దక్షిణ తెలంగాణ వరదాయని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

సెప్టెంబర్‍ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అయ్యింది. నాగర్‍ కర్నూల్‍ జిల్లా, కొల్లాపూర్‍ మండలం, నార్లపూర్‍ వద్ద నిర్మించిన మొదటి స్టేజి పంప్‍ హౌజ్‍ నుండి 145 మెగావాట్ల రేటింగ్‍ పంప్‍ హౌజ్‍ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసిన 3200 క్యూసెక్కుల క•ష్ణా జలాలు నార్లాపూర్‍ జలశయానికి పరుగులు తీసాయి. ప్రాజెక్టులో ఇటువంటివి 5 పంప్‍ హౌజుల్లో మొత్తం 34 పంపులు బిగించనున్నారు. ప్రాజెక్టు విశేషాలు వివరించే ముందు ప్రాజెక్టు చరిత్రని ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.


పాలమూరు ప్రాజెక్టు విషాద చరిత్ర :
పాలమూరు జిల్లాది ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో ఒక విషాద గాథ. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానిది ఒక పోరాట చరిత్ర. 1956 లో ఆందప్రదేశ్‍ రాష్ట్రం ఏర్పడడం వలన అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. ఫజల్‍ అలీ కమిషన్‍ సిఫారసుల మేరకు హైదరాబాద్‍ రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటె అప్పర్‍ క•ష్ణా, భీమా, తుంగభద్రా ఎడమ కాలువ ద్వారా దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేది. హైదరాబాద్‍ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అప్పర్‍ క•ష్ణ (54.4 టిఎంసి), భీమా(100.7 టిఎంసి), తుంగభద్ర లో లెవెల్‍ కాలువ (19.20 టిఎంసి) మొత్తం 174.40 టిఎంసి ల నీటిని మహబూబ్‍ నగర్‍ కోల్పోయింది. ఆంధప్రదేశ్‍ ఏర్పాటు వలన ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్న జిల్లా. పాలమూరు జిల్లా మొత్తం విస్తీర్ణం 43.73 లక్షల ఎకరాలు ఉంటె అందులో వ్యవసాయ యోగ్యమైన భూమి దాదాపు 35 లక్షల ఎకరాలు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 4.5 లక్షల ఎకరాలు మాత్రమే. ఇందులో ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించే జూరాల, 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే పారే రాజోలిబండ మళ్లింపు పథకం, 2.5 లక్షల ఎకరాలకు బదులు 75 వేల ఎకరాలకు సాగునీరు అందించే చెరువులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం మీద నికరంగా దాదాపు 2 లక్షల ఎకరాలకే సాగునీరు అందేది.


ఉమ్మడి రాష్ట్ర పాలనలో సాగునీరు అందించే ఆలోచనే లేని కారణంగా పాలమూరు ప్రజలకు బతుకు దెరువు కోసం వలసలే గతి అయినాయి. ప్రతిపాదిత భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు పథకాలు నిరంతరం ఫైళ్ళల్లో మగ్గుతూ వచ్చాయి.
నల్లగొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల (•వీ=•) లిఫ్ట్ స్కీమ్‍ విజయవంతం అయిన తరువాత పాలమూరు ప్రజలలో కొంచెం చైతన్యం వచ్చిన కారణంగా, అప్పటికే ప్రత్యేక రాష్ట్ర సాధనకై టిఆర్‍ఎస్‍ పార్టీ తెలంగాణ రాజకీయ రంగంపైకి వచ్చిన కారణంగా 2003లో కల్వకుర్తి, 2004లో భీమా, నెట్టెంపాడు, కోయిల్‍ సాగర్‍ ఎత్తిపోతల పథకాలకు మోక్షం వచ్చింది.


