సుందర నగరాల్లో ఛిద్రమౌతున్న బాల్యం

నేపథ్యం:
వేగావంతమవుతున్న పట్టణీకరణతో పాటు పట్టణాలలో పేదలు నివసించే ప్రాంతాల జనాభా కూడా పెరుగుతుంది సుమారు ఆరు కోట్ల యాభై లక్షల మంది ప్రజలు అంటే పట్టణ జనాభాలో 27% మంది అరకొర వసతులున్న ఈ బస్తీలలో నివసిస్తున్నారని 2011 జనాభా లెక్కలు నివేదించాయి. 2011 తర్వాత అధికారికంగా మురికివాడల జనాభా లెక్కలు ఏమీ లేవు గాని ఈ 13 సంవత్సరాల కాలం లో గ్రామీణ శ్రామిక పేదలు నగరాలకు తరలడం పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు లేక గ్రామాల నుండి పట్టణాలకు రావడం పట్టనీకరణ అనివార్యం అవుతూనే ఉంది. అయితే గ్రామాల నుంచి ఉపాధి కోసం తరలివస్తున్న కుటుంబాలు వారి పిల్లల కోసం నగరాలు ఎంత మాత్రం సిద్ధంగాలేవు. మరోవైపు పట్టణాలలో రోడ్ల విస్తరణ ఫ్లైఓవర్‍ నిర్మాణం మెట్రో రైలు మాల్స్ ఫుడ్‍ కోర్టులు పట్టణ సుందరీకరణ వంటి మెగా ప్రాజెక్టులతో పట్టణాలలోని ఇతర ప్రాంతాలు సిద్ధమవుతున్నాయి.


ప్రగతి అభివ•ద్ధి ఆర్థిక అభివ•ద్ధికి ఇవి సూచికలుగా నిలుస్తున్నాయి రియల్‍ ఎస్టేట్‍ రంగంలోని రియాల్టర్లు వారికి దన్నుగా నిలిచే రాజకీయ వర్గాలు ప్రభుత్వ భూములను ఆధీనంలోకి తీసుకోవడానికి కోసం పోటీ పడుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ప్రజా ఉపయోగా ప్రదేశాలను ఆక్రమించుకోవడం అధికార దర్పణానికి మార్గంగా తయారయింది. ఫలితంగా పేద మద్యతరగతి వర్గాలకు చెందవలసిన విద్యా, ఆరోగ్యం, పరిశుభ్రమైన, నీరు, ప్రజా రవాణా సదుపాయం, నివాసం, ఇతర సదుపాయాలు చిన్న చూపుకు గురవుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాదులో నగరం నడిబొడ్డున ఉండి ప్రఖ్యాతి గాంచిన ఎయిడెడ్‍ పాఠశాలల ప్రాంగణాలు వాణిజ్య సముదాయాల కోసం ఆక్రమనకు గురికాబడి నిర్వహణకు నిధుల కొరత చివరికి ఉపాధ్యాయుల కొరత ద్వారా మూతబాదడానికి సిద్దమయ్యాయి.


ఈ పట్టణీకరణ పక్రియ పేదలను మనం చూసే మనకు తెలిసిన నగర ప్రాంతాలకు దూరం చేసి వారి పిల్లల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడంతో పాటు వారిని మరింత ప్రమాదకర పరిస్థితులను గురిచేస్తుంది. ఏ బస్తీలో చూసినా టార్పాలిన్‍ లేదా అల్యూమినియం సీట్లతో ఏర్పడిన నివాసలు అక్కడక్కడ డాబా ఇల్లు టీవీ యాంటినాలు విద్యుత్‍ తీగలు పాత బట్టల దుంతలు చెత్తతో నిండిన మురికి పరిసరాలు దుర్గంధం వెదజల్లుతు పారే మురికి కాలువల పరిసరాలు వారి నివాస ప్రాంతాలు అవుతున్నాయి. రోజుకి ఒకసారి ఒక గంట పాటు ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీటి కోసం వారు కుస్తీలు పడతారు. వేసవిలో అయితే నీటి కోసం చిన్నపాటి యుద్దాలే జరుగుతాయి. తాగడానికి శుభ్రమైన నీరు అందుబాటులో లేని ఫలితంగా నీటిపారుదల వ్యవస్థ లోపం వల్ల జ్వరాలు డయేరియా మలేరియా డెంగ్యూ వంటి అనేక రోగాల బారిన పడుతుంటారు.
బడికి వెళ్ళని పిల్లలు బడికి వెళ్లే కొందరు పిల్లలు కూడా చెత్తకుప్పలు దుకాణాలు భవన నిర్మాణ సైట్లు ఫంక్షన్‍ హాల్లో కార్యక్రమాలు అయిన తర్వాత క్లీనింగ్‍ వర్క్ వంటి పనులు చేయడం వల్ల చర్మవ్యాధులకు నోటి పొక్కుల వంటి వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని పని ప్రదేశాలలో వెలువడే ప్రమాదకర గ్యాసు దుర్గంధ వాసనాలకు భోజనం రుచించక ఆకలికి దూరమై పిల్లల ఆరోగ్యాల మీద ప్రభావం చూపుతున్నాయి. బడికి వెళ్ళడానికి బస్సులు ఉండవు కొంతమంది పిల్లలు జనం నడవడానికి యోగ్యం కానీ మార్గాలలో నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల కూడా నడిచి బడికి వెళ్లాలి వారు నివసించే నగరం మనం అందరం నివసించే నగరానికి ఎంతో దూరం కాదు మన మధ్యనే పక్కనే ఉంటుంది అయినా మన నగరంతో పోలిస్తే వారి నగరం భిన్నంగా ఉంటుంది.


బాలురు, పురుశాదిపత్యం మరియు అస్తిత్వ వాస్తవాలు:

ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‍ లోని మధ్యతరగతి ప్రాంతంలోని మా ఇంటి వెనుక ప్రాంతంలోని బాలురు బాలికలతో ఏదో సమావేశంగా కాకుండా వారితో బస్తీలో కూర్చొని మామూలుగా మాట్లాడాను. ఈ సంభాషణ మొత్తం వారి రోజువారి జీవనం చదువు ఆటలు క్రీడలు స్నేహితులు జీవనోపాధి వాల్ల తల్లిదండ్రులు వారి వ•త్తి వంటి మొదలగు అంశాలు మా చర్చలోకి వచ్చాయి.
స్నేహితులు పుట్టినరోజుల పార్టీలు సినిమాలు మొబైల్‍ ఫోన్లు ఇంస్టాగ్రామ్‍ వంటి అంశాలపై మాట్లాడినప్పుడు బాలురు హాయిగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే చదువులు బడులు గురించి మాట్లాడినప్పుడు మాత్రం కొంత ఇబ్బంది పడ్డారు. వారు వాళ్లు ఆడే ఆటలు గురించి హుషారుగా మాట్లాడారు క్రికెట్‍ అందరికి ఇష్టమైన ఆట దగ్గర్లోనే గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్‍ ప్రాక్టీస్‍ కోసం టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్నారు క్రికెట్‍ బ్యాట్‍ బంతి ప్యాడ్స్ కొనడానికి చెందాలు వేసుకుంటామని చెప్పారు. నెలలో రెండు సార్లు ఒక స్లమ్‍కు మరో స్లమ్‍ల మధ్య క్రికెట్‍ చాంపియన్షిప్‍ పోటీలు నిర్వహిస్తారట. ఈ పోటీల నిర్వహణ కోసం కావాల్సిన నిధులను చందాలు వేసుకుని నిర్వహిస్తారట. ఈ పోటీలలో పాల్గొనడానికి సరైన గ్రౌండ్లో ప్రాక్టీస్‍ చేయడం కోసం బస్సులో ను మెట్రోలోనూ వెళతారు. నాతో మాట్లాడిన పిల్లల టీం పేరు ‘గల్లి బాయ్స్’ టీం అని గర్వంగా చెప్పారు. క్రికెట్‍ పట్ల వారి మోజు ఎంత అంటే వారిలో ఒకరు క్రికెట్‍ కోసం మేం ప్రాణాలైనా ఇస్తాం అని చెబుతుంటే మిగతా మిత్రులు చప్పట్లు కొట్టారు. గోలీల ఆట గురించి కూడా వారు ఉత్సాహంగా వివరించారు అయితే ఇందులో డబ్బు పందెం జూదం ఉంటేనే గోలీల ఆటలో మజా ఉందని అందరూ ముక్తకంఠంతో చెప్పారు అయితే బస్తి లో ఉన్న 40 ఏళ్ల గోపి అనే సామాజిక కార్యకర్త పిల్లలు చెడు అలవాట్లకు అలవాటు కాకుండా చూస్తుంటాడాని గోళీలు అడుతున్నప్పుడు చూసినప్పుడు మాత్రం గోలీలు డబ్బులు దాచిపెట్టి ఆయన పోయిన తరువాత మళ్ళీ ఆడుతామని చెప్పారు. గోపి పైసలు పెట్టి ఆడడం చూస్తే మాత్రం మండలిస్తాడని చెప్పారు. గోపి వారిలో క్రమశిక్షణకు ప్రయత్నిస్తున్న వ్యక్తిగా కనిపించారు.


ప్రతి రెండు నెలలకు ఒకసారి అయినా మిత్రులలో ఎవరో ఒకరి పుట్టినరోజు వస్తుంది. బర్త్ డే బాయ్‍ బొమ్మతో ఒక ఫ్లెక్సీ లేదా కటౌట్‍ తయారు చేస్తారు పిక్నిక్‍ కి వెళతారు ఫాస్ట్ ఫుడ్‍ సెంటర్లో తింటారు కేక్‍ కట్‍ చేస్తారు డాన్సులు చేస్తారు మద్యం కూడా ఉంటుంది పార్టీలో. దీని అంతటికి ఖర్చుకు వారిలో వారు చందాలు వేసుకొని డబ్బు సమకూర్చుకుంటారు సరదాగా గడుపుతారు. ఈ బాలల హెయిర్‍ స్టైల్‍ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పైకి నిక్కపొడిచినట్లు కత్తిరించుకోవడం, జూలపాలు పెంచడం, జుట్టుకు పసుపు ఎరుపు నీలం రంగులు వేయడం నల్లద్దాలు ధరించడం వంటి వేషాదారణాలు కనిపిస్తాయి, యూట్యూబ్‍ చూసి డాన్స్ చేయడం నేర్చుకుంటారు. వీళ్ళు తామ చేసే సరదాలకు నెలకి 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు పెడతారు నెలకు 200 రూపాయలు ప్యాకెట్‍ మనీ కావాలని ఇంట్లో తల్లిదండ్రుల నుండి డిమాండ్‍ చేసి అడుగుకుంటారు. ఇది కాక బెదిరించొ బతిమాలో తల్లి నుంచి మరో 100 రూపాయలు గుంజుతారు కొడుకుల పట్ల తల్లికి ఉండే ప్రేమను ఇలా క్యాష్‍ చేసుకుంటారు.
పెళ్లిలు ఇతర ఫంక్షన్లలో యూనిఫాం వేసుకుని వెయిటర్స్ గానూ బరువులు మోయడం దింపడం లారీలలో సామాన్లు ఎక్కించడం వంటి పనులు చేయడం ద్వారా దుకాణాలలో సహాయకులుగా నిర్మాణ పనులలో మేస్త్రీలకు సహాయంకులుగా బ్యాండ్‍ మేళం వంటి వాటిలో పనిచేసి సంపాదిస్తారు ఇలా సంపాదించి దాసుకున్న సొమ్మును వారు తమపై తమ ఆప్తమిత్రులపై ఖర్చు పెడతారు.


ఈ బాలలు వీధి గ్యాంగులలో సభ్యులుగా కూడా ఉండి హింస ముష్టి యుద్ధాలలో పాలుపంచుకుంటారు. ఎవరిని వారు రక్షించుకోవడానికి శిక్షణ ఇస్తారు ఇదంతా గ్యాంగ్‍కి వారు చెప్పే విధేయత దీని ద్వారా వీరికి మిత్రులు సన్నిహితులు ఏర్పడతారు. దూకుడుగా ఉండటాన్ని ఆనందిస్తూ మగతనాన్ని ప్రదర్శిస్తుంటారు. అక్కచెల్లెళ్లు ఆడపిల్లలు బలహీనులని పనికిరాని వాళ్ళని వారి పాత్ర ఇంటికే పరిమితం అని చాలా చిన్న చూపు చూస్తారు.
లాక్‍ డౌన్‍ లో ఆన్లైన్‍ క్లాసుల కోసం మొబైల్‍ ఫోన్‍ తప్పనిసరిగా వాడవలసి అవసరం వచ్చింది. ఫలితంగా చాలా మంది బాలురు మొబైల్‍ ఫోన్‍ లకు బానిసలు అయ్యారు. అశ్లీల వెబ్సైట్లకు అలవాటుపడ్డారు. అంతేకాదు మద్యపానం మత్తు పదార్థాలకు బానిసలు అయ్యారు. తాము నివసించే ప్రాంతాలు వాతావరణం తమ ఆత్మ అభిమానాన్ని ఎలా దెబ్బతీశాయో మానసిక కుంగుబాటు మానసిక ఆందోళనకు కలిగించాయో ప్రమాదకర ప్రవర్తనలకు ఉరిగొలిపాయో బాలురు వివరించారు ప్రతి ఒక్క బాలుడు వద్ద మొబైల్‍ ఫోన్‍ ఉంటుంది అది లేకుండా ఉండలేరు.


వాట్సప్‍ గ్రూపులో ఏర్పాటు చేసుకుని యూట్యూబ్‍ లింక్‍ షేర్‍ చేసుకుంటారు పాటలు డాన్స్ నేర్చుకుంటారు వీడియో గేమ్స్ ఆడతారు సోషల్‍ మీడియాలో తన్మయం కలుగుతారు. ట్విట్టర్‍ ఎక్స్ ప్రెస్‍, ఫేస్‍బుక్‍, ఇన్‍స్టాగ్రామ్‍లో అందరూ చురుకుగా ఉంటారు ఇన్‍స్టాల్‍లో తమను ఫాలో అయ్యే వారి సంఖ్యను వారు గర్వంగా చూపారు. ముంబైకి ట్రిప్‍ వెళ్లడానికి కొంత నగదును కూడా వారు పోగేసుకున్నారు. వర్చువల్‍ స్పేస్‍ వారికి ఒక ఊహలోకం వంటిది తమను తాను హీరోలుగా భావించుకోవచ్చు ఇష్టమైన నటులు లేదా క్రికెట్‍ ఆటగాళ్లతో లగ్జరీ హోటల్లో ఉన్నట్టు అందమైన సరస్సు ఒడ్డున కూర్చున్నట్టు ఊహించుకోవచ్చు. ఈ వర్చువల్‍ స్పేస్‍ తమకు అనేకమంది పర్చవల్‍ మిత్రులు అనుచరులు ఉన్నారని తాము అందరితో సమానం అని అనిపించేలా ఒక మత్తులో ఉండేటట్లు చేస్తుంది.


చదువు మీద ధ్యాస పెట్టి చదువుల వల్ల వచ్చే కొలువుల మీద ద•ష్టి పెట్టమని తల్లిదండ్రులు తమ కొడుకుల్ని నిరంతరం కోరుతూనే ఉంటారు బాలురకి చదువు విలువ తెలిసు కానీ స్కూళ్లలో తమకు కలిగిన అనుభవాలు తామకు ఆత్మనూన్యత భావానికి గురిచేశాయని భావిస్తారు లేదా చదువులో వెనుకబడడానికి తామే కారణం అని చదువులకు తాము పనికిరామని తమ అసమర్ధత కు తమకు తామే నిందించుకుని కొందరు పదవ తరగతి పూర్తి చేయకుండా బడి మానేస్తే మరి కొందరు ఎనిమిదవ తరగతి పూర్తి చేయకుండానే బడి మానేశారు. స్కూళ్లలో ఏం లేనప్పుడు అక్కడికి ఎందుకు వెళ్లాలి అని తమ తాము ప్రశ్నించుకుంటారు. బడి మానేసిన పిల్లలు ఏదో ఒక పని చేసి సొంత ఖర్చులకి డబ్బు సంపాదించు కోవడం మొదలెడతారు. ఇది తప్పు చేస్తున్నామని మనసులో అనుకున్న తమలాగే బడి మానేసి పనులు చేసే తమరితో పోల్చుకుని ఆ ఆలోచనల నుండి బయటపడతారు. చదువుతున్నావా ఏం చేస్తున్నావు వంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి తోడ్పడుతుందని కొంత మంది ఓపెన్‍ స్కూల్‍ విధానంలో పదవ తరగతి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. తాము చదువు మానేయడం ద్వారా చెడి పోయామని చాలామంది బాలురు అంగీకరించారు.


ఈ పరిస్థితులలో కొంత మంది పిల్లలు మత్తు మందులకు డ్రగ్స్ కు అలవాటు పాడుతారు. బస్తీలలో పిల్లలు పెద్దలు అందరూ కుటుంబాలకు కుటుంబాలు ఈ డ్రగ్స్ బారిన పడుతుంటారు. కుటుంబ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అవుతుంది. సంసారాలు ఒక పద్దతిలో నడవవు. భర్త మరొక స్త్రీ తో వెళుతూనే భార్య మరో పురుషిణితో సంబంధాలు ఏర్పరుచుకోవడం ఫలితంగా కుటుంబాలలో తగాదాల తో ఛిద్రమైన కుటుంబాలు. కుటుంబం నైతిక విలువలు అనేవే ఏవి లేకుండా ఈ కుటుంబాలు విచ్చలవిడితనంతో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబాలకు చెందిన పిల్లలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతుంటారు.


పిల్లలను తల్లిదండ్రుల బాధ్యతా రహిత ప్రవర్తనతో స్వంత కుటుంబమే ఈ పిల్లలకు అబద్రతలోకి నెట్టి వేయ బడుతారు. ఇలాంటి కుటుంబాలు ప్రతి బస్తీలో 30 నుండి 40 శాతం మంది ఉన్నారని ఒక అంచనా ఈ బస్తీలలోని పిల్లలు మత్తు పదార్ధాలను స్వీకరించే కస్టమర్ల నుండి మెల్ల మెల్ల గా మత్తు పదార్ధాలను బస్తీలోకి తీసుకు రావడానికి మద్య వర్తులుగా మారిపోతారు. ఈ బస్తిలలో యువత మరియు యుక్త వయసు పిల్లలు ఎక్కువ మందే ఆత్మ హత్యలకు పాలుపడుతున్నట్లు గా కూడా తెలిసింది. ఇలా చనిపోయిన వారిని గోడకు వేలాడేసిన ఫోటో గా మారి పోయారని అనుకుంటారట. ఒక సారి తమా తో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మత్తుకు అలవాటుపడి అనుమానస్పద మ•తి చెందిన సంధర్భంగా శవానికి పాలు పోస్తూస్నేహితులంతా కలిసి తాగి డ్యాన్సులు చేస్తూ ఒక ట్రక్‍ మీద ఊరేగించి దహనం చేశారు. ఇది ఒక నూతనఆ భయంకరమైన చావు సంప్రదాయం.


అబ్బాయిలు ఒక్కసారి వారి పరిసరాల నుండి బయట పట్టణ పరిసరాలలోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళ పట్టణం పూర్తిగా భిన్నమైనది. వారు జీవించే పరిస్థితులు ఎలా ఉన్నా వారు ఇంట్లో అనుభూతి చెందుతారు, తక్షణ అవసరాలు మరియు కోరికలను తీర్చుకుంటారు. మగ పెత్తనాన్ని ప్రదర్శిస్తూ దూకుడుగా త•ప్తిగా ఉంటారు. మనం నివసిస్తున్న మన పట్టణ ప్రాంతాలు ఆధునిక హంగులు పట్టణ అభివ•ద్ధి వారి పట్టణం కాదు. అణిగిమణిగి ఉండడం భావోద్వేగంతో మరియు ఆత్మగౌరవం కోల్పోవడం వారి జీవిత అనుభవం. నిజానికి వారి నిత్య జీవితం వాస్తవ ప్రపంచం మరియు బ్రమలో ఉన్న ప్రదేశాలలో మనోవైకల్యం తో తిరగాడుతున్నారు.


ఇలాంటి పరిస్థితుల జీవనం కొనసాగిస్తున్న ఈ పిల్లల వ్యక్తిత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నా ఊహకు అందని విషయం. వారి అస్పష్టమైన భవిష్యత్తు ముందుగా ఊహించి చెప్పడం చాలా కష్టమే.
ముఖ్యంగా 30-40 ఏళ్ల వయసున్న వారి జీవితాలను పరిశీలిస్తే మగవారు మద్యానికి బానిసలు కావడం తమ కోప తాలను ఇంట్లో మహిళల, పిల్లల మీద చూపించడం గమనించవచ్చు.
బాలికలు, లింగ వివక్ష మరియు విద్య అడుగడుగునా ఆడపిల్లలు కుటుంబాలలో పిత•స్వామ్య విలువలు వీధుల్లో, పాఠశాలల్లో, బస్‍ స్టాప్లో లింగ వివక్షతో పోరాడుతున్నారు. వారు తమ గురించి విప్పి చెప్పడానికి కొంత సమయం తీసుకున్నారు. మొదటి సంభాషణ లింగ వివక్ష మరియు హింస గురించి. బాలికలు పాఠశాల నుంచి వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమితం కావడం, స్కూల్‍ నుండి ఆలస్యంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు వారిని అనుమానించడం మొదలైన అనేక ఇబ్బందులను బాలికలు ఈ బస్తీలలో ఎదురుకుంటున్నారు. పైగా మద్యానికి బానిసైన తండ్రుల హింస నుండి తల్లిని రక్షించేది ఆడపిల్లలే. తమ అన్న దమ్ములు చెలాయిస్తున్న పెత్తనాన్ని మగ పిల్లలకున్న అధికారాలను చూస్తూ వారి పట్ల కొంత ద్వేషాన్ని కూడా పెంచుకున్నారు.


మగ పిల్లలకు వేడి వేడి ఆహారాన్ని వడ్డించడం, ఏదైనా ప్రత్యేక వంటకం చేస్తే వారే ముందుగా తింటారు. అమ్మాయిలేమో మిగిలిపోయిన పదార్థాలతో సరిపుచ్చుకోవాలి. అబ్బాయిల ఇంటిపనులు లో ఏ మాత్రం సహాయం చేయరు మరియు ఎటువంటి బాధ్యత వహించరు. అబ్బాయియులు ఎంత సేపు వారి గురుంచి వారే ఆలోచించుకుంటారు తప్ప కనీసం అందరూ తినడానికి సరిపోను ఆహారం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయతించరు. అదే ఆడ పిల్లలకు ఇంటి పరిస్తితి అంతా తెలిసి ఉంటుంది. కోవిడ్‍ లాంటి కష్ట సమయాల్లో కూడా అబ్బాయిల పరిస్థితి ఇదే.
బస్తీలలో అమ్మాయిలకు కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, స్నేహితులతో కలవడానికి చోటు లేదు. అదే అబ్బాయిల విషయం లో 90% మంది ఆటలు పాటలతో సమయాన్ని గడుపుతుండగా అమ్మాయిలకు ఆటలు ఆడడం అనే ప్రశ్నే లేదు. ఆడ పిల్లలకే కాదు వాళ్ళ తల్లులకు కూడా వారి స్వంత గుడిసె బయట కూర్చొని మాట్లాడే స్థలం లేదు.


కోవిడ్‍ సమయంలో స్వచ్చంద సంస్థల సామాజిక వ్యక్తులు చేసిన సహాయం గురుంచి చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు పంచిన రేషన్ల గురుంచి తమ బస్తీలో సంఘ పెద్దలు ఒక్కటై అతి పేద కుటుంబాలను ఆదుకున్న విషయాలను చెప్పారు. క్లిష్ట సమయంలో కుటుంబాలు ఒకరికొకరు మద్దతుని చూసి మనుషులలో మానత్వ రూపాన్ని చూశామని చెప్పారు. వారి వారి కుటుంబాలలో చాలా మంది రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవారని మరియు కరోనా కాలం అంతా కూడా ఆందోళన కలిగించిన కాలంగా చెప్పారు. అదే సమయంలోనే తమతో పాటు చదువుతున్న చాలా మంది స్నేహితుల పెళ్లిళ్ళు కావడం వలన చదువు మానేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాలలో పెళ్లి వద్దని ప్రతిఘటించిన వారిని ఒక గదిలో బంధించి దారుణంగా కొట్టి బలవంతంగా పెళ్లికి ఒప్పించారని కూడా చెప్పారు. కోవిడ్‍ సమయంలో కొన్ని కుటుంబాలకు కరెంటు బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బు లేక వారాల తరబడి చీకటిలోనే జీవించాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ పరిస్థితులు వారి ఆందోళన మరియు నిస్ప•హకు తోడైంది.


ఆడపిల్లలు బడులకు వెళ్ళే క్రమం ఒక తరగతి నుండి మరో తరగతికి మారడం లాంటి అనేక అనుభవాలను చాలానే పంచుకున్నారు. చదువు గురించి అబ్బాయిలతో మాట్లాడినప్పుడు అబ్బాయిలు దాటవేయడంతో చూస్తే ఆడ పిల్లల విషయంలో పూర్తిగా భిన్నంగా ఉంది. కోవిడ్‍ సమయంలో ఆన్లైన్‍ తరగతులు ప్రారంభమయ్యాయి తాము పాఠాలను వినే అవకాశానన్ని ఏ మాత్రం కోల్పోవద్దు అని అనుకున్నారు. స్మార్ట్ ఫోన్ల కోసం వారు తల్లిదండ్రుల మీద వత్తిడి తెచ్చారు. కొందరు తల్లులు అయితే ఎలాంటి వత్తిడి లేకుండానే, తమ పిల్లలు (కొడుకు, కూతురు ఇద్దరూ) చదువులు కొనసాగించాలని కోరికతో స్మార్ట్ ఫోన్లు సమకూర్చారు. ఆన్లైన్‍ తరగతులతో ఇబ్బందులు వున్నా, చదువులు కొనసాగించాలనే ఆసక్తి అలాగే బాల్య వివాహాలు తప్పించు కోవడానికి అమ్మాయిలకు ఆన్లైన్‍ తరగతులు ఉపయోగపడ్డాయి.


ఆన్లైన్‍ తరగతుల తరువాత స్మార్ట్ ఫోన్లు వినియోగించడానికి తమకు అనుమతి వుండదు అని బాలికలు చెప్పారు. కానీ బాలుర విషయంలో ఇందుకు భిన్నంగా ఉంది. బాలురకి ఈ నిబంధనలు, పరిమితులు లేవు.వారు 24 గంటలు ఫోన్‍ లో నిమగ్నమై అన్ని రకాల వెబ్సైట్లు చూసినా తల్లిదండ్రులు ప్రశ్నించరు. తమ పై ‘ కోవిడ్‍ బాచ్‍’ అని ముద్ర వేశారని, జీవితాంతం ఆ ముద్రతోనే ఉండాల్సి రావడం ఇబ్బందికర విషయమని బాధ పడ్డారు. కష్టపడే, మెరిట్‍ విద్యార్థులకు అలాంటి ముద్ర వేయడం సరికాదని కొందరు విద్యార్థులు వాదించారు.


