తెలంగాణ రాష్ట్రంలోని దిగుడు బావులను గుర్తించి, వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. అలాంటి స్టెప్‍వెల్ (దిగుడు బావులు) లను గుర్తించడానికి హైదరాబాద్ డిజైన్ ఫోరమ్ (హెచ్‍డిఎఫ్) సంస్థను భాగస్వామ్యం చేసుకుందని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ భాగస్వామ్యంలో సూచించిన ప్రతిపాదిత వాటి పునరుద్ధరణ పూర్తయిన తర్వాత డిపార్ట్మెంట్ మరిన్ని బావులను పునరుద్ధరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మరియు చుట్టుపక్కల చారిత్రాత్మకంగా ముఖ్యమైన 10 స్టెప్‍వెల్ (దిగుడు బావులు)ల పునరుద్ధరణను చేపడుతుంది. అందులో భాగంగా మొజామ్ జాహీ మార్కెట్ పునరుద్ధరణను పూర్తి చేసింది.
తరువాత గుడిమల్కాపూర్‍లోని భగవాన్‍దాస్ భాగ్ స్టెప్‍వెల్‍ను శుభ్రపరచడం జరుగుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘స్టెప్‍వెల్‍లను శుభ్రం చేయడానికి, రక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి అందరం చేతులు కలుపుదాం’’ అని వారు ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 140 స్టెప్‍వెల్‍లు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‍లో 60 ఉన్నాయి. అయితే, రామనాజ్‍పూర్‍లోని సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో పుష్కర్ణి మరియు మౌలా అలీ వద్ద ఉన్న బావి వంటి కొన్నింటిని మినహాయించి, మిగతావి అధ్వాన్న స్థితిలో ఉన్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‍మెంట్ విభాగం ప్రతిపాదిత వాటిని పునరుద్ధరించిన తర్వాత మరిన్ని స్టెప్‍వెల్‍ల పునరుద్ధరణను చేపట్టనుంది.
‘‘కుతుబ్ షాహీలు, కాకతీయులు వేసవిలో ప్రయాణించే బాటసారులకు విశ్రాంతిని అందించడానికి స్టెప్‍వెల్‍లను కట్టించారు. స్టెప్‍వెల్స్ దగ్గర ఉష్ణోగ్రత బయట కంటే చాలా తక్కువగా ఉంటుంది. స్టెప్‍వెల్స్ తెలంగాణ యొక్క ముఖ్యమైన మైలురాళ్లలో ఒకటి. దక్కన్, కాకతీయ పాలన నుండి అవి ప్రసిద్ధమైనవి. దురదృష్టవశాత్తు కొంత కాలంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. వాటిలో చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. మేము పునరుద్ధరణను చేపట్టనున్నా’’ మని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్ డిజైన్ ఫోరమ్ రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో స్టెప్‍వెల్‍లను సర్వే చేస్తోంది. ఇప్పటి వరకు 100కి పైగా గుర్తించింది. ప్రభుత్వానికి 16 స్టెప్‍వెల్‍ల జాబితాను సమర్పించింది. వాటిలో మొదటి దశ పనుల కోసం 10 బావులను గుర్తించి పని ప్రారంభించనుంది. ఈ ఫోరం వాటి చరిత్ర, నీటిని తట్టుకునే సామర్థ్యం మొదలైన వాటితో సహా స్టెప్‍వెల్‍ల సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి సహాయం చేస్తుంది.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88