేవ్‍లో ఫ్లోరోసెంట్‍గా
ఉంటాయి. ఫ్లోరోసెన్స్తో పాటు కొన్ని వజ్రాలు ఫాస్పోరసెన్స్ను కూడా కలిగి ఉండవచ్చు. అంటే వజ్రంమీద కాంతి ప్రసరణన ఆగిపొయిన తర్వాత కూడా వజ్రాలు అలాగే కొంచెం సేపు ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ లక్షణాన్ని శీతలదీప్తి అనవచ్చు. బహుశా వజ్రాలు చీకటిలో కూడా ప్రకాశిస్తాయి అనుకోవడం ఈ లక్షణం వల్లనే కావచ్చు. సహజ వజ్రాల తోపాటు ••ణ వజ్రాలు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి.
ఈ ఫ్లోరోసెన్స్, ఫాస్ఫరసెన్స్ వల్ల సహజ వజ్రాలు కూడా క•త్రిమ వజ్రాలేమో అన్న భ్రమ కలుగుతుంది. కాబట్టి వ్యాపార వర్గాలు వీటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే ఇది వాణిజ్య పరంగా ఉన్న అంశం మాత్రమే. ఫ్లోరోసెన్స్ లేని లేదా తక్కువ ఫ్లోరోసెన్స్ ఉన్న వజ్రం మార్కెట్‍లో ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. అధిక ఫ్లోరోసెన్స్ ఉన్న వజ్రం జీ,ఖ వంటి కలర్ గ్రేడ్‍లో ఉన్నా అంతకన్నా నాణ్యత గల గ్రేడ్‍లో ఉన్నట్లు కనిపిస్తుంది.
ఏడు రాళ్ళ కమ్మలు/ బ్లూ జాగర్స్:
ఒక్కో సారి నీలం రంగులో ఫ్లోరోసెన్స్ ఉండటం వల్ల సహజ వజ్రాలు ఎక్కువ విలువగలవి అవుతాయి. ‘‘బ్లూజాగర్స్’’గా మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వజ్రాలు చాలా ఎక్కువ ధర పలుకుతాయి. వీటితో చేసిన ‘‘ఏడు రాళ్ళ కమ్మలు’’ దక్షిణం భారత దేశంలో చాలా ఆదరించి బడ్డాయి. వీటి ప్రస్తావన తెలుగు జానపద గీతాలలో తరచూ కనిపిస్తుంది. తెలుగు జానపద పాటలలో ‘‘ఏడురాళ్ల కమ్మలు’’ తరచుగా అందం, గాంభీర్యం మరియు దాంపత్య ఆనందానికి చిహ్నంగా పేర్కొనబడ్డాయి.
కొన్ని ఉదాహరణలు:
‘‘ఏడురాళ్ళ కమ్మలు, పువ్వు ముత్యాల హారాలు
ఏడురాళ్ళ కమ్మలు కుంకుమబిందెలే’’
ఇలాంటి పద ప్రయోగాలు తెలుగు జానపద గీతాలలో తరచూ కనిపిస్తాయి.
వేమన శతకంలో..
‘‘ఏడురాళ్ళ కమ్మలు, పువ్వుల హారములు
చెడును గల నెఱటి యుండెదె వేమా?’’
రంగనాధ రామాయణంలో
‘‘ఏడురాళ్ళ కమ్మలు, ముత్యాల హారములు
సీతాదేవి ధరించిన ఆభరణములు’’
భాస్క• రామాయణంలో
‘‘ఎడురాళ్ళ కమ్మలు, రత్నాల హారములు
మండోదరి ధరించిన ఆభరణములు’’ అని పేర్కొనబడింది.
ఇలా తెలుగువారికి దగ్గరైన ఏడురాళ్ళ కమ్మలు సాధారణంగా వజ్రాల కమ్మలే!
వీటిని బ్లూజాగర్స్ వజ్రాలతో చేయిస్తే దాని విలువ ద్విగుణీక•తం అవుతుంది. ఈ బ్లూజాగర్స్ నిజానికి నీలిరంగులో ఉండవు. ఇవి ఏరంగు లేని ణ రకం వజ్రాలు. వీటిలోఉన్న ఇతర చేరికల వల్ల అధిక ఫ్లోరోసెన్స్ కలిగి సూర్యకాంతిలో కూడా నీలంరంగులో కనిపిస్తాయి. దక్షిణఆఫ్రికాలో ఉన్న జాగర్స్ ఫోన్‍టైన్ (జీ•స్త్రవతీ••శీఅ•వఱఅ) గనిలో దొరికేవజ్రాలు ఈ లక్షణాన్ని కలిగి ఉండటం వల్ల ఈవజ్రాలు ‘‘బ్లూ జాగర్స్’’గా మార్కెట్లో చెలామణి అవుతున్నాయి. అయితే ఈ గనులు 1971లో మూతపడ్డాయి. అందువల్ల మార్కెట్‍లో వీటి ధర ఇంకాఎక్కువ అయింది.
జాగర్ఫోంటేన్ గనుల చరిత్ర:
బ్లూ జాగర్స్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన దక్షిణ ఆఫ్రికాలోని జాగర్ఫోంటేన్ అనే పేరు డైమండ్స్ చరిత్రలో చాలాచోట్ల కనిపిస్తుంది. ప్రసిద్ధి చరిత్రకారులు, యాత్రికుల రచనలో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. మొదటి రోజుల్లో ఇక్కడ జాన్ జాగర్స్కు చెందిన ఒక వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉండేది. దాని యజమాని పేరుమీద క్రమంగా అక్కడ ఒక పట్టణం వెలసింది.

ఈ గనుల్లో మొదటిసారి అల్లువియల్ డైమండ్ కాకుండా గనుల్లో వజ్రాలు దొరకటం ఆరంభం అయింది. దక్షిణాఫ్రికాలో మొదటిసారి 1867లో వండలిమట్టిలో వజ్రాలను కనుగొన్నారు. అప్పటిలో వజ్రాలు గులక రాళ్ళలో మాత్రమే దొరుకుతాయని నమ్మేవారు. జాగర్ఫొంటేన్ ఎర్రనినేలలో దాగివున్న వజ్రాలపట్ల అవగాహన ఉండేదికాదు. 1868లో వాల్ నది ఒడ్డున వజ్రాలు కనుగొన్నారు అక్కడ నుండి వస్తున్న ఒక వజ్రాల అన్వేషకుడు తనదారిన పోతూ ఈ వ్యవసాయ క్షేత్రం యజమాని బంధువైన ఒక యువకునికి ఇక్కడ వజ్రాలు దొరికే అవకాశం
ఉందని చెప్పి వాటి కోసం ఎలా త్రవ్వాలి, ఎలా వజ్రాన్ని గుర్తించాలి మొదలైన విషయాలను వివరించాడు. ఆ యువకుడు మాత్రం అక్కడ రూబీ, గార్నెట్ వంటివి ఉన్నాయి అనుకున్నాడు. అయితే అతనికి ఒక చిన్న వజ్రం దొరకడంతో స్థానిక గడియారాలు బాగుచేసే వ్యక్తికి 16 పౌండ్లకు అమ్మాడు. ఆ గడియారాలు బాగుచేసే వ్యక్తి కూడా మెదట అది వజ్రం అని నమ్మలేదు. క్రమంగా ఇక్కడ వజ్రాలు ఉన్నాయనే విషయం ధ్రువపడింది. క్రమంగా ఇక్కడ మైనింగ్ అభివ•ద్ధిచెంది, దశలవారీగా అనేక న్యాయపోరాటాల తరువాత కేప్ టౌన్ కాలనీలో భాగంగా 1876లో ఆరంజ్ ఫ్రీ స్టేట్ నుండి 90,000 పౌండ్ల చెల్లింపు మీద బదిలీ అయింది. క్రమంగా అమ్మకాలు వ్యాపార ఒడంబడికల ద్వారా చివరికి డి బీర్స్ సంస్థ చేతుల్లోకి వచ్చింది. అక్కడ పారిశ్రామిక నగరం కూడా వచ్చింది అలా ఒక వ్యవసాయ క్షేత్రం యజమాని నుండి సార్వజనిక క్షేత్రంగా మారి ప్రఖ్యాత వజ్రాల గనిగా ప్రసిద్ధిమైంది. ఇక్కడ దొరికే వజ్రాలు నీలంఛాయతో ఎక్కడాలేని విధంగాఉండి ‘‘జాగర్’’ అనే పేరుతో చెలామణీ అయ్యేవి. ఈ వజ్రాలకు ఉన్న నాణ్యత వల్ల ‘‘జాగర్ఫోంటేన్ గ్రే’’ అనే నాణ్యత గ్రేడ్ అధికారికంగా గుర్తించబడింది. ఉత్తరోత్తరా ఈ గ్రేడ్ ణ అని మార్చబడింది. ణ అనే గ్రేడ్ వజ్రాలు ఏరంగు లేనివిధంగా అత్యంత నాణ్యమైనవిగా ఉంటాయి. ఈ ణ కలర్‍లో నీలంరంగు ఫ్లోరసెన్స్ ఉండటం ఒక అదనపు గుణంగా గుర్తింపు పొందింది. ఈ నీలం ఫ్లోరసెన్స్, •• శ్రీఱస్త్రష్ట్ర• లోనే కాకుండా సూర్యరశ్మిలో కూడా గుర్తించవచ్చు. వీటి ప్రాధాన్యత అర్థం చేసుకున్న తర్వాత వీటిపై అనేక పరిశోధనలు చేశారు. ఈ వజ్రాలు 400 నుండి 670 కిలోమీటర్ల లోతులో ట్రాన్సిషన్ జోన్ నుండి 180 కి.మీ క్రింద ఏర్పడినట్టు తెలుసుకున్నారు
వీటి వయస్సు 3.3 బిలియన్ సంవత్సరాలుగా గుర్తించారు. ఈ ప్రత్యేకతవల్ల ఈ కింబర్‍లైట్లను ‘‘సూపర్ కింబర్‍లైట్స్’’ అంటారు. జాగర్ఫోంటేన్ ప్రాంతం భూవిజ్ఞాన శాస్త్రపరంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. క్రమంగా ఈ గనులు దాని దగ్గర ఏర్పడిన పట్టణం ప్రాధాన్యత కోల్పోయాయి. 2010 తర్వాత ఈ గనులు డీ బీర్ నుండి వేరే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లింది. పునరుద్ధరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ మార్కెట్‍లో బ్లూ జాగర్లు కనిపిస్తాయని ఆశిద్దాం.
రత్న పరీక్షలో యు.వి. లాంప్ ఉపయోగం:
రత్నంలో ఈ ఫ్లొరసెన్స్ పరీక్షించడానికి మూడు రకాల •• శ్రీఱస్త్రష్ట్ర• లాంగ్ వేవ్ (320-400అఎ), మీడియం వేవ్ (290-320అఎ) షార్ట్ వేవ్(220-290అఎ) తరంగం ధైర్ఘ్య కల అతినీలలోహిత కిరణాలను వాడుతారు. దీనిలో షార్ట్ వేవ్ వల్ల రత్నాలకు ఒక్కొసారి నష్టం వాటిల్లవచ్చు. ఫ్లొరసెన్స్ పరీక్ష రత్నం యొక్క స్పెక్ట్రోస్కోపీ వంటి ఇతర లక్షణాల పరీక్ష తోపాటు మిశ్రమంగా వాడినప్పుడు అధిక ఫలితం కనిపిస్తుంది.
రత్నకాంతులు:
చీకటిలో అతినీలలోహిత కిరణాల ప్రభావం వల్ల ప్రకాశించే స్వభావం (ప్రదీప్తి/ ఫ్లోరసెన్స్) వజ్రాలతోపాటు ఇతర రత్నాలకు కూడా ఉంటుంది. బెనిటోయైట్ ( కాలిఫోర్నియా రాష్ట్రం అధికారిక / జాతీయ రత్నం)ను •• శ్రీఱస్త్రష్ట్ర• ద్వారా సులభంగా గుర్తించవచ్చు.
నీలాలు, కెంపులు, మరకతాలలో కూడా ఫ్లొరసెన్స్ ఉంటుంది. దీనిద్వారా ఆయా రత్నాలు ఎక్కడనుంచి వచ్చింది,ఏదైనా పక్రియ ద్వారా మార్పుచేయబడిందా లేదా ఇంకా అది క•త్రిమంగా తయారు చేయబడిందా, అనే అంశాలను తెలుసుకోవచ్చు. రత్నాలకు ఫ్లొరసెన్స్ రెండురకాలుగా ఉంటుంది. దాని సహజగుణం (×అ•తీఱఅ•ఱ•) అంటే దాని రసాయనిక కూర్పు వంటి వాటివల్ల వచ్చింది రెండవది బాహ్యమైన కారణాలు (జుఞ•తీఱఅ•ఱ•), అంటే వేడిచేసే పక్రియ లేదా రేడియోధార్మిక వికిరణం ద్వారాకూడా సంక్రమించవచ్చు. ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని రత్నాల నాణ్యత పుట్టుకవంటి విషయాలు పరీక్షించవచ్చు. కెంపులు ఎరుపు లేదా గులాబీరంగు ఫ్లొరసెన్స్ కలిగి వుండవచ్చు, కాని ఇది దాని సహజరంగుకన్నా తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది.
రూబీల వెలుగు:
శ్రీ బర్మా రూబీ లాంగ్ వేవ్‍లో ఎక్కువ ఫ్లోరోసెంట్‍గా ఉంటాయి.
శ్రీ థాయిలాండ్ రూబీ తక్కువ ఫ్లొరసెన్స్ కలిగివుండవచ్చు.
శ్రీ వియత్నాం రూబీ ఎక్కువ ఎరుపు ఫ్లొరసెన్స్ కలిగి వుండవచ్చు.
శ్రీ మడగాస్కర్ రూబీ మిశ్రమంగా ఫ్లొరసెన్స్ కలిగిఉంటుంది.
శ్రీ క•త్రిమ రూబీ తీవ్రత ఎక్కువగా గల అన్నివైపులా సమానంగాఎరుపు ఫ్లొరసెన్స్తో ప్రకాశిస్తాయి.
నీలం కాంతులు:
నీలాలు ఎరుపు నుండి పసుపురంగు తక్కువగా తీవ్రతగల ఫ్లొరసెన్స్ కలిగివుండవచ్చు. క•త్రిమ నీలం తక్కువ తీవ్రతగల ఫ్లొరసెన్స్ అన్నివైపులా సమానంగా ఉంటుంది. నీలిరంగు రత్నం గురించి, నీలకాంతి వజ్రం గురించి ప్రస్తావన మన ప్రాచీన సాహిత్యంలో చాలాచోట్ల ఉంది.
‘‘నీలం నీలరత్నం భూషణం భూషణాని
శ్యామం శ్యామరత్న భూషణం భూషణాని’’ – (ఋగ్వేదం)
మేము నీల (ఆకాశం)వంటి నీల దేవతను, మరియు ఆభరణాలతో అలంకరించబడిన దేవతను ఆరాధిస్తాము: రాల్ఫ్ ఇ గిఫ్రిత్ ద్వారా అనువాదం)
‘తస్యైవం వ్యవస్థితే శ్యామాంతహ కౌస్తుభః.
శ్రీ వత్స కౌస్తుభ- శ్యామాంత శ్రీ వత్స కౌస్తుభః’
మహావిష్ణువు వక్షస్థలంపై సముద్రంవంటి నీలంరంగులో ఉన్న కౌస్తుభ రత్నం ప్రకాశిస్తుంది అని భాగవతంలో ప్రస్తావించబడింది.
‘నీలవజ్ర కుండలం క•ష్ణస్య శిరే శోభితే’ అని కూడా భాగవతంలో, ‘నీలవజ్ కుండలం శివపూజాయా ప్రయోజయత్’ అని అగ్ని పురాణంలో చెప్పబడింది.
మన పోతన భాగవతంలో ‘‘కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగనభాగంబెల్ల గప్పికొనగా…’’ అని శ్రీక•ష్ణుని గురించి చెప్పిన పద్యం అందరికీ చిరపరితం.

వజ్రం-పరదేశాలు:
ఐరోపా వాసులకు మాత్రం 15వ శతాబ్దంలో వీటితో పరిచయం జరిగింది. టైటానిక్ సినిమాలో సముద్రంలోకి విసిరి వేయబడిన కాల్పనిక వజ్రం కూడా నీలంరంగు వజ్రమే!
సమకాలీన కాల్పనిక సాహిత్యంలో ‘‘బ్లూడైమండ్’’ ప్రసక్తి వాణిజ్య సంస్థలు, ఉత్పత్తులు పేరు గాను కాల్పనిక పాత్రల పేరు గాను కనిపిస్తుంది.