కోవిడ్‍ వుధ•తి తగ్గిన తర్వాత కూడా ఆన్లైన్‍ తరగతులు కొనసాగించారు అని విద్యార్థినులు తెలిపారు. టీచర్లు తమను ఔష్ట్ర••••జూజూ గ్రూపులుగా ఏర్పాటు చేసి, సబ్జెక్టుల వారీగా నోట్స్ హోమ్‍ వర్క్తో బోధన కొనసాగించారు. కోవిడ్‍కి ముందు ప్రాజెక్టుల కోసం, హోమ్‍ వర్క్ కోసం గ్రూప్లు గా పనిచేయడం వల్ల విద్యార్థుల మధ్య, విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య చక్కని సంబంధాలు, సంభాషణలు వుండేవి. కోవిడ్‍ తర్వాత ఇదంతా మారిపోయింది. పిల్లలు, టీచర్లు ఎదురెదురుగా కలవడం తగ్గిపోయింది. వారి మధ్య సంభాషణలు ఎక్కువ భాగం సోషల్‍ మీడియా ద్వారానే జరుగుతున్నాయి.
ఇంట్లో అబ్బాయిలకి పార్టీలకు, కొత్త దుస్తులు కొనడానికి, ఫ్రెండ్స్ తో కలిసి కేక్‍ కట్‍ చేయడానికి, ఇలా అనేక అవసరాలకి పైసలు ఇస్తారు గానీ, బాలికలను మాత్రం వున్న దానితో సరిపెట్టుకోమంటారు అని బాలికలు వెల్లడించారు. పుట్టిన రోజు బాలికల కోసం ఇంట్లో కనీసం అన్నం, చికెన్‍ కూర నన్న చేస్తారు అని వారు చెప్పారు.


బాలికలు తమ విద్యను కొనసాగించాలని ద•ఢ నిశ్చయంతో ఉన్నారు. వారిలో కొందరు పార్టమ్‍ ఉద్యోగాలు లేదా సెలవుల్లో విద్య కోసం తమ ఖర్చులను తీర్చడానికి పని చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తారు మరియు వారి ఉన్నత చదువుల కోసం రుణాలు తీసుకోవడానికి సిద్ధంగా
ఉన్నారు. అదే సమయంలో, వారు హైస్కూల్లో చదివే సమయానికి, వారిని వివాహం చేసుకోవాలని వారిపై ఒత్తిడి ఉంటుంది. అమ్మాయిలు ఏ వివాహా కార్యక్రమాలకు కానీ వేడుకలకు కానీ హాజరు కావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ‘ఆంటీలు’ వారిని పెళ్లి సంబాధాలు చూసి పెట్టటానికి నలుగురికి చూపించడానికి సిద్ధంగా ఉంటారని. చదువుకోవాలని, తమ దారులు తామే వెతుక్కోవాలని, స్వతంత్రంగా ఉండాలని, బలవంతపు పెళ్లిళ్ళు చేసుకోకూడదని అమ్మాయిలు కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ప్రాముఖ్యత విద్యను ఆపకుండా కొనసాగించాలని ఆడపిల్లలా చర్చాలలో ముఖ్యమైన సారాంశం. ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షలను గౌరవ ప్రదమైన జీవితాన్ని గడపాలని కలలు కంటున్న ఈ బాలికలను ‘ఇతర’ నగరం వారిని భయపెట్టవద్దు.


అయితే చదువు మానేసిన బాలికలకు స్నేహితులు కానీ అందరితో కలిసి మెలిసి తిరిగే అవాకశాలు లేవు. వారు కేవలం తమ ఇంటికే పరిమిత మవుతూ ఇంటి పనులు చేస్తూ, ఇళ్ళలో చాకిరీ చేస్తూ, చిన్న చిన్న పరిశ్రమలలో రోజు కూలిగా పని చేస్తూ కర్మాగారాల్లో ఎల్లప్పుడూ పెద్దవారి కనుసన్నులలోనే ఉంటారు. ప్రతి నిత్యం అవమానాలు భరిస్తూ అంతులేని విషయవలయం చిక్కుకున్నారు. అడుగడుగునా ఒంటరితనం ఇతరులచే చీదరించ బడుతూ ఉంటుంది. ఇక వివాహం కనుక జరిగి ఉంటే శారీరక, మానసిక మరియు లైంగిక హింస మరియు అణచబడి ఉంటారు. ఈ పరిస్తితి ఆమెలో భయం ఆందోళనతో కాలం గడుపుతుంది. ఈ పరిస్థితికి అంతటికీ సామాజిక అనుమతి తోనే జరుగుతుంటుంది. ఇట్టి పరిస్థితులలో వారు నిరాశ నిస్ప•హలకు గురవుతు విధి రాసిన రాతగా భావించి నిస్ప•హలోకి జారీ పోతారు. వారి అనుభవిస్తున్న రోదన వినే వారు ఉండరు. విచారకరమైన విషయం వారి జీవితంలో హింస నుండి బయటపడే అవకాశం వారికి ఉండదు.


ముగింపు
మొత్తం మీద అబ్బాయిలు హానికరమైన ప్రవర్తనను ఆశ్రయిస్తారు. వారి ప్రవర్తనల గురించి తీర్పు చెప్పడంలో అర్థం లేదు. అదేసమయంలో బాలికలు పిత•స్వామ్యం మరియు లింగ హింస నుండి బయటపడటానికి విద్యను ఒక మార్గంగా చూస్తారు. ప్రశ్నించవలసిన అమానవీయ పరిస్థితులు మామూలు విషయాలుగా మారి పోయాయి. వారు నివసించే పరిసరాల్లో మరియు ప్రదేశంలో వారు అస్థిరంగా, దుర్భరంగా జీవించడం మాత్రం అన్యాయం.
ఒక వైపు విద్యపై రాష్ట్ర పెట్టుబడులను ఉపసంహరించు కోవడం మరో వైపు భరించలేని ఫీజులు ఇతర ఖర్చులతో ప్రైవేట్‍ పాఠశాలల విస్తరణ పిల్లలు పాఠశాలల్లో కొనసాగడం ఎంత కష్టతరం చేసిందో మనం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి బస్తీలలో నివసిస్తున్న పిల్లలను పాఠశాలల నుండి మాత్రమే కాకుండా మొత్తం సమాజం నుండె బహిష్కరించాము. అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి పునరిద్దయించ వలసిన అవసరం ఉంది. అంతే కాకుండా మొదటి తరం చదువుకు కదిలిన పిల్లల పట్ల వివక్షత భావం మరియు మొద్దుబారిన విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. పిల్లలందరికీ న్యాయం చేయడమే విద్యా లక్ష్యం కావాలి.


పిల్లలను హానికరమైన వాతా వరణం నుండి రక్షించడం ఒక సవాలు. వారికి అన్నీ విధాలా సౌకర్యాలు కల్పించడం. ఆటలు ఆడు కోవడానికి పాటలు పాడుకోవడానికి, వాళ్ళకిష్ట మైన పనులు చేసుకునే అవకాశాలను కల్పించడం చెప్ప దలచుకున్న విషయాలను ధైర్యంగా చెప్పే అవకాశాలు ఇవ్వడం, ఆట స్థలాలను కల్పించడం, పాఠశాలలను అందుబాటులో ఉంచడం, కమ్యూనిటీ సెంటర్లను అందుబాటులో ఉంచడం మొదలగు ఇతర సదుపాయాలు కల్పించాలి.


మరో సవాలు ఏంటంటే అణగారిన వర్గాల పిలల ద•ష్టిలో నుండి నగరం మరియు దాని పరిసరాలను చూడటం మరియు వారు చెప్పే మాటలు వినడం. ముఖ్యంగా అన్ని పట్టణ ప్రణాళికలను పిల్లల కేంద్ర వేదికగా చేయడం, మైదానంలో, స్కూల్‍, సామాజిక కేంద్రాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ఈ పక్రియ పిల్లల హక్కుల రక్షణ మాత్రమే కాదు మొత్తం సమాజాన్ని సంపూర్ణ మార్పుకు దోహదపడుతుంది. ఆ క్రమంలో పట్టణ స్థల ప్రజాస్వామ్యీకరణ పక్రియ ప్రారంభమవుతుంది.


పట్టణ పేదలు నివసించే జనాభా పెరుగుదల అందులో అత్యధిక శాతం మంది దూరమవుతున్నందున వారి ఆందోళనలు, జీవిత పరిస్థితులు నగరం మొత్తం మీద ప్రభావం చూపడం అనివార్యం. నిజానికి రెండు నగరాలు లేవని గుర్తించడమే సవాలు. వారి జీవితాలు మన జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయని గుర్తించాలి.

  • ప్రొఫెసర్‍ శాంత సిన్హా
    పూర్వ జాతీయ బాలల హక్కుల కమిషన్‍, ఛైర్‌పర్సన్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *