విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్‍కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. పశ్చిమబెంగాల్ లోని శాంతినికేతన్ సాంస్క•తిక, విద్యాకేంద్రంగా వెలుగొందుతోంది. సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ(World Heritage Committee)45వ సెషన్ సందర్భంగా ఈ గుర్తింపు ప్రకటన వెలువడింది.
ప్రాధాన్యం:
శాంతినికేతన్‍కు UNESCO వరల్డ్ హెరిటేజ్ హోదా లభించడం శాంతినికేతన్ సాంస్క•తిక, విద్యాత్మక ప్రాధాన్యతను చాటి చెబుతుంది. దాని విశిష్ట ఆర్కిటెక్చరల్ హెరిటేజ్‍ను కాపాడేందుకు వీలు కల్పి స్తుంది. రవీంద్ర నాథ్ ఠాగూర్ వారసత్వంపై అంతర్జాతీయ అవగాహనకు ప్రాచుర్యం కల్పిస్తుంది.
ప్రపంచ విశ్వవిద్యాలయంగా….
1901లో ఏర్పాటైన శాంతినికేతన్ మొదట్లో భారతీయ సంప్రదాయాలను బోధించే రెసిడెన్షియల్ స్కూల్‍గా ఉండింది. మతపరమైన, సాంస్క•తికపరమైన హద్దులను అధిగమిస్తూ అంతర్జాతీయ ఐకమత్యం సాధించడం ఆశయంగా శాంతినికేతన్ ఏర్పడింది. 1921లో అది ‘విశ్వభారతి’ పేరుతో ‘ప్రపంచ విశ్వవిద్యాలయం’గా మారింది. ఆసియాకు చెందిన ప్రాచీన, మధ్యయుగాల నాటి సమ్మేళనంతో కూడిన విశిష్ట వాస్తుశైలి, జానపద సంప్రదాయాలతో శాంతినికేతన్ రూపుదిద్దుకుంది.
ధ్యానకేంద్రంగా మొదలై…
శాంతినికేతన్ మొదట్లో ఒక ధ్యానకేంద్రంగా ఏర్పాటైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ మొదట్లో దీన్ని ఒక ఆశ్రమంగా ప్రారంభించారు. కులం, మతంతో సంబంధం లేకుండా ఆయా వ్యక్తులు ధ్యానం చేసుకునేందుకు ఒక ప్రశాంత స్థలం కావాలన్న ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.
నాటి కాలానికి భిన్నమైన వాస్తుశైలితో…
అప్పట్లో దేశమంతా కూడా బ్రిటిష్ వలసల, యురోపియన్ ఆధునిక వాస్తుశైలిల ప్రభావం ఉండేది. శాంతినికేతన్ ఆర్కిటెక్చర్ శైలి మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఆసియాకు చెందిన ప్రాచీన, మధ్యయుగాల నాటి సమ్మేళనంతో కూడిన విశిష్ట వాస్తుశైలి, జానపద సంప్రదాయాలతో శాంతినికేతన్ రూపుదిద్దుకుంది. నాటి ఆసియావ్యాప్త ఆధునికత రూపాలను అది ఆలింగనం చేసుకుంది.
శాంతినికేతన్‍కు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించేలా చేసేందుకు వీలుగా యునెస్కో నామినేషన్ డోసియర్ రూపకల్పనలో ప్రఖ్యాత కన్సర్వేషన్ ఆర్కిటెక్ట్ అబా నారైన్ లాంబా కీలక పాత్ర పోషించారు. జాబితాలో శాంతినికేతన్ పేరు వచ్చేలా చేయడంలో ఆమె తన నైపుణ్యాలను, శక్తి యుక్తులను ఉపయోగించారు. బెంగాల్ ప్రభుత్వం గత పన్నెండేళ్లుగా శాంతినికేతన్ మౌలిక వసతుల ఉన్నతికి చేసిన క•షి కూడా ఈ సందర్భంగా కలసి వచ్చింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం, రచనలు, స•జనాత్మకత, ఆశయాలతో శాంతినికేతన్‍కు గల సన్నిహిత సంబంధాన్ని డోసియర్ లో వివరించారు. అంతర్జాతీయ సహకారానికి, ప్రజల, పర్యావరణ సంరక్షణకు గల కట్టుబాటు, ఆధునిక ఆసియా శైలిని ఆలింగనం చేసుకున్న తీరును నొక్కి చెప్పారు. శాంతినికేతన్ తో అనుబంధం కలిగిన, కలసి పని చేసిన మేధావులు, అధ్యాపకులు, కళాకారులు, నిపుణుల గురించి కూడా వివరించారు. ఆర్కిటెక్చర్, కళలు, ప్రోడక్ట్ డిజైన్, టౌన్ ప్లానింగ్ వంటి రంగాల్లో శాంతినికేతన్ చేస్తున్న క•షిని తెలిపారు.
•చీజు••• గుర్తింపును పొందేందుకు గాను ఈ ప్రాంతం సంరక్షణకు చేపట్టిన కార్యాచరణ ప్రణాళికను భారత ప్రభుత్వం సమర్పించింది. 36 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ స్థలాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షించనుంది. అదే విధంగా దీని చుట్టూరా 537 హెక్టేర్ల స్థలంలో నిర్మాణ కార్యకలాపాలను ఏఎస్‍ఐ నియంత్రించనుంది. తాజా ణశీ••ఱవతీ రూపకల్పనకు 2010 నాటి డోసియర్ కూడా ఎంతగానో తోడ్పడింది. అప్పట్లో జరిగిన ఎన్నో ఏళ్ల అధ్యయనం, క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఇప్పుడు పనికొచ్చాయి.
భారతదేశంలో ఇప్పటి వరకూ 40 ప్రాంతాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ (UNESCO World Heritage Site)గా గుర్తింపు పొందాయి. అలాంటి ఘనత దక్కించుకున్న 41వ ప్రాంతం శాంతినికేతన్. పశ్చిమబెంగాల్ పరంగా చూస్తే ఇలాంటి గుర్తింపు పొందిన మూడోది అవుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే సుందర్ బన్స్, డార్జిలింగ్ మౌంటెన్ రైల్వేస్ ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలోకి ఎక్కాయి. మొత్తం మీద ఇలాంటి అంశాల్లో బెంగాల్ జోరు కొనసాగుతోంది. గత ఏడాదే బెంగాల్ కు చెందిన దుర్గాపూజ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ జాబితాలో స్థానం పొందింది.
చారిత్రక భవనాలు, ల్యాండ్ స్కేప్స్, ఉద్యానవనాలు, పెవిలియన్స్, కళాక•తులు, విద్యాత్మక, సాంస్క•తిక సంప్రదాయాల కొనసాగింపు… ఇవన్నీ కలగలసి శాంతినికేతన్ కు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు లభించేలా చేశాయి. అవన్నీ మిళితమై దీని తిరుగులేని సార్వత్రిక విలువను చాటిచెప్పాయి.
శాంతినికేతన్ లోని కట్టడాలు, ఓపెన్ స్పేసెస్ అన్నీ కూడా పర్యావరణాత్మక కళ, విద్యాసంస్కరణలు, విజువల్ ఆర్ట్లకు సంబంధించి ఉత్క•ష్ట ప్రపంచ గుర్తింపును పొందాయి. అక్కడి ఆశ్రమం, ఉత్తరాయన్, కళాభవన్ లాంటివి బాగా ప్రఖ్యాతి పొందాయి. రవీంద్రనాథ్‍తో పాటుగా బెంగాల్‍కు చెందిన కళలు, తొలికాలం నాటి భారతీయ ఆధునికత అగ్రగాముల ఆశయాలకు అద్దం పట్టేదిగా శాంతినికేతన్ రూపుదిద్దుకుంది.
శాంతినికేతన్ కు యునెస్కో గుర్తింపు రావడం అనేది భారతదేశ వారసత్వాన్ని వేడుక చేసుకోవడం మాత్రమే గాకుండా సాంస్క•తిక, విద్యాత్మక కేంద్రంగా శాంతినికేతన్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుంది.
1972లో యునెస్కో ఆమోదించిన వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ (UNESCO World Heritage Convention) ఇలాంటి ఉత్క•ష్ట స్థలాలను భవిష్యత్ తరాల వారి కోసం కాపాడేందుకు ప్రయత్ని స్తుంది.
వాటి సార్వత్రిక విలువను గుర్తిస్తుంది. వాటి సంరక్షణకు అంతర్జాతీయ సహకారం ఉండాల్సిన అవసరాన్ని చాటిచెబుతుంది.
కొన్ని నెలల క్రితమే శాంతినికేతన్ ను UNESCO వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చాల్సిందిగా ఫ్రాన్స్కు చెందిన అంతర్జాతీయ ICOMOS (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్) సిఫారసు చేసింది. అది ఇప్పుడు నిజమైంది.
నేడు శాంతినికేతన్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. చదువు, కళలు అపూర్వ రీతిలో సంగమించిన ప్రాంతమే శాంతినికేతన్.
శాంతినికేతన్ తో పాటుగా పాలస్తీనా లోని ప్రాచీన జెరికో, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లోని సిల్క్ రోడ్స్ కు చెందిన జరాఫ్షాన్ – కారాకుమ్ కారిడార్, ఇథియోపియా లోని గెడియో కల్చరల్ ల్యాండ్ స్కేప్, చైనాకు చెందిన ప్యుర్ లోని జింగ్ మయి పర్వతాల పాతకాలపు తేయాకు అడవుల కల్చరల్ ల్యాండ్ స్కేప్ కూడా తాజాగా UNESCO వరల్డ్ హెరిటేజ్ జాబితాలో స్థానం పొందాయి.
శాంతినికేతన్‍కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించడం పట్ల ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటుగా చారిత్రక వారసత్వ సంపద, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
-సువేగా,
ఎ : 9030 6262 88