బ్లూ డైమండ్: బ్లూ జాగర్స్ వాటి ఫ్లోరసెన్స్ వల్ల నీలి కాంతి ప్రతిబిబిస్తాయి కాని నిజమైన నీలిరంగులో ఉండవు. నిజమైన నీలిరంగులో ఉండే వజ్రాలు చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. మొత్తం రత్నం ప్రజాతి వజ్రాల్లో 0.02 శాతం మాత్రమే నీలిరంగులో ఉంటాయి. వీటికి నీలిరంగు బోరాన్ చేరికవల్ల, లాటిస్ హైడ్రోజన్ డిఫెక్ట్ వల్లకాని, రేడియో ధార్మిక వికిరణంవల్ల కాని వస్తుంది. ఒక్కోసారి బూడిదవంటి రంగు సూక్ష్మచేరిక (వీఱ•తీశీ ఱఅ•శ్రీ••ఱశీఅ) వల్ల వచ్చే అవకాశంఉంది. ఈ వజ్రాలలో లేతనీలిరంగులో ఉండే వజ్రాలు ఎక్కువ ఆకర్షణీయ మైనవిగా ఉంటాయి. వీటిలో నీలం, ఆకుపచ్చ నీలం, ఊదారంగు, బూడిదరంగుతో కూడిన నీలం, తదితర ఛాయలు ఉండవచ్చు. వీటిని రంగును బట్టి లేతనీలం నుండి ఫ్యాన్సీబ్లూ వరకు అనేక గ్రేడ్‍లుగా వర్గీకరించారు. బోరాన్ చేరిక వల్ల వచ్చే నీలిరంగు ••జూవ ×ו వజ్రాలలో ఉంటుంది. వీటికి అసలైన నీలవజ్రాలుగా పరిశ్రమలో గుర్తింపు ఉంది. నైట్రోజన్ లేకపోవడం బోరాన్ చేరిక ఉండే భౌమపరిస్తితి అత్యంత అరుదుగా మాత్రమే ఉంటుంది. ఇవి అత్యధిక లోతుల్లో •••-శ్రీఱ•ష్ట్రశీ•జూష్ట్రవతీఱ• ఎ•అ•శ్రీవలో 600 కిలోమీటర్ల లోతుల్లో తయారు అవుతాయని, దీనికి కావలసిన బోరాన్ సబ్డక్షన్ చెందుతున్న సముద్ర తలం లిధోస్పియర్ ద్వారా అందుతుంది అని పరిశోధకులు చెబుతున్నారు. (•ఎఱ•ష్ట్ర వ• •శ్రీ 2018).
ఫ్యాన్సీ బ్లూ డైమండ్‍కు ఉన్న మార్కెట్ విలువ కారణంగా టైప్ ×ו రకం వజ్రాలను •••• ట్రీట్మెంట్ ద్వారా బూడిద రంగును తగ్గించి బ్లూ డైమండ్‍గా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రోజన్ డిఫెక్ట్ వల్ల నీలిరంగులో ఉండే ఆర్గేల్ డైమండ్‍ను కూడా బ్లూ డైమండ్‍గా చెలామణి చేస్తున్నారు.అయితే ఇవి కూడా సహజ వజ్రాలే కావటం వల్ల ధర ఎక్కువగా పలుకుతాయి. ఇంకా క•త్రిమ బ్లూ డైమండ్‍లు కూడా మార్కెట్‍లో
ఉన్నాయి. కాబట్టి సరి అయిన నీలి వజ్రాలు గుర్తించటంలో జాగ్రత్తలు అవసరం. చరిత్ర ప్రసిద్ధి చెందిన నీలంరంగు ••జూవ ×ו వజ్రాలు ఒకప్పుడు భారతదేశం నుంచి వచ్చినవే. కాని ఇప్పుడు దక్షిణం ఆఫ్రికా కుల్లినాన్ గనులు నుంచి వస్తున్నాయి. హైడ్రోజన్ డిఫెక్ట్ వల్ల నీలిరంగులో ఉండే వజ్రాలు ఆస్ట్రేలియా లోని ఆర్గేల్ గనుల నుంచి వస్తున్నాయి.
కొన్ని ప్రసిద్ధ నీలంరంగు వజ్రాలు
హోప్ డైమండ్, విటెల్స్ బ్యాచ్ గ్రెఫ్ డైమండ్, ఒకవాంగా బ్లూ వంటి అనేక వజ్రాలు ఈ రకమైనవే.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698