బాలారణ్యంలో ఒక రోజు

బాలారణ్యను చూడడం అంటే అదెంతో ఆనందం కలిగించేదే. బాగా దప్పిక గొన్న వేళ ఎడారిలో ఒయాసిస్‍ ను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో అలాంటి భావన కలుగుతుంది.
బాలారణ్య అనేది ఒక స్థలం మాత్రమే కాదు. ఎన్నో సవాళ్ళ మధ్య…. జీవితాన్ని అనుభూతి చెందేందుకు ఒక నూతన విధానం కూడా. నైట్‍ అడ్వెంచర్‍ క్యాంప్‍ ఆక్స్ ఫర్డ్ విద్యార్థులందరి ముఖాల్లో చిరునవ్వులు విరబూసేలా చేసింది.


బడికి వెళ్ళడం, ట్యూషన్లు, ఆటలకు కోచింగ్‍ ఇలాంటి రోజువారీ హడావిడి మధ్య బాలారణ్య మనకు గ్రామీణ జీవితాన్ని కళ్ల ముందు కనిపించేలా చేసింది. పిల్లలు రోజూ జీవితం గడిపేది కాంక్రీట్‍ అరణ్యంలోనే. అయితే పిల్లలు తమకు తాముగా టెంట్‍ వేసుకోవడం, పచ్చిక బయళ్లపై తమ బసను సౌకర్యవంతంగా మార్చుకోవడం, చుక్కలతో ఉండే ఆకాశాన్ని చూస్తూ గడపడం మాత్రం వారికొక సరికొత్త అనుభూతిని అందిస్తుంది. చలికాలపు రాత్రి పూట అది క ఆనందదాయక పాఠాన్ని అందిస్తుంది. పొలాల నుంచి చిన్న కట్టెముక్కలను సేకరించి చలి మంట వేసుకోవడం సాయంత్రపు వేళను మరింత ఆనందదాయకం చేసింది. హాట్‍ ఎయిర్‍ బెలూన్ల టెక్నిక్‍ ను ఉపయోగించి రాత్రి పూట దీపం ఎగురవేయడం, దాని ప్రకాశంతో చీకటిని పారదోలడం ఒక అద్భుత అనుభూతి. సంగీతం, వినోదం, ఆటలు అన్నీ కలగలసి ఈ ప్రయాణాన్ని మధుర అనుభూతిగా మార్చాయి.


పాతకాలపు నాటి ప్రయాణ సాధనమైన ఎడ్లబండిని తిరిగి నిర్మించడం ఒక గొప్ప కళగా కనిపించింది. ఆ బండి చక్రం మన నాగరికతకు ఒక ప్రతీకగా కనిపించింది. వెదురుతో ఎడ్ల బండి రూపొందించడం, చక్రాలకు రంగులు వేయడం, ఎడ్లను అలంకరించడం ఒక చక్కటి అనుభూతిని అందించాయి. ఇక బురద మార్గంలో ఎడ్లబండిలో ప్రయాణం అప్పటి వరకూ ఎన్నడూ చేయని ప్రయాణ అనుభవాన్ని అందించింది. అప్పటి వరకూ అలాంటివాటిని సినిమాల్లో మాత్రమే చూశాం.
కాటాపల్ట్ ను తయారుచేయడం ఒక సైన్స్. దాన్ని ఊహించు కోవడం మాకు మరెంతో గొప్ప. కర్రలు, తాడు, బుట్ట, నీటి బెలూన్లు ఉపయోగించి దాన్ని తయారు చేయడంలో సైన్స్ సూత్రాలెన్నో గుర్తుకొచ్చాయి. ప్రాచీన కాలపు యుద్ధరంగం సృష్టించాం. ఫిరంగి గుళ్ల మాదిరిగా బెలూన్లను ప్రయోగించాం. అవి గాల్లోకి ఎగిరి కొంతదూరంలో కిందపడడం ‘యురేకా’ అనేలా చేసింది.


దిష్టిబొమ్మల కథలెన్నో విన్నాం. పొలాల్లో వాటిని నిజంగా చూశాం. రాత్రి వేళ చల్లటి గాలికి అవి కదలడం చూశాం. కర్రలు, కుండ లాంటివి ఉపయోగించి పిల్లలే వాటిని తయారు చేశారు. కుండకు రంగులు వేసి దాన్ని ముఖంలా చేశారు. పంటలను పాడు చేసే పక్షులను దూరంగా పారదోలేందుకు అది తోడ్పడం చూస్తుంటే, అది ఎంతో స్నేహపూర్వకంగానే కనిపించింది.
ఆవుల పాకను చూశాం. పాలు పితకడం, పేడతో సేంద్రియ ఎరువు తయారు చేయడం, బయోగ్యాస్‍ ఉపయోగించడం చూశాం. వ్యర్థాల నుంచి విద్యుత్‍ శక్తిని తయారు చేయడం అనేది పిల్లలకు ఓ కొత్త అనుభవం. రోజూ తాగే గ్లాసెడు పాల వెనుక ఉండే కష్టం ఏమిటో అర్థమైంది.
ట్రాక్టరు పై కూర్చోవడం, దానిపై ప్రయాణం అనేది పిల్లలకు నిజమైన డాక్యుమెంటరీ సినిమాలలా అని పించింది. రైతుల కష్టాన్ని గౌరవిం చేందుకు, అర్థం చేసుకునేందుకు వీలు కలిగింది.


సింధూ లోయ నాగరికత సందర్భంగా ప్రజలు రవాణా సాధనాలుగా చెక్కమొద్దుల నుంచి నావలు తయారు చేసుకున్నారు. రాఫ్ట్ ను తయారు చేయడం ఎంతో నైపుణ్యంతో కూడుకున్నది. థర్మకోల్‍, టైర్లు, కర్రలు ఉపయోగించి దాన్ని తయారు చేయడం విద్యార్థులకు ప్రాక్టికల్‍ నాలెడ్జ్ ను అందించి నట్లయింది. తాము తయారు చేసిన రాఫ్ట్ ను నీటిలోకి తోయడం, అది తేలుతుంటే చూడడం పిల్లలకు అద్భుత అనుభూతిని అందించింది.
శారీరకంగా శ్రమించేందుకు, ఏకాగ్రతతో ఉండేందుకు విద్యార్థులు తాళ్లను పట్టుకొని నదిని దాటారు. బర్మా బ్రిడ్జి యాక్టివిటీని చేపట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం పిల్లల్లో భయం పోగొట్టడం, జీవితంలో సవాళ్లను సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేలా చేయడం. సురక్షిత చర్యల మధ్య, ఒక మూల నుంచి మరో మూలకు తాళ్లపై నడవడం విద్యార్థులకు ఒక గొప్ప అనుభూతిని అందించింది.
గ్రామీణ వాతావరణంలో జీవితంలోని వివిధ అంశాలపై ప్రాక్టికల్‍ నాలెడ్జ్ పొందుందుకు ఈ పర్యటన తోడ్పడింది. తరగతి వెలుపల నేర్చుకోవడాన్ని ఇది మెరుగుపర్చింది. ప్రకృతి ఒడిలో సేదదీరేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా పిల్లలు వదులుకోలేదు.

  • నబోయిన స్వామి, ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *