లోహ్రి (భోగి) సంబరాలు

భారత దేశం పండుగుల నేల. భారత దేశంలో, సంవత్సరంలో ఏదైనా నెలలో గాని లేదా ఏదైనా ఋతువులో గాని పండగ జరగకుండా సమయం గడిచింది అని ఊహించుకోవడమే ఎంతో కష్టతరమైన విషయం. అంతలా భారతీయులను పండగలు పలకరిస్తుంటాయి. ఈ పండగలను చేసుకొనే ప్రాముఖ్యత మరియు విధానాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కానీ, పండుగలో ఉన్న సారాంశం మరియు పరస్పర సామరస్యం మాత్రం చెక్కు చెదరకుండా అన్ని పండుగల్లో, అన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటాయి.


దీనిని ద•ష్టిలో ఉంచుకొని వ్యవసాయానికి మూల స్తంభాలుగా ఉండే రాష్ట్రాలు లేదా దేశం ఏదైనా, పంటకోత సందర్భంగా పండుగలు చేసుకోకపోతే అది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుచేతనంటే, వ్యవసాయం చేసేవారు పంటకోత సమయంలో వారికి వచ్చే దిగుబడి మరియు రాబడికి గాను ఎంతో క•తజ్ఞతతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటారు. ఉత్సహపూరితమైన రాష్ట్రాల్లో ముందుండే పంజాబ్‍ మరియు హర్యానా రాష్ట్రాలు, లోహ్రి అనే వ్యవసాయానికి సంబంధించిన పండుగను జరుపుకుంటాయి.


లోహ్రి యొక్క శబ్దవ్యుత్పత్తి :
లోహ్రి అనే పదం ఉద్భవించడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఈ పదం ‘లోహ్‍’ అనే పదం తో ఉద్భవించిందని ఒక కథ ప్రచారంలో ఉంది. ‘లోహ్‍’ అంటే ఇనుము అని అర్ధం. మందమైన ఇనుము బాండీలను పండుగ సందర్భంగా రకరకాల మసాలాలు తయారుచేయడంలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇక్కడి నుండే ఈ పండుగకు ఈ పేరు వచ్చిందని చెబుతారు. జానపద కథలు చెప్పేవారు మాత్రం పూర్వం ఇద్దరు తోబుట్టువులు ఉండేవారు. వారి పేర్లు హోళికా మరియు లోహ్రి. హోళికా హోలీ సందర్భంగా వేసిన మంటల్లో చిక్కుకొని చనిపోయిందట, లోహ్రి బ్రతికిపోయాడట. ఆలా లోహ్రి బ్రతికిపోవడంతో ఆ ఆనందాన్నే ఇలా పండగ రూపంలో జరుపుకుంటున్నారని చెబుతారు.


వ్యవసాయం విజయవంతమవడం:

భారతదేశం వ్యవసాయంపై ఆధారపడ్డ దేశం. పంజాబ్‍ మరియు హర్యానా వంటి భూసారవంతమైన నేలలు కలిగిన ఈ రాష్ట్రాల్లో ఈ మాట మరింత నిజమైనది. ఇలాంటి ప్రదేశాల్లో తాము పడ్డ కష్టానికి, పెట్టిన పెట్టుబడికిగాను చివరిగా వచ్చే పంట దిగుబడి, పంటకోత సమయంలో వచ్చే రాబడి, ఇక్కడివారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో జరుపుకొనే పండగనే లోహ్రి అంటారు. అందుచేతనే పంజాబీ ప్రజల గుండెల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.
తరువాతి తరాలకు సాంస్క•తిక సమగ్రతను పరిరక్షిస్తున్నారు: లోహ్రి పంగడలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ పండగ సందర్భంగా చిన్నపిల్లలు ఇంటింటికి వెళ్లి జానపద పాటలు పాడుతారు. వీరు ఇలా పాడుతున్నందుకు గాను, ఆ ఇంటివాళ్ళు బెల్లం, గింజలు, డబ్బు, ఈ రోజుల్లో చాకోలెట్స్ని వారికి బహుమతిగా ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలకు ప్రోత్సాహకం లభిస్తుండటంతో వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలా చేయడం ద్వారా, వీరు వీరి యొక్క సంస్క•తి, విలువల గురించి నేర్చుకుంటున్నారు. వీటి వల్ల వీరి వ్యక్తిత్వం కూడా అభివ•ద్ధి చెందుతుంది. అందుచేతనే సంప్రదాయకమైన పంజాబీ కుటుంబాలన్నీ ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యతని ఇస్తాయి.


బంధాలన్నీ బలపడే సమయం :
లోహ్రి పండుగ సందర్భంగా కుటుంబంలో ఉన్న స్త్రీ, పురుషులు అందరూ ఇంటి నుండి బయటకు వచ్చి పంజాబీ జానపద న•త్యాలు చేస్తారు. భోగి మంటను మధ్యలో పెట్టి వీరు ఆ న•త్యం చేయడం ఆనవాయితీ. సాధారణంగా స్త్రీలు గిద్ద అనే న•త్యం చేయగా, పురుషులు బాంగ్రా అనే న•త్యం చేస్తారు. పాటలు పాడటం, న•త్యం చేయడం, యిలా ఎన్నో ఉత్సాహ వంతమైన కార్యక్రమాల్లో పాల్కొంటూ, రాత్రంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆ భోగి మంటలు అలా మండుతూ ఉండటం కోసమై పల్లీ పట్టీని, పాప్‍ కార్న్, వేరు సెనగకాయలను ఇలా మరికొన్ని వాటిని ఆ భోగి మంటలో వేస్తారు. వీరు చేసే ఈ పనులన్నీ పిల్లల్లో, కుటుంబ సభ్యుల్లో, సమాజంలో మతసామరస్యం పెంపొందించడంలో ఎంతగానో కీలక పాత్ర పోషిస్తాయి.


రుచికరమైన ఆహారాలు తినటం :
సాధారణంగా భారతీయులు వారు తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహిస్తారు. ఏదైతే ఉత్తమంగా ఉంటుందో దానిని తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇక పండుగ సమయంలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పననవసరం లేదు. ఇలాంటి సందర్భంలో మరింత రుచికరమైన ఆహారాన్ని తినటానికి ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఈ పంటకోత పండుగ సందర్భంగా చేసే సర్సొన్‍ డా సాగ్‍, మక్కి ది రోటి, ఖీర్‍ గురించి ప్రస్తావించకపోతే అసంపూర్తిగా ఈ పండుగ గురించి చెప్పినట్లు అవుతుంది.


సూర్యదేవునికి సమర్పణలు :
మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, సరైన పంట దిగుబడి రావాలంటే సరైన వెలుగు కూడా అవసరం. అందుచేతనే ఈ పండుగ, ఈ విషయానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతని ఇస్తుంది. వెలుగును, వేడిని యిచ్చే సూర్యదేవునికి సమర్పణలు చేయడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, అందుకు ప్రతిఫలంగా మొక్కజొన్న పొలాలు మరింత దిగుబడిని సాధిస్తాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. చివరకు ఇదంతా మనుష్యులు మరియు జంతువులు ఈ భూమిపై ఆనందంగా ఉండటానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి.


చల్లని శీతాకాలాలు :
జనవరి మాసం మధ్యలో లోహ్రి పండుగను జరుపు కుంటారు. ఈ సమయంలో సూర్యుడు మకరరాశి నుండి తప్పుకొని, ఉత్తరం వైపుకు జరుగుతాడు. ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ సందర్భాన్నే ఉత్తరాయన్‍ అని కూడా పిలుస్తుంటారు. ఈ సమయం అయిన శీతల కాలంలో విపరీతమైన చలి కూడా ఉంటుంది. ఈ అతి చల్లని శీతలకాలం కారణంగానే భోగిమంట కేంద్రంగా లోహ్రి పండగను జరుపుకోవడం జరుగుతుంది. అలా భోగి మంటకు, శీతల కాలానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ముడిపడి ఉంది.


ఆత్మ సంత•ప్తి :
కావాల్సిన మేర ఆహారాన్ని ఆరగించడం మరియు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఈ లోహ్రి పండుగ జరుపుకున్న అందరిలో ఒకరకమైన ఆత్మ సంత•ప్తి కలుగుతుంది. ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకమైన, అతిముఖ్యమైన విశిష్టత. లోహ్రి సందర్భంగా ప్రజలు ఎంతో శాంతంగా వారి వారి కుటుంబ సభ్యులతో, ఒక మంచి భావంతో ఈ పండగను జరుపుకుంటారు. సిక్కులు, పంజాబీలు భోగి మంట చుట్టూ చేరి గురు గ్రంథ్‍ సాహిబ్‍ నామస్మరణ చేస్తారు. భోగి మంట ముందు ధ్యానం కూడా చేస్తారు.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *