రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు, ప్రచురణకర్తలు, విద్యార్థులు, తదితరుల అందరిని ఒక చోట చేర్చి అన్ని అంశాలపై చర్చించే కార్యక్రమం మళ్లీ ప్రారంభంకానుంది. 2010లో మొదలైన ఈ వేదిక అన్ని విషయాలను తెలియజేస్తూ అందరిలోనూ ఉత్సహం మింపే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ మొదలైంది. అన్ని రకాల రూపాల్లో సృజనాత్మకతను జరుపుకునే వార్షిక కార్యమ్రంగా చెప్పవచ్చు ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍ను. చర్చలు, సంభాషణలు, ప్యానెల్ చర్చలు, పఠనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍లో నిర్వహిస్తారు. దేశవిదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులను పిలిపించి అనేక అంశాలపై ఈ ఫెస్టివల్‍లో చర్చిస్తారు. సాహిత్యం, కళలు,విజువల్ ఆర్ట్స్, సంస్కృతి మరియు వారసత్వం యొక్క పరిశీలనాత్మక కలయిక వేడుక ద్వారా సంరక్షిస్తుంది.
2010లో ప్రారంభమైన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ తొమ్మిదవ ఎడిషన్ కు సిద్ధమైంది. దేశవిదేశాలకు చెందిన కళాకారులు, రచయితలు, విద్యావేత్తలు ఈ ఫెస్టివల్‍కు హాజరుకానున్నారు. జనవరి 25 నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. పలు అంశాలపై చర్చాగోష్ఠిలు కొనసాగనున్నాయి. చిన్న పిల్లలకు ఆర్టస్ వర్క్ షాప్, పెద్దవాళ్ల చర్చలు, పుస్తకాల ప్రదర్శన, ఆర్ట్ ఎగ్జిషన్ తదితర కార్యక్రమాలు ఈ పెస్టివల్‍లో నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 8 గంటల వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍లో అందరికి ఉచిత ప్రవేశం ఉంటుంది. సాహిత్యం, కళలపై యువతియువకుల అవగాహన తగ్గుతున్న క్రమంలో ఇలాంటి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ ఫెస్టివల్‍లో సినిమాల ప్రదర్శనలు, ఆర్ట్స్ కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సహంగా, సరదాగా కుటుంబం మొత్తం వచ్చి ఈ ఫెస్టివల్‍లో ఎంజాయ్ చేసే విధంగా నిర్వహిస్తారు.
వాడీవేడి చర్చలు.. జీవితపు అనుభవాలు నేర్పిన పాఠాలతో తాము మార్చుకున్న విధానాలు… సృజనాత్మక కళారూపాలు.. హైదరాబాదీ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చిత్రించే చిట్టి చేతుల రాతలు… మనసును ఉప్పొంగించే సంగీతం నడుమ ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍ను నిర్వహిస్తారు. వివిధ కళావిభాగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఫెస్ట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్‍గా నిలుస్తాయి. ప్రతిరోజు సాయంత్రం వివిధ భాషలపై నాటకాల ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కామెడితో పాటు ఆర్టస్కి ప్రాధాన్యం ఇచ్చే ఇన్నోవేటివ్ ఆలోచనతో థియేటర్ గ్రూపులు చేసిన ప్రదర్శనలు జనాన్ని అలరించనున్నాయి. నాట్యకళారీతులతో కూడిన ప్రదర్శనలు గురించి ఇక చెప్పక్కర్లేదు. ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‍లో మొదటి తరం బ్లాక్ అండ్ వైట్ మూవీల నుంచి లగాన్ కలర్ సినిమాల దాకా ఎన్నో సామాజిక నేపధ్యం ఉన్న సినిమాలు ప్రదర్శిస్తారు. మారుతున్న కాలంతో పాటు కల్చర్‍లో ఎంతో మార్పొస్తోంది. దీన్ని అనుగుణంగా మారుతునే మన గతాన్ని మరవకూడదని వక్తలు అభిప్రాయపడ్డారు. కొత్త తరానికి మన కల్చర్ తెలియాల్సిన అవసరంపై ప్రసంగంలో వివరించే ప్రయత్నం ఈ ఫెస్టివల్‍లో చేస్తారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ను నిర్వహిస్తారు.
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‍లో ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఉత్సవాలకు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు 200 మంది హాజరుకానున్నారు. వీరిలో లిటరరీ, కల్చరల్, ఆర్టిస్టులు, సినిమా ప్రముఖులుంటారని తెలిపారు. ఈ ఏడాది గెస్ట్ నేషన్‍గా చైనా, స్టేట్ గెస్ట్గా గుజరాత్ రాష్ట్రం ఉంటుందన్నారు. దాదాపు 10 గంటల పాటు పొయెట్రీ (పద్యం)పై వివిధ భాషల్లో కార్యక్రమాలుంటాయన్నారు. ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్లు, లఘు చిత్రాల ప్రదర్శనలు ఉంటాయి అన్నారు. ప్రముఖ సినీనటులు మల్లికా సారాభాయి, షబానా అజ్మీ, ప్రముఖ గుజరాతీ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సితాన్షు యశస్పంద్ర, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‍సింగ్ తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు. ఎకనమిక్స్, మీటూ, ఆధార్ వంటి అంశాలపై చర్చా గోష్టులుంటాయన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధేయన్ స్కాలర్స్ సుదర్శన్ అయ్యంగార్, సుధీర్‍చంద్ర ప్రసంగిస్తారని తెలిపారు.
- దక్కన్‍న్యూస్, ఎ : 9030 6262 88