ఫోర్‍ం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూసీ రివర్ బెడ్ వద్ద, మంచిరేవుల బ్రిడ్జి, నార్సింగి, హైదరాబాద్ సందర్శన
ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచ జలమార్గాల వేడుక లక్ష్యం:
ఇది మన నదుల యొక్క అనేక విలువలను ప్రతిబింబిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని నదుల మెరుగైన నిర్వహణ కై క•షి చేస్తుంది. దాదాపు ప్రతి దేశంలోని నదులు అనేక ముప్పులను ఎదుర్కొంటు న్నాయి. మన క్రియాశీల భాగస్వామ్యం ద్వారా మాత్రమే రాబోయే సంవత్సరాల్లో వాటి భవితవ్యాన్ని మనం కాపాడుకోగలం.
సంక్షిప్త చరిత్ర:
2005 లో, ఐక్యరాజ్య సమితి మన నీటి వనరులను మరింత మెరుగ్గా చూసు కోవాల్సిన ఆవశ్యకత గురించి మరింత అవగాహన కల్పిం చడంలో సహాయపడటానికి వాటర్ ఫర్ లైఫ్ దశాబ్దాన్ని ప్రారంభించింది. దీని తరువాత, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ‘‘రివర్ అడ్వకేట్’’ మార్క్ ఏంజెలో ప్రారంభించిన ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ‘‘ప్రపంచ నదుల దినోత్సవం’’ స్థాపన జరిగింది. 1980 నుండి పశ్చిమ కెనడాలో మార్క్ ఏంజెలో స్థాపించి నాయకత్వం వహించిన బిసి రివర్స్ డే విజయం ఆధారంగా నదుల దినోత్సవం ను జరుపుకోవడానికి ఒక గ్లోబల్ ఈవెంట్ ప్రతిపాదన రూపొందించబడింది. ప్రపంచ నదుల దినోత్సవ కార్యక్రమాన్ని వాటర్ ఫర్ లైఫ్ దశాబ్ద లక్ష్యాలకు బాగా సరిపోతుందని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు భావించి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నదీ ఔత్సాహికులు కలిసి డబ్ల్యూఆర్డీ ప్రారంభ ప్రపంచ నదుల దినోత్సవ (ఔ=ణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. 2005లో జరిగిన ఆ మొదటి కార్యక్రమం గొప్ప విజయాన్ని సాధించింది మరియు డజన్ల కొద్దీ దేశాలలో రివర్స్ డే జరుపుకున్నారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. దీనిని ప్రతి సంవత్సరం సెప్టెంబరు నాల్గవ ఆదివారం జరుపుకుంటారు. గత సంవత్సరం, 100 దేశాలలో కొన్ని మిలియన్ల మంది ప్రజలు మన నదుల, జలమార్గాల యొక్క అనేక విలువలను జరుపుకున్నారు.
వ్యవస్థాపకుడు ప్రసిద్ధ ‘‘రివర్ అడ్వకేట్’’ మార్క్ ఏంజెలో గురించి:
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని బర్నాబీకి చెందిన మార్క్ ఏంజెలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నదీ పరిరక్షకుడు. బ్రిటీష్ కొలంబియా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిసిఐటి)లో రివర్స్ ఇన్‍స్టిట్యూట్‍కు ఛైర్ ఎమెరిటస్‍గా వ్యవహరిస్తున్నారు. మార్క్ ఫిష్, వైల్డ్ లైఫ్ అండ్ రిక్రియేషన్ పోగ్రామ్‍కు సుదీర్ఘ కాలం అధిపతిగా కూడా ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నదీ పరిరక్షణ ప్రయత్నాలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, ఆర్డర్ ఆఫ్ కెనడా (తన దేశ అత్యున్నత పురస్కారం) రెండింటినీ అందుకున్నారు. మార్క్ ఏంజెలో అనేక ఇతర పురస్కారాలలో ఐక్యరాజ్యసమితి స్టీవార్డ్ షిప్ అవార్డు మరియు నేషనల్ రివర్ కన్జర్వేషన్ అవార్డు ఉన్నాయి. సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ లభించింది. 2019లో, మార్క్ ప్రపంచ వ్యాప్తంగా జలమార్గాలను రక్షించడానికి చేసిన సుదీర్ఘ ప్రయత్నాలకు గుర్తింపుగా ట్రెంట్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‍ను ప్రదానం చేసింది.
వాటర్ వారియర్ ప్రొఫెసర్ వేదకుమార్ మణికొండ, ఛైర్మన్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ నేత్రత్వంలో మరియు ప్రపంచ నదుల దినోత్సవ సంస్థ ఆధ్వర్యంలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ మరియు జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్, హైదరాబాద్ సహకారంతో 24.9.2023న ప్రపంచ నదుల దినోత్సవాన్ని పురస్క రించుకుని ఉదయం 7 గంటల నుంచి ‘‘మూసీ నది సందర్శన’’ కార్యక్రమాన్ని, మూసీ నది ఒడ్డున, హైదరాబాద్, నార్సింగిలోని మంచిరేవుల వంతెన వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా చారిత్రక మూసీ నది ఫోటో ఎగ్జిబిషన్‍ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రతి సెప్టెంబర్ 4వ ఆదివారం జరుపుకుంటారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నదీ సంరక్షకుడు, ప్రపంచ నదుల దినోత్సవం వ్యవస్థాపకుడు శ్రీ మార్క్ ఏంజెలో ప్రారంభించారు. ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచ జలమార్గాల వేడుక. ప్రపంచ నదుల దినోత్సవం ప్రజల్లో మన నదుల యొక్క అనేక చారిత్రాత్మక విలువలను, ప్రాముఖ్యతను తెలియచేయటానికి, ప్రపంచవ్యాప్తంగా అన్ని నదుల మెరుగైన నిర్వహణ, దానికై మనం చేయవలసిన కృషిపై అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది.
హైదరాబాద్‍లోని బాబుఘాట్ వద్ద సంగమించి ముందుకు సాగి వాడేపల్లి, క•ష్ణా నదిని దాటే ‘‘ESA-MUSI’’ నది చరిత్రను •తీశీ•.జుతీ. వేదకుమార్ మణికొండ సభికులకు వివరించారు. ఉస్మాన్ సాగర్ సరస్సు, హిమాయత్ నగర్ సరస్సు రిజర్వాయర్ల నిర్మాణం గురించి వివరించారు. హరితహారం పథం ద్వారా చెట్లు నాటి పచ్చదనాన్ని పెంచారు. అనేక ఎస్టీపీల ఏర్పాటు మరియు చెత్త తొలగింపు యూనిట్లను ఏర్పాటు చేసి మూసీ నదిని మురుగునీటి నుంచి పరిశుభ్రంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను యువతకు వివరించారు. నదిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపై మాత్రమే లేదని, పౌరసమాజం, సంస్థలు ఈ లక్ష్యంతో సమానంగా నిమగ్నం కావాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
కౌన్సిలర్ శ్రీమతి నాగపూర్ణ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మూసీ నది పరిరక్షణలో తన వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‍బిహెచ్ ఉపాధ్యక్షులు శ్రీ ఎం.హెచ్.రావు, ఎఫ్.బి.హెచ్ జనరల్ సెక్రటరీ శ్రీమతి శోభాసింగ్, జె.బి.ఆర్ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్, హిమాయత్ నగర్, పలు పాఠశాలల విద్యార్థులు, స్థానిక సీనియర్ సిటిజన్లు, పర్యావరణవేత్తలు తదితర ఇతర సామాజిక సమూహాలు పాల్గొని మూసీ నదిపై వారి అభిప్రాయాలను, దాని పరిరక్షణ అవసరాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం మంచిరేవుల బ్రిడ్జి వెంబడి, మూసీ నది ఒడ్డున పాదయాత్ర నిర్వహించి ఇకపై ప్రతి నెలా మూసీనది బెడ్ వెంబడి పౌర్ణమి రోజున ‘శ్యామ్-ఎ-మూసీ’ (SHAAM-E-MUSI) సాంస్క•తిక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
మూసీ నదిని ఉత్తమ రూపంలో ఉంచాలని విద్యార్థులు,
ఉపాధ్యాయులు, పౌర సమాజం, ఎఫ్ బీహెచ్, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ సభ్యులు, ఇతరులు ప్రతిజ్ఞ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
- కట్టా ప్రభాకర్,
ఎ: 8106721111