అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్‍లో డిమాండ్‍ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట కొరత ఉన్నదో చూసి దాన్ని రైతు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‍కు చెందిన ఓ రైతు. పదెకరాల్లో కల్యామాకు తోట వేసిన ఈయన.. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఆదాయం సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఏడాదికి రెండు సార్లు కోత తీస్తున్నానని చెప్తున్నారు. 3 ఫీట్ల ఎత్తు పెరగ్గానే కోసి, హైదరాబాద్ మార్కెట్లకు తరలిస్తున్నానని తెలిపారు. విజయవాడ నుంచి విత్తనాలను తెచ్చి పదెకరాల్లో డ్రిప్ విధానంలో సాగు చేశారు. పంట వేసినప్పటి నుంచి మూడు సార్లు కోత తీశారు. గజ్వేల్ ప్రాంతంలో ముందుగా ఈయనే కల్యామాకు సాగును చేపట్టారు. అందరి కంటే భిన్నంగా ఆలోచించి కల్యామాకు తోటను సాగుచేయటం ద్వారా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ కల్యామాకు సాగుతో మంచి ఆదాయం వస్తున్నది. విత్తనాలు వేసిన ఆరు నెలల్లోనే మొక్కల నుంచి కరివేపాకును కోతతీసి మార్కెట్‍లో అమ్మొచ్చు. కల్యామాకు తోట సాగుకు పెట్టుబడి తక్కువే. లాభం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇతర రైతులు కూడా ఈ పంటవైపు చూస్తున్నారు.
ఆనబోయిన స్వామి,
ఎ : 9963 87 2222