భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం


రాజస్థాన్‍లో 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆదేశం
మరింత తక్కువ ధరలో విద్యుత్‍ ఉత్పత్తికి క•షి చేయాలి
రాష్ట్రంలో పవన విద్యుత్తు ప్లాంట్‍ల ఏర్పాటుకు పరిశీలన
సింగరేణి సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍

ఇప్పటికే కంపెనీ వ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగా వాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరాం పేర్కొన్నారు.


హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో ఆయన సింగరేణి విద్యుత్‍ విభాగంపై డైరెక్టర్‍ ఈ అండ్‍ ఎం. డి.సత్యనారాయణ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో శనివారం (మార్చి 2) నాడు ప్రత్యేక సమీక్షను నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన కంపెనీ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కొత్తగా సింగరేణి సంస్థ చేపట్టనున్న సోలార్‍ విద్యుత్తు ప్రాజెక్టులపై చర్చించారు. సోలార్‍ విద్యుత్తు పెంపుదలకు క•షి చేయాలని ఇటీవల రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ జలాశయాలైన లోయర్‍ మానేరు డ్యాం పైన 300 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్‍ ప్లాంట్‍, మల్లన్న సాగర్‍ జలాశయం పైన 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటుకు తగు సన్నాహక చర్యలుతీసుకోవాలని సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍ సంబంధిత అధికారులను ఆదేశించారు.


లోయర్‍ మానేర్‍ డ్యాంపై 300 మెగా వాట్ల సోలార్‍ ప్లాంట్‍ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్‍ సిద్ధంగా ఉంది. కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిర్మాణం చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. కాగా మల్లన్న సాగర్‍ జలాశయంపై ఏర్పాటు చేయ తలపెట్టిన రెండు 250 మెగావాట్ల ఫ్లోటింగ్‍ సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి డిపిఆర్‍ను వెంటనే రూపొందించాలనీ ఆయన అధికారులను ఆదేశించారు.


రాజస్థాన్‍ రాష్ట్రంలో సింగరేణి ఏర్పాటు చేయతల పెట్టిన 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్‍కు సంబంధించిన కార్యాచరణపై కూడా ఆయన సమీక్షించారు. దీనిపై రూపొందించిన డిపిఆర్‍పై మరింత లోతుగా అధ్యయనం జరపాలని, తక్కువ ధరకే విద్యుత్‍ ఉత్పత్తి జరిగే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, తద్వారా విద్యుత్‍ పంపిణీ సంస్థలు సింగరేణి సోలార్‍ విద్యుత్తును ఎక్కువగా కొనే అవకాశం ఉంటుందన్నారు.


మంచిర్యాల జిల్లా జైపూర్‍ వద్ద గల సింగరేణి ధర్మల్‍ విద్యుత్‍ కేంద్ర పనితీరుపై కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రస్తుత 1200 మెగావాట్ల ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల సూపర్‍ క్రిటికల్‍ థర్మల్‍ విద్యుత్‍ కేంద్రానికి సంబంధించిన టెండర్‍ పక్రియ త్వరగా పూర్తిచేసి నిర్మాణం ప్రారంభించాలని అధికారులను కోరారు. ఇటీవల సింగరేణి థర్మల్‍ విద్యుత్‍ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ•త లాల్‍ మీనా ఇదే ప్రాంగణంలో 800 మెగావాట్ల సూపర్‍ క్రిటికల్‍ ప్లాంట్‍తో పాటు మరో ఎనిమిది వందల ప్లాంట్‍ను కూడా నిర్మించే అవకాశాలను పరిశీలించాలని సూచించారని, కనుక దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై వెంటనే ఒక నివేదిక సమర్పించాలని చైర్మన్‍ ఆదేశించారు.
వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుత్‍ కేంద్రాల ఏర్పాటు చేయటానికి అవకాశం గల ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా రూపొందించాలని ఆయన కోరారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్‍ (ఈ అండ్‍ ఎం) డి సత్యనారాయణ రావు, ఎగ్జిక్యూటివ్‍ డైరెక్టర్‍ బసివి రెడ్డి, జనరల్‍ మేనేజర్‍ సివిల్‍ సూర్యనారాయణ, మేనేజర్‍ సోలార్‍ జానకిరామ్‍, చీఫ్‍ ఆఫ్‍ పవర్‍ ఎన్‍ వికేవి రాజు, చీఫ్‍ ఓఅండ్‍ ఎంజేఎన్‍ సింగ్‍. డీజీఎంలు వేణుగోపాల్‍, సిహెచ్‍ ప్రభాకర్‍, తదితరులు పాల్గొన్నారు.


-చీఫ్‍ పబ్లిక్‍ రిలేషన్స్ ఆఫీసర్‍
ది సింగరేణి కాలరీస్‍ కంపెనీ లిమిటెడ్‍
(ప్రభుత్వ సంస్థ), ప్రజా సంబంధాల విభాగం, హైదరాబా

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *