బడ్జెట్ 2025-26: ప్రభుత్వ అధిక దిగుబడినిచ్చే విత్తనాల మిషన్ పంట వైవిధ్యంపై ఆందోళనలను లేవనెత్తింది. ఆవిష్కరణ, సాంప్రదాయ విత్తన వారసత్వాన్ని సమతుల్యం చేయడం: NMHYSజీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుందా లేదా భారతదేశ విలువైన విత్తన రకాలను కోల్పోయే ప్రమాదం ఉందా?
భారత ప్రభుత్వం 2025-26 కేంద్ర బడ్జెట్లో భాగంగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ మిషన్ పరిశోధనను మెరుగుపరచడం, తెగుళ్ళు, వాతావరణ సవాళ్లను నిరోధించే విత్తనాలను అభివ•ద్ధి చేయడం, జూలై 2024 నుండి విడుదలైన 100 కంటే ఎక్కువ కొత్త విత్తన రకాల (23 రకాల త•ణధాన్యాలు, 11 పప్పుధాన్యాలు, ఏడు నూనెగింజలు, ఇతరాలు) లభ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే, ఈ చొరవ ఏక పంటలను ప్రోత్సహిస్తుందని, సాంప్రదాయ పంట వైవిధ్యం మరియు దేశీయ విత్తన రకాలను దెబ్బతీస్తుందనే ఆందోళనలు పెరుగు తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మిషన్ యొక్క మూడు ప్రధాన లక్ష్యాలను పేర్కొన్నారు:
పరిశోధనను బలోపేతం చేయడం: ఈ మిషన్ కొత్త అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివ•ద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
నిరోధకతను మెరుగుపరచడం: ఇది తెగుళ్ళు, వాతావరణ ఒత్తిడిని నిరోధించే విత్తనాలను స•ష్టించడంపై ద•ష్టి పెడుతుంది, పర్యావరణ పరిస్థితులు మారినప్పటికీ అవి ఉత్పాదకంగా ఉండేలా చూస్తుంది.
వాణిజ్య లభ్యత: ఈ విత్తనాలను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచడం, ఈ రకాలను స్వీకరించమని ప్రోత్సహించడం లక్ష్యం. అధిక దిగుబడినిచ్చే విత్తనాల వైపు మొగ్గు విత్తన జీవవైవిధ్యాన్ని పణంగా పెట్టకూడదు.
భారతదేశం అనేక సంవత్సరాలుగా స్థానిక వాతావరణం మరియు నేలకు అనుగుణంగా మారిన సాంప్రదాయ మరియు స్వదేశీ విత్తనాల గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఈ విత్తనాలు తరచుగా తెగుళ్ళను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. తక్కువ రసాయనాలను ఉపయోగిస్తాయి. అయితే, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ప్రోత్సహించడం వల్ల స్థానిక విత్తనాలు తగ్గుముఖం పడతాయనే భయం ఉంది. రైతులు వాణిజ్యపరంగా సరఫరా చేయబడిన విత్తనాలను ఉపయోగించడం ప్రారంభిస్తే, సాంప్రదాయ రకాలకు డిమాండ్ తగ్గి, కాలక్రమేణా అవి కనుమరుగయ్యే అవకాశం ఉంది.
అదనంగా, కొన్ని అధిక దిగుబడినిచ్చే రకాలను విస్త•తంగా ఉపయోగించడం వల్ల ఏక పంట సాగుకు దారితీయవచ్చు. ఏక పంట అంటే పెద్ద ప్రాంతాలలో ఒకే పంటను పండించడం, ఇది తాత్కాలికంగా దిగుబడిని పెంచుతుంది కానీ పంటలను వ్యాధులు, తెగుళ్లకు గురి చేస్తుంది. ఏక పంటలు చారిత్రాత్మకంగా ఒక తెగులు లేదా వ్యాధి దాడి చేసి, మొత్తం పొలాలను నాశనం చేసినప్పుడు తీవ్రమైన పంట వైఫల్యాలకు కారణమయ్యాయి. ఇంకా, ఏకరీతి విత్తన రకాలకు మారడం వల్ల పరాగ సంపర్క వైవిధ్యం తగ్గవచ్చు, ఎందుకంటే వివిధ పంటలు, వాటి పుష్పించే చక్రాలు తేనెటీగలు, సీతాకోక చిలుకల జనాభాకు మద్దతు ఇస్తాయి. జీవ వైవిధ్యం కోల్పోయినప్పుడు, పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో రైతులు కూడా నష్టపోతారు.
ఈ మిషన్ కింద సాంప్రదాయ విత్తన రకాలను ఎలా రక్షించాలో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై మాత్రమే ద•ష్టి పెట్టడానికి బదులుగా, జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి వ్యవసాయ విధానాలు ఆధునిక మరియు సాంప్రదాయ విత్తనాల మిశ్రమాన్ని కూడా సమర్ధించాలి.
చిన్న తరహా రైతులు దేశీయ విత్తనాలను పొందలేకపోతే లేదా పండించలేకపోతే కార్పొరేట్ విత్తన కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉందనే ఆందోళనలు ఉన్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు రక్షణ కల్పించడం విత్తన సార్వభౌమత్వాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం.
భారతదేశ ఆహార భద్రతను పెంపొందించడం ఈ మిషన్ లక్ష్యం కాబట్టి, సాంప్రదాయ పంటలను రక్షించడం, విత్తన సార్వభౌమత్వాన్ని ప్రోత్సహించడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం వంటి భద్రతా చర్యలను అమలు చేయాలి. ప్రభుత్వం కమ్యూనిటీ విత్తన బ్యాంకులలో పెట్టుబడి పెట్టాలని, రైతులు నడిపించే విత్తన సంరక్షణకు మద్దతు ఇవ్వాలని, జీవవైవిధ్యానికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే విధానాలను రూపొందించాలని, అదే సమయంలో అధిక దిగుబడినిచ్చే రకాలను ప్రోత్సహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ గురించి మరిన్ని వివరాలు వెలువడుతున్నందున, అది జీవవైవిధ్యానికి విలువనిచ్చే సమగ్ర విధానాన్ని తీసుకుంటుందా లేదా భారతదేశ గొప్ప విత్తన వారసత్వాన్ని క్రమంగా కోల్పోవడానికి దోహదపడుతుందా అని వాటాదారులు నిశితంగా పరిశీలిస్తారు.
భారతదేశం అనేక సంవత్సరాలుగా స్థానిక వాతావరణం, నేలలకు అనుగుణంగా సాంప్రదాయ, స్వదేశీ విత్తనాల గొప్ప చరిత్రను కలిగి ఉంది.
-షిమాలి చౌహాన్
అనువాదం : ఎసికె.శ్రీహరి