బి.ఎస్‍.రాములు 75వ జన్మదిన వజ్రోత్సవం


బి.ఎస్‍. రాములు సామాజిక తత్వవేత్తగా, సుప్రసిద్ధ రచయితగా, బీసీ కమిషన్‍ తొలి ఛైర్మన్‍గా, విశాలసాహిత్య అకాడమి, సామాజిక తాత్విక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులుగా, దళిత (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ) రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా, సమకాలీన రాజకీయ విశ్లేషకులుగా అందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తనదైన విశిష్ఠ పాత్రను నిర్వహించారు.
23 ఆగష్టు 1949న జగిత్యాలలో జన్మించిన బి.ఎస్‍. రాములు తొలి కథ 1968 జనవరి బాలమిత్ర సంచికలో జగిత్యాల కథగా ప్రచురించబడింది. అప్పటినుండి నిరంతరం విభిన్న విషయాలపై విస్తారంగా రాస్తూ వస్తున్నారు. 23 ఆగష్టు 2023 నుండి 75వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా 75వ జన్మదిన ఉత్సవాలను డా।। వింజమూరి సూర్యప్రకాష్‍, ప్రొ. తాటికొండ వెంకటరాజం, విద్యావేత్త డా।। బి.ఆర్‍. అంకం, అంబర్‍పేట సేవాసమితి నిర్వాహకులు కార్యక్రమాలను నిర్వహించారు.


23 ఆగష్టు 2023న ఉదయం 11 గం।।ల నుండి సాహితీవేత్తలు, అభిమానులు, బంధుమిత్రులు కరోనా కాలం తర్వాత అందరం కలుసుకో గలిగాం అని అనేక విశేషాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా కొన్ని పుస్తకాల ఆవిష్కరించారు.


ఈ ఉత్సవానికి డా।। వడ్డేపల్లి కృష్ణ, నాళేశ్వరం శంకరం, నేటినిజం దినపత్రిక సంపాదకులు బైస దేవదాస్‍, డా।। కాలువ మల్లయ్య, ఆడెపు లక్ష్మీపతి, కథలాపూర్‍ కరెంట్‍ గంగారెడ్డి, ఆర్టీసి ఆనందం, సుప్రసిద్ధ గేయ కవి తెలంగాణ సంస్క•తి సారథి, కళాకారులు జనగామ శంకర్‍, రిటైర్డ్ ప్రిన్సిపల్‍, విద్యావేత్త వడ్లకొండ జగదీశ్వర్‍, రిటైర్డ్ ప్రిన్సిపాల్‍ ఎం. అనంతయ్య, నిమ్స్ కాలేజి ప్రిన్సిపాల్‍, కొక్కుల భాస్కర్‍, కట్టా ప్రభాకర్‍, శిరం శ్రీనివాస్‍, రుద్ర శంకర్‍, బెనారస్‍ యూనివర్శిటీలో బి.ఎస్‍. రాములు సాహిత్యంపై పిహెచ్‍డి చేస్తున్న సంతు, ఎంబిసి కులాల రాష్ట్ర అధ్యక్షులు నిమ్మల వీరన్న, చెన్నమనేని శ్రీనివాస్‍, జాజుల గౌరి, ఉసికెల శంకరయ్య, హేమలత, పొన్నూరు నుండి విజయరావు, కరీంనగర్‍, వరంగల్‍, జగిత్యాల తదితర ప్రాంతాల నుండి అభిమానులు ఈ సభలో పాల్గొన్నారు. ఆహ్వానం సంఘం తరఫున డా।। సూర్యప్రకాష్‍, ప్రొఫెసర్‍ వెంకటరాజం, పూలమాలలతో సత్కరించారు.


ఆత్మీయులు, పలువురు సాహితీవేత్తలు శుభాకాంక్షలు తెలిపారు. సాహిత్యంలో, తాత్విక రంగంలో, సామాజిక ఉద్యమాల్లో బి.ఎస్‍. రాములు నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. తరతరాలకు వీరి సాహిత్యం, సిద్ధాంతాలు భవిష్యత్‍ తరాలు ముందుకు తీసుకు పోతాయని ఆకాంక్ష వ్యక్తం చేశారు. పుస్తకావిష్కరణల సందర్భంగా ఆయా పుస్తకాల గురించి సంక్షిప్తంగా ఆవిష్కర్తలు వివరించి విశ్లేషించారు.


సమావేశం ముగింపులో బి.ఎస్‍. రాములు స్పందిస్తూ, అనేకమంది సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు తమ సందేశంలో నా జీవితమే సందేశం అని అంటారని నేను కూడా అదే అంటున్నాను అని అన్నారు. నా జీవితం, సాహిత్యం, ఉద్యమాలు వేర్వేరు కావని కుటుంబ సభ్యుల సహకారం, బంధుమిత్రుల సహకారంతోనే 105 పుస్తకాలు విభిన్న అంశాలపై వెలువరించడం సాధ్యపడిందని, అందరికి ధన్యవాదాలు తెలిపారు. కథా శిక్షణా తరగతులు ‘కథలబడి’ గ్రంథాలతో వందలాది కథకులు స్ఫూర్తి పొంది ఎదగడం సంతోషంగా ఉందన్నారు. గద్దర్‍ ఆకస్మిక మరణం తనను కలచివేసిందని, వారి సంస్మరణ సభలు జరుగుతున్న సందర్భంగా జన్మదిన సభ వాయిదా వేద్దాం అని అనుకున్నామని, కానీ సాహితీవేత్తలు, మిత్రులు కనీసం ప్రారంభోత్సవమైనా తప్పనిసరి అదే తేదీన జరపాలని కోరారని, దాంతో అతితక్కువ వ్యవధిలో ఆహ్వాన సంఘం పూనుకొని ఈ ఏర్పాటు చేసిందని, వారికి ధన్యవాదాలు తెలిపారు. వందలాది మంది ఫేస్‍బుక్‍ ద్వారా, వాట్సప్‍ ద్వారా, ఫోన్ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. వారందరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఇలా 75వ జన్మదినోత్సవ ప్రారంభ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు కన్నులపండుగా సాగింది. భోజనాలు చేస్తూ, భోజనాల అనంతరం కూడా అరగంట దాకా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఇలా 200 మందికి పైగా పాల్గొన్న 75 సంవత్సరాల ప్రారంభ సభ ఆత్మీయంగా ముగిసింది. ఈ కొత్త పుస్తకాలను పలువురికి ఉచితంగా అందజేయడం విశేషం.

  • కట్టా ప్రభాకర్‍,
    ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *