(గత సంచిక తరువాయి)
మాలోని మనిషివే! మా మనిషివే నువ్వు!!
మన జాతిలోని (వాలిడికోతులు -•జూవ•) అన్ని జంవుతులకన్నా బాగా ఎదిగిన నీ మెదడు, కేవలం రెండు కాళ్ళపై స్వేచ్ఛగా నడిచే (•ఱజూవ••శ్రీఱ•ఎ) విధానం, పొందికైన బొటనవేలు మా నుంచి నిన్ను వేరుచేశాయి. ఇది సుమారు 25 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి మాట! తర్వాత 16.8 మిలియన్ సంవత్సరాల క్రితం గిబ్బన్స్ (స్త్రఱ••శీఅ•), 10 మిలియన్ సంవత్సరాల క్రితం మేము (గొరిల్లాలు), 8 మిలియన్ సంవత్సరాల క్రితం చింపాంజీలు, బోనోబోస్ (•శీఅశీ•శీ•) లు ఒక్కొక్కరుగా మీ నుంచి దూరమయ్యాం. మీ తెలివి తేటలతో దాదాపు పోటీపడే ఒరాంగ్‍టాన్ (శీతీ•అస్త్ర•••అ) వేరుపడి, అడవులకు పరిమితంగా ‘అటవి మనిషి’గా మీతో ముద్రవేసుకొని బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నాయి.
అయినా మీకు నమ్మకం కుదరకపోతే మీతో మాకు గల జన్యు సంబంధాన్ని చూడండి.
ఇలా గిబ్బన్స్ కిందిస్థాయి వాలిడి కోతులుగా (•జూవ•) మిగతావి మీతో సహా ఉన్నత స్థాయివి (స్త్రతీవ••వతీ •జూవ•)గా రూపాంతరం చెందాయి. ఇదంతా ఓ పరిణామ క్రమం అయినా, పెరిగిన మీ తెలివి తేటలతో అపూర్వ సోదరులమైన మాకు ప్రాణ సంకటంగా మారింది. ముందు నా కథ దీనావస్థ చూడండి!
గొరిల్లాగా పిలవబడే మా జాతి లోతట్టు అడవుల్లో, ముఖ్యంగా భూమధ్యరేఖ పైభాగాన గల ఆఫ్రికాలోని ఉష్ణమండల అడవుల్లో మీలాగా కుటుంబ జీవనాన్ని సాగిస్తాం. అప్పుడప్పుడు చీమల్ని, చెదలును తినడం తప్ప, మేమంతా శాఖాహారులమే (ష్ట్రవతీ•ఱఙశీతీశీ••). ఒకప్పుడు మా సంఖ్య అడవిలోని ఇతర పెద్ద జాతి జంతువులకన్నా అధికంగా వుండేది. నిజానికి కాంగో మా స్వంతదేశమని భావిస్తాం. ఇప్పుడు పశ్చిమ సహారా ప్రాంతంలో 3,16,000 గా మీ గణాంకాలు చెపుతున్నా, మా సంఖ్య అంతగా లేదు. ఇక తూర్పు సహారా ప్రాంతంలో కేవలం అయిదు వేలలోపే! నైజీరియా కూడా మాకు మాతృదేశమే అయినా, 25 సం।। క్రితమే మాకు ఇక్కడ మరణశాసనం రాయబడింది.
మా మరణశాసనం ఎలా రాయబడిందో చూడండి! మా ఉనికి స్థానిక ఆఫ్రికా ఆదివాసులకు చిరకాలంగా తెలిసినా, బాహ్య ప్రపంచానికి 20వ శతాబ్దం ప్రారంభం దాకా తెలియదు. మొదటిసారి మా గూర్చి వాన్‍బెరింగే (ఙశీఅ •వతీఱఅస్త్రవ) గుర్తించినట్లుగా రికార్డులున్నాయి. ఈ విషయం తెలిసిన అమెరికా నేచురల్ హిస్టరీ (•ఎవతీఱ••అ ఎ••వ•ఎ శీ• అ•••తీ•శ్రీ ష్ట్రఱ••శీతీ•) శిల్పకారుడు, ప్రకృతి ప్రేమికుడైన కార్ల్ అకెలె (••తీశ్రీ ••వశ్రీవ•) ను మా మాదిరి (•జూవ•ఱఎవఅ)ల సేకరణకై మధ్య ఆఫ్రికా అడవులకు పంపించబడ్డాడు. ఆ విధంగా అయిదు తుపాకి గుళ్ళతో ఓ అయిదిగుర్ని వధించి మా చర్మాల్ని ఒలిచి, మ్యూజియంలో గొరిల్లా మారు రూపంగా (•••••వ•) అమెరికాలో ప్రదర్శించబడ్డాయి. మా మానాన మేం బతుకీడుస్తుంటే, చెట్ల పైనుంచి మా శవాల్ని కిందపడేలా చేసాడు అకెలె. మా రోదనలు అడవి అంతా ప్రతిధ్వనించినా మీ జాతికి కనికరం లేదు. మా మంచితనం గూర్చి సంవత్సరంపాటు మా గుంపుతో కలిసి జీవించిన స్కాలర్ (స్త్ర. ••ష్ట్ర•శ్రీశ్రీవతీ) కు తెలుసు. తర్వాత స్వీడిష్ ప్రిన్స్ విల్‍హెల్మ్ (•ఱశ్రీష్ట్రవశ్రీఎ) రాజువేట అనే క్రీడలో 14 మంది మా సహచరులను ఇదే ప్రాంతంలో కాల్చి చంపాడు. అలాగే అమెరికాకు చెందిన బర్‍బ్రిడ్జి (••తీ•తీఱ•స్త్రవ) మరో 10 గొరిల్లాలను పొట్టన పెట్టుకున్నాడు. అలా అయిదు సంవత్సరాల కాలంలో పర్వతప్రాంతపు చివరి గొరిల్లాతో సహా 54 మందిమి చంపబడ్డాం.
పోతే తిరిగి మరికొన్ని చర్మాలు కావాలని అకెలెను మ్యూజియం అధికారులు కోరితే, మనసు మారిన అకెలె మా సంరక్షణకై గొంతెత్తాడు. ఆయన ప్రయత్నంతో బెల్జియన్ జంతుశాస్త్రజ్ఞులు, ఇతర దేశాల ప్రకృతి ప్రేమికుల ఒత్తిడితో బెల్జియన్ అధికారులు, మా ఆవాస (ఆఫ్రికా) ప్రాంతంలో అల్బ్ర్ట్ జాతీయ పార్కును (•శ్రీ•వతీ• అ•••తీ•శ్రీ జూ•తీ•) ఏర్పాటు చేసారు. బాధకరమైన విషయమేమంటే, మాపై వేట సాగించినా, మా పట్ల కరుణ చూపి, మా రక్షణకై కృషిచేసిన అకెలె 1926లో మమ్మల్ని చూడడానికి వస్తూ మార్గమధ్యలోనే చనిపోవడం ఓ విషాదం!
మా ప్రాంతంలోనే ఆయన్ను సమాధి చేసినా, సమాధి చుట్టూ తుపాకి గుళ్ళను మోగిస్తూ మా అంతానికి చేయని ప్రయత్నం లేదు. ఆఫ్రికా స్వతంత్రం పొందిన తర్వాత పార్కు పేరును కివు(•ఱఙ•) జాతీయ పార్కుగా మార్చి, మా జాతిని జాతీయ సంపదగా ప్రకటించడం ఓ సంతోషకరమైన వార్తనే!
మిగతా మా అనుంగు సోదర జాతి గూర్చి: (ఒరాంగ్ టాన్)
మలేషియా వాసులు అడవి మనిషిగా (ఎవఅ శీ• •ష్ట్రవ •శీతీవ••) పిలిచే ఒరాంగ్‍టాన్‍లు ఇండోనేషియా, మలే షియా వర్షపు అడవుల స్థావరంగా జీవించే ఈ జాతి ఇప్పుడు బొర్నియో (•శీతీఅవశీ), సుమత్రా దీవులలో కూడా కనపడుతాయి. శతాబ్దం క్రితం వీటి సంఖ్య 2,30, 000 పైగా వుంటే, బొర్ని యోలో 1,04,700గా, సుమత్రాలో 7,500 వున్నట్లుగా గణాంకాలు చూపుతున్నాయి. 2017లో తపనులి (••జూ•అ•శ్రీఱ) దీవిలో సుమారు 800 వరకు వున్నట్లు తేలింది. వీటి కనుమరుగు ప్రమాదకరస్థాయి నుంచి అత్యంత ప్రమాదకరస్థాయికి దిగజారడానికి కారణం, వీరి ఆవాసాల్ని దెబ్బతీయడం, గనుల్ని తవ్వడం, వివిధ జంతు ప్రదర్శన శాలలకి వాటిని పట్టుకెళ్ళడం, వేటాడి చంపడం ప్రధాన కారణాలు. సుమారు 45 సం।।ల జీవించే ఈ జాతి నిర్బంధంలో 3-4 సం।। కూడా బతకడం లేదు. అమెరికా, యూరప్ దేశాల్లో వీటిని ప్రదర్శించడానికై ప్రతి సంవత్సరం 100కు పైగా ఒరాంగ్‍టాన్‍లను పట్టి తేవడం జరుగుతున్నది. అలాగే వీటి చర్మాల కోసం మ్యూజియంలో నమూనా కోసం, ప్రతి సంవత్సరం 3 వేలకు పైగా వధించబడుతుండడంతో, వీటిసంఖ్య రమారమి 50 వేలు కూడా లేకుండా పోయింది.
ముద్దుగుమ్మ చింపాంజీ:
మొత్తం వాలిడి కోతుల జాతిలో ముద్దుగా, చిన్నారిగా కనపడే చింపాంజీలు కొంతదూరం మీలాగా నడవగలవు కూడా. చెట్ల కొమ్మలకు వేలాడుతూ, ఊగుతూ హాయిగా జీవించే ఈ జాతి ఇప్పుడు విపత్కర స్థితిలో వున్నది. ఇవికూడా ఆఫ్రికా ఉష్ణమండల అడవులలో ఒకప్పుడు మూడు లక్షలకు పైగా వుండేవి. ఇవి పసిపాపల్లా అగుపించడంతో మానవజాతి వీటిని ఒక ఆటబొమ్మగా చేసి, జంతు, సఫారి ప్రదర్శనశాలల్లో పెద్ద పెద్ద హోటలల్లో పెట్టి ఆకర్షించడం, అతిధులకు అభివాదం చేయించడం, ప్రేక్షకులకు వినోదాన్ని కల్గించడం చేయిస్తున్నారు. సహజ సిద్ధంగా సుమారు 40 సం।।ల పాటు జీవించే చింపాంజీలు నిర్బంధంలో కేవలం 3-4 సం।। కూడా బతకడం లేదు. వీటి స్థానంలో తిరిగి కొత్త వాటిని తేవడంతో వీటి సంఖ్య కూడా లక్షకు పడిపోయింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా తగ్గి పూర్తిగా భూమిపై నుంచి కనుమరుగయ్యే ప్రమాదం కూడా వుంది.
ముగింపు:
మిలియన్ సంవత్సరాల క్రితమే మీలాగా ఈ భూమిపై పురుడు పోసుకున్న మా జాతి గూర్చి మీకు 19వ శతాబ్ది మధ్య భాగం నుంచే తెలిసింది. ఆయా ప్రాంతాల ఆదివాసీల ద్వారా మా గూర్చి తెలసుకున్న వారు మమ్మల్ని దెయ్యాలని భావిస్తే, అడవి మనుషులని మరికొందరు చెప్పుకునేవారు. కొన్ని దేశాల్లో మా పట్ల ఆరాధన భావం కూడా వుండేది. ఇలా 1830లో ఒరాంగ్‍టాన్, 1836లో చింపాంజీలు లండన్ జూ కు పరిచయం చేయబడగా, 1855లో నన్ను (గొరిల్లా) యూరప్‍లో పరిచయం చేసారు. ఏది ఏమైనా తుపాకి గురి మాత్రం మమ్మల్ని వెంటాడుతూనే వున్నది.
డార్విన్, వాలేస్ లాంటి పరిణామ సిద్ధాంత కర్తల చొరవతో మేం మీ జాతివారం అని తెలిసినా, అభివృద్ధి చెందిన అమెరికాలో, 1925 దాకా డార్విన్ సిద్ధాంతాన్ని బోధించడాన్ని నిషేధించిన ఘనత మీది. ఇప్పుడన్న మా మొర ఆలకించి, మా మానాన మమ్మల్ని బతకనిస్తే, మీరు కూడా మరో పదికాలాలపాటు జీవిస్తారు. లేదంటే, ఎక్కిన కొమ్మనే నరుక్కున్న చందంగా మీ బతుకులుంటాయి.
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162