వైఎస్సార్‍ ప్రభుత్వం వీటిని జల యజ్ఞంలో భాగం చేసి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి టెండర్లు పిలిచింది. కానీ పది సంవత్సరాలు గడచినా కూడా ప్రాజెక్టులు పూర్తి కాని స్థితి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే 8 లక్షల ఎకరాలు సాగులోనికి వచ్చి ఉండేవి. ఇంకా చాలా ప్రాంతాలు సాగుకు నోచుకోని పరిస్థితి ఉన్నది. జిల్లా గుండా క•ష్ణా నది 300 కిలో మీటర్లు పారుతుంది. తుంగభద్రా నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా పారుతుంది. అయినా జిల్లాలో ఈ దీన పరిస్థితి ఉన్నది.


తెలంగాణ ఉద్యమం వువ్వెత్తున లేచిన సందర్భంలో తెలంగాణ రిటైర్డు ఇంజనీర్లు 2005 లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపకల్పన చేసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే రాజశేఖర్‍ రెడ్డి ప్రభుత్వం బుట్ట ధాఖలుచేసింది. జిల్లా నాయకుల్లో దాన్ని పట్టించుకునే నాధుడే లేడు. 2009ఎన్నికల ముందు సర్వేల గురించి జీ.ఓ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మొఖం చాటేసి అనేక సాకులు చెప్పింది. ఇప్పటికే చాలా ఎత్తిపోతల పథకాలు వచ్చాయి కనుక వాటి పనితీరు చూసిన తరువాతనే ఈ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టటం జరుగుతుందని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా మొత్తం పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల నోరు మూయించడం జరిగింది.


దీని తరువాత, టి ఆర్‍ ఎస్‍ పార్టీ సహా తెలంగాణ ఇంజనీర్లు, ప్రజా సంఘాలు ధర్నాలు, రౌండ్‍ టేబుల్‍ సమావేశాలు, అవగాహన సదస్సులు, కళారూపాల ద్వారా గ్రామ గ్రామాన భావ వ్యాప్తి జేశారు. ఉద్యమ ఒత్తిడికి తట్టుకోలేక ఎన్నికల్లో లబ్ది పొందడానికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే నిమిత్తమై 2013 ఆగష్టులో జీ.ఓ. ఇచ్చింది. అయితే టెండర్ల పక్రియ పూర్తి కాకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో అపెక్స్ కౌన్సిల్‍ అనుమతి కొత్త ప్రాజెక్టులకు తప్పనిసరి అయినందువల్ల అపెక్స్ కౌన్సిల్‍లో అడ్డుకోవచ్చన్న ముందు చూపుతో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకుండా ఆటంకాలు కల్పించారు ఉమ్మడి రాష్ట్ర పాలకులు.


తెలంగాణ ప్రభుత్వ క•షి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్‍ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే చేసిన మొదటి పని… అటక మీద దుమ్ముపట్టిపోయిన పాలమూరు రంగారెడ్డి దస్త్రాన్ని బయటకు తీసి ఇన్స్టిట్యూషన్‍ ఆఫ్‍ ఇంజనీర్స్ (ఇండియా) వారి అధీనంలో పని చేస్తున్న ఇంజనీరింగ్‍ స్టాఫ్‍ కాలేజ్‍ ఆఫ్‍ ఇండియా (జు••×) వారిచే సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయించడానికి 5.71 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ జిఓ నంబరు 69ని తేదీ 1.8.2014న జారీ చేసింది.
6 నెలల తర్వాత ఎస్కీ వారు తయారు చేసిన ముసాయిదా నివేదికలోని ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ సలహాదారు దివంగత శ్రీ ఆర్‍ విద్యాసాగర్‍ రావు, సాగునీటి శాఖ సీనియర్‍ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, ఎస్కీ ఇంజనీర్లతో కూలంకషంగా సమీక్ష జరిగింది. ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.


ప్రాజెక్టు తొలి ప్రతిపాదనలు :
జూరాల జలాశయం నుంచి 35 రోజుల్లో రోజుకు 2 •వీ• ఎత్తిపోసి మహబూబ్‍ నగర్‍ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్లగొండ జిల్లాలో 30,000 ఎకరాలు.. మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు, జంటనగరాలకు మరియు దారి పొడుగునా గ్రామాలకు తాగు నీరు, పరిశ్రమల అవసరాలకు నీరు అందించడం.
కోయిల్‍ కొండ వద్ద 76 టిఎంసిలు, గండీడ్‍ వద్ద 35 టిఎంసిలు, లక్ష్మిదేవిపల్లి వద్ద 10 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాల నిర్మాణం మూడు జలాశయాల్లో మొత్తం 47 గ్రామాలు, 84,400 మంది జనాభా, 16,342 ఆవాసాలు ముంపు బారిన పడుతున్నాయని తేలింది.
ఎస్కీ వారి పై ప్రతిపాదనలపై సమగ్ర చర్చ అనంతరం ఇంత భారీ ముంపుని తగ్గించడం ప్రభుత్వం ముందు ఒక సవాలుగ ముందుకు వచ్చింది. ఇంత భారీ ముంపును తగ్గించడానికి ప్రత్యామ్నాయాలు లేవా? దాంతో పాటు జూరాల జలాశయం నికర నిల్వ సామర్థ్యం 7 టిఎంసిలు మాత్రమే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రోజుకు 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించినందున జూరాల జలాశయం నుండి ఇంత భారీగా నీటిని ఎత్తిపోయడానికి సాంకేతికంగా, ప్రాజెక్టుకు నీటి లభ్యత ద•ష్ట్యా సాధ్యమా? అన్న ప్రశ్నలను సమీక్షించడం జరిగింది.


చిన్నదైన జూరాల జలాశయం ఇప్పటికే తన స్థాయికి మించిన భారాన్ని మోస్తున్నది. జూరాల స్వంత ఆయకట్టు (1.04 లక్షల ఎకరాలు), భీమా ఆయకట్టు (2 లక్షల ఎకరాలు), నెట్టెంపాడు ఆయకట్టు (2 లక్షల ఎకరాలు), కోయిల్‍ సాగర్‍ ఆయకట్టు (50 వేల ఎకరాలు), మహబూబ్‍ నగర్‍ పట్టణ తాగునీటి అవసరాలు, మిషన్‍ భగీరథ ద్వారా తాగునీరు, జూరాల జల విద్యుత్‍ యూనిట్ల కోసం నీటి విడుదల (40 వేల క్యూసెక్కులు) తదితర అవసరాలను అతి కష్టం మీద తీరుస్తున్నది.
అందుకే ఈ చిన్నప్రాణంపై మరొక భారీ ప్రాజెక్టుని మోపడం దానిపై ఆధారపడిన ప్రాజెక్టులకు అన్యాయం చేసినట్లవుతుందన్న వాదనలు సమీక్షలో ముందుకు వచ్చినాయి. సర్వే ఆఫ్‍ ఇండియా వారి టోపో మ్యాపులు, గూగుల్‍ ఎర్త్ సాఫ్ట్ వేర్‍, జూరాల, శ్రీశైలం వరద ప్రవాహాల గణాంకాల సాయంతో కూలంకషంగా అధ్యయనం జరిపిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపుని గణనీయంగా తగ్గించగలిగే అవకాశం
ఉందని, జూరాల నుండి కాక 215 •వీ• నిల్వ సామర్థ్యం కలిగిన శ్రీశైలం జలాశయం నుండి రోజుకు 2 టిఎంసిల నీటిని 90 రోజుల పాటు(వరద లేని రోజుల్లో కూడా) ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉందని తేలింది. క•ష్ణా నదికి అతిపెద్ద ఉపనది తుంగభద్ర నీరు కూడా శ్రీశైలం జలాశయానికే చేరతాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పుడు ప్రాజెక్టు సాఫల్యతపై ద•ష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఈ అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రీ డిజైన్‍ చెయ్యాలని ముఖ్యమంత్రి కెసిఆర్‍ నిర్ణయించారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారు చేస్తున్న ఎస్కీ వారిని పై చర్చల ఆధారంగా శ్రీశైలం నుండి ప్రాజెక్టుని రీ డిజైన్‍ చెయ్యమని ప్రభుత్వం ఆదేశించింది.


టోపో మ్యాపుల ద్వారా, క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు ప్రతిపాదనలను ఎస్కీ ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లు సిద్దం చేసినారు. పలు మార్లు ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ప్రతిపాదనలపై చర్చలు జరిగినాయి. కె సి ఆర్‍ స్వయంగా ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి సర్వే ఆఫ్‍ ఇండియా మ్యాపుల ద్వారా అధ్యయనం చేసి జలాశయాల నిర్మాణ స్థలాలను ఎంపిక చేసినారు. వాటి నిల్వ సామర్థ్యాన్ని నిర్ధారించినారు. ఆరు నెలల సుధీర్ఘ మేధో మధనం అనంతరం తుది ప్రతిపాదనలు తయారు అయినాయి.


రీ డిజైన్‍ తర్వాత ప్రాజెక్టు వివరాలు :
రీ డిజైన్‍ తర్వాత ప్రాజెక్టు ప్రతిపాదనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానమైన మార్పులు.. 1. నీటి సొర్స్ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి మార్చడం, 2. ఆరు కొత్త జలాశయాలను ప్రతిపాదించడం, 3. ఆయకట్టు 10 లక్షల ఎకరాల నుంచి 12.30 లక్షల ఎకరాలకు పెంచడం 4. గతంలో కంటే ముంపు గణనీయంగా తగ్గించడం జరిగింది. ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు.. మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, మొత్తం 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు అందించడానికి ప్రతిపాదనలు తుది రూపం తీసుకున్నాయి. ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల వివరాలు కింది పట్టికలో చూడవచ్చు.

అన్ని జలాశయాల్లో కలిపి ముంపు మొత్తం 49 వేల ఎకరాలు, ప్రభావితం అయ్యే గ్రామాలు 3, తండాలు 20, ఆవాసాలు 2,781 మాత్రమే. పై గణాంకాలను పరిశీలిస్తే రీ డిజైన్‍ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముంపు గణనీయంగా తగ్గిపోయిందని అర్థమవుతున్నది.
కొత్త జిల్లాల వారీ ఆయకట్టు వివరాలు ఎఏ విధంగా
ఉన్నాయి

గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనల్నిఆమోదించడంతో ప్రభుత్వం జీవో నంబరు 105 తేదీ 10.06.2016 ద్వారా ప్రాజెక్టుకు రూ. 35,200 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు 11.06.2015 తేదీన కరివెన గ్రామం వద్ద శంకు స్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు పనులని 18 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చెయ్యడం జరిగింది. పనులు ప్రారంభమయినాయి. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టినారని జాతీయ గ్రీన్‍ ట్రిబ్యునల్‍ లో కేసుల కారణంగా పనులను రెండు దశలలో పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో తాగునీటి సరఫరా పనులు, రెండో దశలో సాగునీటి సరఫరా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సరఫరా పనులు పూర్తి అయ్యే దశకు చేసుకున్నాయి. నార్లాపూర్‍ పంప్‍ హౌజ్‍లో మొదటి పంపు (145 మే వా) డ్రై రన్‍ కూడా ఆగస్ట్ 3న విజయవంతం అయిన తర్వాత సెప్టెంబర్‍ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభం అయింది.


ప్రాజెక్టుకు నిరంతర ఆటంకాలు :
పనులు ప్రారంభం అయినప్పటినుంచి ప్రాజెక్టు వ్యతిరేకులు కోర్టుల్లో కేసులు వేసి అనేక ఆటంకాలు కల్పించడం మొదలు పెట్టారు. ఆ క్రమలోనే జాతీయ గ్రీన్‍ ట్రిబ్యునల్‍ లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేస్తున్నారని, పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వమని వారు జాతీయ గ్రీన్‍ ట్రిబ్యునల్‍ ను కోరినారు.
ఈ కేసులో ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్‍ అయి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వాదనలు చేసింది. ఇది కొత్త ప్రాజెక్టు కాబట్టి విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్‍ అనుమతి పొందిన తర్వాతనే ప్రాజెక్టును చేపట్టాలని వాదించింది. ఈ ప్రాజెక్టుకు
ఉమ్మడి రాష్ట్రంలోనే 90 టిఎంసిల నీటి కేటాయింపులు చేస్తూ జీవో జారీ అయ్యిందని, కాబట్టి దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించడానికి వీలు లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. తొలుత 1226 గ్రామాలకు, హైదరాబాద్‍ నగరానికి తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, తాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపు ఉందని, సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే చేపడతామని తెలంగాణ ప్రభుత్వం జాతీయ గ్రీన్‍ ట్రిబ్యునల్‍ కు తెలిపింది.


ట్రిబ్యునల్‍ అందుకు అంగీకరించి ప్రాజెక్టులో తాగునీటి పనులు చేసుకోవడానికి అనుమతించింది. ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం తిరిగి గ్రీన్‍ ట్రిబ్యునల్‍ లో మరో కేసు ఆంధప్రదేశ్‍ రైతులతో వేయించి ట్రిబ్యునల్‍ ద్వారా ప్రాజెక్టు పనులకు స్టే ఆర్డర్‍ పొందింది. దాంతో పాటు పర్యావరణానికి హాని కలిగించినందుకు భారీ మొత్తంలో జరిమానా కూడా వేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‍ ట్రిబ్యునల్‍ స్టే ఆర్డర్‍ పై సుప్రీం కోర్టుకు అప్పీల్‍ చేసింది. అందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు తాగునీటి సరఫరా పనులను కొనసాగించడానికి అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. సాగునీటి పనులు మాత్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే చేపట్టాలని సూచించింది. గ్రీన్‍ ట్రిబ్యునల్‍ వేసిన జరిమానాపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్నది. ఇటీవలే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేసినందున రెండవ దశ పనులకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.


కేంద్ర ప్రభుత్వ గజిట్‍ నోటిఫికేషన్‍ :
పరిస్థితులు ఈ రకంగా ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం 15 జూలై 2020 న క•ష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధులను నిర్దేశిస్తూ గజిట్‍ నోటిఫికేషన్‍ ను జారీ చేసింది. ఇందులో రెండు నదీ బేసిన్‍ లలో కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాను పొందు పరచింది. అందులో క•ష్ణ బేసిన్‍ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా చేర్చినారు. ఈ ప్రాజెక్టులకు 6 నెలల్లో కేంద్ర సంస్థల నుంచి అనుమతులు పొందాలని ఆదేశించింది. నోటిఫికేషన్‍లో పేర్కొన్న ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం నుంచి, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందడానికి డిపిఆర్‍ లు సిద్దం చేయమని ముఖ్యమంత్రి సాగునీటి శాఖను ఆదేశించారు. క•ష్ణా బేసిన్‍ లో ఉన్నపాలమూరు సహా అన్ని ప్రాజెక్టులకు.. కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఆర్‍ విద్యాసాగర్‍ రావు డిండి.. ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవు. ఇవి వరద జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే. వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం కానీ, కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ కానీ అనుమతులు ఇవ్వడానికి నిబంధనలు లేవు. కనుక ప్రాజెక్టుకు అనుమతులు పొందాలంటే నికర జలాల కేటాయింపులు తప్పనిసరి. ప్రభుత్వం ఈ విషయంపై మేధోమధనం చేసిన అనంతరం 90 టిఎంసిల నికర జలాలను తెలంగాణ వాటా నుంచే కేటాయించుకునే అవకాశం ఉందని తేలింది. చిన్న నీటి పారుదల కోసం బచావత్‍ ట్రిబ్యునల్‍ తెలంగాణకు కేటాయించిన 90 టిఎంసిల నీటిలో 45 టిఎంసిలకు మించి క•ష్ణా బేసిన్‍లో వినియోగం జరగడం లేదని తేలింది. ఈ నీటిని పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించ వచ్చునని భావించడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రకమైన సేవింగ్స్ ను అప్పర్‍ భద్రా ప్రాజెక్టుకు కేటాయించుకున్నది. ఇక గోదావరి ట్రిబ్యునల్‍ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టిఎంసిల గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా క•ష్ణా డెల్టా అవసరాలకు తరలించుకోవచ్చు. ఆ మేరకు క•ష్ణా నీటిని నాగార్జునసాగర్‍ ఎగువన పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం అనుమతించిన రోజు నుంచే మహారాష్ట్రా 14 టిఎంసిలు, కర్ణాటక 21 టిఎంసిలు, ఆంధప్రదేశ్‍ 45 టిఎంసిలను బేసిన్‍లో ఉండే ఆయకట్టు అవసరాలకు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు. కర్ణాటక అప్పర్‍ భద్రా ప్రాజెక్టుకు ఈ వాటాలో కూడా కొంత నీటిని కేటాయించింది. కర్ణాటక అవలంభించిన పద్దతిలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా మైనర్‍ ఇరిగేషన్‍లో 45 టిఎంసిల మిగులు జలాలను, పోలవరం నుంచి తరలించే నీటిలో ఆంధప్రదేశ్‍ వాటా 45 టిఎంసిలు.. మొత్తం 90 టిఎంసిలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పునర్‍ కేటాయింపులు (బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ అంతిమ తీర్పుకు లోబడి) చేస్తూ జీవోనంబరు 246ని 18.8.2022న జారీ చేసింది.


రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్‍ ఎగువన ఉన్నది తెలంగాణ మాత్రమే. నాగార్జునసాగర్‍ ఎగువన క•ష్ణా బేసిన్‍లో ప్రాజెక్టులు కలిగి ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఆంధప్రదేశ్‍ రాష్ట్రానికి ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా బేసిన్‍ ఆవలకు నీటిని తరలించేవి. కాబట్టి ఈ 45 టిఎంసిల నీటిపై పూర్తి హక్కు తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది. ఈ రకమైన విశ్లేషణతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టిఎంసిల నికర జలాలను కేటాయించి డిపిఆర్‍ తయారు చేసి కేంద్ర జల సంఘానికి, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సెప్టెంబర్‍ 2022 లోనే సమర్పించడం జరిగింది. ఇదే విషయాన్ని బ్రిజేష్‍ కుమార్‍ ట్రిబ్యునల్‍ కు కూడా తెలియజేయడం జరిగింది. ఈ జీవో పై కూడా ఆంధప్రదేశ్‍ క•ష్ణా ట్రిబ్యునల్‍లో కేసు వేసి జీవో అమలు కాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‍లో ఆంధప్రదేశ్‍ వాదనలను తిప్పికొట్టింది. తెలంగాణ వాదనతో అంగీకరించిన ట్రిబ్యునల్‍ ఏపి కేసును కొట్టి వేసింది. ఈ తీర్పుతో ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు సాధించడానికి మార్గం సుగమం అయ్యింది. ఇది ధర్మ విజయం.


ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించిన అనుమతులు :

  • అటవీ అనుమతి తేదీ 25.01.2019
  • కేంద్ర వన్య ప్రాణి సంరక్షణ బోర్డు అనుమతి తేదీ
  • కేంద్ర విద్యుత్‍ ప్రాధికార సంస్థ (•జు•) అనుమతి:తేదీ 17.03.2023
  • సెంట్రల్‍ సాయిల్‍ • మెటీరియల్‍ రీసెర్చ్ స్టేష• •(••వీ=•)
  • అనుమతి : తేదీ 05.06.2023
  • కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ (వీశీ••) అనుమతి:తేదీ 17.07.2023
  • కేంద్ర భూగర్భ జల బోర్డు (•+ఔదీ) అనుమతి:తేదీ 28.07.2023
  • పర్యావరణ అనుమతికి జు•• కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సిఫారసు తేదీ 10.08.2023


పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలు :

  • 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు తాగునీరు
  • సోర్స్ : శ్రీశైలం జలాశయం
  • లబ్ధి పొందే జిల్లాలు : 6 (నాగర్‍ కర్నూల్‍, మహబూబ్‍ నగర్‍, నారాయణ్‍ పేట, రంగారెడ్డి, వికారాబాద్‍, నల్గొండ), అసెంబ్లీ నియోజకవర్గాలు : 19
  • ప్రతిరోజూ లిఫ్ట్ చేసే జలాలు : 2 టిఎంసిలు
  • లిఫ్ట్ స్టేజిలు : 5, రిజర్వాయర్లు : 6
  • మొత్తం నీటి నిల్వ సామర్థ్యం : 67.74 టిఎంసిలు
  • ఒక పంపు గరిష్ట సామర్థ్యం : 145 మెగావాట్లు, మొత్తం 34 పంపుల సామర్థ్యం : 4900 మెగావాట్లు
  • నీటిని లిఫ్ట్ చేసే గరిష్ట ఎత్తు : 672 మీటర్లు
  • సొరంగమార్గం పొడవు : 61.57 కిలోమీటర్లు, ప్రధాన కాలువల పొడవు : 915.47 కిలోమీటర్లు
  • తాగునీటికి వినియోగం : 7.15 టిఎంసిలు, పరిశ్రమల వినియోగానికి కేటాయింపులు : 3 టిఎంసిలు, సాగునీటి కోసం కేటాయింపులు : 75.94 టిఎంసిలు
  • ఏదుల పంప్‍ హౌజ్‍ వద్ద ఆసియాలోనే అతి పెద్దదైన భూగర్భ సర్జ్ పూల్‍.
  • అత్యధిక సామర్థ్యం గల పంపుల వినియోగంలో కాళేశ్వరం రికార్డును అధిగమించి 145 మెగావాట్ల సామర్థ్యం మహా బాహుబలి మోటర్ల వినియోగం
  • మూడు పంప్‍ హౌజ్లలో 145 మె.వా భారీ సామర్థ్యం కలిగిన 34 పంపులను ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఇదే ప్రథమం.
  • ఈ భారీ మోటార్లను దేశీయ దిగ్గజ కంపనీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్‍ఈఎల్‍ తయారుచేయడం విశేషం


అన్ని అడ్డంకులను అధిగమించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం శుభ సూచకం. 6 దక్షిణ తెలంగాణ జిల్లాలకు, 19 నియోజకవర్గాలకు, 70 మండలాల్లో 1226 గ్రామాలకు ఈ ప్రాజెక్టు వరదాయనిగా మారబోతున్నది. హైదరాబాద్‍ రాష్ట్రం రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‍నగర్‍ కోల్పోయిన నీటి వాటా తెలంగాణ రాష్ట్రంలో పొందింది. జూరాల, రాజోలిబండ, ఊకచెట్టి వాగులకు ట్రిబ్యునల్‍ కేటాయించి నీరు 37.84 టిఎంసిలు, కల్వకుర్తికి 40 టిఎంసిలు, నెట్టెంపాడుకు 22 టిఎంసిలు, పాలమూరుకు 90 టిఎంసిలు, మొత్తం 189.84 టిఎంసిల క•ష్ణా జలాలు ఉమ్మడి మహబూబ్‍ నగర్‍ జిల్లాకు దక్కడం గమనించదగ్గ విశేషం. ఇది తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడినందున దక్కిన ఫలితం. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‍ సంకల్పం తోడయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‍ నగర్‍, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు అనుభవించిన 60 ఏండ్ల నీటి గోసకు పాలమూరు ప్రాజెక్టు తప్పకుండా ఒక పరిష్కారం కానున్నది.

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే, ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *