175వ సంవత్సరంలోకి ప్రవేశించినజియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా

జి.ఎస్‍.ఐ (జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా) 1851లో మార్చి 4న స్థాపించబడింది. కానీ దీనికంటే ముందే 1836లో బ్రిటీష్‍ ప్రభుత్వం కోల్‍ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జీన్‍ మెక్‍లాండ్‍ని ఇన్‍చార్జిగా నియమించారు. ఇతనే మొట్టమొదటి జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా అనే టైటిల్‍ని తన రిపోర్ట్లో ఉపయోగించాడు. అతను తనను 1850 ఏప్రిల్‍ 1న జియోలాజికల్‍ సర్వేయర్‍గా నియమించు కున్నాడు. తరువాత 1851లో మార్చి 4 నాడు కోల్‍కత్తాలో జి.ఎస్‍.ఐ. ని స్థాపిం చారు. దానికి ఐర్‍ల్యాండ్‍ నుండి జియాలజి ప్రొఫెసర్‍ థామస్‍ ఓల్దామ్‍ని రప్పించి జి.ఎస్‍.ఐ.కి జియోలాజికల్‍ సర్వేయర్‍గా నియమించారు. ఆ రోజు అనగా 1851 మార్చి 4 నుండి జి.ఎస్‍.ఐ. యొక్క ప్రయాణం మొదలై దేశానికి ఎనలేని సేవలు అందిస్తూ ఖనిజ వనరులను వెలికి తీసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ 175వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి భారతీయుడు డా. ఎం.ఎస్‍. కృష్ణన్‍గారిని డైరెక్టర్‍గా నియమించారు.


మొట్టమొదటి జియోలాజికల్‍ మ్యాప్‍ మన దేశంలో హైదరాబాద్‍ ప్రాంతానికి చెందినది కావడం విశేషం. దీనిని తయారు చేసినది హెనరీ వెస్‍లీ వాయ్‍సీ అనే జియోలాజికల్‍ సర్వేయర్‍. ఖనిజ అన్వేషణలో నిమగ్నమై ఎన్నో ఖనిజ నిక్షేపాలను వెలికి తీసి ఎన్నో పరిశ్రమలకు రా మెటీరియల్‍ని సప్లై చేసి లెక్కలేనన్ని పరిశ్రమల స్థాపనకు తోడ్పడింది. మొట్టమొదట కోల్‍, సిమెంట్‍, ఐరన్‍, అల్యూమినియం, కాపర్‍, లెడ్‍, జింక్‍, ఫర్టిలైజర్‍, మినరల్స్పై దృష్టి సారించి వాటికి చెందిన పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో తోడ్పడింది.


ఈ 175 సంవత్సరాలలో లెక్కలేనన్ని ఖనిజ వనరులను అన్వేషించి వెలికి తీసి దేశ ఆర్థిక పరిస్థితిని నిర్విరామంగా మెరుగుపరుస్తూనే ఉంది. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో జి.ఎస్‍.ఐ. తన విభాగాన్ని స్థాపించి ఆయా రాష్ట్రంలోని ఖనిజ వనరులను వెలికి తీస్తు వస్తున్నారు. ఈ అన్వేషణలో జియాలజిస్టులు, జియోఫిసిస్ట్లు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించారు. అందిస్తూనే ఉన్నారు. ఇవే కాకుండా ఇంజినీయరింగ్‍ ప్రాజెక్ట్లలో ఫౌండేషన్స్కు వారి ఎక్స్పర్టీస్‍ను ఉపయో గిస్తారు. ఇప్పుడు దేశానికి కావలసిన అత్యంత విలువైన క్రిటికల్‍ మినరల్స్పై దృష్టి సారించారు జి.ఎస్‍.ఐ. మరియు కేంద్ర గనుల శాఖ. వీటిని వెలికి తీసి దేశాన్ని ఆర్థికంగా బలపరిచే ప్రయత్నంలో నిమగ్నమైనది.


జి.ఎస్‍.ఐ. 175వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా దేశవ్యాప్తంగా మార్చి 2న వాక్‍థాన్‍ నిర్వహించారు. మార్చి 4న ప్రతి రాష్ట్రంలోని జి.ఎస్‍.ఐ. కార్యాలయంలో స్థాపన దినాన్ని ఘనంగా సెమినార్‍లు, మీటింగ్‍లు జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొనడానికి సర్వీస్‍లో ఉన్నవారే కాకుండా రిటైర్డ్ జియో సైంటిస్టులందరినీ ఆహ్వానించారు. వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. కోల్‍కత్తా హెడ్‍ క్వాటర్‍లో కేంద్ర గనులమంత్రి కిషన్‍రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి 175వ స్థాపన దినాన్ని జి.ఎస్‍.ఐ. డైరెక్టర్‍ జనరల్‍ ఎస్‍.కె. సాహా పలు ప్రముఖ జియో సైంటిస్టుల సమక్షంలో ఘనంగా జరుపబడినది.

  • కమతం మహేందర్‍ రెడ్డి,
    ఎ : 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *