- ఇన్టాక్ పాలకమండలి సభ్యుడిగా మణికొండ వేదకుమార్
- ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఇన్టాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా మూడోసారి ఎన్నిక
ప్రతిష్టాత్మకమైన ఇన్టాక్ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్ కార్యకర్త మణికొండ వేదకుమార్ ఢిల్లీలో జరిగిన 2022 ఇన్టాక్ ఎన్నికల్లో వరుసగా మూడవసారి అత్యధిక మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు. ‘ఇన్టాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్’గా ఎన్నికయ్యారు. 2016, 2019 ఇన్టాక్ ఎన్నికల్లో సైతం ఎన్నికయ్యారు. దేశ వ్యాప్తంగా చారిత్రక సంపదను కాపాడటం కోసం మూడు దశాబ్దాలుగా చేసిన కృషికిగాను ఇన్టాక్ సభ్యులు వరుసగా మూడోసారి ఎన్నుకునేలా చేసింది.
దేశం సుస్థిరమైన అభివృద్ధి కోసం వారసత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్న ఆయన, భారతదేశం యొక్క నిర్మిత, సహజ మరియు అసాధారణమైన వారసత్వం యొక్క వైభవాన్ని పరిరక్షించడానికి, గౌరవించడానికి, సంరక్షించడానికి మరియు సంరక్షించడానికి కీలకమైన అవసరాన్ని విధాన రూపకర్తలకు తన సూచనల ద్వారా తెలియ చేయడంలో మరియు వాటిని కాపాడుకోవలసిన ఆవశ్యకతను ప్రజలలో అవగాహన కల్పించడంలో ఆయన చేస్తున్న నిరంతర కృషికి ప్రభావితమైన ఇంటాక్ సభ్యులు ఆయనను తమ పాలక మండలి సభ్యుడుగా తిరిగి ఎన్నుకొన్నారు.
ఎం.వేదకుమార్ వృత్తిరీత్యా ఇంజినీర్ అయినప్పటికీ, ప్రవృత్తిరీత్యా హెరిటేజ్ కార్యకర్త. వీరు సుమారు మూడు దశాబ్దాలుగా ఈ రంగంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. 2001 నుంచి వేదకుమార్ ఇన్టాక్ సంస్థతో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఐకోమాస్ (ICOMOS) సంస్థలో సైతం మెంబర్‌గా సేవలు అందించారు. ఇన్టాక్ ఏపీ రాష్ట్ర శాఖకు కో-కన్వీనర్‌గా 2012 నుంచి 2014 వరకు కొనసాగారు. ఈ సమయంలో ఎన్నో ప్రహరీలు, రాక్ ఫార్మేషన్స్ (శిలల సహజసిద్ధ కళాకృతులు), కట్టడాలు మరియు స్థానిక నిర్మాణ శైలుల పరిరక్షణకు ఎంతోగానో కృషి చేశారు. 2009లో ఇన్టాక్ కన్వీనర్‌గా వేదకుమార్ ఉన్న సమయంలో సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలను నిర్వహించారు. అందులో భాగంగా ఎన్నో హెరిటేజ్ కార్యకలాపాలను నిర్వహించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఎన్నో టీవీ చానళ్లు, రేడియో స్టేషన్స్‌లో దృశ్య, అదృశ్య రూపాల్లోని వారసత్వ అంశాలపై ఎన్నో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కన్వీనర్‌గా ఉన్న సమయంలో అర్బన్ ప్లానింగ్, అభివృద్ధి, నిర్వహణ, వారసత్వ పరిరక్షణ, చెరువులు, జలాశయాలు, నీటి సరఫరా, డ్రైనేజీ, పార్కులు, అడవులు, మైదానాలు, ట్రాఫిక్, రవాణా, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం.. ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన హైదరాబాద్ వారసత్వ కట్టడాల పరిరక్షణకు ఇన్టాక్, ఇతర వేదికల మీద విశేషంగా కృషి చేశారు. ఇప్పటి వరకు 25కుపైగా భవనాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషించారు. గాంధీ మెడికల్ కాలేజీ మొదలుకొని విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్ వరకు అనేక భవనాల రక్షణకు తోడ్పాటునిచ్చారు. హెరిటేజ్ బోధకుడిగా, కార్యకర్తగా రోమ్, పారిస్, బెర్లిన్, ఇస్ఫాహన్ అండ్ హమెదాన్ (ఇరాన్), ఇస్తాంబుల్, కెన్యా, అంకారా లాంటి ప్రసిద్ధ నగరాలను సందర్శించి అక్కడ వారసత్వ కట్టడాలను ఎలా పరిరక్షిస్తున్నారో అధ్యయనం చేశారు. అనంతరం అదేరీతిలో ఇండియాలో కూడా ఆ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని మేధావులు, అధికారులకు సూచించారు.
2019 సెప్టెంబర్‌లో ‘‘ది గ్లోరియస్ కాకతీయ టెంపుల్స్ అండ్ గేట్ వేస్ – రుద్రేశ్వర (రామప్ప) టెంపుల్, పాలంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం’’కు యునెస్కో హోదాను తీసుకువచ్చే పక్రియలో థాయ్‌లాండ్ ఆఫ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ మిషన్, యునెస్కోబృందం నిపుణుడు శ్రీ వాసు పోశ్యానందన్, సందర్శన సందర్భంగా ఆయనను సౌత్ జోన్ ఐకోమోస్ ఇండియా నుంచి ‘‘అబ్జర్వర్’’గా నామినేట్ చేయబడ్డారు.
ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరా బాద్ చైర్మన్‌గా చారిత్రక వారసత్వ ప్రాధాన్య కట్టడాల పరిరక్షణతో పాటుగా చెట్ల పరిరక్షణ కోసం ఎంతో పాటుపడ్డారు. చెట్ల నరికివేతకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం అధికార వర్గాలను మెప్పించి, ఒప్పించడంతో సుమారు 10,000కుపైగా చెట్లను కాపాడగలిగారు. అంతేకాకుండా 7500 చెట్లను మరోచోట నాటగలిగేలా ప్రయత్నించి విజయం సాధించారు. వీటిలో చాలా వరకు 150 ఏళ్లకు పైబడిన వయసు కలిగినవి కావడం గమనార్హం. జర్మనీకి చెందిన హమ్‌బోల్డ్ యూనివర్సిటీతో కలిసి చేపట్టిన మూసీ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుకు ఆయన సారధ్యం వహించడమే కాకుండా బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ వాటర్ సదస్సులో ఆయన వక్తగా పాల్గొని అతిథులను మెప్పించారు.
వేదకుమార్ మణికొండ పైన పేర్కొన్న విధులనే కాకుండా ఆయన దిగువ పేర్కొన్న సంస్థలకు కూడా సేవలు అందిస్తున్నారు.
- చైర్మన్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ (డీహెచ్ఏ)
- చీఫ్ ఎడిటర్, దక్కన్‌ల్యాండ్
- చీఫ్ ఎడిటర్, బాలచెలిమి
- మెంబర్, ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, ఇండియా (ఐటీపీఐ)
- మెంబర్, ఐకోమోస్ ఇండియా
- మెంబర్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్, ఇండియా (ఐఈఐ), తెలంగాణ చాప్టర్
- ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సి).
- సయ్యద్ ఖైజర్ భాష,
ఎ : 9030 6262 88