నవంబర్ 1న మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ ఆవరణలో హైదరాబాద్ గచ్చుబౌలిలో ఈ జలపునరుద్దరణ కార్యక్రమానికి ఔత్సాహికులు నాంది పలికారు. దక్కన్ ప్లాటూ ఆధ్వర్యంలో భూగర్భజలాల పరిరక్షణ, నర్మద, గోదావరి, కృష్ణానదుల ద్వారా అందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వాలని తీర్మానించారు. ప్రకృతి సిద్దమైన ఈ జలవనరులను సాంకేతిక విజ్ఞానం ద్వారా శుద్దీకరించి, ప్రజలకు తాగునీటి సౌకర్యమే కాక, పంట పొలాలకు కూడా నీటి సౌకర్యము కల్పించాలని వీరి ఆకాంక్ష.
కాకతీయ రాజుల కాలంలోనే ప్రజలకు నీటి సౌకర్యాలు చాలా చక్కగా చేసారు. వీరు ప్రజలకు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు కట్టించి, బావులు తవ్వించి నీటి సౌకర్యం కల్పించారు. ఈ రాజులు ప్రజలకు చేసే ఈ సేవలకు ఆనాటి ధనవంతులు, సమాజంలోని గొప్ప గొప్ప వ్యాపార వేత్తలు సైతం ఈ ‘బృహత్ కార్యం’లో తమ మద్దతు తెలిపారు.
వీరు వర్షపు నీరు వృధా కాకుండా ట్యాంక్‍లో, ఇంకుడు గుంతల ద్వారా నీటిని నిలువ చేసేవారు. ఈ నీటిని నిలువ చేసే కార్యక్రమం ‘కుతుబ్ షాహి’ వారు కూడా ఆదచరించి ఆ కార్యక్రమాన్ని ‘ఖనత్’ అనే పేరుతో పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత ఈ ట్యాంక్‍లో చెత్తకుండీలుగా మారాయి. ప్రతి సంవత్సరం వర్షాభావ పరిస్థితులు మారి ప్రజలకు నీరు సరిగా అందక బాదలకు గురి అవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నీరు వృథా కాకుండా, భూగర్బ జలాలు రక్షించాలని, వాటర్ ట్యాంక్స్ను పునరుద్ధరించాలని కంకణం కట్టుకుంది. ఈ పథకం ద్వారా ప్రాణాధారమైన నీటిని రాబోయే తరాలకు అందించవలసిన అమూల్యమైన వారసత్వం మనందరిది.
ఈ కార్యక్రమానికి సయ్యద్ అమునుల్ హసన్ గారు వైస్ ఛాన్సలర్‍గా (మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ) ముఖ్య అతిథిగా, అరవింద్ ఐఎఎస్ గారు, సజ్జద్ షాహీద్‍గారు, ప్రొపెసర్ షకీల్ అహమ్మద్‍గారు మరియు డా. సుభాష్‍గారు సమన్వయంగా ఈ పథకం గురించి మాట్లాడారు. నవంబర్ 1 నుంచి ఈ పథకం ప్రణాళిక తయారు చేస్తామని తెలిపారు. అరవింద్‍కుమార్ ఐఏఎస్ ప్రభుత్వం కూడా ఈ ప్రణాళికపై శ్రద్ద చూపుతుందని పేర్కొన్నారు.
ఒక సంవత్సర కాలంలోనే జలజీవన పునరుద్దరణ కార్యక్రమం ద్వారా ప్రజలకు నీటి వసతి కల్పిస్తామని ఈ పథకానికి రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని ఈ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రొఫెసర్ సంజయ్ సుబోద్ తన బృందంతో కలసి హైదరాబాద్ నగరంలోని గోల్కొండ, భువనగిరి, బీదర్ ప్రాంతాలు దర్శించి అచ్చటి చారిత్రాత్మక నీటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో గ్రహించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ షకీల్ అహ్మద్ స్వస్తి వాచకం పలికారు. డాక్టర్ ఎ. సుభాష్ అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు.
- దక్కన్‍న్యూస్,
ఎ : 9030 6262 88