సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,
రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు)


ఆహారం విషపూరితం
2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన ఆహారమే! ఇప్పుడు తింటున్న ఆహారం మరింత విషపూరితంగా మారిపోతోంది.


పురుగు మందులు
జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహారం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవడానికి పురుగుమందులు తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది. గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎమల్షన్‍ రూపంలో నీటిలో కలిసిపోయే రకం పురుగుమందులను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అమెరికాలో జన్యుమార్పిడి సోయాబీన్స్ను ఉత్పత్తి చేసే క్రమంలో జరిపిన ప్రయోగ ఫలితాలను బట్టి శాస్త్రవేత్తలకు ఈ ఆలోచన వచ్చింది.


కలుపు మందులతో ముప్పు.
సోయాబీన్స్ పొలంలో మొలిచే కలుపు మొక్కలను నిర్మూలించేందుకు శాస్త్రవేత్తలు కలుపు నివారణ మందులను తయారు చేశారు. అయితే, ఈ కలుపు మందులు వాడినప్పుడు ప్రధాన పంట కూడా దెబ్బతిన్నది! కలుపు మందుకి 2-4-డి. దీనికి ‘ఏజెంట్‍ ఆరెంజ్‍’ అనే మరో పేరు కూడా ఉంది. మొక్కలు చూస్తుండగానే మాడిపోయేలా చేయడానికి దీన్ని వియత్నాం యుద్ధంలో వాడారు. సోయాబీన్‍ పంటలోకి చేరింది. ఈ రసాయనం క్రమంగా ఫెనోలిక్‍ కాంపౌండ్‍గా రూపుదాల్చి, కొంత మేరకు నీటిలో కరిగే స్వభావం కలిగిన ‘గ్లైఫొసేట్‍’ వంటి కలుపు మందులను కనుగొన్నారు.


సరిగ్గా ఈ దశలోనే ‘కేన్సర్‍’ పుట్టిందని ఆహార శాస్త్రవేత్త డాక్టర్‍ ఖాదర్‍ వలీ అంటున్నారు! ఈ క్రమంలోనే నీటిలో కరిగే కలుపు మందుల ఉత్పత్తి, వాడకం పాశ్చాత్య దేశాల్లో పెద్దఎత్తున ప్రారంభమైంది. పర్యావరణ వ్యవస్థలోకి రసాయనాలు చేరిపోవటం అలా మొదలైంది. దక్షిణ దృవంలో నివసించే పెంగ్విన్ల దేహాల్లోకి కూడా ఈ విషాలు చేరిపోయాయంటే వ్యవసాయ రసాయనాలు యావత్‍ భూగోళాన్నే ఎంత విషతుల్యంగా మార్చాయో అర్థం చేసుకోవచ్చు. మన దగ్గర కూడా ఈ రసాయనాలను చాలా విస్తారంగా వినియోగిస్తుండడంతో మన పర్యావరణ వ్యవస్థలోకి కూడా విషత్యుల పదార్థాలు పెద్దఎత్తున చేరిపోయాయి.


కల్తీవంట నూనెలు

కేన్సర్‍ వ్యాధి విజృంభించడానికి మరో ముఖ్య కారణం వంట నూనెల రంగం. ముడి చమురును శుద్ధి చేసే క్రమంలో అనేక మూలకాలు వెలువడతాయి. సి-8 యూనిట్ల కన్నా ఎక్కువ ఫ్రాక్షన్లు ఉన్న మూలకాలను ఇంధనంగా వాడుతున్నారు. అంతకన్నా తక్కువ ఉన్న మూలకాలతో మినరల్‍ ఆయిల్‍ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కృత్రిమ రసాయనాలను కలపడం ద్వారా పొద్దుతిరుగుడు నూనె, కొబ్బరి నూనె మాదిరిగానే ఉండే కృత్రిమ నూనెను కలిపి ప్యాకెట్లు చేసి మార్కెట్‍లో అమ్ముతున్నారు. ఆ విధగా విషపూరితమైన రసాయనాలు వంట నూనెల రూపంలో మనుషుల దేహంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకే ఆహారోత్పత్తి పద్ధతులను, ఆహార శుద్ధి పక్రియలను రసాయన రహితంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పంటల సాగులోను, వ్యవసాయోత్పత్తుల శుద్ధి కర్మాగారాల్లోనూ విష రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది! రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం మానేసి కట్టెగానుక నూనెలను వాడటం ఆరోగ్యదాయకం.


జన్యుమార్పిడి పంటలు
కేన్సర్‍ వ్యాధి విపరీతంగా విస్తరించడానికి జన్యుమార్పిడి మొక్కజొన్న సాగు కూడా మరో ముఖ్య కారణం. జన్యుమార్పిడి సోయాబీన్స్ను తయారు చేసిన రసాయనిక / ఔషధం కంపెనీలే జన్యుమార్పిడి మొక్కజొన్నను కూడా రూపొందించాయి. ఈ మొక్కజొన్నలో కొవ్వు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది (మొక్కజొన్నలో సాధారణంగా 100 గ్రాములకు 1 మిల్లీ గ్రాము కొవ్వు ఉంటుంది). ఈ జన్యుమార్పిడి మొక్క జొన్నను పశువులకు, కోళ్ళకు మేపుతున్నారు. పాల ఉత్పత్తులు, మాంసం, పంది మాంసం, కోడి మాంసం, కోడిగుడ్లు తదితర ఆహారోత్పత్తుల ద్వారా నీటిలో కరిగే విషతుల్యమైన రసాయనాలు మనుషుల దేహాల్లోకి చేరిపోతున్నాయి. కూరగాయలు కూడా విషరసాయనాల బారిన పడ్డాయి. బేకింగ్‍ పరిశ్రమదారులు బిస్కెట్లు, కేకులు వంటి ఉత్పత్తుల్లో పశువుల కొవ్వు పదార్థాలను వాడుతున్నారు.


తినకూడనివి : వరి బియ్యం, గోధుమలు, పంచదార, మాంసాహారం, పాలు


‘‘కేన్సర్‍ను విజయవంతంగా జయించిన వారు గానీ లేదా కేన్సర్‍కు చికిత్స పొందుతున్న వారు గానీ లేదా కేన్సర్‍ జబ్బు బారిన పడకూడదనుకున్న వారు గానీ… వరి బియ్యం, గోధుమలు, పంచదార, మాంసాహారం తినకూడదు. పాలు తాగకూడదు’’ అని డాక్టర్‍ ఖాదర్‍వలి అంటున్నారు. ‘‘ఇవి మన దేహంలోకి రసాయనాలను చేరుస్తాయి. ఆ రసాయనాలు మన దేహంలోని అణువణువులో క్రమంగా పోగుపడి (బయోకాన్సంట్రేషన్‍) జబ్బును కలిగిస్తాయి. అందువల్లనే కేన్సర్‍ను విజయవంతంగా ఎదుర్కోవాలనుకుంటే వీటిని మన ఆహారంలో నుంచి తొలగించాల్సిందే’’నని ఆయన చెబతున్నారు.


కాఫీ, టీ, పాలు తాగరాదు. పెరుగు, మజ్జిగ వాడవచ్చు. ‘‘ఇంత కఠినమైన ఆహార నియమాలు పాటించడం సాధ్యమయ్యే పనేనా అంటూ ప్రజలు అపనమ్మకంతో, ఆశ్చర్యంతో నా వంక చూస్తుంటారు. అటువంటప్పుడు నేను ఏ సందిగ్ధమూ లేకుండా బలంగా చెప్పే మాట ఒక్కటే. ముమ్మాటికీ సాధ్యమే! ఇటువంటి నియమబద్ధమైన జీవన శైలిని అనుసరించడం సాధ్యమే. తు.చ. తప్పకుండా అనుసరిస్తున రోగులెందరో నాకు తెలుసు. మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, మన వృత్తి, క్రమం తప్పని శారీరక వ్యాయామం. నడక, యోగా, మంచి అలవాట్లు, ధ్యానం, మన ఆసక్తులు… ఇవన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. అయితే నిరంతర వత్తిడితో కూడిన పాశ్చాత్య జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తూ మనవైన ఆహారపు అలవాట్లను మనం మరచిపోయాం. వేళా పాళా లేకుండా తినటం, అనారోగ్యకరమైన పోషకాల్లేని ఆహార పదార్థాలను తినటం అలవాటు చేసుకున్నాం.


పాల దిగుబడి పెంచేందుకు పాడి పశువులకు ఆక్సీటోసిన్‍ / ఈస్ట్రోజన్‍ హార్మోన్లు ఇస్తున్నారు. ఇటువంటి పాలు తాగటం వల్లనే తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నాం.
గోధుమ పిండిని మైదా పిండిగా మార్చటానికి అలొక్సాన్‍ అనే బ్లీచింగ్‍ రసాయాన్ని వాడుతున్నారు. ఆ మైదా పిండితో బిస్కట్లు, తదితర బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఇవి తిన్న వారి దేహాల్లో క్లోమ గ్రంధికి బీటా సెల్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం నశిస్తోంది. ఇన్సులిన్‍ను నిల్వచేసి, అవసరం మేరకు విడుదల చేయటంలో ఈ బీటా సెల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. మైదా తినటం వల్ల మనుషులు మధుమేహ రోగులుగా మారడానికి ఇదే కారణం. సిరిధాన్యాలతో రోగరహిత, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం!


పంచరత్న సిరిధాన్యాల విశేష గుణాలు

ఈ సిరిధాన్యాలు, చిరు ధాన్యాలు కావు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సహజ ఆహార ధాన్యాలు. వీటిని వాడుతూ ఎవరైనా కానీ 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో వారి వ్యాధిని నిర్మూలించుకోవచ్చు. సిరిధాన్యాలు పోషకాలను అందించటమే కాకుండా, రోగ కారకాలను శరీరంలో నుంచి తొలగించి, దేహాన్ని శుద్ధి చేస్తాయి.


ఏ సరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది?

  1. కొర్రలు (Foxtail Millet) : నరాల శక్తి, మానసకి దృఢత్వం, ఆర్ధ్రయిటిస్‍, పార్కిన్‍సన్‍, మూర్చరోగాల నుండి విముక్తి.
  2. అరికలు (Kodo Millet) : రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబిటిస్‍, మలబద్ధకం, మంచినిద్ర.
  3. ఊదలు (Branyard Millet) : లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్‍ గ్లాండ్స్), కొలెస్టరాల్‍ తగ్గించడం, కామెర్లు.
  4. సామలు (Little Millet) : అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, థైరాయిడ్‍, సంతానలేమి సమస్యల నివారణ.
  5. అండు కొర్రలు (Browntop Millet) : జీర్ణాశయం, ఆర్థ్రయిటిస్‍, బి.పి. కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.


ఏ ఆహార పదార్థ గుణగణాలైనా దానిలో ఉండే ఫైబర్‍, కార్బో హైడ్రేట్‍ల నిష్పత్తిని బట్టి నిర్ణయింపబడుతుంది. వీటి నిష్పత్తి 10 కంటే తక్కువ ఉండే పదార్థాలు రోగాలను తగ్గించ గలిగే శక్తి ఉన్న ఆహారం కింద లెక్క. ఈ సిరిధాన్యాలలో ఈ నిష్పత్తి 5.5 నుంచి 8.8 వరకు ఉంటుంది. వరి బియ్యంలో ఆ నిష్పత్తి 385 ఉంటుంది. ముడి బియ్యం, గోధుమలలో కూడా ఈ నిష్పత్తి పెద్దగా తేడా లేదు. మనిషికి కావలసిన పోషకాలు, ప్రోటీన్లు, పిండిపదార్థం, పీచుపదార్థం సిరిధాన్యాల్లో సమతూల్యంగా ఉన్నాయి. ఈ 5 రకాల సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా ఒక్కోదాన్ని వేర్వేగా కొన్ని రోజులు అవర్తనంగా తింటూ ఉంటే జబ్బులు పోతాయి. కొత్త జబ్బులు రావు.

  • ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు
    డా।। ఖాదర్‍ వలి రచించిన
    ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ నుంచి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *